Variety Campaign
-
వెరైటీ ప్రచారం: ఒక చేత చెప్పులు.. మరో చేత రాజీనామా
సాక్షి, జగిత్యాల : రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసి.. ప్రచార హోరు పుంజుకుంటుంది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంటింటికి వెళ్లి చెప్పులు పంచుతూ.. వెరైటీ ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. వివరాలు.. జిల్లాలోని కొరుట్ల నియోజవర్గం నుంచి ఆకుల హన్మంతు అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మంతు ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాల్సిందిగా ఓటర్లకు మనవి చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే తాను ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తానన్నారు. ఒక వేళ మాట తప్పితే పబ్లిక్‌గా తనను చెప్పు తీసుకుని కొట్టండంటూ ఓటర్లకు చెప్పులను కూడా పంచారు. హామీలను నెరవేర్చకపోతే తనను పదవి నుంచి తొలగించవచ్చంటూ..ముందే సిద్ధం చేసి పెట్టుకున్న రాజీనామా పత్రాన్ని కూడా జనాలకు చూపిస్తున్నారు. ఈ విషయం గురించి హన్మంతు మాట్లాడుతూ.. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకే తాను ఇలా ప్రచారం చేస్తున్నానంటూ తెలిపారు. అయితే కోరుట్ల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పోటీచేస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు విజయం సాధించిన విద్యాసాగర్ రావు వరుసగా నాల్గోసారి విజయం సాధించాలని ఉవ్విళూరుతుండగా.. అధికార పార్టీ అభ్యర్థి మీద విజయం సాధించాలని హన్మంతు కృషి చేస్తున్నారు. -
‘నాకు ఓటేసి నా ఇజ్జత్ కాపాడండి’
భోపాల్ : ఐదేళ్లు జనాలను పట్టించుకోని నేతలు ఎన్నికల సమయంలో మాత్రం ఓటర్లను దేవుళ్లుగా పూజిస్తారు. ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతూ.. రకరకాల ఫీట్లు చేస్తుంటారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ప్రచారం కూడా జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో ఏ అభ్యర్థి అయినా నన్ను, నా పార్టీని గెలిపించండి అంటూ ఓటర్లను అడుక్కోవడం సాధరణం. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం ‘పార్టీని తుంగలో తొక్కండి కానీ నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి’ అంటూ ఓటర్లను వేడుకుంటున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వివరాలు.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే జీతు పట్వారీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లతో ‘పార్టీని తుంగలో తొక్కండి.. కానీ నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి.. నా ఇజ్జత్ కాపాడండి’ అంటూ వేడుకుంటున్నారు. పట్వారీ అభ్యర్థనను కాస్తా సదరు ఓటర్లు వీడియో తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. దాంతో ప్రతిపక్షాలకు మంచి అవకాశం దొరికినట్లైంది. #WATCH Congress MLA from Indore's Rau,Jitu Patwari during door-to door campaigning in Indore, says, "Aapko meri izzat rakhni hai, Party gayi tel lene." #MadhyaPradesh ( Source: Mobile footage) pic.twitter.com/ZIodfLdwEY — ANI (@ANI) October 23, 2018 ఈ వీడియోను సాకుగా చూపిస్తూ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మీ ఎమ్మెల్యేనే పార్టీని తుంగలో తొక్కండి అంటున్నారు దీని గురించి జనాలకు ఏం చెబుతారు అంటూ’ ప్రశ్నిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ పట్వారీ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు సమచారం. -
అర్ధనగ్నంగా 'నమో'నమః
-
అర్ధనగ్నంగా 'నమో'నమః
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశమంతా చుట్టేస్లూ ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై వ్యంగ్య వాగ్బాణాలు సంధిస్తూ దూసుకుపోతున్నారు. పదుదైన మాటలతో రాజకీయ వాతావరణాన్ని వేడిక్కిస్తున్నారు. మోడీకి మద్దతుగా ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రచారం చేస్తుంటే గుజరాత్‌కు చెందిన మోడల్ మేఘనా పటేల్ మాత్రం వినూత్న ప్రచారానికి దిగింది. అర్ధనగ్నంగా ఫొటోలకు పోజిచ్చి.. మోడీకి ఓటేయమని అర్థించింది. పలు సినిమాలతోపాటు సీరియళ్లలో నటించిన మేఘన ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. ఈ ఫొటోలు నెట్లో, ప్రసారమాధ్యమాల్లో విస్తృతంగా రావడంతో మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మద్దతు తమకక్కర్లేదని, ప్రచారం కోసమే మేఘన ఇలా అసభ్యకర చర్యలకు దిగిందని మండిపడింది. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. అయితే, తన చర్యలను అసభ్యకరమనడాన్ని మేఘన ఖండించింది. తాను శరీర వర్ణంలో కలిసిపోయేలా ఉన్న దుస్తులు వేసుకున్నానని, మోడీకి తాను మద్దతు తెలిపే విధానం ఇదేనని గడుసుగా సమాధానం ఇచ్చింది. మోడీకి మద్దతు తెలిపే అందాల భామల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ కూడా కొద్ది రోజుల క్రితం మోడీకి మద్దతు ప్రకటించింది. ‘ద బ్యాచిలరెట్ ఇండియా- మేరే ఖయాలోంకీ మల్లిక’ రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చిన మల్లిక... తన షోలో నరేంద్ర మోడీ పాల్గొంటే ఆయన కోసం ఏం చేసేందుకైనా తాను సిద్ధమేనని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అక్కడితే ఆగకుండా మోడీని ‘పర్ఫెక్ట్ బ్యాచిలర్’గా, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’గా మల్లిక అభివర్ణించింది. తాజాగా మేఘనా పటేల్ తన అభిమాన నాయకుడికి 'అర్ధనగ్న' ప్రదర్శనతో ప్రచారం కల్పించింది. టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా నిలబడతానని ప్రకటించి అప్పట్లో పూనమ్ పాండే సంచలనం రేపింది. దాంతో రాత్రికి రాత్రే ఆమె పాపులరయింది. ఇప్పుడు మేఘన కూడా ఇదే దారిలో వెళుతున్నట్టు కనిపిస్తోంది. 'అర్ధనగ్న' ప్రచారాన్ని పాలిటిక్స్‌లో ప్రవేశపెట్టి ఇప్పటికే వార్తల్లో నిలిచింది మేఘన. మున్ముందు ఆమె ఇంకా ఎన్ని సంచలనాలు రేపుతుందో చూడాలి.