veera bramhaiah
-
వ్యవసాయానికి 5 గంటలే..
ముకరంపుర : వ్యవసాయానికి 5 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుందని, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య ఆదేశించారు. వ్యవసాయ, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టరేట్లోని సమావేశ మంది రంలో మంగళవారం ఆయన సమీక్షించారు. అవసరానికి కంటే తక్కువగా విద్యుత్ సరఫరా అవుతోందని, 5 గంటలకు మించి ఇవ్వలేమని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ తెలిపారని కలెక్టర్ చెప్పారు. పంటలు కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు సాంకేతిక సలహాలు అందించాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు పంటల పరిస్థితి, విద్యుత్ సరఫరా, తాగునీటిపై సమీక్ష నిర్వహిం చాలన్నారు. తాగునీటి ఇబ్బందులు రాకుండా ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీల్లో ఉన్న నీరు వచ్చే వేసవి వరకు తాగునీటి సరఫరా కోసమే వినియోగించాలన్నారు. 15 రోజులకోసారి తాగునీటి సరఫరాపై నివేదికలు పంపాలని ఆదేశించారు. పంచాయతీలు బకాయి ఉన్న రూ.70 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వర్షాభావ పరిస్థితులపై సూచనలు అందించాలన్నారు. మరమ్మతులో ఉన్న 154 తాగునీటి పథకాల పునరుద్ధరణకు అవసరమైన నిధులు జెడ్పీ, మండల పరి షత్ల నుంచి వినియోగించుకోవాలన్నారు. ఏజేసీ టి.నంబయ్య, జేడీఏ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ మొదలెట్టండి జిల్లాలో వర్షాభావ పరిస్థితులేర్పడుతున్నందున అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ పనులపై కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో సమీక్షించారు. పనికోసం వలసలు పోకుండా చూడాలన్నారు. 15 రోజుల్లో రెండు లక్షల మంది కూలీలకు పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సెప్టెంబర్ నెలాఖరుకు లక్ష మరుగుదొడ్ల నిర్మాణం పూర్తవుతుందని, మొదలుపెట్టని యూనిట్లను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ గణేశ్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. వైద్యశాఖ అధికారులతో మంగళవారం తన చాంబర్లో సమీక్షించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జనవరి నుంచి ఇప్పటివరకు 5 మలేరియా కేసులు నమోదయ్యాయని, వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 34 మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. దోమల నివారణకు పారిశుధ్య చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రాథమిక వైద్యకేంద్రాల్లో వైద్యులను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు జేసీ టి.నంబయ్య, వైద్యారోగ్యశాఖాధికారి, మలేరియా అధికారి తదితరులు పాల్గొన్నారు. -
అంతా సిద్ధం
సాక్షి, కరీంనగర్ : సమగ్ర సర్వేకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులాలు, ఆర్థిక, సామాజిక, సమగ్ర జనాభా లెక్కింపు సమాచార సేకరణ కోసం ఈ నెల 19న చేపట్టిన ఇంటింటి సర్వేను విజయవంతం చేసేందుకు విస్తృత ప్రచారం చేసిన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివరాలను కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జిల్లా ఎస్పీ శివకుమార్ ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో వివరించారు. నియోజకవర్గానికి, మండలానికి ఒకరి చొప్పున ప్రత్యేకాధికారులను నియమించామని, సందేహాలుంటే వారిని సంప్రదించాలని సూచించారు. అందరూ ఇళ్లలోనే ఉండి సమాచారం కోసం వచ్చే ఎన్యూమరేటర్లకు వాస్తవ వివరాలతో సమగ్ర సమాచారం ఇవ్వాలన్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 30 కుటుంబాల సర్వే బాధ్యతలిచ్చామని పేర్కొన్నారు. ఎ న్యూమరేటర్లు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయా తహశీల్దార్ కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని, వారికి అక్కడ ఒక రోజు ముందే సర్వే ఫారాలు అందజేస్తామని తెలిపారు. సోమవారం సాయంత్రం వరకు ఎన్యూమరేటర్లు తాము సర్వే నిర్వహించే ప్రాంతాల్లో పర్యటించి.. మరుసటి రోజు ఉద యం 7 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు సర్వే పూర్తి చేయాలన్నారు. ప్రజలు చెప్పిందే రాసుకోకుండా.. ఇల్లు, పరిసర పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకుని వాస్తవ వివరాలు నమోదు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. పూర్తి చేసిన సర్వే ఫారాలు సంబంధిత, గ్రామ పంచాయతీ, తహశీల్దార్ కార్యాలయాల్లో అప్పజెప్పాలన్నారు. సర్వే సమాచారాన్ని 20 నుంచి 26వ తేదీ వరకు కంప్యూటరీకరిస్తామని చెప్పారు. ఇం దుకోసం జిల్లావ్యాప్తంగా 3 వేల కంప్యూటర్లు.. అంతే మంది ఆపరేటర్లను నియమించినట్లు వివరించారు. సర్వే సిబ్బంది ని తరలించేందుకు.. 200 ఆర్టీసీ, 446 ప్రైవేట్ మినీ బస్సులు, 569 జీపులు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ శివకుమార్ చెప్పారు. 3500 మంది పోలీసు సి బ్బంది ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారని, పెట్రోలింగ్ కోసం 200 మొబైల్ వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. టోల్‌ఫ్రీ సర్వేపై సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ 18004254731 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు నిరంతరం ఈ నంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఏ అనుమానమున్నా ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. వాస్తవాలే చెప్పండి *సిబ్బందికి వాస్తవాలే చెప్పాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకే సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఒకే పొయ్యి మీద వండుకున్నా.. వారిని ఒకే కుటుంబంగా గుర్తిస్తామన్నారు. * ఇంటికి నోషనల్ నంబర్ కేటాయింపు సమయంలో అందుబాటులో లేనివారు ప్రస్తుతం ఇంట్లో ఉంటే వారికీ నోషనల్ నంబర్ కేటాయించి, వివరాలు సేకరిస్తారు. * గుడిసెలకూ నోషనల్ నంబర్లు కేటాయించనున్నారు. సర్వం బంద్ సర్వే రోజు సర్వం బంద్ కానుంది. సిబ్బంది కోసం అందుబాటులో ఉంచిన బస్సులు, ప్రైవేట్ వాహనాలు మినహా ఏ వాహనాలూ రోడ్లపై తిరగవు. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవే ట్ కార్యాలయాలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, ఫ్యాక్టరీలన్నీ మూతబడనున్నాయి. ప్రభుత్వం సెలవు ప్రకటిం చడంతో ఇప్పటికే సంబంధిత శాఖాధికారులు ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు ఎవరైనా ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. కార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అధికారి వీరబ్రహ్మయ్య హెచ్చరించారు. -
పులకించిన కొత్తకొండ
కొత్తకొండ(భీమదేవరపల్లి), న్యూస్‌లైన్: మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. పలుప్రాంతాల నుంచి వీరంతా స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. బ్రహ్మోత్సావాల్లో భోగి, సంక్రాంతి బండ్లు తిరిగే ఘట్టాలు ఈ నెల 14, 15తేదీల్లో ఉన్నా సోమవారం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. కోడె కట్టుట, తలనీలాల సమర్పణ, గండదీపం వద్ద పూజలు చేసేందుకు భక్తులు ప్రత్యేక దర్శనాల వద్ద క్యూ కట్టారు. చైర్మన్ చిట్టంపల్లి అయిలయ్య, ఈవో రామేశ్వర్రావు, ప్రధాన అర్చకుడు తాటికొండ వీరభద్రయ్య, అర్చకులు రాజన్న, సదానందం, రాంబాబు, వినయ్‌శర్మ, ధర్మకర్తలున్నారు. వాహనాలకు నో ఎంట్రీ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో రానున్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా మూడుచోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తె ప్రమాదం ఉన్నందున వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే నిలిపివేస్తున్నారు. హుజూరాబాద్ డీఎస్సీ సత్యనారాయణరెడ్డి, హుస్నాబాద్ సీఐ సదన్‌కుమార్, ముల్కనూర్ ఎస్సై కిరణ్ ఆధ్వర్యంలో 500మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
ప్రజావాణికి వెల్లువలా దరఖాస్తులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో బాధితులు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వెల్లువలా తరలివస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో 500 మందికిపైగా అర్జీలు సమర్పించగా మండల, డివిజన్ కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాలు జనం లేక బోసిపోయాయి. గ్రామ, వార్డు సందర్శనల పేరిట అధికారులు గ్రామాలకు వస్తున్నా సమస్యలు పరిష్కరించడం లేదని, అందుకే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని బాధితులు వాపోతున్నారు. వ్యక్తిగత సమస్యల కోసం కలెక్టరేట్లో ప్రజావాణికి రావొద్దని అధికారులు సూచించినా... క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేవారు లేకపోవడంతో వారు పట్టించుకోవడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి వస్తున్నామని అర్జీదారులు పేర్కొంటున్నారు. సోమవారం కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జేసీ అరుణ్‌కుమార్ కొద్ది సేపు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం వివిధ పనుల నిమిత్తం వెళ్లిపోవడంతో డీఆర్వో కృష్ణారెడ్డి అర్జీలు స్వీకరించారు. డీవైసీకి 9 ఫిర్యాదులు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తొమ్మిది మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలపగా... చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమాన్‌పూర్ మండలం గుండారం నుంచి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామంలో ఏడాది క్రితం అంగన్వాడీ కేంద్రం ప్రారంభించినా టీచర్‌ను నియమించలేదని తెలపగా జేసీ అరుణ్‌కుమార్ స్పందిస్తూ నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. రామడుగు మండలం కొక్కెరకుంట నుంచి లక్ష్మి మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకున్నప్పటికీ బిల్లులు చెల్లించలేదని తెలపగా జేసీ స్పందిస్తూ సంబంధిత అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. డీఆర్వో కృష్ణారెడ్డి, డీఆర్డీఏ పీడీ శంకరయ్య, జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.