నల్లకుంట (హైదరాబాద్) : చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై ఓ యువకుడు దర్జాగా చక్కర్లు కొడుతూ పోలీసులకు చిక్కి కటకటాల పాలైన సంఘటన హైదరాబాద్ నల్లకుంట పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట వెంకట్‌రెడ్డి నగర్‌లో నివాసముండే పి.రాముగౌడ్(24) మెకానిక్‌గా పనిచేసి మానేశాడు. జల్సాలకు అలవాటు పడిన అతను ఈ నెల 22వ తేదీన విద్యానగర్ లక్కీ కేఫ్ చౌరస్తాకు వచ్చాడు. అక్కడ ఓ హోటల్ ఎదుట పార్క్ చేసి ఉంచిన ఫ్యాషన్ ప్రో టీఎస్ 15 ఈడీ 3118 వాహనాన్ని చోరీ చేశాడు.
కాగా శుక్రవారం సాయంత్రం నల్లకుంటలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా దొంగిలించిన వాహనంపై అటుగా వచ్చిన రాముగౌడ్‌ను ఆపారు. అతని వద్ద వాహనానికి సంబంధించిన పేపర్లు ఏమీ లేకపోవడంతో తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు.
బైక్ దొంగకు రిమాండ్
Published Sat, Jun 27 2015 7:04 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement