Bike thief
-
పూజారిని మాటల్లో పెట్టి బండి కొట్టేసిన బుడ్డోడు
-
బౌన్స్ స్కూటీల దొంగ అరెస్ట్
మూసాపేట: పార్కింగ్ చేసిన స్కూటీలను దొంగిలించి అమ్ముతున్న దొంగను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సురేందర్‌రావు వివరాలు వెల్లడించారు. ఔసలి నరేష్ (28), శంకర్‌పల్లిలోని మైతాబ్ ఖాన్‌గూడలో నివాసముంటున్నాడు. 2018 నుంచి 2020 వరకు బౌన్స్ ద్విచక్ర వాహనాల కంపెనీలో టెక్నికల్ వింగ్‌లో పని చేసి ఆ తర్వాత మైతాబ్‌ఖాన్‌గూడలో మెకానిక్ షెడ్ నిర్వహిస్తున్నారు. కూకట్పల్లి స్టేషన్ పరిధిలో 3, కేపీహెచ్‌బీ పరిధిలో 2 వాహనాలను దొంగిలించి తన షెడ్డుకు తరలించాడు. గతంలో కంపెనీలో పనిచేసిన అనుభవం ఉండటంతో పార్కింగ్ చేసిన వాహనాల జీపీఎస్ తొలగించి సులువుగా వాహనాన్ని దొంగిలించి తన షెడ్డుకు తరలించేవాడు. మూడు వాహనాలను బౌన్స్ స్టిక్కర్ తొలగించి, రంగు మార్చి అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల దొంగిలించిన మరో వాహనానికి జీపీఎస్ తొలగించకుండా షెడ్డులో ఉంచి ఊరికెళ్లాడు. డీఐ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ఎల్లస్వామి, పరమేశ్వర్‌రెడ్డిల నేతృత్వంలో జీపీఎస్ ద్వారా మైతాబ్‌ఖాన్‌గూడకు వెళ్లి వాహనాలను స్వాధీనం చేసుకుని నరేష్‌ని రిమాండ్‌కు తరలించారు. చదవండి: జూబ్లీహిల్స్: ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం -
కొంపముంచిన ఓఎల్ఎక్స్ బేరం!
గోల్కొండ: బైక్ కొంటానని వచ్చిన ఓ యువకుడు ట్రయల్ వేస్తానని చెప్పి బైక్‌తో ఉడాయించాడు గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేకర్ రెడ్డి కథనం ప్రకారం... రాజేంద్రనగర్ మండలం కిస్మత్ పూర్‌కు చెందిన పృథ్వీ యాదవ్ క్యాబ్ డ్రైవర్. ఇతను తన వద్ద ఉన్న పల్సర్ బైక్‌ను అమ్మడానికి ఓఎల్ఎక్స్లో పెట్టాడు. కాగా శనివారం ఉదయం ఆ బైక్ కొంటానని ఓ యువకుడు పృథ్వీ యాదవ్‌కు ఫోన్ చేశాడు. బైక్ తీసుకుని షేక్‌పేట్ నాలా అల్హమ్రా కాలనీ వద్ద గల డీ మార్ట్ షోరూం వద్దకు రమ్మని ఆ యువకుడు పృథ్వీ యాదవ్‌ను ఫోన్లో కోరారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో పృథ్వీ యాదవ్ అక్కడికి వెళ్లగా... పేపర్లు, ఇన్సూరెన్స్ అంటూ వివరాలు అడిగాడు. బైక్ తీసుకొని ట్రయల్ కొడతానని చెప్పి... మూడు ట్రయల్స్ వేశాడు. మళ్లీ ట్రయల్ వేస్తానని చెప్పి బైక్‌తో ఉడాయించాడు. పృథ్వీ యాదవ్ ఆ యువకుడికి ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (పెద్దపులి దత్తతకు రూ.5 లక్షల చెక్) -
చలానాతో.. పోయిన బైక్ తిరిగొచ్చింది!
సాక్షి, ఆదోని: జరిమానా అంటే సహజంగా బాధ కలిగించే విషయమే. అయితే కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన పురుషోత్తంకి మాత్రం జరిమానా ఖుషీ కలిగించింది. అదెలాగంటే... పట్టణానికి చెందిన పురుషోత్తం 2018 మార్చిలో ఎస్కేడీ కాలనీలోని తన గది ముందు హీరో స్ప్లెండర్ బైక్ నిలిపి ఉంచాడు. కొద్దిసేపటికే అది అపహరణకు గురికావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది గడిచినా బైక్ ఆచూకీ దొరకలేదు. ఇక దొరకదేమోనని ఆశ వదులుకున్నాడు. అయితే మూడు రోజుల క్రితం తన సెల్‌ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా బైక్‌పై ముగ్గురు ప్రయాణం చేస్తూ పట్టుబడినందున, నిర్ణీత కాల వ్యవధిలో రూ.1,235 జరిమానా చెల్లించాలని అందులో ఉంది. వెంటనే ఈ విషయం టూటౌన్ సీఐ అబ్దుల్ గౌస్ దృష్టికి తీసుకెళ్లాడు. సీఐ స్పందించి మెసేజ్ ఏ పోలీసు స్టేషన్ పరిధి నుంచి వచ్చిందో గుర్తించి.. కోసిగి పోలీసులను సంప్రదించారు. వారు బైక్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిని సీఐ వద్దకు పంపించారు. ఏడాది తరువాత తన బైక్ తిరిగి దక్కడంతో పురుషోత్తం సంతోషం వ్యక్తం చేశాడు. -
బైక్ దొంగ దొరికాడు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఘరానా దొంగ వీరయ్య చౌదరిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇతను హీరోహోండా కంపెనీకి చెందిన వాహనాలను దొంగిలించడంలో సిద్ధహస్తుడు. 2005లో కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీలో పని చేస్తూ అక్కడి కంప్యూటర్ను దొంగిలించి చేతివాటాన్ని ప్రదర్శించాడు. దీంతో ఆ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. 2013 నుంచి దొంగతనాలకు అలవాటు పడిన వీరయ్య నగరంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ కలిపి 130 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. అధికారులు వరుస దొంగతనాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వీరయ్య చౌదరితో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా ముందు హాజరు పరిచారు. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
సాక్షి, మంగపేట: కొంత కాలంగా వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న తాడ్వాయి మండలం గంగారం గ్రామానికి చెందిన యాస వినోద్(23) అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ శరత్చంద్ర స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండలోని వడ్డేపల్లికి చెందిన గుండ్ర రామ్రాజ్ అనే భక్తుడు గురువారం మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో తాళం వేసి ఉన్న తన ద్విచక్ర వాహనాన్ని ఎవరో అపహరించుకు పోయారని పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశాడు. శుక్రవారం ఉదయం మండల కేంద్రంలోని కోమటిపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఎస్సై వెంకటేశ్వర్రావు, పిఎస్సై సురేష్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కాటాపురం వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న వినోద్ పోలీసులను చూసి ద్విచక్రవాహనాన్ని వదిలి పారిపోతుండగా పట్టుకుని విచారించారు. మల్లూరు గుట్టపై గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తాళం వేసి ఉన్న ద్విచక్ర వాహనాన్ని తాను దొంగిలించానని, కమలాపురంలో వాహనాన్ని విక్రయించేందుకు వస్తునట్లు ఒప్పుకున్నాడు. మండలంలో ఇటీవల ద్విచక్ర వాహనాలు తరచుగా మాయమవుతున్న సంఘటనల పై అనుమానం వచ్చి విచారించగా హన్మకొండ, వరంగల్, పరకాల వంటి ప్రాంతాల్లో మరో 10 వాహనాలు కూడా దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు దొంగిలించబడిన 11 వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడు వినోద్‌పై కేసు నమోదు చేసి మరింత లోతుగా విచారణ చేపడుతున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. పట్టుబడిన ద్విచక్ర వాహనాల విలువ సుమారు రూ 2.44 లక్షలు ఉంటుందన్నారు. ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై వెంకటేశ్వర్రావు, పిఎస్సై సతీష్, సిబ్బంది మేర శ్రీనులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏటూరునాగారం సీఐ బత్తుల సత్యనారాయణ, ఏఎస్సై అబ్బయ్య, కానిస్టేబుల్ మేర శ్రీనివాస్, తాటి అశోక్, యాకన్న, వాసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
బైక్ దొంగలముఠా గుట్టురట్టు..
మెరకముడిదాం : తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు బైక్‌ల దొంగతనాలను చేసే ముఠా గుట్టురట్టైంది. స్థానికులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన మెరకముడిదాంనకు చెందిన గొలుసు లక్ష్మణ ఇటీవల విజయనగరం వెళ్లాడు. అక్కడ తన పల్సర్ బైక్ పార్క్‌చేసి పనులు చూసుకుని తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించలేదు. చుట్టుపక్క ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో వెంటనే విజయనగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వచ్చేశాడు. అయితే మెరకముడిదాంలోని ఒక న్యూడిల్ షాపు వద్ద గొలుసు లక్ష్మణకు చెందిన బైక్ ఆదివారం కనిపించడంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు లక్ష్మణ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో లక్ష్మణ కుటుంబ సబ్యులు, గ్రామానికి చెందిన కొందరు యువకులు కలిసి బైక్ ఉన్న ప్రదేశానికి చేరుకుని బైక్ ఎవరు తీసుకువచ్చారో తెలుసుకునేందుకు చుట్టుపక్కల కాసికాశారు. ఇంతలో మెరకముడిదాం మండలం గోపన్నవలస గ్రామానికి చెందిన బోగాది లక్ష్మణరావు, కందికుప్ప రవి, గురాన ఈశు అనే ముగ్గురు యువకులు బైక్ తీస్తుండగా చుట్టుపక్కల కాపుకాసి ఉన్న మెరకముడిదాం వాసులు పట్టుకున్నారు. ఈ బైక్ మాదని..మీకు ఎలా వచ్చిందని ముగ్గురు యువకులను లక్ష్మణరావు కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. దీంతో నిందితులు ఈ బైక్ తమదని మొదట బుకాయించారు. గ్రామస్తులు గట్టిగా నిలదీయడంతో నిందితులు ఓ గ్రామపెద్దకు ఫోన్ చేసి తమ బైక్‌ను కొంతమంది అడ్డుకున్నారని తెలియజేశారు. దీంతో ఇరువర్గాలను ఆ పెద్దాయన (సోమలింగాపురం వ్యక్తి) రమ్మని చెప్పడంతో పాటు నిందితుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. నిందితుల తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను గట్టిగా నిలదీయడంతో తాము చాలాకాలంగా బైక్‌లు దొంగతనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ ముగ్గురులో ఇద్దరు యువకులు చీపురుపల్లి ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే విషయం తెలుసుకున్న బొబ్బిలి పోలీసులు సోమలింగాపురం చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకుని ఎక్కడెక్కడ బైక్‌లు దొంగతనం చేశారు.. ఎవరెవరికి విక్రయించారన్న కోణంలో విచారించారు. దీంతో 13 బైక్‌లు దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడంతో పాటు ఆ బైక్‌లు ఎవరెవరికి విక్రయించారో కూడా పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు బైక్‌లు కొనుగోలు చేసిన వ్యక్తులకు ఫోన్లు చేసి సోమలింగాపురం రప్పించారు. వారి వద్ద నుంచి 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని బొబ్బిలి తరలించారు. అయితే ఈ ముగ్గురు వెనక పెద్దముఠాయే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి విచారణ జరిగితే నిందితుల వెనుకున్న ముఠా బయటకు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపడుతున్నట్లు సీఐ మోహనరావు తెలిపారు. -
ముఠాపై తూటా...
బనశంకరి : చైన్‌స్నాచింగ్ పాల్పడి బైక్‌పై ఉడాయిస్తున్న బావరియాగ్యాంగ్ సభ్యులపై ఉత్తరవిభాగం పోలీసులు కాల్పులు జరిపి ఒకరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో చైన్‌స్నాచర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బావరియా గ్యాంగ్ నగరంలో మకాం వేసి బైకుల్లో సంచరిస్తూ మహిళల మెడల్లో గొలుసులు అపహరించే ఉడాయించేది. బెంగళూరు ఉత్తరవిభాగంలో ఇటీవల ఆ గ్యాంగ్ సభ్యులు మూడునాలుగుచోట్ల చైన్‌స్నాచింగ్‌కు తెగబడ్డారు. దీంతో ముఠాను అరెస్ట్ చేసేందుకు ఉత్తరవిభాగం డీసీపీ చేతన్సింగ్రాథ్డ్ ఆధ్వర్యంలో యశవంతపుర ఏసీపీ రవిప్రసాద్, మహాలక్ష్మీలేఔట్ సీఐ లోహిత్, నందినీలేఔట్ సీఐ కాంతరాజు, ఆర్ఎంసీ.యార్డు సీఐ రామప్ప, ఎస్ఐ సోమశేఖర్లు బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. నిందితులు పంజాబ్ రిజిస్ట్రేసన్ కలిగిన బైక్ ఉపయోగిస్తన్నట్లు సమాచారంతో సూలదేవనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురక్రాస్ వద్ద మంగళవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో పంజాబ్ రిజిస్ట్రేషన్ కలిగిన బజాజ్పల్సర్బైక్ రాగానే కానిస్టేబుళ్లు బిరాదార, ఇమామ్సాబ్కురికుట్టిలు వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన చైన్‌స్నాచర్లు ఓ కానిస్టేబుల్ గొంతుపై కత్తితో దాడి చేసి ఉడాయించారు. చైన్‌స్నాచర్లు నీలగిరి తోపులో పారిపోతుండగా ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్యేక పోలీస్‌బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపుచర్యలు చేపట్టింది. రాత్రి 11.50 గంటల సమయంలో సోమశెట్టిహళ్లి సమీపంలోని కెరెగుడ్డదహళ్లి వద్ద నిందితలులు పారిపోతుండగా పోలీసులు గుర్తించి పట్టుకోవడానికి యత్నించారు. నిందితులు ఎదురు తిరిగి కానిస్టేబుల్ ఇమామ్సాబ్కురికుట్టిపై చాకుతో దాడికి యత్నించగా అప్రమత్తమైన నందీనీలేఔట్ ఎస్ఐ సోమశేఖర్ కాల్పులు జరిపారు. బుల్లెట్లు చైన్‌స్నాచర్ రామ్‌సింగ్ కుడికాలు, చేతిపై దూసుకుపోవడంతో అక్కడే కిందపడిపోయాడు. అనంతరం నిందితుడిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. చైన్‌స్నాచర్ దాడిలో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సూలదేవనహళ్లిపోలీసులు చైన్‌స్నాచర్లు వినియోగించిన పల్సర్‌బైక్. యలహంక పోలీస్‌స్టేషన్ పరిధిలో అపహరించిన బంగారుచైన్, చాకును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో చైన్‌స్నాచర్ రాజేంద్ర కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడు రామ్‌సింగ్‌పై బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కేసులున్నాయని పోలీసులు తెలిపారు. గ్యాంగ్‌లో రామ్‌సింగ్ కీలకవ్యక్తి అని డీసీపీ చేతన్సింగ్రాథ్డ్ తెలిపారు. -
బైక్ పోయిందా.. ఇక గోవిందా!
