Veer Singh
-
‘మోదీ సర్కార్.. పేదల వ్యతిరేకి’
దోమలగూడ: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ పేదల వ్యతిరేకిలా వ్యవహరిస్తోందని బహుజన సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీర్‌సింగ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ భూసేకరణ బిల్లు, రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత హామీలకు వ్యతిరేకంగా బీఎస్పీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2013లో యూపీఏ ప్రభుత్వం భూసేకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ కూడా ఆమోదించిందని, అప్పుడు ఆమోదించి ప్రస్తుతం సవరణ బిల్లు తేవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక భూసేకరణ సవరణ బిల్లు పార్టమెంటులో ఆమోదం పొందకుండా అడ్డుకుంటామని తెలిపారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం బాలయ్య, ప్రధానకార్యదర్శి ఎండీ పాల్వేదాంత్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ భూసేకరణ సవరణ బిల్లు బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. -
అవినీతిలో కూరుకుపోయాయి
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై బీఎస్పీ జాతీయ కార్యదర్శి విమర్శ కర్నూలు, అనంతపురం జిల్లాల కార్యకర్తల సమావేశం కర్నూలు సిటీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి ఊబిలో కురుకుపోయాయని బహుజన సమాజ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వీర్ సింగ్ అరోపించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బహూజన సమాజ్ పార్టీ జిల్లా అద్యక్షుడు బి.ఎస్ నవీన్ అద్యక్షతన నిర్వహించిన కర్నూలు, అనంతపురం జిల్లాల కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో అగ్రవర్ణ కులాలకు చెందిన పార్టీలే రాజ్యాం ఏలుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాధికారం అనేది సామాన్యలకు దక్కడం లేదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం రాజకీయ పార్టీల నాయకులు అణగదొక్కుతున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు అబివృద్ధి ఫలాలు అందకుండా అడ్డుపడుతున్న పార్టీలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే సత్తా ఓక్క బీఎస్పీకే ఉందన్నారు. బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రసాద్ ఉపాసక్ మాట్లాడుతూ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావుఫూలే అలోచన విధానంతో ముందుకు పోతున్న ఏకైక పార్టీ బీఎస్పీ అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అనంతరం పార్టీ ఆఫీస్‌ను ప్రాంరంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రవి, నాయకులు మల్లెకల్, వనుములయ్య, ఓబులేష్, లక్ష్మీనారాయణ, రవీంద్రబాబు, బాలస్వామి, దాసు,వెంకటేష్, దేవదానం తదితరులు పాల్గొన్నారు. -
మాజీ మోడల్‌కి జీవిత ఖైదు
లక్నో: తల్లిదండ్రులను హత్య చేసిన కేసులో మాజీ మోడల్ ప్రియాంక సింగ్, ఆమె స్నేహితురాలు అంజూలకు జీవిత ఖైదు విధిస్తూ మీరట్ జిల్లా జడ్జి రామకృష్ణన్ గౌతమ్ తీర్పు వెలువరించారు. అలాగే ఒకొక్కరు రూ. 20 వేల జరిమాన విధించాలని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. 2008, నవంబర్ 11న ప్రియంక... అంజూ సహాయంతో తన తల్లిదండ్రులు ప్రేమ్ వీర్ సింగ్ (65) అతడి భార్య సంతోష్ సింగ్ (62) లను కత్తితో పోడిచి దారుణంగా హత్య చేసింది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా 17వ తేదీన ప్రియాంక, అంజూలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో పోలీసులు అనుమానించి గట్టిగా ప్రశ్నించారు. దీంతో ప్రియాంక, అంజూలు హత్య చేసినట్లు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. ఆస్తి తగాదాలతోపాటు తనను నిర్లక్ష్యం చేస్తున్నారనే కోపంతోనే ఈ హత్యకు ఒడిగట్టినట్లు వారు పోలీసుల ఎదుట చెప్పారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరిచారు. దీంతో వారికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.