veera pandian
-
‘ఆ డివిజన్లో అప్రమత్తంగా ఉండాలి’
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఇప్పటివరకు 547 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 191 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రి నుంచి 80 ఏళ్ల వృద్ధుడు, ఒకటిన్నర ఏళ్ల చిన్నారిని ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశామని చెప్పారు. ఆదోనిలో వలసకు వెళ్ళిన వారిలో ఒక్కరికీ కరోనా వైరస్ సోకిందని.. ఆ డివిజన్ లో అప్రమత్తం ఉండాలని ప్రజలకు సూచించారు. అక్కడ కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. (ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు..) బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌కు చెందినవారిని తరలించామని కలెక్టర్ పేర్కొన్నారు. మూడు రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు చెందినవారిని తరలించామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చేవారి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు కరోనా పరీక్ష చేయించుకోవాలని, లేదంటే క్వారంటైన్లో ఉండాలని తెలిపారు. విశాఖ ఘటనను దృష్టిలో ఉంచుకుని 5 ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేస్తున్నామని కలెక్టర్ వీరపాండ్యన్ పేర్కొన్నారు. (కరోనా ఖతం!) లాక్డౌన్ పటిష్టంగా అమలు: ఎస్పీ ఫక్కీరప్ప జిల్లాలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అత్యవసర సేవల అనుమతి కోసం 9 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. 419 దరఖాస్తులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి 10,812 వాహనాలు సీజ్ చేశామని ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు. -
ఈ మూడు రోజులు కీలకం
సాక్షి, అనంతపురం అర్బన్: ‘సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం పోలింగ్ ఈనెల 11న జరగనుంది. ఈ మూడు రోజులు అత్యంత కీలకం. ఎన్నికల విధుల్లో పొరపాట్లకు, విమర్శలకు చోటివ్వకండి. ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘన జరగకూడదు. ఓటరు స్లిప్‌లు బీఎల్ఓల ద్వారానే పంపిణీ జరగాలి. రాజకీయ పార్టీల ద్వారా జరిగితే కఠిన చర్యలు ఉంటాయి.’’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.వీరపాండియన్ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదివారం స్థానిక ఎస్ఎస్బీఎన్న్ డిగ్రీ కళాశాలలో జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, అసిస్టెంట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్‌తో కలిసి ఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మూడు రోజులు చాలా కీలకం, ఎక్కడా పోరపాటు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశించారు. బీఎల్ఓలతో అండర్ టేకింగ్ తీసుకోండి ఓటరు స్లిప్పులు రాజకీయపార్టీల ద్వారా పంపిణీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటరు స్లిప్పులు అనధికార వ్యక్తులకు స్వాధీనం చేయలేదని బీఎల్ఓలతో అండర్ టేకింగ్ తీసుకోవాలని ఆర్ఓలను కలెక్టర్ ఆదేశించారు. ఓటర్ల జాబితా మార్కింగ్ సోమవారం నాటికి పూర్తి చేయాలన్నారు. పొరపాట్లు జరగకూడదు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దివ్యాంగ ఓటర్ల కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేసుకోవాలని, వాలంటీర్లను నియమించుకోవాలన్నారు. అంధ ఓటర్ల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ బ్యాలెట్ పత్రం ఏరా>్పటు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలన్నారు. చురుకుగా పనిచేయాలి ఈ మూడు రోజులూ ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఎంసీసీ, వీఎస్టీ బృందాలు చురుకుగా పనిచేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు విస్తృతంగా పర్యటించి తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఇందుకోసం అదనంగా రెవెన్యూ సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. సివిజిల్లో వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు నియమించిన ఉద్యోగులకు మినహాయింపులు ఇవ్వరాదని ఆదేశించారు. పోలింగ్‌కు అవసరమైన సామగ్రి సక్రమంగా ఉన్నాయా లేదాని తనిఖీ చేసుకోవాలన్నారు. శిక్షణ నిర్వహించండి పోలింగ్ నిర్వహణపై నియోజకవర్గాలకు చెందిన పీఓలు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాలను సోమవారం నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు సంబంధిత ఆర్ఓలకు సూచించారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన విధులు, నివేదికలు గురించి ఆర్ఓలకు క్షుణ్ణంగా వివరించారు. సమావేశంలో జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆరో ఎం.వి.సుబ్బారెడ్డి, అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు పాల్గొన్నారు. -
పైసా వసూల్..
అనంతపురం సిటీ: జిల్లాపరిషత్ డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చిత్తుకాగితం మొదలు టేబుళ్లు, చైర్లు, బ్యాలెట్ పేపర్లు, కలప దేనినీ వదలకుండా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని, అంబేడ్కర్ భవన్ అద్దెలోంచి లంచం ఇవ్వలేదని తనపై లేనిపోని అభాండాలు వేసి చర్యలు తీసుకున్నారని, ఇకనైనా డిప్యూటీ సీఈఓ ఆగడాలకు అడ్డుకట్ట వేయండని జూనియర్ సహాయకులు వై.టి.నరేంద్రశర్మ కలెక్టర్ వీరపాండియన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. నాలుగు రోజుల కిందట అందిన ఈ ఫిర్యాదుపై కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదులో ఏం పేర్కొన్నారంటే.. ‘జెడ్పీలో జూనియర్ సహాయకులుగా పని చేస్తున్న వైటీ నరేంద్రశర్మ అను నేను డిప్యూటీ సీఈఓ అనాలోచిత కారణంగా అన్యాయంగా సస్పెన్షన్‌లో ఉన్నాను. అంబేడ్కర్ భవనం కేర్ టేకర్‌గా 2017 జూలై నుంచి నాకు బాధ్యతలు అప్పగించారు. ఫర్నీచరు, మంచాలు, ఇతర సామగ్రి సమకూర్చుకునేందుకు డిప్యూటీ సీఈఓని ఆశ్రయించాను. అధికారి నోటి మాటగా ‘అద్దె డబ్బుల్లో సామగ్రి కొనుగోలు చేసి బిల్లులు పెట్టండి’ అని సూచించారు. ఆయన ఆదేశాల మేరకు సామగ్రి కొనుగోలు చేసిన బిల్లులను అధికారి వద్దకు పలుమార్లు తీసుకెళ్లగా ‘చూద్దాంలే’ అంటూ నెలల తరబడి కాలయాపన చేశారు. కొద్ది రోజుల అనంతరం అధికారి వద్దకు వెళ్లి బిల్లులపై సంతకాలు చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేయగా...నెలకు రూ.10 వేలు నాకు ఇచ్చేలా ‘ప్లాన్’ చేయండని చెప్పారు. లేదంటే బిల్లుల గురించి నా వద్దకు రావద్దని హెచ్చరించారు. నా వల్ల కాదని తెగేసి చెప్పిన పాపానికి బిల్లులు కూడా చేయడం కుదరదని చెప్పి వేధింపులకు దిగాడు. ఈ నేపథ్యంలో తన వర్గానికి చెందిన కొందరు వ్యక్తులతో తప్పుడు ఫిర్యాదులు పెట్టించి అంబేడ్కర్ భవనంలో సామగ్రికి వినియోగించిన డబ్బును నా సొంతానికి వాడుకున్నట్లు అభియోగం మోపారు. దీంతో నాకు చార్జ్ మెమో ఇచ్చారు. అక్కడితో ఆగని అధికారి లేనిపోని పుకార్లు పుట్టించి సీఈఓ వద్దకు బలవంతంగా పంపి మరీ నన్ను సస్పెండ్ చేయించారు. నాలుగు నెలలుగా అధికారులు తీసుకున్న చర్యలకు అవమానంతో కుంగిపోతున్నాను. నాకు ఎటువంటి సస్పెండ్ అలవెన్స్‌లు కూడా ఇవ్వకుండా సదరు అధికారి అడ్డు పడుతూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఆ అధికారి అక్రమాల పుట్ట ‘కార్యాలయం ఆవరణలోని పెద్ద చెట్లను అటవీశాఖ అనుమతి లేకుండా నరికించి.. నాలుగు ట్రక్కుల కలపను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. డీపీసీ కార్యాలయంలో నిల్వ ఉంచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, కార్యాలయానికి సంబంధించిన పది బీరువాలు, ఫైళ్లు, స్టేషనరీని అధికారుల అనుమతి