Vegitables shop
-
కరీంనగర్లో మూడో రోజు రద్దీగా మార్కెట్లు
-
కొంగొత్త అంగడి.. నగరంలో ఇక ప్రతిరోజు మార్కెటే!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వెరైటీ కొంగొత్త మార్కెట్లు రూపుదిద్దుకుంటున్నాయి. కాలనీల్లో ఇప్పుడు వారం వారం నిర్వహిస్తున్న కూరగాయల సంతల మాదిరిగానే కొన్నిచోట్ల రోజూ మార్కెట్ నిర్వహించేలా జీహెచ్ఎంసీ ఆలోచన చేసింది. ఇందుకు ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రోడ్ల వెంబడి ఉన్న స్థలాలను ఎంపిక చేశారు. ఇక్కడ జనరల్, ఫ్యాన్సీ తదితర సామగ్రి అమ్మకాలను చేపడతారు. రోడ్ల పక్కన ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలు చెత్త నిలయాలుగా, జులాయిలకు అడ్డాలుగా మారుతుండటంతో ఆ పరిస్థితిని మార్చే ందుకు చేసిన ఆలోచనల్లోంచి జనరల్, ఫ్యాన్సీ, తదితర వస్తువులమ్మే ఈ వెరైటీ మార్కెట్ ఆవిర్భవించింది. మార్కెట్లు ఇలా.. ► ఆయా ఖాళీ ప్రదేశాలలో దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా పైన కప్పుతో పాటు కనీస సదుపాయాలు కలిపించి అంగడి మాదిరిగా చిరువ్యాపారులు తమ సరుకులు అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేస్తారు. ► వీటిల్లో స్థలాలను ఎవరికీ పర్మినెంట్‌గా కేటాయించరు. ఎవరు ముందు వస్తే వారు ఖాళీగా ఉన్న ప్రదేశంలో సరుకుల్ని అమ్ముకోవచ్చు. ► ఇందుకు ఎలాంటి చార్జీ వసూలు చేయరు. పరిశుభ్రంగా నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ► ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులు, దువ్వెన్లు, అద్దాలు వంటివాటి నుంచి లేడీస్ కార్నర్లో లభించే అన్ని వస్తువులు, ఇతరత్రా వివిధ రకాల ఫ్యాన్సీ, జనరల్ సామాగ్రిని చిరు వ్యాపారులు ఈ మార్కెట్లో అమ్ముకోవచ్చు. చిన్న చిన్న వస్తువులు, సరుకులు అవసరమైన స్థానికులకే కాక, ఆ దారిలో వెళ్లే వారికి కూడా ఈమార్కెట్లు ఎక్కువగా ఉపయోగపడగలవని భావిస్తున్నారు. ► మెట్టుగూడలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో రూ.50 లక్షల వ్యయంతో ఇలాంటి మార్కెట్‌ను సిద్ధం చేశారు. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నట్లు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. దాదాపు అరవై మంది చిరువ్యాపారులకు ఇది ఉపయోగపడగలదన్నారు. ప్రతిరోజూ ఉండే ఈ మార్కెట్లో చిరువ్యాపారులు పాటించాల్సిన విధివిధానాలు, తదితరమైనవి రూపొందించి త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. -
జీవితం పచ్చగా ఉంది
బీటెక్ కంప్యూటర్స్ చేసింది. కూరగాయలు అమ్ముతోంది. ఏం పచ్చగా ఉన్నట్లు?! మూడు నెలలు జీతం తీసుకుంది. తర్వాతి నెల్లో జాబ్ పోయింది. ఏం పచ్చగా ఉన్నట్లు?! నాలుగు రాళ్లు వస్తున్నాయి. మూడు రాళ్లు ఇంటి అద్దెకే పోతున్నాయి. ఏం పచ్చగా ఉన్నట్లు?! అన్నీ ఉండటం పచ్చదనం మనకు. కష్టకాలంలోనూ.. ధైర్యమే పచ్చదనం శారదకు. ‘నీ కష్టం, శ్రమ లేకుండా నీకు అంది వచ్చిన గౌరవాలేవీ నీకు సంతృప్తినివ్వలేవు’ ఈ కొటేషన్ చెప్పింది తత్వవేత్త కాదు. ఒక మామూలు అమ్మాయి. అత్యంత సామాన్యమైన అమ్మాయి. ఈ ఒక్కమాటలో ఆమె తన జీవితాన్ని చెప్పుకుంది. నిజమే... ఇది ఆమెకు ఆమె చెప్పుకున్న సూక్తి. అలాంటి ఎన్నో సూక్తులను సొంతంగా రాసుకుంది శారద. తాను రాసుకున్న ఆ సూక్తులతోనే తనను తాను చైతన్యవంతం చేసుకుంది ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా ఆమె రాసుకున్న స్ఫూర్తిదాయకమైన వచనాలే ఆమెను ధైర్యంగా నిలబెట్టాయి. ‘‘కరోనా కష్టకాలంలో ఎదురైన చేదు అనుభవం నుంచి నన్ను నేను నిలబెట్టుకున్న ధైర్యవచనాలవి’’ అంటోంది శారద. కూరగాయలతో కొత్త దారి శారద బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి, కొన్నాళ్లు ఢిల్లీలో ఉద్యోగం చేసింది. తర్వాత హైదరాబాద్‌లోనే ఉద్యోగం చూసుకుందామనుకుని వెనక్కి వచ్చేసి కొత్త ఉద్యోగంలో చేరింది. కార్మికనగర్‌కు దగ్గరలోని ఎస్పీఆర్ హిల్స్‌లో నివాసం. ఓ ఆరు నెలల కిందట మరో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ మూడు నెలలు జీతం తీసుకోగానే ఓ విపత్తు. కరోనా విలయతాండవం మొదలైంది. ఆ కంపెనీ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం సంక్షోభంలో పడింది. ఉద్యోగులను సమావేశ పరిచి ‘ఈ పరిస్థితుల్లో సంస్థను నడిపించడం కష్టం కాబట్టి అర్థం చేసుకోవలసింది’గా సూచించారు పై స్థాయి ఉద్యోగులు. ‘‘జీవితంలో ఎదురయ్యే సంఘటనలన్నీ మనకు నచ్చినవే ఉండవు. ఎదురైన వాటిని యథాతథంగా స్వీకరించి తీరాల్సిందే. మనకు మరొక ఆప్షన్ ఉండదని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. అయితే ఆ క్షణంలో ఉద్వేగాన్ని అదిమి పెట్టుకోగలిగాను కానీ, ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాత్రంతా ఏడ్చాను. ఉదయానికి ఒక నిర్ణయానికి వచ్చేశాను’’ అని చెప్పింది శారద. ఆ నిర్ణయమే ఇప్పుడామె చేస్తున్న కూరగాయల వ్యాపారం. ‘‘సౌకర్యవంతమైన జీవితం అనేది దేవుడిచ్చే బహుమతి. ఆ బహుమతిని దేవుడు ఇచ్చినప్పుడు ఆస్వాదించాలి. ఇవ్వనప్పుడు మనంతట మనం మనకు సాధ్యమైన జీవితాన్ని జీవించాలి. అంతే’’ అని చిరునవ్వు నవ్వింది. ఇంత చిన్న వయసులో ఆమెలో ఇంతటి పరిణతి, జీవితం పట్ల ఆ అమ్మాయికి ఉన్న స్పష్టత ఆశ్చర్యం కలిగిస్తాయి. పెద్ద పాఠాలున్న తన చిన్న జీవితాన్ని శారద అలవోకగా వివరించింది. ర్యాంక్ రుచి ‘‘మాది వరంగల్ జిల్లా వర్ధన్నపేట. నాన్న వెంకటయ్య, అమ్మ సరోజిని వ్యవసాయం చేసేవాళ్లు. మేము ముగ్గురమ్మాయిలం, ఒక అబ్బాయి. చెల్లికి రెండేళ్ల వయసులో మా కుటుంబం హైదరాబాద్‌కి వచ్చేసింది. నలుగురు పిల్లలను పెంచడానికి నాన్న ఎంతో కష్టపడ్డాడు. కూరగాయలమ్మేవాడు. వాచ్‌మన్‌గా పని చేశాడు. అమ్మ ఇళ్లలో పని చేసింది. వాళ్లు ఎన్ని కష్టాలు పడినప్పటికీ మమ్మల్ని చదివించడంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. మేము