వారం రోజుల క్రితం పాతూరు మార్కెట్లో కూరగాయాలు కొనేందుకు దాసన్న అనే వ్యక్తి ద్విచక్రవాహనంలో వచ్చాడు. కూరగాయాలు తీసుకొని వచ్చే లోపే బండి మాయమయింది. పోలీసులకు ఫిర్యాదు చేద్దామని కంగారుగా వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. ఎప్పుడు పోయింది? ఎలా పోయింది? అని గంటల తరబడి కారణాలు అడిగి సెల్‌ఫోన్ నెంబర్ తీసుకుని.. ‘నీ బండి దొరికినప్పుడు పిలుస్తాం.. పో’ అని ఓ ఫవర్‌ఫుల్ ఎస్ఐ చెప్పి పంపించాడు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రెండు నెలల క్రితం ఔట్సోర్సింగ్ సిబ్బంది వాహనాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఉద్యోగుల పార్కింగ్ స్థలంలో ఉన్న వాహనాన్నే ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై టూ టౌన్ సీఐ, ఎస్ఐని కలిసి బాధితుడు ఫిర్యాదు చేశా డు. ఇంత వరకూ అతీగతి లేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. కేవలం ఈరెండు స్టేషన్‌న్ల మాత్రమే ప్రతి పోలీస్‌ష్టేషన్‌లోనూ ఇదే తీరు. అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలోని పోలీసుస్టేషన్లలో సిఫార్సులున్న వారికి మాత్రమే పనులు అవుతున్నాయి. సమస్యలపై సామాన్య వ్యక్తులు వస్తే కనీసం స్పందించే నాథుడు కరవుయ్యారు. ముఖ్యంగా కేసుల నమోదులో పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని కేసులు నమోదు చేయాలంటే కూడా బరువుగా మారింది. ముఖ్యంగా ద్విచక్రవాహనాలు ఎత్తుకుపోయారంటే ఇక మర్చిపోవడమే మేలని వాహనదారులు భావించాల్సిన పరిస్థి తి నెలకొంది. ఇటీవల జిల్లా కేంద్రంలో ద్విచక్రవాహనాల దొంగతనాలు అధికమయ్యాయి. వారంలో పది ద్విచక్రవాహనాలకుపైగా దొంగతనాలకు గురవుతున్నాయి. అధికారికంగా ఈ సంఖ్య ఉంటే.. కేసులు నమోదు చేయని వారి సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుంది. దొంగతనాలకు పోలీసులు అడ్డుకట్ట వేయడం పక్కన పెడితే కనీసం కేసులు కూడా నమోదు చేయడం లేదు. దీంతో బాధితులు నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. సవాలక్ష కొర్రీలు ద్విచక్రవాహనాల దొంగతనాలపై కేసులు నమోదు చేయడానికి బాధితులు సిఫార్సులు చేయిస్తున్నా అధికారులు సవాలక్ష కొర్రీలు వేస్తున్నారు. ఆర్సీ, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలంటున్నారు. సహజంగా కార్లు, ఆపై వాహనాలకు మాత్రమే ఇన్సూరెన్స్ సక్రమంగా ఉండేలా వాహనాదారులు చర్యలు తీసుకుంటారు. ద్విచక్రవాహనాలకు ప్రభుత్వశాఖల అధికారుల వాహనాలకే ఇన్సూరెన్స్ ఉండదు. సామాన్య ప్రజల ఎవరూ ఇన్సూరెన్స్ చేయించుకోరు. దీన్ని సాకుగా తీసుకుని పోలీసులు కేసులు నమోదు చేయలేదు. మరీ భాదాకరమైన విషయం ఏమిటంటే కొత్త వాహనమైతేనే స్పందిస్తున్నారు. రెండు, మూడేళ్లు దాటిదంటే అసలు పట్టించుకోవడం లేదు. దీంతో అనేక మంది వాహనాలు పోగొట్టుకున్న ప్రజలు ఆశలు వదులుకుంటున్నారు. మరి కొందరు ఆశలు చంపుకోలేక కేసు నమోదు చేసి తమ వాహనాన్ని ఇప్పించాలంటూ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. సమస్య నా దృష్టికి వచ్చింది ద్విచక్రవాహనం పోయినా కేసు నమోదు చేయలేదని ఒకటి, రెండు ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి. సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నాం. ఫిర్యాదులు వస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశిస్తున్నాం. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. ద్విచక్రవాహనాల దొంగతనాలపై నిఘా పెట్టాం. – జె. వెంకట్రావ్, డీఎస్పీ, అనంతపురం -
కన్ను పడిందా.. బండి మాయమే!