లేకుండా గతేడాది అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇందులో ఒక్క పైసా కూడా జెడ్పీ ఖాతాలోకి జమ చేయలేదు. బదిలీలు, డెప్యుటేషన్ల కోసం వచ్చిన వారి నుంచి వేలాది రూపాయలు లంచంగా తీసుకున్నారు. ఎంపీడీఓ క్యాడరు గల వ్యక్తి డిప్యూటీ సీఈఓగా చాలాకాలంగా పాతుకుపోయి ఉద్యోగులను వేధించి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది.’ ఆరోపణలు అర్థరహితం విధి నిర్వహణలో తప్పిదాలు చేసిన వారిపట్ల కొంత కఠినంగా వ్యవహరించాం. దీంతో ఆ ఉద్యోగి కక్షసాధింపు చర్యలకు దిగాడు. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లన్నీ గదిలో భద్రపరిచాం. ఇక కార్యాలయ ఆవరణలో కలపను అమ్ముకున్నానని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు. కలప అమ్మగా వచ్చిన డబ్బును చలానా తీశాం. ఎవరు అడిగినా ఆ గదిలో కాగితాలు, కలపకు సంబంధించిన చలానా చూపించేందుకు సిద్ధంగా ఉన్నాను.– సూర్యనారాయణ,డిప్యూటీ సీఈఓ, జిల్లాపరిషత్ -
‘కియా’ పనులు వేగవంతం చేయండి : కలెక్టర్
అనంతపురం అర్బన్ : కియా పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. గురువారం ఆయన కియా పరిశ్రమ ఏర్పాట్ల పురోగతిపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులు, కియా మోటర్ల సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. పరిశ్రమకు అవసరమైన 599 ఎకరాల భూమిని ఆ పరిశ్రమకు బదలాయించాలని ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. శిక్షణా కేంద్రం, టౌన్‌షిప్‌కు తాత్కాలిక ప్రాతిపదికన విద్యుత్, నీటి సరఫరా, రోడ్ల విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అదే విధంగా శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసేందుకు నివేదిక అందజేయాలని ట్రాన్స్‌కో ఎస్ఈని ఆదేశించారు. సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. కియా ప్రతినిధులు, ఇంజనీర్లకు తాత్కాలిక కార్యాలయం, విడిది ఏర్పాటు చేసేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉన్న భవనాలను కేటాయిస్తున్నామని, సమావేశ మందిరానికి కూడా అనుమతి ఇస్తున్నామన్నారు. గుడిపల్లి వద్ద ఆర్ఓబీ నిర్మించేందుకు స్థల సేకరణ, అంచనా వివరాలతో నివేదిక రూపొందించి అందజేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో పద్ధతిపై మంజూరు చేయాలన్నారు. సమావేశంలో జేసీ టి.కె.రమామణి, పరిశ్రమల శాఖ జీఎం సుదర్శన్‌బాబు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రఘునాథ్, పెనుకొండ ఆర్డీఓ రామ్మూర్తి, ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి, కియా మోటర్స్ వైస్ ప్రెసిడెంట్ హువాన్ జిన్, డైరెక్టర్ కిమ్, ప్రతినిధులు జూడ్, పార్క్ తదితరులు పాల్గొన్నారు. -
పరిహారం ఇంకా ఎందుకివ్వలేదు ?