బాగా చదువుకుంటూ ఉండడంతో మా ఇంటి దగ్గర ఉండే గోవిందరెడ్డి సార్, ప్రభావతి మేడమ్ ఇంకా కొందరు సహాయం చేశారు. నాలుగో తరగతిలో అనుకుంటాను నాకు ఒకసారి థర్డ్ ర్యాంక్ వచ్చింది. ర్యాంక్‌తో వచ్చే సంతోషం ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ నా టార్గెట్ అయింది. టెన్త్ సెవెన్టీ పర్సెంట్‌తో పాసయ్యాను. జీవితంలో మంచిగా స్థిరపడాలంటే ఇది చాలదు, పర్సంటేజ్ ఇంకా పెంచుకోవాలనిపించింది. ఇంటర్ ఎనభైశాతంతో పాసయ్యాను. బీటెక్‌లో ఫ్రీ సీట్ వచ్చింది. నాదే కాదు, మా అక్క, చెల్లిది కూడా ఫ్రీ సీటే. మేము జీవితకాలమంతా మర్చిపోలేని స్కీమ్ ఫీజ్ రీయింబర్స్మెంట్. నేను బీటెక్‌లోకి వచ్చేటప్పటికీ వైఎస్ఆర్ లేరు. కానీ మాలాంటి వాళ్ల కోసం ఆయన వేసిన అక్షరాల బాట ఉంది. మా అమ్మానాన్నలకు మమ్మల్ని చదివించాలనే కోరిక ఎంతలా ఉన్నా, ముగ్గురికి వేలాది రూపాయల ఫీజులు కట్టి ఇంజనీరింగ్ కోర్సు చేయించగలిగేవాళ్లు కాదు. స్కూల్ ఫీజులు, పుస్తకాలకు పెద్ద మనసున్న వాళ్లు సహాయం చేశారు. కానీ ఇంజనీరింగ్ ఫీజులు కట్టమని ఎవరినీ అడగలేం కదా! అంతంత ఫీజు కట్టాలంటే ఎవరికైనా కష్టమే. వైఎస్ఆర్ అనే మహానుభావుడు మా ముగ్గురినే కాదు, మా కాలనీలో ఉన్న మూడు వందల కుటుంబాల్లో కనీసం వంద మందిని గ్రాడ్యుయేట్లను చేశారు. మా జీవితమంతా ఆయన పట్ల కృతజ్ఞతతో ఉంటాం’’ అని చెమర్చిన కళ్లతో చెప్పింది శారద. నాన్న పడిన కష్టం ఇక చాలు మా అక్క ఎంటెక్ చేసి వరంగల్‌లో వాగ్దేవి కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తోంది. చెల్లి హైదరాబాద్, బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ పాలసీ మేకర్. అన్నయ్య టెన్త్‌తో ఆపేశాడు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేసేవాడు. కరోనా లాక్డౌన్ వల్ల అన్నయ్యకు కూడా ఉద్యోగం పోయింది. నాన్న మనందరినీ కూరగాయల బండి మీదనే బతికించాడు. అదే కూరగాయలతో మనం మాత్రం బతకలేమా!, గౌరవంగా డబ్బు సంపాదించుకునే ఏ పనినైనా చేసుకోవచ్చని అన్నయ్యకు నచ్చచెప్పాను. అడవిలో వదిలినా బతికేయగలననే నమ్మకం ఉంది. నాన్నను ఇంట్లోనే ఉండమని చెప్పాం. దుకాణాన్ని విస్తరించాం. ఇక నాకు మనసు బాధ పడిన క్షణాలంటే... నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బులో పెద్ద మొత్తం ఇంటి అద్దెకే వెళ్లిపోతోంది. నేను అద్దె కడుతున్నప్పుడు నాకు అనుభవంలోకి వచ్చిన ఆవేదన ఇది. ఇన్నాళ్లూ మా అమ్మానాన్న రెక్కల కష్టంలో కూడా ఎక్కువ భాగం అద్దెలకే సరిపోయింది. అలాగని కుంగిపోవడం ఏమీ ఉండదు. ఉన్నంతలో హాయిగా తింటున్నాం, దేవుడి దయ వల్ల అనారోగ్యాల్లేవు, ఆరోగ్యంగా బతుకుతున్నాం. ‘నా పెళ్లి కోసం అప్పులు చేయవద్దు. నేను సంపాదించుకున్న తర్వాత చేసుకుంటాను’... అని మా నాన్నకు చెప్పేశాను. ‘ఇంకా ఎప్పుడు చేసుకుంటావే’ అని అమ్మ తిడుతోంది’’ అని నవ్వుతూ చెప్పింది శారద. శారద మాటలు వింటుంటే... ‘‘నీలో దృఢనిశ్చయం శక్తిమంతంగా ఉండాలి. ఆత్మస్థయిర్యం అత్యున్నత స్థాయిలో ఉండాలి. నీ కలల మీదనే దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడే నీ గమ్యాన్ని చేరగలుగుతావు’’ అని ఆమె రాసుకున్న కొటేషన్‌ను అక్షరాలా ఆచరణలో పెడుతున్నట్లు అనిపించింది. కాలేజీ రోజుల్నుంచి తనకు వచ్చిన భావాన్ని కాగితం మీద రాసుకోవడం ఆమెకు అలవాటు. అలా ఆమె రాసుకున్న కొటేషన్లు ముప్పైకి పైగా ఉన్నాయి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: గడిగె బాలస్వామి ఒకటి పోతే మరొకటి ఉంటుంది రోజూ ఉదయాన్నే అన్నయ్య మార్కెట్‌కెళ్లి కూరగాయలు తెస్తాడు. నేను షాప్‌లో అమ్ముతున్నాను. ఉద్యోగం పోతే బతకలేమని భయపడే వాళ్లకు నేను చెప్పేదొక్కటే. మీ అమ్మానాన్నలు చేసిన పనినే చేయండి. వాళ్లకంటే మరింత మెరుగ్గా చేయండి. మా మట్టుకు మేము మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలను అలాగే అమ్మకుండా శుభ్రం చేసి అమ్ముతున్నాం. మనకు తెలిసిన నైపుణ్యాలతో జీవితాన్ని నిలబెట్టుకోవాలి కానీ కుంగిపోతే సాధించేదేమీ ఉండదు. ఒకటి చేజారి పోయిందంటే... మనకోసం మరొకటేదో ఉండి ఉంటుందని నమ్ముతాను. – శారద, సాఫ్ట్వేర్ ఇంజనీర్ -
బాబోయ్.. కూరగాయల సంచిలో పాము!
ఒకేసారి కిలోల్లో బంగాళదుంపల సంచిని కొనుగోలు చేస్తున్నారా.. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఆస్ట్రేలియాకు చెందిన మారిస్సా డెవిడ్ అనే మహిళా. ఓ సూపర్ మార్కెట్లో బంగాళ దుంపల సంచిని కొని ఇంటికి తీసుకెళ్లిన క్రమంలో ఆమె ఓ భయంకర అనుభవాన్ని ఎదుర్కొన్నానంటూ ఫేస్బుక్ పేజీలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌కు చెందిన మారిస్సా డెవిడ్ అనే మహిళ శక్రవారం అక్కడి సూపర్ మార్కెట్లో 4 కిలోల బంగాళ దుంపల సంచిని కొనుగోలు చేసింది. ఇక ఆ సంచిని ఇంటికి తీసుకేళ్లిన ఆమె దానిని తెరచి బంగాళ దుంపలను బయటకు తీస్తున్న క్రమంలో సంచిలో బతికున్న పాము గమనించింది. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. ఇది అద్భుతం! ఇక ఒక్కసారిగా ఉలిక్కపడ్డ మారిస్సా సంచికి దూరంగా పరిగెత్తింది. ఆ పాము సంచి నుంచి బయటకు దూకి మహిళ ఐదేళ్ల కుమారుడి వైపు పాకుతుండం చూసింది. వెంటనే తన కొడుకును దగ్గరికి తీసుకుని వాక్యూమ్ క్లీనర్‌తో పాము తలపై కొట్టడంతో అది చనిపోయింది. కాగా ఈ పాముకు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె ఫేస్బుక్లో పంచుకున్నారు. ఇక ఈ ఘటనపై మారిస్సా మాట్లాడుతూ.. ‘ఇది భయంకరమైన ఘటన.. దీని నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్న. సరిగా నిద్ర కూడా పట్టడం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక జరిగిన ఘటనపై సూపర్ మార్కెట్ నిర్వహకులు కూడా స్పందించి ఆమెను క్షమాపణలు కోరినట్లు ఆమె చెప్పారు. -
దళిత కాబట్టే వివక్ష!
-
ఖండకర కార్పాసకూర్పాసం అంటే...?
నవ్వింత: ఈ మధ్య మా రాంబాబుగాడు బనీను మీదే ఉంటున్నాడు. దగ్గర్లోని కూరగాయల షాపు, కిరాణ స్టోరుకు వెళ్లాలన్నా అదే డ్రస్‌కోడు. అందుకే ఓ రోజు తెగించి వాడికి సలహా ఇచ్చా. ‘‘లుంగీ, బనీను మీద ఇంటి ముందుకొచ్చే బండ్ల దగ్గరకు వెళ్లడం అయితే పర్లేదు గానీ... బజారుకు వచ్చేటప్పుడైనా బట్టలు కట్టుకుని రారా’’. ఊహించినట్టే వాడు ఆవేశపడ్డాడు. ‘‘బనీను గొప్పదనం నీకు తెలియట్లేదురా. కొంతమంది బనీను లేకుంటే అసలు చొక్కా వేసుకోనే వేసుకోరు. ఒకవేళ అలా వేసుకోవాల్సి వచ్చినా వాళ్లు సంతృప్తిగా ఉండలేరు. మత్తుమందు కంటే ఎక్కువగా అడిక్టు చేయించే వస్త్రవిశేషం, విశేషవస్త్రం బనీను’’. ‘‘బనీను గొప్పదేమిట్రా నీ ముఖం’’ అన్నాను. ‘‘బనీనంటే ఏమిటి? బిడ్డపుట్టగానే బనీను గుడ్డలో చుట్టి ఉంచుతారు. పుట్టుకతో మొదలైన ఈ బనీను బంధం... పుడకల దగ్గర పోవాల్సిందేరా. అంతగా తోడొచ్చే వస్త్రం మరోటి లేదు. అంతెందుకు పైన తొడిగే షర్టు ఓ భవనం అయితే దానికి పునాది బనీను. అందుకే కొందరు బనీనునూ, అది ఇచ్చే కంఫర్టునూ వదల్లేక దానికే కాలరొకటి కుట్టించి, ‘టీ షర్ట్’ అని ముద్దుపేరు పెట్టుకున్నారు’’ అన్నాడు. ‘‘ఒరే రాంబాబూ, రోజూ క్యాజువల్‌గా తొడుక్కునే దానికి ఇంత రాద్ధాంతం ఏమిట్రా! టాపిక్ వదిలెయ్’’ అన్నాన్నేను. కానీ వాడు అంత తేలిగ్గా వదలడానికి ఇష్టపడలేదు. ‘‘బనీను తెలుగు సినిమా రంగానికి సేవ చేస్తుంటుందిరా. హీరో ఇమేజ్ను కాపాడటానికి తోడ్పడుతుంది’’ ‘‘బనీనా... హీరో ఇమేజ్నా’’ అన్నాను సంభ్రమంగా. ‘‘హీరో తన అల్లరి మూకతో ఆగడాలు చేస్తూ పోలీసులకు పట్టుబడతాడనుకో. అప్పుడు పోలీసులు హీరోకు తోడున్న తోకబ్యాచీవాళ్లందర్నీ చారల డ్రాయర్ మీద నగ్నంగా నిలబెడతారు. కానీ హీరోకు మాత్రం బనీనును ఉంచి వాడి ఇమేజు డ్యామేజు కాకుండా కాపాడతారు. ఇక నువ్వు చాలా విలువైన జాతివజ్రాలనూ, మేలురత్నాలనూ బంగారుపళ్లెంలో పోసి రాచకొలువుకు తెస్తున్నావనుకో. అప్పుడు ఒక అందమైన నగిషీల గుడ్డ కప్పి తెస్తావు చూడు... అలాంటిదే హీరో బనీను. జాతివజ్ర, మేలిరత్న దర్శన సమయంలో సదరు జలతారు వస్త్రాన్ని పక్కకు తొలగించినట్టే... సినిమా చివర్లో హీరో కూడా బనీను విప్పేసి తన సిక్స్‌ప్యాక్ చూపిస్తాడన్నమాట. ఇది కండలున్న హీరోకు! ఒకవేళ వాడు కండల్లేని హీరో అనుకో. ఇంటి సీన్లూ, పెరటి సీన్లలాంటి క్యాజువల్ సన్నివేశాల్లో వాడి మానరక్షణతో పాటు మళ్లీ ఇమేజు సంరక్షణకు తోడ్పడుతుంది. అది మన సంస్కృతి’’ అంటూ ఒక థీసిస్ సమర్పించాడు. ‘‘బనీను సంస్కృతేమిట్రా బాబూ. అది ఇంగ్లిషు వాళ్లు నేర్పిన అలవాటు కాదా?’’ అని ఆశ్చర్యంగా అడిగాన్నేను. ‘‘కాదు... ప్రబంధమహాకవి శ్రీనాథుడేమన్నాడు? ‘కుల్లాయుంచితి... మహాకూర్పాసమున్ తొడిగితిన్’ అన్లేదా? మహాకూర్పాసమంటే ఏమనుకున్నావ్. గొప్ప బనీను అని అర్థం తెల్సా? అలా ఎన్నో రకాలు’’ అన్నాడు వాడు. ‘‘బనీన్లలో రకాలా?’’ ‘‘మహాకూర్పాసమంటే బహుశా శ్రీనాథుడూ దాని గొప్పదనాన్ని అర్థం చేసుకొని, మహా అనే విశేషణాన్ని చేర్చి ఉంటాడు. ఆయన చేతులున్న బనీను వేసుకుని ఉంటాడు. చేతుల్లేని బనీనును ‘ఖండకర కార్పాసకూర్పాసం’ అని మన తెలుగు సార్ చెప్పింది నీకు గుర్తులేదా? మొన్న మొన్నటి వరకూ షావుకార్లూ, మోతుబర్లూ సైనుగుడ్డను బనీనుగా కుట్టించి డబ్బులూ అవీ జాగ్రత్తగా పెట్టుకోడానికి దాన్లోనే కలిసిపోయి కనిపించని విధంగా పెద్ద పెద్ద జేబులు పెట్టించేవారు. పైన షర్టేసేవారు. మామూలు బడుగు జనాలైతే పై అంగీలేకుండా వాటినే వేసుకునేవారు’’ అంటూ బనీన్ల చరిత్ర, వాటి ప్రాధాన్యం గురించి లెక్చరిచ్చాడు. ‘‘ఆయనేదో ఆరోజు ఖండకరకార్పాసమంటూ హాస్యానికి అన్నారు. నువ్వేమో సీరియస్‌గా తీసుకుంటున్నావ్’’ పిచ్చి వదిలిద్దామని నేను లోతుగా గిల్లితే, అసలు రహస్యమేమిటో చెప్పాడు. ‘‘ఆ టీవీలో ప్రకటన చూళ్లేదా? అమ్మాయిల్ని కొందరు ఆకతాయీలు ఏడిపిస్తుంటే ఎలక్ట్రీషియన్ బనీన్‌తో ఎగిరి దూకుతాడు. ఆ ఎలక్ట్రీషియన్‌ను సదరు అమ్మాయిలు మోహిస్తారు. ఇంకోటి చెప్పనా? ఫలానా సెంటు వాడితే అమ్మాయిలు వెంటపడతారని చూపిన ప్రకటన చూసి అది వాడా. నిజంగానే వెంటపడ్డారు కొట్టడానికి! అందుకే సెంటు వర్కవుటు కాలేదని బనీను మీద పడ్డా. మన ఫిట్‌నెస్‌కు విట్నెస్గా ఇది నిల్చి ఎప్పటికైనా ఓ అమ్మాయి లవర్‌గా దొరుకుతుందేమోరా’’ అంటూ తన ఆశను బయటికి చెప్పాడు. ‘‘మరి చేతిలో ఆ కటింగ్ ప్లేయర్ ఏమిట్రా?’’ అంటే, ‘‘అమ్మాయిలకు కటింగ్ ఇవ్వాలంటే ఈమాత్రం ఉండాలి’’ అన్నాడు. - యాసీన్