శ్రీకాకుళం సిటీ: వారి కన్ను ఆ బండిపై పడిందంటే చాలు.. అది ఎంత పెద్ద వాహనమైనా కాసేపట్లో మాయం కావాల్సిందే. ముఖ్యంగా పార్క్ చేసిన వాహనాలనే తస్కరిస్తారు. మంచినీళ్లు తాగినంత సులువుగా ద్విచక్ర వాహనాలను వారు కొట్టేయగలరు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 ద్విచక్ర వాహనాలను అపహరించారు. వీటి విలువ సుమారు రూ.15 లక్షల పైమాటే. అలా అని వీరు పెద్ద ముఠా ఏమీ కాదు. ఇద్దరే ఇద్దరు. ఇంత చూస్తే.. వారి వయస్సు 20 ఏళ్లలోపే. ఇందులో ఒకరు మైనర్. కేసును ఛేదించిన శ్రీకాకుళం పోలీసులు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో చోరీకి గురైన ద్విచక్రవాహనాల కేసును సిక్కోలు పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రెండు జిల్లాలకు సంబంధించిన రూ.15 లక్షల విలువచేసే 14 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ చోరీలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేయగా.. వారిలో ఒకరు మైనర్‌గా గుర్తించామని వివరించారు. బాలుడిని జువైనల్ హోమ్‌కు పంపించామని చెప్పారు. కేసును ఛేదించారిలా.. ఈ నెల 19న శ్రీకాకుళం పట్టణంలోని కిమ్స్ వద్ద పార్కు చేసిన వాహనం అపహరణకు గురైనట్లు పైడిభీమవరానికి చెందిన కొంపెర్ల రమేష్ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. ఢిల్లీ వాసి, విశాఖపట్నం మల్కాపురంలో నివాసం ఉంటున్న హిమాంశు మిట్టల్ (20), పాట్నాకు చెందిన గాజువాకలో నివసిస్తున్న బాలుడు (17)ను నిందితులుగా గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించారు. 14 వాహనాలను దొంగిలించినట్లు పోలీసుల ఎదుట వెల్లడించారు. వీరిలో హిమాంశు మిట్టల్‌ను రిమాండ్‌కు తరలించామని ఎస్పీ తెలిపారు. శ్రీకాకుళం, విశాఖల్లో కేసులు.. వాహనాల చోరీకి సంబంధించి శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, విశాఖపట్నం జిల్లా మల్కాపురంలో ఐదు, గాజువాకలో రెండు, కంచరపాలెంలో ఒకటి, ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో మూడు కేసులు చొప్పున కేసులు నమోదయ్యాయని ఎస్పీ వివరించారు. వీరు అపహరించిన వాహనాల్లో కేటీఎం, యమహా ఎఫ్జెడ్ఎస్, రాయల్ ఇన్ఫీల్డ్, పల్సర్ వంటి ఖరీదైన వాహనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. పోలీస్ సిబ్బందికి అభినందనలు ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన రెండో పట్టణ ఎస్సై వై.రవికుమార్, హెచ్‌సీ కేవీఆర్ కృష్ణ, పీసీలు సీహెచ్ మహేష్, పి.శివ, ఇ.రామకృష్ణ, ఎస్.ఉషాకిరణ్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో అడిషినల్ ఎస్పీ షేక్ హుసేన్ బేగం, శ్రీకాకుళం డీఎస్పీ కె.భార్గవరావునాయుడు పాల్గొన్నారు. -
బైక్ దొంగ అరెస్ట్
నెల్లూరు (క్రైమ్) : బైక్ చోరీకి పాల్పడిన ఓ దొంగను శనివారం ఒకటో నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం కోవెలంపాడుకు చెందిన హరీష్‌రెడ్డి తన స్వగ్రామంలో పాల డిపో నిర్వహించారు. ఆర్థికంగా దెబ్బతినడంతో ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి ఓ ప్రముఖ జ్యుయలరీ దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేశాడు. అక్కడ అవకతవకలకు పాల్పడడంతో వారు ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో హరీష్‌రెడ్డి ఈజీగా నగదు సంపాదించేందుకు బైక్ దొంగగా మారాడు. గతేడాది డిసెంబర్ 1వ తేదీన నెల్లూరు రాజాగర్వీధికి చెందిన కొడవలూరు పవన్‌కుమార్ ఎస్2 థియేటర్‌కు తన పల్సర్ మోటారు బైక్‌పై వచ్చాడు. బైక్‌ను థియేటర్ బయట పార్క్ చేసి టికెట్లు కొనుక్కొనేందుకు లోనికి వెళ్లాడు. హరీష్‌రెడ్డి పల్సర్ బైక్‌ను అపహరించాడు. బాధితుడు అదే రోజు ఒకటో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ రాంబాబు కేసు నమోదు చేశారు. శనివారం ఇన్స్పెక్టర్ ఎస్కే అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో రాంబాబు విజయమహాల్ గేటు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. హరీష్‌రెడ్డి దొంగలించిన బైక్‌పై వస్తుండగా అతన్ని పోలీసులు అదుపులోకి అరెస్ట్ చేశారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసులకు చిక్కిన బైక్ దొంగ
థియేటర్ పార్కింగ్‌లో పెట్టిన బైక్‌ను దొంగలించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని సాయిబాబా నగర్ క్రాస్ రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. క్రాస్‌రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వ్యక్తి తారసపడటంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. తన పేరు ఎరగండ్ల కుమరయ్య(24) అని రెండు రోజుల క్రితం కాటెదాన్ లోని స్వప్న థియేటర్ పార్కింగ్ నుంచి హీరో హోండా ఫ్యాషన్ ప్లస్ బైక్‌ను దొంగలించానని చెప్పడంతో అతన్ని అరెస్ట్ చేసి బైక్ స్వాధీనం చేసుకున్నారు. -
’కసితోనే హార్లీ డేవిడ్సన్ బైక్ కొట్టేశా..’
-
బైక్ దొంగకు రిమాండ్
నల్లకుంట (హైదరాబాద్) : చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై ఓ యువకుడు దర్జాగా చక్కర్లు కొడుతూ పోలీసులకు చిక్కి కటకటాల పాలైన సంఘటన హైదరాబాద్ నల్లకుంట పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట వెంకట్‌రెడ్డి నగర్లో నివాసముండే పి.రాముగౌడ్(24) మెకానిక్‌గా పనిచేసి మానేశాడు. జల్సాలకు అలవాటు పడిన అతను ఈ నెల 22వ తేదీన విద్యానగర్ లక్కీ కేఫ్ చౌరస్తాకు వచ్చాడు. అక్కడ ఓ హోటల్ ఎదుట పార్క్ చేసి ఉంచిన ఫ్యాషన్ ప్రో టీఎస్ 15 ఈడీ 3118 వాహనాన్ని చోరీ చేశాడు. కాగా శుక్రవారం సాయంత్రం నల్లకుంటలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా దొంగిలించిన వాహనంపై అటుగా వచ్చిన రాముగౌడ్‌ను ఆపారు. అతని వద్ద వాహనానికి సంబంధించిన పేపర్లు ఏమీ లేకపోవడంతో తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్
కర్నూలు (బేతంచర్ల) : కర్నూలు జిల్లా బేతంచర్లలోని ఓ పెట్రోలు బంకు వద్ద శనివారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా.. తన పేరు భాస్కరాచారి అని, ఇప్పటివరకు 12 బైక్‌లను దొంగిలించానని ఒప్పుకున్నాడు. భాస్కరాచారి దొంగిలించిన 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. -
బైక్‌ల దొంగకు బ్రేక్
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: చిన్న వయసులో జల్సాలకు అలవాటు పడ్డాడు. అందు కు సులువైన మార్గం బైక్‌లు దొంగిలించి అమ్మడాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. చివరికి పోలీసులు అతని దొంగతనాలకు బ్రేక్ వేశారు. సీతానగరం మండలం కోట శ్రీరామపురానికి చెందిన కోట శివకుమార్ (26) రెండు జిల్లాల్లో 18 బైక్‌లను దొం గతనం చేశాడు. వాటిలో 17బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్ అలియాస్ శివ తొలుత విశాఖ పట్నంలోని ఓ మెడికల్ షాపులో పనిచేస్తూ యజమాని ఇంట్లో దొంగతనానికి పాల్పడడంతో పని నుంచి తొలగించారు. అప్పటినుంచి చెడు వ్యసనాలకు బానిసైన శివకుమార్ బైక్‌లు దొంగతనం చేస్తూ వాటిని అమ్మగా వచ్చే డబ్బులతో జల్సా చేసేవాడు. విశాఖపట్నం, విజయనగ రం జిల్లాల్లోని పలు పోలీసు స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసుల్లో శివకుమార్ ప్రధాన ముద్దాయి. 11 ద్విచక్ర వాహనాలకు సంబంధించిన కేసులు అతనిపై నమో దై ఉన్నాయి. మిగిలిన ఏడు వాహనాలకు సంబంధించి యజ మానులను గుర్తించాల్సి ఉంది. శనివారం పట్టణంలోని జేఎన్టీ యూ కళాశాల వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా శివకుమార్ వాహనంతో పట్టుబడ్డాడు. వాహనానికి సంబంధిం చిన ధ్రువీకరణ పత్రాలు అతని వద్ద లేకపోవడంతో అనుమానం వచ్చి విచారణ చేశారు. విచారణలో 18 బైక్‌లను దొంగిలించినట్లుగా నిందితుడు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతని నుంచి 17 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో బైక్‌ను స్వాధీ నం చేసుకోవాల్సి ఉంది. కరకవలస సమీపంలోని భవనంలో 8 బైక్‌లు, ఫూల్బాగ్కాలనీలో 5 బైక్‌లు, కేఎల్ పురం సమీపంలో 4 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని శివకుమార్‌ను అరెస్ట్ చేశారు. బైక్‌ల దొంగను పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన ఒకటో పట్టణ సీఐ కె.రామారావు, ఎస్సై బి.రమణ య్య, సీసీఎస్ సీఐలు ఎస్.వాసుదేవ్, కుమార్‌స్వామి, ఎస్సై ఐ. సన్యాసిరావు, సీసీఎస్ హెచ్‌సీలు మజ్జి.రామకృష్ణ, రాజు, పి.జగన్మోహనరావు, ఎం.రామకృష్ణ, ఎల్.గోపాల్, మహేష్, కానిస్టేబుళ్లు నాగేంద్రప్రసాద్, పి.పాపారావు ఎస్. కిరణ్‌కుమార్‌లను విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ ఆదివారం పోలీస్ స్టేషన్లో నిందితుడిని,బైక్‌లను విలేకరుల ముందు ప్రవేశ పెట్టారు, అనంతరం ఆయన మాట్లాడుతూ దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు ఇతర ప్రదేశాలకు వెళ్లిన సమయాల్లో పోలీసులకు సమాచారం అందిస్తే అటువంటి ఇళ్లకు ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశామన్నా రు. బైక్‌లను పార్కింగ్ చేసే సమయాల్లో హ్యాండ్‌లాక్ వేసేలా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.