Vennupotu
-
చంద్రబాబు వెన్నుపోటుకు 29 ఏళ్లు
సాక్షి, అమరావతి: వెన్నుపోటుకు చంద్రబాబే ప్రపంచ బ్రాండ్. ఆయనకు ఈ ఘనత వచ్చి నేటితో సరిగ్గా 29 ఏళ్లు నిండింది. 30వ సంవత్సరంలోకి అడుగిడుతోంది. పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్‌నే అధికార దాహంతో వెన్నుపోటు పొడిచి, ఆయనపై చెప్పులేయించి, 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు సీఎం పీఠాన్ని ఎక్కారు. అప్పటి నుంచి తన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి రాజకీయాలను భ్రష్టు పట్టించారు. రాజకీయాలను డబ్బు మయం చేసి, కుట్రలు, కుతంత్రాలతో 3 దశాబ్దాలుగా నాయకుడిగా చలామణి అవుతున్నారు. అప్పటి వెన్నుపోటుకు మూడు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా తనను గొప్పగా కీర్తిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరపాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబును దశమ గ్రహంతో పోలి్చన ఎన్టీఆర్ చంద్రబాబుకు ఎన్టీఆర్ తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆయన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ట్రాప్‌లో పడేసి వెన్నుపోటు ప్రహసనంలో పావులుగా వాడుకున్నారు. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసి పదవి నుండి తప్పించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని, గుర్తును సొంతం చేసుకున్నారు. ఈ తిరుగుబాటులో ఎమ్మెల్యేలంతా చంద్రబాబు మాయలో పడ్డారని గ్రహించిన ఎన్టీఆర్.. పార్టీ ఎమ్మెల్యేలను ఒప్పించడానికి వైస్రాయ్ హోటల్‌కు వెళ్తే చంద్రబాబు దగ్గరుండి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి దాడి చేశారు.ఈ ఘోరమైన అవమానాన్ని ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. ఆత్మ గౌరవానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఎన్టీఆర్ తనకు జరిగిన అవమానంతో కుంగిపోయారు. ఆ క్షణమే తాను చచ్చిపోయినట్లు లెక్క అని కంటతడి పెట్టి ఆక్రోశించారు. అక్కడితో ఆగకుండా ఎన్టీఆర్ బ్యాంకు ఖాతాను చంద్రబాబు ఫ్రీజ్ చేయించారు. ఎన్టీఆర్ కురీ్చని కబ్జా చేసిన చంద్రబాబు అసెంబ్లీలోనూ ఆయన్ని అవమానించారు. సినిమాల్లో, రాజకీయాల్లోనూ తనదైన శైలితో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ తన జీవిత చరమాంకంలో సొంత మనుషుల చేతుల్లోనే ఘోరమైన అవమానాలు పొంది కంట తడి పెట్టుకున్నారు. చంద్రబాబుని ఎన్టీఆర్ దశమ గ్రహంగా, ఔరంగజేబుగానూ పోల్చారు. చంద్రబాబు పరివారం పెట్టిన మానసిక క్షోభతోనే ఎన్టీఆర్ కన్ను మూశారన్నది చరిత్ర చెప్పే విషయం. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన ఆనవాళ్లు లేకుండా చేసేందుకు చంద్రబాబు అనేక నిర్ణయాలు తీసుకున్నారు.ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధం, రెండు రూపాయల బియ్యం పథకాలను ఎత్తివేశారు. రైతులకు నీటి రాయితీని తొలగించారు. అటు పార్టీలోనూ ఎన్టీఆర్ జ్ఞాపకాలు లేకుండా చెరిపేశారు. ఇలా అనేక చర్యలతో ఎన్టీఆర్‌ను ప్రజలకు దూరం చేసేందుకు ప్రయతి్నంచారు. ఎన్టీఆర్‌ను అడుగడుగునా అవమానాలకు గురి చేస్తూ అనుక్షణం క్షోభ పెట్టిన చంద్రబాబు.. రాజకీయ అవసరాలకు మాత్రం ఎన్టీఆర్ పేరు, బొమ్మ వాడేసుకుంటారు. ఎన్టీఆర్ గురించి గొప్పగా చెబుతూ నిజ జీవితంలో ఎన్టీఆర్‌ను మించిన మహానటుడి పాత్ర పోషిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని దారుణాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేలా పొగడడం రాజకీయ వైచిత్రేనంటారు రాజకీయ విశ్లేషకులు.బాబు హయాంలో అనేక నేరాలు, ఘోరాలు995లో ఎన్టీఆర్‌ను ద్రోహపూరితంగా గద్దె దించి, తాను పీఠమెక్కింది మొదలు చంద్రబాబు రాజకీయం, పరిపాలన మొత్తం కుట్రలు, కుతంత్రాలు, స్వార్థ ప్రయోజనాలే. 