Varalaksmi
-
వాట్ ఎ షేమ్!
‘‘మహిళలను దేవతలుగా కొలిచిన నేలపై ఇన్ని దారుణాలా?! అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది? నిర్భయ, నందినీలకు జరిగినట్లు ఎవరికీ జరగకూడదు. అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. మాకు కావలసింది న్యాయం, గౌరవం. దయచేసి ఈ దారుణాలను ఆపండి’’ అని ఆగ్రహావేదనలు వ్యక్తం చేశారు నటి స్నేహ. మహిళలకు మద్దతుగా, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా ఆమె గళం విప్పారు. భావన, వరలక్ష్మీలకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇది: నా సహచర నటీమణులు భావన, వరలక్ష్మీలకు ఎదురైన అనుభవాలను తలచుకుంటుంటే నా మనసు తీవ్రంగా ఆవేదన చెందుతోంది. మనస్ఫూర్తిగా వాళ్లకు నా మద్దతు తెలుపుతున్నాను. ధైర్యంగా వాళ్లు మాట్లాడిన తీరుని ప్రశంసిస్తున్నాను. ఇటువంటి ఘటనల గురించి ఓపెన్‌గా హ్యాండిల్ చేసిన విధానంలో వాళ్ల పరిణతి కనిపిస్తోంది. ఇంకెన్నాళ్లీ ప్రేక్షక పాత్ర? మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, అవమానాలు... ప్రతి రోజూ సమాజంలో ఏ మూలన చూసినా ఇటువంటి ఘటనలే కనిపిస్తున్నాయి. చాలామంది బాధిత మహిళలు తమ మనసులో మాటలు చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్లూ ఓ భాగమైన ఈ సమాజమే కారణం. ఇటువంటి దురాగతాలు జరిగినప్పుడు ఎక్కువగా అమ్మాయిలనే నిందిస్తున్నారు. నైతిక విలువలు, సంప్రదాయ పరిరక్షణకు పాటుబడుతున్నామని ప్రచారం చేసుకునేవాళ్లు... అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఎక్కడికి వెళ్లాలి? ఎవరితో వెళ్లాలి? అనేవి చెబుతారు. ఈ సందర్భంగా నేను వాళ్లను ఒకటి అడగాలనుకుంటున్నాను. మూడేళ్ల పసిపాపలు, ఏడేళ్ల చిన్నారులపై అకృత్యాలు, అఘాయిత్యాలు జరిపి చెత్తబుట్టల్లో పడేస్తున్నారు. ఏం జరుగుతుందో కూడా వాళ్ల ఊహకు తెలీదు. ఇలాంటి అకృత్యాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారు. ఇంకెన్నాళ్లు ప్రేక్షక పాత్ర పోషిస్తారు? ఓ మై గాడ్! హృదయ విదారకరమైన ఫొటోలు చూస్తుంటే, నా మనసు ముక్కలవుతోంది. ఓ తల్లిగా ఆ చిన్నారుల తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోగలను. ఆ రోజులు పోయాయి తప్పు ఎక్కడ జరిగింది? ‘మదర్ ఇండియా’గా, దేశాన్ని అమ్మగా పిలవబడే రాజ్యంలో ఏం జరుగుతోంది? జీవనదులకు మహిళల పేర్లు పెడతారు. దేవుడితో సమానంగా దేవతలను పూజిస్తారు. పురాణ ఇతిహాస గ్రంథాల్లో ‘దేవుడు తనలో సగభాగాన్ని అర్ధాంగికి ఇచ్చాడు’ అని చెబుతారు. ఓ ఆడదాని కారణంగా రాజ్యం రావణకాష్టంలా తగలబడిందనే కథలు విన్నాము. మహిళలను చాలా విధాలుగా కొలిచే దేశం ఇది. కానీ, మహిళలు గర్వంగా తలెత్తుకుని, హుందాగా గౌరవంతో బతికే రోజులు పోయాయి. ఇప్పుడీ మాట చెబితే ఎప్పుడో గడిచిన గతంలా ధ్వనిస్తుంది. వాట్ ఎ షేమ్!! ఆ ఆలోచన వస్తే.. వెన్నులో వణుకుపుట్టాలి ఇటువంటి అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలనే నిర్ణయం తీసుకోవడానికి ఇంతకు మించిన తరుణం లేదు. మహిళల గౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి.. అంతకు ముందు ఉన్నట్టు మేము సురక్షితంగా ఉన్నామని మహిళలు ధైర్యంగా ఉండడానికి పొరాటం చేయవలసిన సమయమిదే. ముఖ్యంగా... పసిపాపలను అబ్యూజ్ చేయడానికి కూడా ఏ మగాడైనా భయపడాలి. మనసులో అలాంటి ఆలోచన చేయడానికి కూడా భయపడాలి. నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించే కఠినమైన చట్టాలు తీసుకురావాలి. న్యాయవ్యవస్థను పటిష్టం చేయాలి. నిర్భయ, నందిని, రితిక, హాసిని... ఇంకా ఎంతమంది? ఇక ఈ దేశంలో బాధితులు ఉండకూడదు. మాకు న్యాయం కావాలి. మాకు గౌరవం కావాలి. గౌరవంగా బతికే హక్కు కావాలి. మా హక్కులను సాధించుకునే గెలుపు కావాలి. ఈ సందర్భంగా నేనొక చిన్న అడుగు వేస్తున్నాను. చిన్నదే కానీ చాలా ముఖ్యమైన అడుగు ఇది. ఓ తల్లిగా నేనో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ‘మహిళలను గౌరవంగా చూసేలా.. మహిళల అర్హతకు తగ్గట్టు వాళ్లతో హుందాగా ప్రవర్తించేలా’ నా కుమారుణ్ణి పెంచుతానని అందరికీ మాటిస్తున్నాను. సేలంలో ఐదుగురు వ్యక్తులు కలసి పదేళ్ల అమ్మాయిని వేధించి చంపేశారు. తమిళనాడులో ఏం జరుగుతోంది? ప్రతి రోజూ వార్తల్లో ఇలాంటివి కనిపించడం కామన్ అవుతుందా?? దయచేసి ఈ దుర్మార్గాలను ఆపండి. – స్నేహ -
పుష్పాభిషేకం
కలియుగ ప్రత్యక్ష దైవం, అలంకార ప్రియుడైన శ్రీవేంకటేశ్వరస్వామి హృదయంపై పుష్ప దేవతలు సేదతీరాయి. స్వామి వారి పుష్పయాగం కోసం తరలించిన సుగంధ భరిత పుష్పాలను చూసి భక్తులు తన్మయం చెందారు. టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు స్వామి సేవకు పుష్పాలను మోసుకె ళ్లడం పూర్వజన్మ సుకృతంగా భావించారు. తిరుమల, న్యూస్‌లైన్: శ్రీవారి ఆలయంలో ఆదివారం పుష్పయాగం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ గార్డెన్ విభాగం వారు స్వామివారి కైంకర్యానికి ఎనిమిది టన్నుల బరువు కలిగిన 12 రకాల పుష్పా లు, 6 రకాల పత్రాలను వెదురు బుట్టల్లో తరలించా రు. ఇందులో చామంతి, లిల్లీ, వృక్షి, రోజాలు, మల్లె లు, కనకాంబరాలు, తామరలు, కలువలు, మొగలిరేకులు, మాను సంపంగి వంటి పుష్పాలతో పాటు మరువం, దవణం, బిల్వం, కదిరిపచ్చ, పన్నీరాకు, తులసి పత్రాలు ఉన్నాయి. అలాగే ఈ ఏడాది అత్యంత ధర కలిగిన మదిలం పుష్పాలను కూడా పుష్పయాగంలో వినియోగించారు. కార్యక్రమంలో భాగంగా తిరుమల పాపవినాశనం మార్గంలోని టీటీడీ గార్డెన్ నుంచి వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలను టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు గోవింద నామ స్మరణల మధ్య ఆలయం వద్దకు గంపలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఇన్ని రకాల పుష్పాలను ఒకేసారి చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. మరికొంత మంది సేవకులు స్వామి కైంకర్యానికి పుష్పాలను తీసుకెళ్లటం పూర్వజన్మ సుకృతంగా భావించారు. నా జీవితంలో ఇన్ని రకాల పుష్పాలను చూడలేదు నేను శ్రీవారి సేవ చేయటం కోసం తిరుమలకు వచ్చాను. నా జీవితంలో ఇన్ని రకాల పుష్పాలను ఎక్కడా చూడలేదు. మళ్లీ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలనిపిస్తోంది. నాతో పాటు నా స్నేహితులు కూడా పుష్పయాగంలో వినియోగించే పుష్పాలను తీసుకువచ్చారు. - వరలక్ష్మీ, ఆకివీడు పూర్వజన్మ సుకృతం స్వామి సేవకు నా చేతుల మీదుగా పుష్పాలను తీసుకురావటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గోవిందనామ స్మరణలు చేస్తూ పుష్పాలను తీసుకురావటం ఎంతో సంతోషాన్ని కల్గించింది. ఇది దేవుడిచ్చిన ఓ గొప్ప వరంగా, అదృష్టంగా భావిస్తున్నాను. - దేముళ్లు, విశాఖపట్నం -
సొమ్ము కోసమే మహిళ హత్య
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : స్థానికంగా సంచలనం సృష్టించిన వరలక్ష్మి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మొదటినుంచి అనుమానిస్తున్నట్లుగానే వరలక్ష్మి ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తే సొమ్ము కోసం ఆమెను హత్య చేశాడని పో లీసుల విచారణలో తేలింది. స్థానిక పోలీస్‌స్టేష న్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వై.వి.రమణ ఈ వివరాలు వెల్లడిం చారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. స్థానిక గుడివాడ రోడ్డులో అల్లాడి భానుమూర్తి కుటుంబం నివాసం ఉంటోంది. ఆయనకు బస్టాండ్ ఎదురుగా ఫ్యాన్సీ షాపు ఉంది. ఈనెల మూడో తేదీ మధ్యాహ్నం భానుమూర్తి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. లోపల వెదగ్గా భార్య కనిపించలేదు. పక్కన అద్దెకు ఉంటున్న గొర్రెల రవికుమార్ పోర్షన్‌కు తాళం వేసి ఉంది. ఆరోజు ఉదయం వరలక్ష్మికి, రవికుమార్‌కు గొడవ జరిగింది. భార్య కనిపించకపోవడంతో భానుమూర్తి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి వివరాలు సేకరించారు. రవికుమార్‌పై అనుమానం వచ్చి ఫోన్ చేయగా వస్తున్నానంటూ ఎంతకూ రాలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి రవికుమార్ ఇంటి పోర్షన్ తాళం పగులగొట్టారు. లోనికి వెళ్లి చూడగా వరలక్ష్మి మృతదేహం గోనెసంచిలో మూట కట్టి సోఫాలో దాచి ఉంది. ఈ ఘటన జరిగినప్పటినుంచి రవికుమార్ పరారీ లో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవికుమార్ గుడివాడలో తలదాచుకున్నాడని సమాచారం అందడంతో శుక్రవారం సాయంత్రం అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నానని, వరలక్ష్మి అప్పు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను కత్తితో పొడిచి చంపానని రవికుమార్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. మృతదేహాన్ని గోనెసంచిలో మూట కట్టి తన పోర్షన్లో దాచానని, ఎవరికీ అనుమానం రాకుండా రక్తపు మరకలు కడిగివేశానని చెప్పాడు. రాత్రివేళ తీసుకువెళ్లి చెరువులో పడవేద్దామని అనుకున్నానని అతడు తెలిపాడు. దీం తో పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేశారు. వరలక్ష్మి వద్ద అతడు దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నూజి వీడు కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ రమణ తెలిపారు. సమావేశంలో ఎస్సై బి.ప్రభాకరరావు, ఏఎస్సై బాలస్వామి పాల్గొన్నారు. -
కామెడీకి మాస్ హీరో విశాల్ సై
మదగజరాజా చిత్ర యూనిట్ దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో ప్రచార యాత్ర చేయనుంది. యువ నటుడు విశాల్ హీరోగా నటించిన చిత్రం మదగజరాజా. అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సుందర్ సీ దర్శకుడు. ఈయన కమర్షియల్ కథా చిత్రాలను హాస్యంతో రంగరించి రూపొందించడంలో సిద్ధహస్తుడు. ఈ చిత్రంలో మాస్ హీరో విశాల్‌తో హాస్యం పండించారు. జెమినీ ఫిలింస్ సర్క్యూట్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రాన్ని నటుడు విశాల్ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. తెలుగులో నటరాజు తనే రాజు (ఎన్టీఆర్) పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల ఆరున విడుదల చేయనున్నారు. సోమవారం కేరళలోని కొచ్చిలో మదగజరాజా చిత్ర యూనిట్ ప్రచారం ప్రారంభించనుంది. తర్వాత కర్ణాటకలోని బెంగళూరు, ఆంధ్రాలోని హైదరాబాద్ తదితర ముఖ్య నగరాల్లో ఈ ప్రచార బృందం పయనించనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కార్యక్రమాలలో విశాల్‌తో పాటు నటి వరలక్ష్మి, దర్శకుడు సుందర్ సీ, చిత్ర యూనిట్ పాల్గొననున్నారు.