Vehicle life cycle assessment
-
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసే ముందు ఇవి తెలుసుకోండి!
దేశంలో పెట్రోల్ ధరలు 100 రూపాయల దాటేసరికి వాహనదారులు తమ వాహనాన్ని బయటకు తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది కొత్త వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. కరోనా మహమ్మరి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆటో పరిశ్రమకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఇది ఇలా ఉంటే ఎలక్ట్రిక్ వాహనలకు డిమాండ్, అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా చాలా మంది వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సిద్దం అవుతున్నారు.(చదవండి: సరికొత్త మోసం.. ఇలాంటి లింక్ అస్సలు క్లిక్ చేయకండి!) ప్యాసింజర్ వేహికల్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన ట్రెండ్ ఏమిటంటే, ప్రీ-ఓన్డ్ లేదా ఉపయోగించిన వాహనాలకు అధిక డిమాండ్ ఉంటుంది. దీని వెనుక కారణం కొత్త మోడల్స్ తో పోలిస్తే వాహనాలు సరసమైన ధరలకు వస్తాయి. అదే సమయంలో, పెద్దగా కొన్నవారికి కూడా ఎక్కువ నష్టం కలగదు. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరగడంతో ఈవీ ప్రీ-ఓన్డ్ వేహికల్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, సెకండ్ హ్యాండ్ లేదా ప్రీ-ఓన్డ్ ఎలక్ట్రిక్ వాహనాలను కొనేముందు కొన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. బ్యాటరీ జీవితకాలం ఉపయోగించిన ఈవీని కొనుగోలు చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశం ఇది. బ్యాటరీ మంచి కండిషన్ తో ఉన్న ఈవీలు భాగ పనిచేస్తాయి. అయితే, ఉపయోగించిన ఐసీఈ వేహికల్ కొనుగోలు చేసేటప్పుడు మీరు చెక్ చేసినట్లుగా వీటి బ్యాటరీ జీవితకాలం, రేంజ్ వంటివి చెక్ చేయాలి. ఆ తర్వాత డీల్ గురుంచి మాట్లాడండి. బ్యాటరీ జీవితకాలం ఛార్జింగ్ టైప్, ఛార్జింగ్ ఫ్రీక్వెన్సీ, బ్యాటరీ ఏ స్థాయికి డ్రెయిన్ చేశారు వంటి కారకాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. ఫాస్ట్ ఛార్జింగ్ ఈవీల బ్యాటరీలు త్వరగా నష్టం వాటిల్లుతుంది. రెగ్యులర్ హోమ్ ఛార్జింగ్ సాకెట్ ఎక్కువ బ్యాటరీ జీవితకాలాన్ని ఇస్తుంది. బ్యాటరీని సున్నా నుంచి చార్జ్, ఎప్పుడు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ జీవిత కాలం ప్రభావితం చెందుతుంది. ఆ లీథియం ఆయాన్ బ్యాటరీ లేదా వేరే బ్యాటరీనా అని చూసుకోవాలి. (చదవండి: డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు డౌన్లోడ్ చేశారా..?) మైలేజ్ రేంజ్ ఈవీ రేంజ్ బ్యాటరీ సైజుపై ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ ఎంత పెద్దదిగా ఉంటే ఈవీ అంత ఎక్కువ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల, ప్రీ-ఓన్డ్ ఈవిపై డీల్ ఖరారు చేసే ముందు బ్యాటరీ సైజు, సగటు రేంజ్ గురించి ఎల్లప్పుడూ విచారించండి. ఎలక్ట్రిక్ వాహనం రేంజ్ సామర్థ్యం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. మౌలిక సదుపాయాల లభ్యత ఈవీ కొనుగోలు చేసే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో కీలకమైన అంశం. నగరం, చుట్టుపక్కల ఎక్కువగా ప్రయాణించడానికి ఈవీ కొనుగోలు చేసినట్లయితే ఎలాంటి సమస్య లేదు. ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటే రహదారుల వెంట ఎక్కువ ఛార్జింగ్ సౌకర్యాలు ఉన్నాయో లేదా అనేది చూసుకోవాలి.(చదవండి: ఏటీఎం కార్డు లాంటి ఆధార్.. అప్లై ఇలా!) కాలం ఒక ఎలక్ట్రిక్ వాహనం తీసుకునే ఎన్ని ఏళ్లు అయ్యింది అనేది కూడా చాలా ముఖ్యం. ఇంధన వాహనాలతో పోలిస్తే తక్కువ లైఫ్ ఉంటాయి. నిర్వహణ ఖర్చులు పెద్దగా ఉండనప్పటికి బ్యాటరీ, ఇంజిన్ సమస్య వస్తే సాదారణ వాహనాలతో పోలిస్తే ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. వీటి జీవిత కాలం ఇంధన వాహనాలతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకే, కొనేముందు వారు తీసుకొని ఎన్ని ఏళ్లు అయింది అనేది తెలుసుకోవాలి. -
పన్ను కాడ..‘లెక్క’ తేడా!
వాహనాల జీవితకాల పన్ను చెల్లింపులో అక్రమాలు 14కు బదులు 12 శాతమే చెల్లింపు ఆటో మొబైల్ డీలర్ల మోసాలు ఆర్టీఏ పరిశీలనలో వెల్లడి సిటీబ్యూరో: వాహనాల జీవిత కాల పన్ను (లైఫ్ ట్యాక్స్) చెల్లింపులో కొందరు ఆటో మొబైల్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన కార్లు, ఇతర తేలికపాటి మోటారు వాహనాలపై రవాణా శాఖకు 14 శాతం జీవిత కాల పన్ను చెల్లించవలసి ఉంటుంది. కొందరు డీలర్లు వాటి ధరలను రూ.10 లక్షల కంటే తక్కువగా చూపుతూ 12 శాతం లైఫ్‌ట్యాక్స్ మాత్రమే చెల్లిస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్టరైన రెండు కార్లపైన సుమారు రూ.68 వేల వరకు పన్ను ఎగవేసినట్లు గుర్తించారు. దీంతో రవాణా శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో జీవిత కాల పన్ను చెల్లింపులో అక్రమాలపై తనిఖీలు చేపట్టాలని రవాణా కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కూకట్పల్లి, ఖైరతాబాద్, తదితర ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో మరో 15 వాహనాలపైన కూడా డీలర్లు ఇదే తరహాలో లక్షలాది రూపాయల మేర పన్ను ఎగవేసినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అక్రమాలు రూ.కోట్లలో ఉండి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా మరింత లోతుగా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇన్వాయిస్లలో మార్పు కార్లు, ఇతర తేలికపాటి మోటారు వాహనాలపై రవాణా శాఖ రెండు రకాల జీవిత కాల పన్ను విధిస్తోంది. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన కార్లకువాటి ధరలో 14 శాతం... అంతకంటే తక్కువ ఖరీదైన వాటిపై 12 శాతం చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ వెసులుబాటును అవకాశంగా తీసుకొని కొందరు డీలర్లు వాహనాల ఇన్వాయిస్లో రూ.9.90 లక్షలుగా నమోదు చేశారు. ఈ మేరకు వాహనం కొనుగోలు చేసిన వ్యక్తికి అసలు ధరతో కూడిన ఇన్వాయిస్ అందజేసి... ఆర్టీఏకు మాత్రం సవరించిన ఇన్వాయిస్ మేరకు జీవిత కాల పన్ను చెల్లించారు. కొనుగోలుదారులకు, ఆర్టీఏ అధికారులకు అనుమానం రాకుండా ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులతో తమ జేబులు నింపుకున్నారు. ఇలా నమోదైన రెండు వాహనాలపై అనుమానం రావడంతో రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు వాహనాల అసలు ధరల పట్టికను తెప్పించుకొని పరిశీలించారు. రూ.11 లక్షల ఖరీదైన వాహనాల ఇన్వాయిస్లను రూ.9.95 లక్షల చొప్పున సృష్టించినట్లు గుర్తించారు. ఒక్కో వాహనంపై రూ.1.54 లక్షల లైఫ్‌ట్యాక్స్ చెల్లించవలసి ఉండగా... తప్పుడు ఇన్వాయిస్లతో రూ.1.20 లక్షలు మాత్రమే చెల్లించారు. దీంతో మోసానికి పాల్పడిన డీలర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన రవాణా కమిషనర్‌కు విన్నవించారు. ఈ ఉదంతంతో అప్రమత్తమైన కమిషనర్ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు ఆదేశించారు. పునరావృతం కాకుండా చర్యలు ఇలాంటి అక్రమాలు మరోసారి జరగకుండా రవాణా శాఖ కార్యాచరణకు దిగింది. వాహనాల తయారీదారులు నిర్ణయించిన ధరలు.. వాటి ప్రకారం చెల్లించవలసిన జీవిత కాల పన్ను వివరాలు రవాణా శాఖ వెబ్సైట్లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ధరల వివరాలు పూర్తిగా పారదర్శకంగా ఉన్నప్పుడే పన్ను చెల్లింపుల్లోనూ పారదర్శకత ఉంటుందని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. మరోవైపు అక్రమాలకు పాల్పడిన డీలర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై రాష్ట్రవ్యాప్త తనిఖీలు పూర్తయిన తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.