vehicle siezed
-
చలానా పెండింగ్ ఉంటే బండి సీజ్
సాక్షి, సిటీబ్యూరో: ఒక్క చలానా పెండింగ్‌లో ఉన్నా వాహనాన్ని జప్తు చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని.. తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్ అవాస్తవమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తేల్చారు. హైకోర్టు అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని ఆపేయాలని హెచ్చరించారు. చదవండి: డేంజర్ డెంగీ సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ (సీఎంవీఆర్)–1989 రూల్ 167 ప్రకారం 90 రోజులకు పైగా ట్రాఫిక్ చలానాలు పెండింగ్ ఉన్న వాహనాలను అదుపులోకి తీసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సంబంధిత పెండింగ్ చలానా గురించి వాహనదారునికి ఎలక్ట్రానిక్ రూపంలో లేదా కాల్ ద్వారా పోలీసులు ఒక్కసారైనా తెలియజేస్తే చాలని పేర్కొన్నారు. చదవండి: సీసీఎస్ బకాయిల కోసం రూ.500 కోట్లు ఏమైనా ట్రాఫిక్ ఉల్లంఘన చలానాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేసుకోవాల్సిన బాధ్యత వాహనదారులదే. ఒకవేళ వాహనదారులు ఏమైనా వ్యత్యాసం గమనిస్తే ఆన్లైన్ ద్వారా అధికారులకు నివేదించవచ్చు. సాక్ష్యాలను ధ్రువీకరించి సరిదిద్దుకోవచ్చని వారు సూచించారు. చదవండి: ఏఐబీపీ ప్రాజెక్టులన్నీ పూర్తికావాల్సిందే! -
పది రోజుల్లో 10 వేలకు పైగా వెహికిల్స్ సీజ్
సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఉదయం వేళ కల్పించిన వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓపక్క చెక్‌పోస్టులు, మరోపక్క పికెట్ల వద్ద వాహనచోదకుల్ని ఆపి... ఆకారణంగా బయటకు వచ్చిన వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా గడిచిన పది రోజుల్లో 10 వేలకు పైగా వాహనాలను సీజ్ చేశారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఆయా సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. మూడు పోలీసు కమిషనరేట్‌లో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ (టీసీసీసీ) సిబ్బంది వివిధ జంక్షన్లు, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ద్వారా ఇలాంటి ఉల్లంఘనుల్ని గుర్తించి ఈ–చలాన్లు జారీ చేస్తుండగా క్షేత్రస్థాయి అధికారులు ఆయా వాహనాలను ఆపి స్వాధీనం చేసుకుంటున్నారు. లాక్డౌన్ గత నెల 23న అమలులోకి రాగా.. అప్పటి నుంచి శుక్రవారం వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు మొత్తం 11,012 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అత్యధికం ద్విచక్ర వాహనాలు కావడంతో యువకులే అకారణంగా రోడ్ల పైకి వస్తున్నట్లు నిర్ధారణ అవుతోందని చెప్తున్నారు. మరోపక్క ఫిజికల్ డిస్టెన్స్‌ను కచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం లాక్డౌన్ ముగిసే వరకు ద్విచక్ర వాహనంపై ఒకరు, తేలికపాటి వాహనంగా పిలిచే కారులో గరిష్టంగా ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అనేక మంది ఈ ఉత్తర్వుల్నీ ఉల్లంఘిస్తూ ద్విచక్ర వాహనాలపై ఇద్దరు సంచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ తరహా వాహనచోదకులపై 9122 కేసులు నమోదు చేశారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులకు ఉల్లంఘించడం సహా వివిధ రకాలైన ఉల్లంఘనలకు పాల్పడిన వారినీ పోలీసులు నేరుగా, టీసీసీసీ ద్వారా గుర్తించి ఈ చలాన్లు జారీ చేస్తున్నారు. ఇలా జారీ చేసిన కాంటాక్ట్, నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్ మెంట్ చలాన్ల సంఖ్య శుక్రవారం నాటికి మూడు పోలీసు కమిషనరేట్లలో కలిపి 333,932కు చేరింది. లాక్డౌన్ వైలేషన్స్‌కు పాల్పడిన వాహన చోదకులకు ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 179 కింద జరిమానా విధిస్తున్నారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి రూ.600 జరిమానా పడుతోంది. అయితే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై మాత్రం ఐపీసీలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ప్రధానంగా సెక్షన్ 188 (ప్రభుత్వ ఆంక్షల్ని ఉల్లంఘించడం), సెక్షన్ 270 (ప్రాణాంతకమైన వ్యాధి మరొకరికి సోకేలా ప్రవర్తించడం), సెక్షన్ సెక్షన్ 271 (క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించడం) తదితరాల కింద రిజిస్టర్ చేస్తున్నారు. ఇలాంటి వారిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నా.. శాంతిభద్రతల విభాగానికి అప్పగిస్తున్నారు. ఈ తరహాకు చెందిన కేసులు ఇప్పటి వరకు మూడు కమిషనరేట్లలో కలిపి 328 నమోదు చేశారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత వీరికి నోటీసులు జారీ చేసి, న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేయనున్నారు. వీరిపై కోర్టులో నేరం నిరూపణ అయితే గరిష్టంగా రెండేళ్ల వరకు శిక్ష పడేందుకు ఆస్కారం ఉందని అధికారులు చెప్తున్నారు. సాధారణ రోజుల్లో కూడా పోలీసులు ఉల్లంఘనులపై కేసులు నమోదు చేస్తుంటారు. ప్రస్తుతం లాక్డౌన్ డేస్‌లో సాధారణ రోజులకంటే ఎక్కువగానే కేసులు నమోదు చేయడం గమనార్హం. -
ఉలిక్కిపడ్డ ధర్మాజిపేట
దుబ్బాకటౌన్: దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని ధర్మాజిపేటలో గురువారం తెల్లవారుజామున సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీ సులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. సీపీ శివకుమార్, డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రామేశ్వర్ ఆధ్వర్యంలో దుబ్బాక సీఐ నీరంజన్, ఎస్ఐ సుభాష్గౌడ్తో పాటు మిరుదొ డ్డి, చిన్నకోడూర్ ఎస్ఐలు.. మొత్తం 65 మంది సిబ్బం ది బ్యాచ్‌లుగా విడిపోయి ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటినీ తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని 94 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు, 2 కార్లు, 3 ట్రాక్టర్లను సీజ్ చేశారు. గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురిని గుర్తించా రు. వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ శివకుమార్.. ఎస్ఐ సుభాష్‌గౌడ్‌కు సూచించారు. గతంలో 30 నేరాలతో సంబంధం ఉన్న భిక్షపతితో పాటు పలు నేరాలు చేసిన కాస్తి కనకయ్య, శ్రీనివాస్‌ను విచారణ చేశారు. ఆందోళనకు గురైన ప్రజలు తెల్లవారుజామున 5 గంటలకు ఒక్కసారిగా ధర్మాజిపేటను పోలీసులు చట్టుముట్టడంతో ప్రజలు ఆందోళన చెందారు. గతంలో నక్సలైట్ల కోసం పోలీసులు గ్రామాలను చుట్టుముట్టేవారు.. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ అలాంటి సంఘటలన ఏదైనా జరుగుతుందేమోనని ధర్మాజీపేట ప్రజలు ఉలిక్కిపడ్డారు. పోలీసులు అన్ని వివరాలు చెప్పడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. నేర రహిత సమాజం కోసమే.. నేరరహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా నిరంతరం పనిచేస్తున్నామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ అన్నారు. గురువారం ధర్మాజిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల అదుపునకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజల మేలు కోసమే కార్డెన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. వాహనదారులు తమ వాహనాల ఆర్సీ, ఇన్సురెన్స్, డ్రైవింగ్ లైసెన్స్‌లు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సీపీ సూచించారు. -
బైక్ దొంగ అరెస్ట్
నెల్లూరు (క్రైమ్) : బైక్ చోరీకి పాల్పడిన ఓ దొంగను శనివారం ఒకటో నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం కోవెలంపాడుకు చెందిన హరీష్‌రెడ్డి తన స్వగ్రామంలో పాల డిపో నిర్వహించారు. ఆర్థికంగా దెబ్బతినడంతో ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి ఓ ప్రముఖ జ్యుయలరీ దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేశాడు. అక్కడ అవకతవకలకు పాల్పడడంతో వారు ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో హరీష్‌రెడ్డి ఈజీగా నగదు సంపాదించేందుకు బైక్ దొంగగా మారాడు. గతేడాది డిసెంబర్ 1వ తేదీన నెల్లూరు రాజాగర్వీధికి చెందిన కొడవలూరు పవన్‌కుమార్ ఎస్2 థియేటర్‌కు తన పల్సర్ మోటారు బైక్‌పై వచ్చాడు. బైక్‌ను థియేటర్ బయట పార్క్ చేసి టికెట్లు కొనుక్కొనేందుకు లోనికి వెళ్లాడు. హరీష్‌రెడ్డి పల్సర్ బైక్‌ను అపహరించాడు. బాధితుడు అదే రోజు ఒకటో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ రాంబాబు కేసు నమోదు చేశారు. శనివారం ఇన్స్పెక్టర్ ఎస్కే అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో రాంబాబు విజయమహాల్ గేటు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. హరీష్‌రెడ్డి దొంగలించిన బైక్‌పై వస్తుండగా అతన్ని పోలీసులు అదుపులోకి అరెస్ట్ చేశారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.