vender
-
అరెస్టైన ఇద్దరు పాల పాపాత్ములు!
భూదాన్‌పోచంపల్లి: మండలంలోని కనుముకుల, గౌస్‌కొండ గ్రామాల్లో ఆదివారం ఎస్ఓటీ పోలీసులు అకిస్మిక దాడులు చేసి కల్తీపాలు తయారు చేస్తున్న పాలవ్యాపారులను అరెస్ట్ చేశారు. కనుముకులకు చెందిన పాల వ్యాపారులు పాండు, గౌస్ కొండ గ్రామానికి చెందిన అజ్గర్ ఇళ్లపై పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి 350 లీటర్ల కల్తీపాలు, 2.1 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 11 డోలోఫర్ స్కిమ్డ్ పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారుచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్‌రెడ్డి తెలిపారు. -
నిజాయితీకి లభించిన బహుమానం
రామాపురం అనే గ్రామంలో కిరాణా వ్యాపారస్తుడైన సుబ్బయ్యకు నిజాయితీపరుడు అనే పేరుంది. వయసు మీదపడటంతో సుబ్బయ్య తప్పుకుని తన కొడుకు రాజేశ్‌కి వ్యాపారాన్ని అప్పగించాడు. సుబ్బయ్య కిరాణా వ్యాపారం చేసేటప్పటి నుండి ఆ దుకాణంలో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న వీరయ్య.. రాజేశ్‌కి కూడా చేదోడు వాదోడుగా ఉండేవాడు. అందుకే రాజేశ్ హాయంలో కూడా కిరాణా వ్యాపారం నల్లేరు మీద బండి నడకలా హాయిగా సాగిపోయింది. అయితే వీరయ్యకి కూడా వయసు మీద పడటంతో కొంతకాలానికి పని మానివేశాడు. దాంతో రాజేశ్‌కి తన కిరాణా దుకాణంలో పనిచేయడానికి ఒక నమ్మకస్తుడైన పనివాడి అవసరం పడింది. పనివాని ఎంపికలో రాజేశ్, తన తండ్రి సలహా కోరాడు. ఆ విషయాన్ని సుబ్బయ్య తన స్నేహితులకి చెప్పటంతో వాళ్ళు తమకు తెలిసిన పనివాళ్ళని సుబ్బయ్య దగ్గరకి పంపారు. అనేక రకాల వడపోతల తర్వాత తమ కిరాణా వ్యాపారంలోకి ఉపయోగపడతారు అనుకునే ఇద్దరిని ప్రాథమికంగా ఎంపిక చేశాడు సుబ్బయ్య. వారిద్దరి పేర్లు వినయ్, సతీశ్. ‘ఆ ఇద్దరిలోంచి ఒకరిని ఎంపిక చేసుకో. వారితో మాట్లాడుతున్నప్పుడు, వారికి అప్పగించిన పని వాళ్లు చేస్తున్నప్పుడు ఆ ఇద్దరినీ నిశితంగా పరిశీలించ’మనీ రాజేశ్‌కి వివరించాడు సుబ్బయ్య. ముందుగా వినయ్‌ని పిలిచి ‘నెలకు ఎంత జీతం కావాలి?’ అని అడిగాడు సుబ్బయ్య. ‘తమరు ఎంత ఇస్తే అంతే చాలు బాబయ్యా!’ సమాధానమిచ్చాడు వినయ్. ‘సరే..ఓ రెండు రోజులు కిరాణా దుకాణంలో ఉండి చెప్పిన పనులు చేయి, దాన్ని బట్టే నిన్ను పనిలో పెట్టుకునేది లేనిదీ చెపుతాను’ అన్నాడు. ‘అయితే రేపే వచ్చి పనిలో చేరతాను’ అని వినయ్ సెలవు తీసుకున్నాడు. ‘రేపు వినయ్ దుకాణానికి వచ్చాక ఏ సరుకులు ఎక్కడ ఉన్నాయో చూపించి అప్పుడప్పుడు గల్లా పెట్టెకి తాళం వేసి ఇంట్లోకి వెళ్లొస్తూ ఎవరైనా సరుకులకు వస్తే ఆ ప్యాకెట్స్ పై ఉన్న ధర తీసుకుని, ఆ డబ్బుని నీకు ఇమ్మని చెప్పు. అలాగే చిల్లర ఒక పదిరూపాయలు పైన ఉంచు’ అంటూ రాజేశ్‌కి సలహా ఇచ్చాడు సుబ్బయ్య. మరుసటి రోజు వినయ్ వచ్చాక తండ్రి చెప్పినట్లే చేశాడు రాజేశ్. మధ్య మధ్యలో ఇంట్లోకి వెళ్లొచ్చినప్పుడల్లా తను ఏఏ వస్తువులను అమ్మాడో, ఎంత డబ్బు వచ్చిందో రాజేశ్ చేతికిచ్చేవాడు వినయ్. ఆ విషయాన్నే రాత్రి తండ్రికి చెప్పాడు రాజేశ్. ‘రేపు వినయ్ వచ్చాక నా దగ్గరకు పంపించు’ అని చెప్పాడు సుబ్బయ్య. అతను చెప్పినట్టే మరుసటి రోజు వినయ్ రాగానే అతనిని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళాడు రాజేశ్. వినయ్‌ని ఉద్దేశించి సుబ్బయ్య ‘ఈ రోజు మన ఎలక్ట్రానిక్ కాటాని ఉపయోగించి సరుకులు అరకేజీ, కేజీల చొప్పున ఆ కవర్లలో ప్యాక్ చేయాలి. అలా ప్యాక్ చేసేటపుడు అరకేజీ ప్యాకెట్లలోంచి ఓ పది గ్రాముల చొప్పున, కేజీ ప్యాకెట్లలోంచి ఇరవై గ్రాముల చొప్పున ఆ సరుకులు తీసేసి ప్యాక్ చేయాలి. తెలిసిందా? ఈవాళ్టికి అరకేజీ ప్యాకెట్లు ఒక అయిదు, కేజీ ప్యాకెట్లు ఒక అయిదు ప్యాక్ చేసి తరువాత కొట్లో పనిచూసుకో’ అని పురమాయించాడు. ‘అలాగేనండి’ అంటూ సుబ్బయ్య చెప్పినట్లుగానే ప్యాక్ చేసి వాటిని సుబ్బయ్యకి అప్పజెప్పి కిరాణా దుకాణంలోకి వెళ్ళిపోయాడు వినయ్. ఈ వ్యవహారాన్నంతా రాజేశ్ పరిశీలిస్తూనే ఉన్నాడు. ఆ రోజు పని పూర్తి అయిన తరువాత వినయ్‌ని పిలిచి ఆ రెండురోజులకు ఇవ్వాల్సిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తాన్ని ముట్టజెప్పి, తరువాత రెండు రోజులు సతీశ్ పనితీరును కూడా పరిశీలించి , ఇద్దరి పనితీరును బేరీజు వేసుకుని కబురు చేస్తానని పంపించివేశాడు సుబ్బయ్య. ఆ మరుసటి రోజు సతీశ్‌కి కబురుపెట్టాడు. వినయ్‌ని అడిగినట్టే సతీశ్నీ అడిగాడు సుబ్బయ్య ‘ నెలకు ఎంత జీతం కావాలి?’ అని. ‘మూడువేలు ఇవ్వగలిగితే చేయగలను’ బదులిచ్చాడు సతీశ్. వినయ్‌కి చెప్పినట్లుగానే ‘సరే, ఒక రెండు రోజులు కిరాణా దుకాణంలో చెప్పిన పనులు చేశాక దానిని బట్టి నిన్ను పనిలో పెట్టుకునేది లేనిదీ చెపుతాను’ అన్నాడు సుబ్బయ్య. ‘సరేనండి, రేపే వచ్చి పనిలో చేరతాను’ అంటూ సెలవు తీసుకున్నాడు సతీశ్. అప్పుడు రాజేశ్‌తో ‘వినయ్ విషయంలో మొదటి రోజు ఏం చెప్పి చేయమన్నానో,అలాగే సతీశ్‌కీ చెప్పి చేయించు’ అన్నాడు సుబ్బయ్య. మరుసటి రోజు సతీశ్ రాగానే సుబ్బయ్య చెప్పినట్టే చేసి.. జరిగినదంతా ఆ రోజు రాత్రి తండ్రికి వివరించాడు రాజేశ్. ‘రేపు సతీశ్ రాగానే నా