- రెవెన్యూ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం - మానవత్వంతో పనిచేయండని క్లాస్ పెనుకొండ రూరల్ : కియో కార్ల కంపెనీ కోసం రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములకు పరిహారం చెల్లించకపోవడంపై కలెక్టర్ వీరపాండియన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని యర్రమంచి భూములలో జరుగుతున్న పనులను పలు శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే యర్రమంచి పొలాలకు చెందిన సుబ్బరాయుడు, సునీత, అస్మిత్ ప్యారీ తదితరులు తమకు ఇంకా పరిహారం అందలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన కలెక్టర్ ఏం చేస్తున్నారు మీరంతా.. రైతులకు పరిహారం ఎందుకు అందలేదంటూ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటివి తన దృష్టికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత 50–60 ఏళ్లుగా వంక పోరంబోకు భూములు సాగు చేస్తున్నామని, వాటికి పరిహారం ఇవ్వలేదని సునీతమ్మ అనే మహిళా రైతు కలెక్టర్‌కు చెప్పారు. అయితే వంక పోరంబోకు భూములకు పరిహారం ఇవ్వాలని చట్టంలో లేదన్నారు. రెవెన్యూ అధికారుల తప్పిదం వల్ల పట్టా భూములు అసైన్ట్ భూములుగా రెవెన్యూ రికార్డులలో నమోదైనట్లు కొందరు రైతులు వీరపాండియన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే..మీరు మారరు.. మానవత్వంతో పనిచేయండి అంటూ అధికారులపై మండిపడ్డారు. పనులను త్వరగా పూర్తి చేయాలి కియో కార్ల కంపెనీ పరిశ్రమ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. రూ.250 కోట్లతో ఎల్అండ్టీ సంస్థకు భూమి చదును పనులను అప్పగించామని ఆయన చెప్పారు. సంబంధిత అధికారులు దగ్గరుండి పనులు చేయించాలన్నారు. అవసరమైతే జిల్లా అధికారులను పనులు జరుగుతున్న ప్రదేశానికి డంప్ చేయాలన్నారు. యేడాదిలోపు పనులను పూర్తి చేయాలని సూచించారు. పనులు జరుగుతున్న ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం దుద్దేబండ క్రాస్‌లోని టూరిజం గెస్ట్‌హౌస్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 21న ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని, అందరూ కచ్చితంగా పాల్గొనాలని ఆదేశించారు. అంతకముందు పరిశ్రమల ప్లానింగ్ పర్పస్ మ్యాప్ గురించి పరిశ్రమల శాఖ మేనేజర్ సుదర్శన్‌బాబు కలెక్టర్‌కు వివరించారు. -
నాసిరకం విత్తనంపై కలెక్టర్ కన్నెర
అనంతపురం అగ్రికల్చర్ : నాసిరకం విత్తన వేరుశనగను సరఫరా చేసిన ఏజెన్సీలపై కలెక్టర్ జి.వీరపాండియన్ కన్నెర చేసినట్లు సమాచారం. పెద్ద ఎత్తున నాసిరకం విత్తనం ఇస్తున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏజెన్సీలు, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప దారికొచ్చే పరిస్థితి లేదని భావించిన కలెక్టర్ కొరడా ఝులిపించేందుకు సిద్ధమైనట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా ఓ మండలానికి నాసిరకం విత్తనం సరఫరా చేసినట్లు ఫిర్యాదు రావడంతో మార్క్‌ఫెడ్ ఏజెన్సీపై రూ.లక్ష జరిమానా విధించినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత ఏఓకు మెమో ఇవ్వాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. మార్క్‌ఫెడ్‌కు జరిమానా విధించినట్లు తెలియడంతో ఏపీ సీడ్స్, ఆయిల్ ఫెడ్ అధికారులతో పాటు పలువురు ఏఓలు, ఏడీఏల్లో గుబులు రేపుతోందనే చర్చ జరుగుతోంది. మార్క్‌ఫెడ్‌కు జరిమానా, ఏఓకు మెమో జారీ చేసిన విషయంపై వ్యవసాయశాఖ అధికారులు నోరు మెదపడం లేదు. విషయం బయటకు పొక్కకుండా రూ.లక్ష జరిమానా నుంచి తప్పించుకునేందుకు మార్క్‌ఫెడ్ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
కాలయాపన చేయడమేంటి?
ఆటంకాలు ఎదురైతే మా దృష్టికి తేవాలి హంద్రీనీవా కాంట్రాక్టర్‌పై కలెక్టర్ ఆగ్రహం హిందూపురం రూరల్ : హంద్రీనీవా కాలువ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంపై ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ శ్రీనివాసులుపై కలెక్టర్ జి.వీరపాండియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తూముకుంట పారిశ్రామికవాడలో కొటిపి నుంచి కిరికెర పంచాయతీ అప్పలకుంట వరకు వచ్చే హంద్రీనీవా సప్లయ్ చానల్‌ను కలెక్టర్ పరిశీలించారు. చానల్ పారిశ్రామికవాడ సమీపంలో రైల్వే వంతెన, బెంగళూరు–హిందూపురం రహదారిని దాటి రావాల్సి ఉండగా కాంట్రాక్టర్ పనులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. కాలువ నిర్మాణ పనుల్లో ఏవైనా ఆటంకాలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని చెప్పారు. పనులు చేయకుండా కాలయాపన చేయడం ఏంటని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. అయితే కాలువ రైల్వే వంతెన దాటాల్సి ఉండటంతో పనుల్లో జాప్యం జరుగుతోందని కాంట్రాక్టర్ సమాధానం చెప్పారు. కాలువ నిర్మాణ పనులు జూన్ నెలాఖరులోపు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ రామకృష్ణారెడ్డి, నారాయణనాయక్, హిందూపురం మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, తహసీల్దార్ చల్లా విశ్వనాథ్ తదితరులు ఉన్నారు. అంతకుముందు కలెక్టర్ సోమందేపల్లి మండలం నక్కలగుట్ట వద్ద హంద్రీనీవా కాలువ లిఫ్టింగ్ పాయింట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో పెనుకొండ ఆర్డీఓ రామ్మూర్తి, ఇన్చార్జ్ తహసీల్దార్ హసీనాసుల్తానా పాల్గొన్నారు. కూలీల సంఖ్య పెంచండి : మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ, అమరాపురం, మడకశిర మండలాల్లో కూడా కలెక్టర్ పర్యటించారు. అమరాపురం మండలంలో ఉపాధి కూలీల హాజరు శాతాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి కూలీకీ ఉపాధి పనులు కల్పించాలన్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అమరాపురం మండలంలోని నాగోనపల్లి రైతు ఉలియప్పకు చెందిన వక్కతోటను కలెక్టర్ పరిశీలించారు. బోరుబావుల్లో నీరు అడుగంటిపోవడంతో తోటలు ఎండుతున్నాయని తమను ఆదుకోవాలని పలువురు రైతులు కోరారు. అనంతరం హేమావతిలోని సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని కలెక్టర్ సందర్శించారు. -
16న అమరావతికి కలెక్టర్
అనంతపురం అర్బన్ : జిల్లా కలెక్టర్లతో ఈ నెల 17,18 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు హారయ్యేందుకు కలెక్టర్ జి.వీరపాండియన్ ఈ నెల 16న అమరావతికి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం నేపథ్యంలో ముఖ్యమంత్రి కలెక్టర్లతో సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన నివేదికను సిద్ధం చేసుకునే ప్రక్రియలో కలెక్టర్ బిజీగా ఉన్నారు. -
జిల్లా అభివృద్ధే లక్ష్యం
– సమస్యలను ఛాలెంజ్‌గా తీసుకుంటా – సాగు, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి – పరిశ్రమల స్థాపనకు చర్యలు వేగవంతం – కలెక్టర్ జి.వీరపాండియన్ అనంతపురం అర్బన్ : ‘జిల్లా అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయాలు ఉంటాయి. ఇక్కడ తాగు, సాగునీటి సమస్య అధికంగా ఉందని బాధ్యతలు చేపట్టిన వెంటనే తెలుసుకున్నా. వీటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తా. సమస్యలను ఛాలెంజ్‌గా తీసుకుని పని చేస్తా’నని కలెక్టర్ జి.వీరపాండియన్ అన్నారు. ఆదివారం రాత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన సోమవారం ఉదయం కలెక్టరేట్‌కు వచ్చి తన ఫైలుపై సంతకం చేశారు. ఈ సందర్భంగా తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. అనంతపురం జిల్లా దేశంలోనే అత్యంత వెనుకబడిందనే విషయం తెలుసన్నారు. వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇందుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వంద శాతం అందితేనే ఫలితాలు వస్తాయన్నారు. ఆ దిశగా కృషి చేస్తానని తెలిపారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమల స్థాపన చాలా ముఖ్యమని, ప్రస్తుతం జిల్లాలో ఆ దిశగా జరుగుతున్న పనులను వేగవంతం చేస్తామని వివరించారు. అందరి సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని చెప్పారు.