vemulawad
-
జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేశా: చెన్నమనేని
హైదరాబాద్: పౌరసత్వ వివాదంపై వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు హైకోర్టుకు తెలిపారు. చెన్నమనేని దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. మరోసారి ఎవరూ గడువు కోరవద్దని తుది వాదనలకు సిద్ధం కావాలని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు విచారణను మరో రెండు వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతోంది. రమేష్ పౌరసత్వం వివాదంపై గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన దేశంలోని ఉన్నాడని, రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వలన శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగటంలేదన్నారు. చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్! -
8న అన్న పెళ్లి.. అంతలోనే విషాదం
కోనరావుపేట(వేములవాడ) : వారింట్లో మొదటి శుభకార్యం.. పెద్ద కుమారుడి పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పచ్చని పందిరి వేసి, బంధుమిత్రులకు శుభలేఖలు పంచుతున్నారు. ఈ క్రమంలో వరుడి సోదరుడు బంధువులకు పెళ్లి కార్డులు ఇచ్చి, సామగ్రి తీసుకురావడానికి తన మిత్రుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లి దుర్మరణం చెందాడు. ఈ ఘటన పెళ్లింట విషాదం నింపింది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన అవధూత వజ్రవ్వ–కాశయ్య దంపతులకు ప్రశాంత్, ప్రవీణ్ ఇద్దరు కుమారులు. వీరిలో ప్రశాంత్‌కు ఈ నెల 8న వివాహం నిశ్చయించారు. దీంతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రవీణ్(21) బంధువులందరినీ కలుస్తూ అన్న పెళ్లి పత్రికలు ఇస్తున్నాడు. బుధవారం సిరిసిల్లలో బంధువులకు కార్డులిచ్చి, సామగ్రి తేవాల్సి ఉండటంతో తన మిత్రుడు తిరుమల్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. నిజామాబాద్ శివారులోని చాంద్‌నగర్ సమీపంలో ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా టిప్పర్ వచ్చింది. దాన్ని తప్పించబోయి ట్రాక్టర్‌ను వెనుకనుంచి ఢీకొట్టారు. దీంతో బైక్ ట్రాక్టర్ ట్రాలీ కింది భాగంలోకి చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనకాల కూర్చున్న తిరుమల్ ఎగిరిపడటంతో త లకు గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని ఎస్సై వెంకటేశ్వర్లు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రాజన్న శ్రావణమాసం ఆదాయం రూ. 4 కోట్లు
కొనసాగిన భక్తుల రద్దీ నేటితో ముగియనున్న శ్రావణమాసం వేములవాడ : శ్రావణమాసం సందర్భంగా వేములవాడ రాజన్నకు రూ.4 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నెల రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దీంతో హుండీ ద్వారా మరింత ఆదాయం సమకూరే అవకాశముందని అధికారులు తెలిపారు. గురువారంతో శ్రావణమాసం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. చిరుజల్లులు కురుస్తున్నా భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బద్ధి పోచమ్మ ఆలయంలోనూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. -
రాజన్న సన్నిధిలో రద్దీ
వేములవాడ : శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు యాభై వేల మంది తరలివచ్చారు. రద్దీని గమనించిన ఆలయ అధికారులు లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. ఉదయం భారీ వర్షం కురియడంతో భక్తులంతా వర్షంలో తడుస్తూనే రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ద్వారా రూ.28 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లను ఈవో దూస రాజేశ్వర్, ఏఈవోలు ఉమారాణి, గౌరినాథ్, హరికిషన్, దేవేందర్ పర్యవేక్షించారు. -
వేములవాడలో భక్తుల రద్దీ
వేములవాడ : వేములవాడ రాజన్నను సోమవారం 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వరుస సెలవులు రావడంతో రద్దీ బాగా పెరిగిపోయింది. దీంతో ఆలయ అధికారులు గర్భగుడి దర్శనం నిలిపివేశారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు కోడె మొక్కులు చెల్లించున్నారు. ఏర్పాట్లను ఈవో దూస రాజేశ్వర్, ఏఈవోలు ఉమారాణి, గౌరినాథ్, హరికిషన్, దేవేందర్‌లు పరిశీలించారు. ఎస్సై సైదారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
తెరపైకి రమేశ్‌బాబు పౌరసత్వం
మూడు నెలల్లోగా నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశం వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రహోంశాఖలో పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని మూడు నెలల్లోగా నిర్ణయించాలని దేశ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం ఆదేశించినట్లు మీడియాలో రావడం వేములవాడ నియోజకవర్గంలో చర్చకు దారితీసింది. రమేశ్‌బాబు పౌరసత్వం కేసును విచారించిన జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రహోంశాఖకు సూచిస్తూనే... హైకోర్టుకు నిర్ణయం ప్రకటించాలని ఆదేశించిందని చర్చించుకుంటున్నారు. రమేశ్‌బాబు పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు రమేశ్‌బాబు ఏడాదిపాటు స్వదేశంలో ఉన్నట్లు రుజువు చూపించాలని కోరింది. కేంద్ర హోంశాఖ చేపట్టిన విచారణలో రమేశ్‌బాబు కేవలం 96 రోజులు మాత్రమే స్వదేశంలో ఉన్నట్లు తేలింది. ఇందుకు రమేశ్‌బాబుకు కేంద్ర హోంశాఖ కార్యాలయం షోకాజు నోటీసు జారీ చేసింది. దీంతో ఈ అంశంపై త్రీమెన్ కమిటీని వేయాలని రమేశ్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కమిటీ ముందు ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ హాజరై తన వాదనను వినిపించారు. అప్పట్నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ అంశం తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది. ఈ అంశాన్ని కేవలం మూడు నెలల్లో స్పష్టం చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. -
రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి
-
రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి
వేములవాడ : వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రావణసందడి మొదలైంది. శ్రావణ మాసంలో శివాలయాల సందర్శనను భక్తులు శుభప్రదంగా భావిస్తారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో రాజన్న ఆలయ ఆవరణంతా కిక్కిరిసిపోయింది. రద్దీతో అధికారులు ఆర్జిత సేవలు రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. దీంతో కొందరు భక్తులు అసహనం వ్యక్తంచేశారు. భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలాచరించి కోడె మొక్కులు చెల్లించుకునానరు. బాలత్రిపుర సుందరీ ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈవో దూస రాజేశ్వర్, ఏఈవోలు ఉమారాణి, గౌరీనాథ్, దేవేందర్, హరికిషన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీఐపీల దర్శనాలను పీఆర్వో చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్లు పర్యవేక్షించారు.