1995 – 2004 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టారనే విమర్శలున్నాయి. “ప్రపంచ బ్యాంకు జీతగాడు, చంద్రబాబు మాయగాడు’ అంటూ అప్పట్లో కమ్యూనిస్టులు ప్రత్యేక పాటలు రచించి ప్రచారం చేశాయంటే ఆయన ఏ స్థాయిలో ప్రజలను వంచించారో అర్థం చేసుకోవచ్చు. హైటెక్ సిటీ నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు కూడగట్టారు. ఏలేరు స్కాం, తెల్గీ స్టాంపులు, మద్యం ముడుపులు, పనికి ఆహార పథకం వంటి కుంభకోణాలు అనేకం వెలుగు చూశాయి.అప్పట్లోనే ‘చంద్రబాబు జమానా–అవినీతి ఖజానా’ అని సీపీఎం పార్టీ ఒక పుస్తకాన్ని విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసింది. రాజకీయాల్లో ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణించి రాయలసీమలో ఫ్యాక్షన్ ను రాజేశారు. అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందిన వందలాది మందిని వెంటాడి వేటాడి చంపేయడంలో కీలక భూమిక పోషించారనే విమర్శలు అప్పట్లో బలంగా వినిపించాయి. విద్యుత్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచడంతో ప్రజలు ఉద్యమించి శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే 2000 సంవత్సరంలో వారిపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుది.ఈ ఘటనలో ముగ్గురు చనిపోవడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారి చంద్రబాబు రాక్షసత్వాన్ని బయటపెట్టింది. అంతకు ముందు తణుకు సమీపంలోని కాల్దరి రైల్వేస్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులు జరిపించి ఒక రైతు మృతికి కారకుడయ్యారు. వీటన్నింటిపైనా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. దాని పర్యవసానమే 2004 ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోయి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు.రంగా హత్యలోనూ తెరవెనుక పాత్ర! రాష్ట్రంలో 1985 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన వంగవీటి మోహన రంగా తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించారు. రంగాను అడ్డు తొలగించుకోకపోతే కోస్తాలో రాజకీయ మనుగడ ఉండదని చంద్రబాబు భావించారని చెబుతారు. అందుకే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు తెలియకుండా కుట్ర చేసి.. 1988 డిసెంబర్ 26న ప్రజా సమస్యల పరిష్కారం, వ్యక్తిగత భద్రత కోసం ఆమరణ దీక్ష చేస్తున్న రంగాను అతి దారుణంగా హత్య చేయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో రాశారు.రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ కుంభకోణాలు రాష్ట్ర విభజన తర్వాత ప్రజలను ఏమార్చి దొంగ హామీలతో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను పీక్కు తిన్నారు. అమరావతి రాజధాని పేరుతో చేసిన అంతర్జాతీయ కుంభకోణంతో ప్రపంచమే ఆశ్చర్యపోయింది. రాజధాని కోసం రైతులపై దౌర్జన్యాలకు పాల్పడి బలవంతపు భూసమీకరణ చేశారు. అసైన్డ్ భూములను లాక్కోవడం, ఇన్సైడర్ ట్రేడింగ్, ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, విశాఖలో లక్ష ఎకరాల భూ కుంభకోణం, నీరు–చెట్టు కార్యక్రమంలో అవినీతి వంటి లెక్కలేనని వ్యవహారాలు బయటకు వచ్చాయి.ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుని మరోసారి చిత్తుగా ఓడించారు. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఏకంగా అరెస్టయి జైలుకు వెళ్లారు. ప్రజలను మాయ చేసి కనీవినీ ఎరుగని అబద్ధాలు, దొంగ హామీలతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చారు. వెన్నుపోట్లు, మోసం, నయవంచనతో రాజకీయ జీవితాన్ని నిరి్మంచుకున్న చంద్రబాబు తనను ఒక విజనరీగా చూపించేందుకు ఎల్లో మీడియాను ఉపయోగించుకున్నారు.చంద్రబాబు చెప్పుచేతల్లో ఉండే ఈ మీడియా ఆయన్ని అవతార పురుషుడిగా, అభివృద్ధి ప్రదాతగా కీర్తిస్తూ నిత్యం ప్రజలను ఏమారుస్తూనే ఉంటుంది. మీడియా హైప్, సొంత డబ్బా కొట్టుకోవడంలోనే ఆయన విజన్ కనిపిస్తుంది తప్ప నిజానికి చంద్రబాబు ఒక దారి తప్పిన, మోసపూరిత నాయకుడు. అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తర్వాత వంచించడం ఆయన నైజం. వీటన్నింటినీ దాచి చంద్రబాబును గొప్ప నేతగా టీడీపీ శ్రేణులు, ఎల్లో మీడియా కీర్తించడంపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. -
Mark Antony: చంద్రబాబు ‘వెన్నుపోటు’పై హీరో విశాల్ సెటైర్లు
గత 30 ఏళ్లుగా ‘వెన్నుపోటు’కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నుంచి టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు లాక్కున్నప్పటి నుంచి వెన్నుపోటు పదం రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఈ వెన్నుపోటుపై చర్చ జరుగుతూనే ఉంది. స్వయాన ఎన్టీఆర్ గారే ‘ పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు’అని మండిపడ్డాడు. దీంతో వెన్నుపోటు అనగానే తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు టక్కున గుర్తొస్తాడు. తాజాగా ఈ వెన్నుపోటు డైలాగ్‌తో చంద్రబాబుపై సెటైర్లు పేల్చాడు హీరో విశాల్. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ‘మార్క్ ఆంటోని’ విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్ జే సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. సెప్టెంబర్ 15న ఈ చిత్రం తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విడుదలైంది. తొలిరోజు ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాకి టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరెక్కించాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. బాబుపై ‘వెన్నుపోటు’ సెటైర్లు ఇది డబ్బింగ్ సినిమానే అయినా.. తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా కొన్ని సంభాషణలను పెట్టారు. ముఖ్యంగా చంద్రబాబు వెన్నుపోటు గురించి హీరో విశాల్ వేసే సెటైరికల్ డైలాగ్ థియేటర్స్‌లో విజిల్స్ వేయించింది. ఈ సినిమా కథ 1975 నేపథ్యంలో సాగుతున్నప్పుడు ఎన్టీఆర్ నటించిన ‘ఎదురులేని మనిషి’సినిమా కోసం హీరో తన స్నేహితుడితో కలిసి థియేటర్‌కి వెళ్తాడు. అక్కడ ఒకడు కత్తితో హీరోపై దాడి చేస్తాడు. వెనుకవైపు నుంచి పొడిచేందుకు ప్రయత్నించగా.. హీరో వాడిని పట్టుకుంటాడు. ఈ క్రమంలో వాడి షర్ట్ చిరిగిపోయి.. గుండెలపై ఎన్టీఆర్ బొమ్మ కనిపిస్తుంది. అంటే వాడు ఎన్టీఆర్ అభిమాని అన్నమాట. అది గమనించిన హీరో.. ‘అన్నగారిని గుండెల్లో పెట్టుకున్న ఎవరికి వెన్నుపోటు పొడిచే అలవాటే లేదురా’అంటాడు. వెన్నుపోటు అనగానే చంద్రబాబు గుర్తుకు రావడం సహజం. అందుకే విశాల్ ఆ డైలాగ్ చెప్పగానే ‘చంద్రబాబు..చంద్రబాబు’అని ఆడియన్స్ గట్టిగా నవ్వుతున్నారు. -
రౌడీ రాజకీయాలను ప్రేరేపిస్తున్న బాబు, లోకేశ్
తిరుపతి సిటీ: చంద్రబాబు, లోకేశ్ పాదయాత్రల పేరుతో చంపుతాం.. అంతు చూస్తాం.. అంటూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం రౌడీ రాజకీయాలను ప్రేరేపించడమేనని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి మేలు చేస్తామని ఒక్క మాట కూడా లోకేశ్ తన పాదయాత్రలో మాట్లాడకపోవడం దారుణమన్నారు.పుంగనూరులో టీడీపీ కుట్ర ప్రజలకు అర్థమైందన్నారు. కులపిచ్చి, వెన్నుపోటు రాజకీయాలు తప్ప ప్రజాప్రభుత్వం రావాలనే ఆకాంక్ష టీడీపీ వారికి లేదన్నారు. రామోజీ గ్రూపునకు చెందిన మార్గదర్శి సంస్థ మోసాలను సీఎం వైఎస్ జగన్ బయటపెట్టడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. పదవులు పోవడంతో మతిభ్రమించి బొండా ఉమ, అయ్యన్నపాత్రుడు రాక్షసుల్లాగా మాట్లాడుతున్న తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఉచ్చపోయిస్తాం.. అంటున్న లోకేశ్ లెట్రిన్, బాత్రూమ్లు కట్టే పనిలో ఉన్నారా.. అని ప్రశ్నించారు. లోకేశ్ అందుకు కూడా పనికిరాడని ఎద్దేవా చేశారు. -
వెన్నుపోటు ఎపిసోడ్ పై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
-
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పోడిచిన పాపం బాబును వెంటాడుతుంది
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను మించిన వెన్నుపోటు’
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను మించిన వెన్నుపోటు’
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘వెన్నుపోటు’ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడే. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి టీడీపీని, అధికారాన్ని చంద్రబాబు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే కథాంశంతోనే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్ సాక్షిగా చంద్రబాబు ఎలా అవమానానికి గురిచేశారు.. టీడీపీని, అధికారాన్ని ఎలా హస్తగతం చేసుకున్నారో ఈ చిత్రంలో చూపించనున్నారు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో ప్రస్తుతం ‘వెన్నుపోటు’అంశం ట్రెండ్‌లో ఉండగానే మరో వెన్నుపోటు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (లక్ష్మీస్ ఎన్టీఆర్ : సోషల్ మీడియాలో వైస్రాయ్ సీన్) ఓ క్రికెట్ మ్యాచ్ సందర్బంగా సహచర ఆటగాడినే మరో బ్యాట్స్‌మెన్ రనౌట్ చేయిస్తాడు. బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్‌మన్ డిఫెన్స్ ఆడి పరుగుకు పిలుస్తాడు. వెంటనే నాన్ స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ పరుగు కోసం యత్నించాడు. వెంటనే డిఫెన్స్ ఆడిన బ్యాట్స్‌మన్ బంతిని బౌలర్‌కు అందించి సహచర ఆటగాడు రనౌట్‌లో భాగస్వామ్యమవుతాడు. దీంతో సొంత జట్టు ఆటగాడి చర్యతో షాక్‌కు గురైన బ్యాట్స్‌మన్ అసహనంతో క్రీజు వదిలి వెళ్లాడు. ప్రసుతం దీనికి సంబంధించిన వీడియా నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను మించిన వెన్నుపోటు ఇది’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘రాజకీయాల్లోనే కాదు క్రీడల్లోనూ వెన్నుపోటు ఉంటుందని నిరూపించావ్ బ్రదర్’అంటూ వ్యంగ్యంగా పేర్కొంటున్నారు. (ఎన్టీఆర్ సందేశం.. ‘వాడు గాడ్సే కన్నా అధముడు) @RGVzoomin #LakshmiNTR ni minchina venupootu idhi!! pic.twitter.com/nxt3eVfk3F — Saketh Ram Peri (@saketh_4490) March 12, 2019 -
వీళ్లను గుర్తించటంలో సాయం చేయండి : వర్మ
-
వీళ్లను గుర్తించటంలో సాయం చేయండి : వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన దాడిని కొనసాగిస్తునే ఉన్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి తనపై విమర్శలు గుప్పిస్తున్న వారిపై తనదైన స్టైల్లో ఎదురుదాడి చేస్తున్నాడు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబంధించి పాటలతో వివాదాలకు తెర తీసిన వర్మ సోషల్ మీడియా పోస్ట్‌లతో మరింత వేడి పెంచుతున్నాడు. తాజాగా బాహుబలి సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ ఆసక్తికర కామెంట్ చేశాడు. బాహుబలి 2 టైటిల్స్ సమయంలో వచ్చిన బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడుస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఫొటోషాప్‌లో గ్రాఫిక్స్ చేసిన ఇమేజ్ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ.. ‘ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగా గుర్తు రావటం లేదు.. వీరిని గుర్తుపట్టడంలో నాకు సాయం చేయండి’ అంటూ కామెంట్ చేశాడు. వర్మ స్యయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈసినిమాలో కీలక పాత్రల్లో యాగ్న శెట్టి, శ్రీతేజ్‌లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు కీలక పాత్రల్లో నటించనున్నారు. These faces are vaguely reminding of two people I know ..can u please help me with my memory pic.twitter.com/Hgqb3tKNB5 — Ram Gopal Varma (@RGVzoomin) 19 January 2019