బాబోయ్‌.. కూరగాయల సంచిలో పాము! | Woman Finds Live Snake In Potatoes Bag In Australia | Sakshi
Sakshi News home page

బంగాళదుంపలను చుట్టేసిన పాము...

Published Thu, Mar 12 2020 5:58 PM | Last Updated on Thu, Mar 12 2020 6:35 PM

Woman Finds Live Snake In Potatoes Bag In Australia - Sakshi

ఒకేసారి కిలోల్లో బంగాళదుంపల సంచిని కొనుగోలు చేస్తున్నారా.. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఆస్ట్రేలియాకు చెందిన మారిస్సా డెవిడ్‌ అనే మహిళా. ఓ సూపర్‌ మార్కెట్‌లో బంగాళ దుంపల సంచిని కొని ఇంటికి తీసుకెళ్లిన క్రమంలో ఆమె ఓ భయంకర అనుభవాన్ని ఎదుర్కొన్నానంటూ ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌కు చెందిన మారిస్సా డెవిడ్‌ అనే మహిళ శక్రవారం అక్కడి సూపర్‌ మార్కెట్‌లో 4 కిలోల బంగాళ దుంపల సంచిని కొనుగోలు చేసింది. ఇక ఆ సంచిని ఇంటికి తీసుకేళ్లిన ఆమె దానిని తెరచి బంగాళ దుంపలను బయటకు తీస్తున్న క్రమంలో సంచిలో బతికున్న పాము గమనించింది.

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. ఇది అద్భుతం!

ఇక ఒక్కసారిగా ఉలిక్కపడ్డ మారిస్సా సంచికి దూరంగా పరిగెత్తింది. ఆ పాము సంచి నుంచి బయటకు దూకి మహిళ ఐదేళ్ల కుమారుడి వైపు పాకుతుండం చూసింది. వెంటనే తన కొడుకును దగ్గరికి తీసుకుని వాక్యూమ్‌ క్లీనర్‌తో పాము తలపై కొట్టడంతో అది చనిపోయింది. కాగా ఈ పాముకు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. ఇక ఈ ఘటనపై మారిస్సా మాట్లాడుతూ.. ‘ఇది భయంకరమైన ఘటన.. దీని నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్న. సరిగా నిద్ర కూడా పట్టడం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక జరిగిన ఘటనపై సూపర్‌ మార్కెట్‌ నిర్వహకులు  కూడా స్పందించి ఆమెను క్షమాపణలు కోరినట్లు ఆమె చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement