బైక్ దొంగ అరెస్ట్
నెల్లూరు (క్రైమ్) : బైక్ చోరీకి పాల్పడిన ఓ దొంగను శనివారం ఒకటో నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం కోవెలంపాడుకు చెందిన హరీష్‌రెడ్డి తన స్వగ్రామంలో పాల డిపో నిర్వహించారు. ఆర్థికంగా దెబ్బతినడంతో ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి ఓ ప్రముఖ జ్యుయలరీ దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేశాడు. అక్కడ అవకతవకలకు పాల్పడడంతో వారు ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో హరీష్‌రెడ్డి ఈజీగా నగదు సంపాదించేందుకు బైక్ దొంగగా మారాడు. గతేడాది డిసెంబర్ 1వ తేదీన నెల్లూరు రాజాగర్‌వీధికి చెందిన కొడవలూరు పవన్‌కుమార్ ఎస్2 థియేటర్‌కు తన పల్సర్ మోటారు బైక్‌పై వచ్చాడు. బైక్‌ను థియేటర్ బయట పార్క్ చేసి టికెట్లు కొనుక్కొనేందుకు లోనికి వెళ్లాడు. హరీష్‌రెడ్డి పల్సర్ బైక్‌ను అపహరించాడు. బాధితుడు అదే రోజు ఒకటో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్‌ఐ రాంబాబు కేసు నమోదు చేశారు. శనివారం ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో రాంబాబు విజయమహాల్ గేటు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. హరీష్‌రెడ్డి దొంగలించిన బైక్‌పై వస్తుండగా అతన్ని పోలీసులు అదుపులోకి అరెస్ట్ చేశారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.