Venugopal nagasuri
-
మహాత్ముడు రేడియోలో మాట్లాడిన వేళ!
భారతీయ రేడియో చరిత్రలో 1947 నవంబర్ 12వ తేదీ ఓ అపురూప సందర్భం. ఆరోజు మహాత్మాగాంధీ తన జీవితంలో తొలి, చివరి పర్యాయం ఆకాశవాణిలో ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన రేడియో ప్రసంగం ద్వారా, విద్యుత్ లేకున్నా లభించే ఈ మాధ్యమం ప్రశస్తి మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఆ రోజు దీపావళి... నవంబర్ 12, 1947! పాకిస్థాన్ కాందిశీకు లను ఉద్దేశించి గాంధీజీ కురు క్షేత్రవెళ్లి ప్రసంగించాలి. అయితే ఆయన అక్కడికి వెళ్లలేకపోయా రు. ఆ సందర్భంగా ఆకాశవాణి ద్వారా ప్రసంగించమనే సూచ నతో పాటు ఆయనపై ఒత్తిడి పెరిగింది. నిజానికి గాంధీజీకి రేడియో అంటే ఎందుకో కాస్త బిడియం. అయితే చాలా మంది అభ్యర్థన కారణంగా గాంధీజీ ఢిల్లీ రేడియో కేంద్ర ప్రసార స్థలమైన బ్రాడ్ కాస్టింగ్ హౌస్‌కు మధ్యా హ్నం 3 గంటలకు రాజకుమారి అమృత్కౌర్తో కలిసి వచ్చారు. అప్పట్లో ముందుగా రికార్డు చేసి, వినిపించే సాంకేతిక సదుపాయం రాలేదు. ఎలా మాట్లాడితే అలా, అప్పుడే శ్రోతలను చేరేది. గాం ధీజీ కోసం - నిత్యం ప్రార్థన వేళలో వాడే చెక్క వేదిక వంటిది రేడియో కేంద్రం స్టూడియోలో ఏర్పా టు చేశారు. తనకు సదుపాయంగా ఉండాలనే ఉద్దేశం. అప్పటికి మనకు స్వాతంత్య్రం వచ్చి మూ డు నెలలు కూడా కాలేదు. గాంధీజీ అంటే అపారమైన గౌరవ భావమని వేరుగా చెప్పనక్కరలేదు. గాంధీజీ స్టూడియో చేరగానే చాలా సహజంగా మారిపోయారు. తన సొంత పరికరంగా రేడియో మైక్‌ను భావించారు. అది అద్భుతమైన శక్తి అన్నారు. మరుసటి రోజు అంటే 1947 నవంబర్ 13వ తేదీ ‘ది హిందుస్తాన్ టైమ్స్’ ఆంగ్లపత్రిక గాంధీజీ ప్రసంగం గురించి - 20 నిమిషాల పాటు సాగిన ప్రసంగం అంటూ, గాంధీజీ గళం అత్యంత స్పష్టంగా ఉందని పేర్కొం ది. గాంధీ ప్రసంగం తర్వాత వందేమాతరం వినిపించారని కూడా హిందుస్తాన్ టైమ్స్ రాసింది. 1947 నవంబర్ 12న గాంధీ మహాత్ముడు రేడియో కేంద్రం సందర్శించిన సమయంలో ఉన్న శ్రీ పి.వి.కృష్ణమూర్తిగారు ఆ విషయాలను ఇటీవల గుర్తు చేసుకున్నాడు. ఆయన బర్మా కాందిశీకుడు, కలకత్తా వాసి అయిన తమిళ వ్యక్తి. 1944లో అనౌన్సర్‌గా చేరి ఆకాశవాణి, దూరదర్శన్లలో పని చేసి చివరికి 1979లో దూరదర్శన్ తొలి డెరైక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. ఈ సంగతులు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం తొలి కేంద్ర నిర్దేశకులుగా పనిచేసిన హెచ్. ఆర్.లూథ్ర రచించిన ‘ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్’ గ్రంథంలో కూడా చూడవచ్చు. 1948 జనవరి 30వ తేదీన గాంధీజీ హత్య అయిన తర్వాత బోధపడింది ఏమిటంటే ఆకాశవాణి కేంద్రానికి (ఢిల్లీకి), రేడియో ప్రసంగం కోసం గాంధీజీ ఒక్కసారే వచ్చారని. ఈ విషయానికి సంబంధించిన వివరాలు ‘ది ఇండి యన్ లిజనర్’ 1948 ఫిబ్రవరి సంచికలో ఉన్నాయి. కనుక నవంబర్ 12 అనేది భారతీయ రేడియో చరిత్రలో ఒక అపురూపమైన సందర్భంగా మారిపో యింది. 2001వ సంవత్సరం నుంచి నవంబర్ 12వ తేదీని ప్రజోపయోగ ప్రసార దినోత్సవంగా గుర్తించి - లాభాపేక్ష లేకుండా సమాజానికి ఉపయోగపడే ప్రసారాల గురించి అవగాహన కలిగించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పటికి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపం చీకరణ మొదలై ఒక దశాబ్దమైంది. ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో కేంద్రాలు అప్పటికి ప్రారంభం కాలేదు. కానీ లాభాపేక్షతో నడిచే టీవీ చానళ్లు మన దేశంలో మొదలై పదేళ్లు అయింది. కనుక పబ్లిక్ బ్రాడ్ కాస్ట్ సర్వీస్ అనేది కేవలం రేడియోకే అని భావించ నక్కరలేదు. 1947లో టెలివిజన్ ఉండి ఉంటే ఆకాశవాణితో పాటు దూరదర్శన్ కూడా తప్పనిసరిగా గాంధీజీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి ఉండేది. ప్రస్తు తం పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్ట్ అవసరం గురించీ; కమర్షియల్ టెలివిజన్ ప్రసారాలు కలిగించే అనర్థం గురించీ చర్చ మొదలైంది. స్వలాభం, అవసరం లేని వినియోగం, శ్రమలేని ఫలితం అవసరం లేదనే భావన కలిగిన గాంధీ ఆలోచనలకు ప్రజోపయోగ ప్రసారాల దినోత్సవం చక్కని సందర్భం. నిజానికి టెలివిజన్‌తో పోలిస్తే రేడియో అత్యం త సరళమైన మాధ్యమం. విద్యుత్ లేకపోయినా లభించే మాధ్యమం; ఇంట్లోనే కాకుండా బయట కూడా హాయిగా అందుబాటులో ఉండే సాధనం రేడియో. ఈ విషయాన్ని స్పష్టంగా గమనించిన వ్యక్తి ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ. మనసులో మాట అని ప్రధాని రేడియోలో ఈ దీపావళి రోజున ప్రసంగించారు. ఈ రేడియో ప్రసంగం క్రమం తప్పకుండా నెలకో, పక్షానికో ఒకసారి ఉంటుందని స్పష్టంగా ప్రకటించారు. ప్రధాని రేడియో ప్రసంగం కారణంగా ప్రైవేట్ టీవీ చానళ్ల తెరపై రేడియో ప్రస్తావన, రకరకాల రేడియో శ్రోతలు కనబడ్డారు. కళ్లెదుటే ఉన్న, చాలా మంది గుర్తించలేని ప్రత్యామ్నాయం - రేడియోను ప్రధాని గమనించి వాడటం ఒక విలక్షణమైన ధోరణి! సరళమైన రీతిలో ఎక్కువ మంది సగటు వ్యక్తులను చేరే సాధనం రేడియో! అలాగే రేడియో సినిమా పాటలు వినడానికే కాదు, పనికి వచ్చే ప్రసంగాలు వినడానికి కూడా చక్కని సాధనమని తేటతెల్లమైంది? ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ బ్రాడ్ కాస్ట్ గురించి ఇప్పుడు ఆసక్తి, గౌరవం పెరిగాయి. (వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త) డా॥నాగసూరి వేణుగోపాల్ -
తెలుగువాణి ‘మాణిక్యవీణ’
ప్రాచ్య విద్యలు చదివి సామ్యవాదం వైపు మొగ్గిన ప్రజ్ఞావంతులలో విద్వాన్ విశ్వం గొప్ప సమన్వయ వాది. మృదువుగా మాట్లాడుతూ విరుద్ధమైన అభిప్రాయం చెప్పడంలో తనది అందెవేసిన చేయి. ఆధునికతను ఆహ్వానిస్తూనే సంప్రదాయంలోని ఔచిత్యాన్ని వివరించడం తనకు చాలా సులువు. ఉద్యమం, సాహిత్యం, జర్నలిజం ముప్పేటగా సాగిన విలక్షణ వ్యక్తి విద్వాన్ విశ్వం! ఛాందసమెరుగని సంప్రదాయ వాది, ఆవేశం లేని ఆధునికవాది! భారతీయ లోచ నాన్ని, వామపక్ష ఆలోచనలను కలిపి చూసిన సమ న్వయవాది! ప్రాకృతం, సంస్కృతం, తెలుగు, ఇం గ్లిష్ భాషలను ఆకళింపు చేసుకొని కృషి చేసిన సాహితీవేత్త! అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో 1915 అక్టోబర్ 21న లక్షమ్మ, మునిరామాచార్యులకు జన్మించారు విశ్వరూపాచారి. తండ్రి జాతీయ భావా లతో మద్యపాన నిషేధం, రైతు మహాసభ వంటి కార్యక్రమాలను సన్మార్గ బోధిని సంఘం ద్వారా నిర్వహించిన వ్యక్తి. తండ్రి మూడవ ఏట గతించ డంతో విశ్వం తల్లి లాలనలో పెరిగాడు. తాత నుంచి సంస్కృత పాండిత్యం గడించాడు. తరిమెల నాగి రెడ్డి అనుంగు, ఆత్మీయ మిత్రుడు. కావ్యనాటకాల నూ, ఛందో అలంకారాలను, తర్కశాస్త్రాన్ని అధ్య యనం చేసి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి విద్వాన్ పట్టా పొందాడు. సంస్కృత అధ్యయనానికి తోడు వామపక్ష భావజాలం అదనంగా అమిరింది. ఏదీ దేన్నీ కప్పివేయలేదు, లేదా అతిక్రమించలేదు. అందుకే వామపక్ష భావజాలాన్ని వివరించే వ్యాసం గొప్ప శ్లోక పాదంతో ముగుస్తుంది. తెలుగు నాట దత్తమండలపు స్వాతంత్య్రోద్య మ రోజుల్లో కల్లూరి సుబ్బారావు, గాడిచర్ల హరిస ర్వోత్తమరావు, చిలుకూరి నారాయణరావు, పప్పూ రు రామాచార్యులు వంటి వారి మార్గదర్శకత్వంలో విశ్వం నడిచారు. ఉద్యమం, ఉపన్యాసం మాత్రమే కాకుండా రాజకీయాలు శాస్త్రీయ పద్ధతిలో వివరిం చాలని పాత్రికేయ జీవితాన్ని ఎన్నుకున్నాడు. జర్నలిజంలో చేరకముందు నవ్య సాహిత్యమాల ద్వారా పుస్తకాలు వెలువరించారు. రామాచార్యుల ‘శ్రీసాధన’ పత్రికతో పాటు ‘భారతి’ వంటి వాటిల్లో రచనలు చేశారు. 1945లో అడవి బాపిరాజుగారి ‘మీజాన్’ పత్రికలో చేరారు. తర్వాత ‘ప్రజాశక్తి’ పత్రికలో మూడేళ్లు పనిచేసి మదరాసుకెళ్లాడు. అక్క డ ‘కిన్నెర’ వంటి పత్రికలకూ, బాలభారత్ విద్యాల యానికి పని చేశారు. 1952లో ‘ఆంధ్రప్రభ’ సచిత్ర వారపత్రికలో చేరారు. తొలి నుంచి కార్యనిర్వా హక సంపాదకులుగా పనిచేసి తెలుగు వారపత్రికల తీరులో గొప్ప మలుపులు తెచ్చాడు. అప్పట్లో ఉన్న ఏకైక వారపత్రిక ‘ఆంధ్రపత్రిక’ పురుష పాఠకులు ప్రధానంగా సాగేదని నండూరి రామమోహనరావు పేర్కొంటూ ‘ఆంధ్రప్రభ’ వారపత్రిక సకుటుంబ వారపత్రికగా విజయవంతమైందంటారు. విద్వాన్ విశ్వం అనగానే ఎక్కువ మందికి మాణిక్యవీణ గుర్తుకు వస్తుంది. తెలుగు పత్రికల్లో ఎక్కువ కాలం నడిచిన శీర్షికలలో మాణిక్యవీణ ఒకటి. అది ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలోనే రెం డు దశాబ్దాల పాటు నడిచింది. అంతకుముందు కొంత కాలం దినపత్రికలో కొనసాగింది. మాణిక్య వీణకు ముందు ఆంధ్రప్రభ వారపత్రికలోనే సుమా రు ఏడు సంవత్సరాల పాటు ‘తెలుపు-నలుపు’ శీర్షిక ప్రధానంగా భాషాంశాలతో నడిచింది. మాణి క్యవీణ వ్యాసాల వస్తువుకు కాలదోషం ఉండవచ్చు కానీ, తెలుపు-నలుపునకు ఆ సమస్య లేదు. ఆంధ్ర పత్రిక దినపత్రికలో ‘అవీ.. ఇవీ’, ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ‘ఇవ్వాళ’ శీర్షికలు కూడా విశ్వం రాశారు. కవిగా విద్వాన్ విశ్వం కీర్తిని గొప్పగా చాటింది పెన్నేటి పాట. ