కొత్తకొండ(భీమదేవరపల్లి), న్యూస్‌లైన్: మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. పలుప్రాంతాల నుంచి వీరంతా స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. బ్రహ్మోత్సావాల్లో భోగి, సంక్రాంతి బండ్లు తిరిగే ఘట్టాలు ఈ నెల 14, 15తేదీల్లో ఉన్నా సోమవారం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. కోడె కట్టుట, తలనీలాల సమర్పణ, గండదీపం వద్ద పూజలు చేసేందుకు భక్తులు ప్రత్యేక దర్శనాల వద్ద క్యూ కట్టారు. చైర్మన్ చిట్టంపల్లి అయిలయ్య, ఈవో రామేశ్వర్‌రావు, ప్రధాన అర్చకుడు తాటికొండ వీరభద్రయ్య, అర్చకులు రాజన్న, సదానందం, రాంబాబు, వినయ్‌శర్మ, ధర్మకర్తలున్నారు.
వాహనాలకు నో ఎంట్రీ
జాతరలో భక్తులు అధిక సంఖ్యలో రానున్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా మూడుచోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తె ప్రమాదం ఉన్నందున వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే నిలిపివేస్తున్నారు. హుజూరాబాద్ డీఎస్సీ సత్యనారాయణరెడ్డి, హుస్నాబాద్ సీఐ సదన్‌కుమార్, ముల్కనూర్ ఎస్సై కిరణ్ ఆధ్వర్యంలో 500మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పులకించిన కొత్తకొండ
Published Tue, Jan 14 2014 3:12 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
Advertisement