కర్నూలు (బేతంచర్ల) : కర్నూలు జిల్లా బేతంచర్లలోని ఓ పెట్రోలు బంకు వద్ద శనివారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా.. తన పేరు భాస్కరాచారి అని, ఇప్పటివరకు 12 బైక్‌లను దొంగిలించానని ఒప్పుకున్నాడు. భాస్కరాచారి దొంగిలించిన 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.