దగ్గరకు తీసుకురా’ అని రాజేశ్‌కి పురమాయించాడు సుబ్బయ్య. తండ్రి అడిగినట్టుగానే తెల్లవారి సతీశ్ రాగానే అతణ్ణి తండ్రి దగ్గరకు తీసుకెళ్లాడు రాజేశ్. తూకం, ప్యాకింగ్ విషయంలో వినయ్‌కి పురమాయించినట్టే సతీశ్‌కీ పురమాయించాడు సుబ్బయ్య. విన్నవెంటనే సతీశ్ ‘ఇటువంటి పనులు నేనెంత మాత్రం చేయను, చేయలేను. నిన్న పనిచేసినందుకు గానూ వందరూపాయలు ఇప్పించండి వెళ్ళిపోతాను’అన్నాడు. ‘సరే, ఈ పని చేయవద్దులే. నువ్వు అడిగినట్లే మూడువేల రూపాయలు ఇస్తాను. నిన్నటి నుంచి నువ్వు పనిలో చేరినట్లే. పో.. పోయి కొట్లో పనులు చూసుకో’ అన్నాడు సుబ్బయ్య. పక్కనే ఉండి ఇదంతా గమనిస్తున్న రాజేశ్‌తో ‘రానవసరంలేదని వినయ్‌కి కబురు పెట్టు’ అని సుబ్బయ్య అనడంతో కొడుకు విస్తుపోయాడు. ‘అదేంటి జీతం ఎంతిస్తే అంతకు ఒప్పుకొని, చెప్పిన పనిని తు.చ తప్పకుండా చేసిన వినయ్‌ని వద్దని కరాఖండిగా ఇంత జీతం ఇవ్వమని అడగటమే కాకుండా, చెప్పిన పని చేయనని తృణీకరించిన సతీశ్‌ని పనిలో పెట్టుకున్నారేంటి ’ అని తండ్రిని అడిగాడు రాజేశ్. ‘వినయ్ పనిచేసిన రెండురోజుల్లో మొదటిరోజు కొట్లో నువ్వు లేనప్పుడు సరుకులు కొనమని నా స్నేహితున్ని పంపి ‘మా కొట్లో పనిచేసే వాడిని ముప్పై రూపాయల పంచదార ప్యాకెట్ ఇవ్వమని అడిగి నలభైరూపాయలు ఇచ్చి ‘ఇవిగో ముప్పై రూపాయలు..సరిగా చూసుకో’ అని చెప్పమన్నాను. ‘పొరపాటున పది రూపాయలు ఎక్కువిచ్చేశారు’ అని వెనక్కి ఇచ్చేసినా లేదూ చూసుకుని కూడా తిరిగి ఇవ్వకపోయినా ఏమీ మాట్లాడకుండా వచ్చి నాకు చెప్పమన్నాను. వినయ్ అతనితో ‘సరిపోయింది’ అని చెప్పి నీకు డబ్బు అప్పచెప్పేటప్పుడు ఆ పదిరూపాయలను తన దగ్గరే ఉంచేసుకున్నాడు. అలాగే రెండో రోజు నేను చెప్పినట్లుగా అది తప్పు పనైనా ఆ పని చేయడానికి ఒప్పుకున్నాడు వినయ్. జీతం ఎంతిస్తే అంతే చాలనుకునే దాని వెనుక.. ఇదుగో ఇటువంటి మోసాలు చేస్తూ సంపాదించుకోవచ్చన్న ధీమా అన్నమాట. అదే సతీశ్ విషయానికొచ్చేసరికి మొదటిరోజు నా స్నేహితుడు పదిరూపాయలు ఎక్కువ ఇస్తే పదిరూపాయలు ఎక్కువ ఇచ్చారని వెనక్కి ఇచ్చేయడమే కాకుండా, రెండో రోజు నేను చెప్పిన అవినీతి పనిని చేయడానికి ఎంత మాత్రం ఇష్టపడక తన ఒక రోజు కష్టానికి మాత్రమే ప్రతిఫలం ఇమ్మని అడిగాడు. ఇక నిక్కచ్చిగా ఇంతే జీతం ఇవ్వమని అడగడానికి కారణం అతని నిజాయితీయే. అటువంటి నమ్మకస్తుడు, నిజాయితీపరుడే మనకు కావలసినవాడు. అందుకే అతనిని పనిలోకి తీసుకున్నది’ అని చెప్పిన తండ్రి వివరణకు అబ్బురపడ్డాడు రాజేశ్. -
Sunday Funday: సండే-ఫండే’లో స్టాల్ పెడతారా?
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే-ఫండేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఎందరో ఉత్సాహం కనబరుస్తున్నారు. దీంతో సండే-ఫండే సందర్భంగా స్టాళ్లు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు.. ముఖ్యంగా హస్తకళలు, చేనేత సంబంధిత, ఈటరీస్ తదితర స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. స్టాళ్లలో ఉంచే ఉత్పత్తులు, ధరలతోపాటు సంప్రదించాల్సిన వారి వివరాలు తదితరమైనవి ea2ps-maud @telangana.gov.in మరియు hcip hmda@gmail.com చిరునామాలకు మెయిల్ చేయాల్సిందిగా పేర్కొంది. లేదా హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ కార్యాలయంలో ప్రతి సోమ, మంగళ వారాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లిఖిత పూర్వక విజ్ఞప్తిని అందజేయవచ్చని సూచించింది. లాటరీ ద్వారా ఎంపిక చేసినవారికి నామమాత్రపు ఫీజుతో రెండు వారాల పాటు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. అందరికీ సమాన అవకాశం కల్పించేందుకు కేటగిరీల వారీగా లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. దీంతోపాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు సంగీతం తదితర కళారూపాలను ప్రదర్శించాలనుకునే వ్యక్తులు, గ్రూపులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని హెచ్ఎండీఏ పేర్కొంది. -
వైరల్: గడ్డం గీయించుకోవాలని ప్రధాని మోదీకి రూ. 100 పంపాడు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఎంతో మంది జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది. లాక్‌డౌన్‌తో ఇంట్లో కూర్చొని హాయిగా తింటూ కాలాన్ని గడిపేవారు కొందరైతే.. తినడానికి తిండి కూడా దొరక్క అల్లాడిపోతున్నవారు కోకొల్లలు. పేదవాడి పూట గడవడమే కష్టతరంగా మారింది. లాక్డౌన్ కష్టాలను ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలియజేయాలని ఆలోచించాడు. లాక్‌డౌన్‌తో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని బారామతికి చెందిన అనిల్ మోరే అనే వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రి ఎదురుగా టీ కొట్టు నడుపుతున్నాడు. లాక్‌డౌన్‌పై తన అసంతృప్తిని ప్రధానికి తెలియజేయాలని ఓ లేఖ రాశారు. అందులో గడ్డం గీసుకోమని సూచిస్తూ ప్రధాని మోదీకి రూ.100 పంపించాడు.‘ప్రధాని మోదీ గడ్డం బాగా పెంచుతున్నారు.. ఆయన ఇకపై ఏదైనా పెంచాలనుకుంటే, అది ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలి.. దేశంలో వీలైనంత వేగంగా వ్యాక్సిన్ వేయించడానికై ఉంటే మంచిది.. వైద్య సదుపాయాలను పెంచడానికి ప్రయత్నాలు చేయాలి. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లాక్డౌన్లతో కలిగిన కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపై దృష్టి పెట్టాలి’ అని లేఖలో పేర్కొన్నాడు మోరే. అయితే దేశంలో ప్రధానమంత్రి స్థానం ఎంతో అత్యున్నతమైనదని, ప్రధాని మోదీ అంటే తన ఎంతో గౌరవం, అభిమానం అని చెప్పుకొచ్చాడు. తనును దాచుకున్న డబ్బుల్లో నుంచి ఆయనకు వంద రూపాయలు పంపుతున్నట్లు తెలిపాడు.. దానితో ఆయన గడ్డం గీయించుకోవాలి అని పేర్కొన్నాడు. అయితే. ప్రధానిని అవమానించడం, బాధపెట్టడం తన ఉద్దేశం కాదని, కరోనాతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు తెలియజేసేందుకే ఇలా చేసినట్టు తెలిపారు.అంతేగాక కోవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ .5 లక్షలు, లాక్దెడౌన్తో దెబ్బతిన్న కుటుంబాలకు రూ .30000 ఆర్థిక సహాయం అందించాలని పీఎంకు రాసిన లేఖలో మోర్ కోరాడు. ఈ విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది. చదవండి: ఆమెను చీరలో చూడాలి.. ఫేర్వెల్ చేసుకోనివ్వండి.. ప్రధానికి ట్వీట్ జూన్ 23లోగా జీవో అమల్లోకి తీసుకురావాలి: హైకోర్టు -
వెండర్ల రాజ్యం!
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద వారిదే హవా అందుబాటులో లేని స్టాంపులు అవస్థలు పడుతున్న వినియోగదారులు అనంతపురం టౌన్ : జిల్లాలో అనంతపురం, హిందూపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అనంతపురం పరిధిలో గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు, పామిడి, రాయదుర్గం, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, యాడికి, అనంతపురం, అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. హిందూపురం పరిధిలోకి బుక్కపట్నం, చిలమత్తూరు, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, తనకల్లు కార్యాలయాలు వస్తాయి. జిల్లా వ్యాప్తంగా 150 మంది వరకు స్టాంప్ వెండర్లు ఉన్నారు. కొంతకాలంగా నాన్ జ్యుడీషియల్, స్పెషల్ అడెస్సివ్ స్టాంపుల కొరత వేధిస్తోంది. అప్పుడప్పుడూ జిల్లాకు స్టాంపులు వస్తున్నా.. అధిక శాతం ‘ వెండర్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. నిబంధనల ప్రకారం కార్యాలయాల్లో ఎక్కువ స్టాంపులు అందుబాటులో ఉంచాలి. జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది స్టాంప్ వెండర్లతో ముందుగానే చేసుకున్న ఒప్పందం మేరకు వాళ్లకే పెద్దపీట వేస్తున్నారు. వెండర్లు స్టాంపులను ముందుగానే కొనేయడం వల్ల అక్కడ మిగిలిన వారికి లభించడం లేదన్న విమర్శలున్నాయి. ప్రజలకు అత్యంత అవసరమైన 10, 20 స్టాంపుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నాన్ జ్యుడీషియల్ స్టాంపులకు సంబంధించి అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈ ఏడాది మేలో రూ.50 విలువైన స్టాంపులు 96 వేలు వచ్చాయి. వీటి మొత్తం రూ.48 లక్షలు. రూ.100 స్టాంపులు లక్షా 60 వేలు వచ్చాయి. వీటి విలువ రూ.కోటి 60 లక్షలు. అలాగే జూలైలో రూ.10 విలువైన స్టాంపులు 24 వేలు, రూ.20 విలువైన స్టాంపులు 32 వేలు వచ్చాయి. వీటి మొత్తం రూ.8 లక్షల 80 వేలు. ఇలా వచ్చిన స్టాంపులను రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపిణీ చేశారు. అయితే..వీటిలో ఎక్కువ శాతం వెండర్లకే పంపిణీ చేశారు. ఒక్క అనంతపురం రిజిస్ట్రార్ కార్యాలయంలోనే నెలకు రూ.50 లక్షల వరకు విలువైన స్టాంపులు అవసరం. మిగిలిన ప్రాంతాల్లో కూడా రూ.20 లక్షల వరకు విలువైన స్టాంపులు అవసరమవుతాయి. అనంతపురం కార్యాలయ పరిధిలో 40 మంది వరకు స్టాంప్ వెండర్లు ఉండగా.. రూ.10, రూ.20 స్టాంపులను అధిక శాతం వారికే ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కార్యాలయాల్లో ఇవి అందుబాటులో లేవు. వెండర్లు అవసరాన్ని బట్టి సాంపుపై రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అనంతపురం నగరంలో కొంత మంది కార్యాలయం వద్దే తిష్టవేసి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. అవస్థలు పడుతున్నా.. ఆస్తులు, భూములు, వాహనాలు, ఆర్థిక లావాదేవీలు, లీజులు తదితర వాటికి నాన్‌జ్యుడీషియల్ స్టాంపులు కావాల్సిందే. రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంపులు ప్రజలకు అందించడంలో రిజిస్ట్రేషన్ శాఖ విఫలమవుతోంది. జిల్లాలోని ఎక్కువ శాతం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.10, రూ.20 స్టాంపులు లేవంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రికార్డులు చూస్తే గానీ చెప్పలేం స్టాంపులు విజయవాడ నుంచి వస్తాయి. ఆ వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపుతాం. సబ్ రిజిస్ట్రార్లే స్టాంప్ వెండర్లకు ఇస్తారు. కార్యాలయాల్లో తక్కువ పెట్టుకుని వెండర్లకు ఎక్కువ ఇస్తున్నారనే విషయం అక్కడి రికార్డులు చూస్తేగానీ చెప్పలేం. తనిఖీలు చేసి అలా జరుగుతుంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – దేవరాజ్, రిజిస్ట్రార్, అనంతపురం