Venkata Ratnam
-
గొంతు కోసుకుని భక్తుడి ఆత్మహత్యాయత్నం
తిరుమల: తిరుమలలో సుదర్శన సత్రం ఎదుట ఓ భక్తుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడు ఒకరు సోమవారం గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన వెంకటరత్నంగా పోలీసులు గుర్తించారు. -
సంతమూరులో నగలు చోరీ
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మండలం సంతమూరు గ్రామంలో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. వెంకటరత్నం అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి 52 సవర్ల బంగారు నగలు, అర కిలో వెండి పాత్రలు, రూ.11వేల నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజమండ్రి క్రైం డీఎస్పీ త్రినాథరెడ్డి, తూర్పు డీఎస్పీ సౌమ్యలత, రాజానగరం సీఐ శంకరనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరిస్తున్నారు. -
పేదబతుకు పెద్దమనసు
అవసరంలో ఉన్నవారికి సాయం చేయడానికి చేతినిండా డబ్బు ఉండాల్సిన పనిలేదు... సహాయపడాలనే గుణం ఉంటే చాలని నిరూపిస్తున్నారు చెప్పులు కుట్టుకుని జీవించే చాట్ల వెంకటరత్నం. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి అతనిది. అయితేనేం... తోటివారికి సాయం అందించడంలో తన పేదరికాన్ని జయించాడు. నెల్లూరు నగరంలోని ప్రధాన రహదారి... ఆ రహదారి పక్కగా విద్యుత్‌భవన్ కార్యాలయం. ఆ ప్రహరీగోడకు ఆనుకుని చిన్న పాక. అందులో చెప్పులు కుడుతున్న ఓ వ్యక్తి... అతడే వెంకటరత్నం. అక్కడ చెప్పులు కుట్టించుకున్న ప్రతిఒక్కరికీ వెంకటరత్నం దయాగుణం ఇట్టే అర్థమైపోతుంది. ఆ పాకకు తగిలించిన చిన్న బోర్డు మీద ‘అనాధ బాలబాలికలకు, వికలాంగులకు, కుష్టువారికి, అంధులకు ఉచితంగా చెప్పులు, గొడుగు లు కుట్టి ఇవ్వబడును’ అని ఉంటుంది. ఇది బోర్డు మీద ప్రకటించి చేసే సేవ. బోర్డు మీద రాయకుండానే ఇంకా విస్తృతంగా సేవలందిస్తున్నాడు వెంకటరత్నం. సంక్షేమ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా చెప్పులు, బ్యాగులు కుట్టిస్తాడు. సంపన్నులు వాడి వదిలేసిన చెప్పులు, బ్యాగులు, గొడుగులను సేకరించి వాటికి సొంతఖర్చులతో మరమ్మతులు చేసి పేద విద్యార్థులకు ఉచితంగా ఇస్తాడు. చిత్తు కాగితాలు ఏరుకునే వారి దగ్గర నుంచి చెప్పులను ఏదో ఒక ధరకు కొని తనకు చేతనైనంత బాగుచేసి అభాగ్యులకు ఉచితంగా ఇస్తాడు. ‘నీకే తినడానికి దిక్కు లేదు... మీసాలకు సంపెంగనూనె ఎందుకు’ అని ఎవరైనా మందలించబోతే... అందుకు మౌనమే అతని సమాధానం. అనుభవమే దారిచూపింది... వెంకటరత్నం తండ్రి వెంకటగిరిలో చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగించేవాడు. వెంకటరత్నం అదే ఊళ్లోని సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో ఉండి పదోతరగతి వరకు చదువుకున్నాడు. తనతో పాటు చదువుకుంటున్న స్నేహితుల బాధలను కళ్లారా చూశాడు. పిల్లల తల్లిదండ్రులు చేతిఖర్చులకు ఇచ్చే రూపాయి, అర్ధరూపాయి ఆ పిల్లలకు ఒక్కరోజుకు కూడా వచ్చేవి కావు. ఈ సమయంలో వారి బ్యాగులు, చెప్పులు తెగిపోతే ‘మా నాన్న దగ్గర కుట్టిస్తాను’ అంటూ వాళ్ల చెప్పులను తన తండ్రి దగ్గర కుట్టించేవాడు. హఠాత్తుగా తండ్రి మరణించడంతో కుటుంబ భారం వెంకటరత్నం మీద పడింది. నెల్లూరు నగరానికి వచ్చి చెప్పులు కుట్టే దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి నుంచి హాస్టల్స్‌లో ఉండే విద్యార్థుల బ్యాగులు, చెప్పులను ఉచితంగా కుట్టి ఇవ్వసాగాడు. పూటగడవడమూ కష్టమే... రైల్వేట్రాక్ సమీపంలో ఓ పూరిపాక వెంకటరత్నం నివాసం. ఇతడికి ఆరుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు అబ్బాయిలు. ముగ్గురికి పెళ్లి చేశాడు. పెళ్లి అయిన వారిలో కొడుకు, కూతురు చనిపోయారు. మరో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పెళ్లి వయస్సుకు వచ్చారు. రత్నం భార్య, కూతురు నగర డీఎస్పీ కార్యాలయంలో స్వీపర్లు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి వచ్చే జీతం కుటుంబపోషణకు సరిపోదు. ఈ స్థితిలో కూడా కుటుంబసభ్యులు రత్నానికి సహకారం అందిస్తున్నారు. నలుగురికీ సేవచేయాలనే ఆలోచన, నిండు గా ఉన్న జేబుకి కలిగితే, ఆ సహాయం మెండుగా ఉంటుందేమో! అదేే ఆలోచన మనసులో కలిగితే అది కలకాలం కొనసాగుతుంది. అందుకు వెంకటరత్నం చేస్తున్న సేవే నిదర్శనం. - కారణి మురళీకృష్ణపిళై ్ల న్యూస్‌లైన్, నెల్లూరు ఫొటోలు: ఆవుల కమలాకర్ -
కేయూ యువజనోత్సవాలు
కేయూలో యువజనోత్సవాలు సోమవారం కనులపండువగా ప్రారంభమయ్యూయి. ఆరు రాష్ట్రాల్లోని 19 యూనివర్సిటీల విద్యార్థులతో క్యాంపస్ సందడిగా మారింది. పబ్లిక్ గార్డెన్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డప్పు వాయిద్యాల మధ్య నగరంలో నిర్వహించిన శోభాయూత్ర ఆకట్టుకుంది.జ్యోతి ప్రజ్వలన చేస్తున్న హైకోర్టు జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డియువజనోత్సవాలకు హాజరైన విద్యార్థులుమాట్లాడుతున్న హైకోర్టు జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిహాజరైన ప్రముఖులు, విద్యార్థులుమాట్లాడుతున్న కేయూ వీసీ ప్రొఫెసర్ వెంకటరత్నంవిద్యుత్ వెలుగుల్లో ఆడిటోరియంమాక్నాలబ్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీ విద్యార్థులుచిందేస్తున్న స్వామివివేకానంద టెక్నికల్ యూనివర్సిటీ, భిలాయ్ విద్యార్థులురవిశంకర్శుక్లా యూనివర్సిటీ రాయ్‌పూర్ విద్యార్థులుఇందిరా కళాసంగీత్ విద్యాలయం, చత్తీస్‌గఢ్ విద్యార్థుల నృత్య ప్రదర్శనజెండా ఊపి శోభాయాత్రను ప్రారంభిస్తున్న కేయూ వీసీవేషధారణలో చత్తీస్‌గఢ్ విద్యార్థులుబుందేల్ఖండ్ యూనివర్సిటీ విద్యార్థులుకేయూ విద్యార్థినుల రిహార్సల్స్సీవీ రామన్ యూనివర్సిటీ, బిలాస్పూర్ విద్యార్థులుఏఐఎస్ఈసీటీ యూనివర్సిటీ విద్యార్థులునృత్యం చేస్తున్న బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ విద్యార్థులుగిరిజన నృత్యం చేస్తున్న విద్యార్థులుహరిదాసు, జోకర్ వేషధారణల్లో.. -
సత్వర సేవలు
సాక్షి, సిటీబ్యూరో : ప్రజలకు సత్వరం సేవలందించేందుకు తార్నాకలోని ప్రధాన కార్యాలయంలో కొత్తగా పౌరసేవల కేంద్రాన్ని (సిటిజన్ ఫెసిలిటేషన్ సెంటర్) ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎండీఏ సెక్రటరీ బి.రామారావు ప్రకటించారు. మరో రెండు నెలల్లో ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తార్నాక హెచ్ఎండీఏ కార్యాలయంలో సోమవారం ప్లానింగ్ డెరైక్టర్లు వెంకటరత్నం, జియాఉద్దీన్, ఎస్యూపీసీ భిడేలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు సేవలందించడంలో జాప్యం, అవినీతి, అక్రమాలతో అపకీర్తిని మూటగట్టుకొన్న ప్లానింగ్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలకు ఉపక్రమించామన్నారు. ఇందులో భాగంగా సంస్కరణలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్లానింగ్ డెరైక్టర్ వెంకటరత్నం మాట్లాడుతూ.. ప్రజలకు సత్వరం సేవలందించేందుకు ప్లానింగ్ విభాగం విధుల పునర్నిర్మాణం, కంప్యూటరైజేషన్‌పై ఇటీవల ‘ఆస్కీ’ చేత అధ్యయనం చేయించినట్లు తెలిపారు. వారి సూచనల మేరకు పౌరసేవల కేంద్రం ఏర్పాటుతోపాటు అనుమతుల్లో జాప్యానికి తావు లేకుండా జేపీవో,ఏపీవో, పీవో, సీపీవోలను ఒక యూనిట్‌గా చేర్చి ఒకేచోట విధులు నిర్వహించేలా నిర్ణయం తీసుకొన్నామన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, పరిష్కరించేందుకు పౌరసేవల కేంద్రం కృషి చేస్తుందన్నారు. ఈ కేంద్రంలో ముగ్గురు సిబ్బంది సేవలందిస్తారని, వీరు పరిశీలించి స్వీకరించిన దరఖాస్తులో ఏదైనా పత్రం (జిరాక్స్ కాపీ) మిస్ అయితే... దానికి హెచ్ఎండీఏనే బాధ్యత వహిస్తుందన్నారు. మొదట జెపీఓ/ఏపీఓలు దరఖాస్తులను ప్రాసెసింగ్ చేసి వారంలోగా పైఅధికారులకు పంపాల్సి ఉంటుందని, ఒకవేళ ఆయా ఫైళ్లు ఎక్కడైనా ఆగితే... ఎందుకు ఆగిందనేని తెలుసుకొని వారిపై చర్యలు తీసుకొనే అధికారం సీపీఓ స్థాయి అధికారికి అప్పగించినట్లు వివరించారు. ప్లానింగ్ విభాగాన్ని మొత్తం 5 యూనిట్స్‌గా విభజించి సేవలందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.మ్యాన్యువల్ సేవల ఫలితంగా కలుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఆన్లైన్ సేవలందించనున్నట్లు తెలిపారు. మరో ఏడాదిలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు. జెడ్ఓలకు టాటా..! జోనల్ అధికారులను తప్పించి వారి సేవలను హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలోని కీలక విభాగాల్లో వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు సెక్రటరీ రామారావు వెల్లడించారు. జోనల్ కార్యాలయాల నిర్వహణ సరిగ్గా లేనందునే సంస్థకు అపకీర్తి వచ్చిందన్నారు. శంకర్పల్లి జోనల్ కార్యాలయంలో ఫైళ్లు కాలిపోవడం, ఘట్కేసర్, మేడ్చల్, శంషాబాద్ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలు వెలుగు చూడటంతో జోనల్ అధికారులుగా ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను అక్కడి నుంచి తప్పిస్తున్నట్లు వివరించారు. ప్రధానంగా భూములకు సంబంధించిన విషయాలను సులభంగా పరిష్కరిస్తారన్న ఉద్దేశంతో రెవెన్యూ విభాగం నుంచి వీరిని డిప్యూటేషన్‌పై తీసుకొన్నామని, అయితే ఆ ఉద్దేశం నెరవేరలేదన్నారు. దాంతో నలుగురు జోనల్ అధికారుల సేవలను ఓఆర్ఆర్, ల్యాండ్ పూలింగ్, గ్రిడ్రోడ్స్, రేడియల్ రోడ్స్ విభాగాల్లో వినియోగించుకొంటామని సెక్రటరీ స్పష్టం చేశారు. ముఖ్యంగా జోనల్ అధికారులతో కోఆర్డినేషన్‌కు ప్రత్యేకంగా యూనిట్-6ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే... జోనల్ ఆఫీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని, అక్కడ ఏపీఓ, జేపీఓల ద్వారా దరఖాస్తులు స్వీకరించడంతోపాటు ఫీల్డ్ ఇన్స్పెక్షన్లు కూడా నిర్వహిస్తామన్నారు. వారానికోసారి ఉన్నతాధికారులు అక్కడికెళ్లి ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారని తెలిపారు. భవన నిర్మాణంలో అతిక్రమణలుంటే ఏపీఓ, జేపీఓలు క్షేత్రస్థాయి పర్యటనలో గమనించి గ్రామపంచాయతీ నుంచి నోటీసు ఇప్పించడం ద్వారా చట్టపరంగా చర్యలు తీసుకొంటామన్నారు. ప్రస్తుతం జోనల్ కార్యాలయాల్లో ఉన్న రికార్డులన్నీ తార్నాక ప్రధాన కార్యాలయానికి తెప్పిస్తామన్నారు. ఇక్కడే ల్యాండ్ వెరిఫికేషన్ యూనిట్‌ను ఒకదాన్ని నెలకొల్పాలన్న ఆలోచన కూడా ఉందని సెక్రటరీ వివరించారు.