వెంకటేశ్- అనిల్ రావిపూడి హ్యాట్రిక్ సినిమా
‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా ప్రకటన వచ్చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా మరో పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌ని తీసుకున్నట్లు దర్శకుడు అనిల్‌రావిపూడి ప్రకటించారు.అయితే, తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను పూర్తి చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టును స్వామి వారి పాదాల వద్ద ఉంచి ఆయన పూజలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు హిట్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమని దర్శకుడు అన్నారు. ఇందులో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారని ముందే అనిల్ రివీల్ చేశాడు. మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్ మాజీ ప్రేయసి... ఈ మూడు ప్రధాన పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ ఎంటర్టైనర్ మూవీ అని ఆయన అన్నాడు. ఈ నెల 3 నుంచి ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ ప్రారంభించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు.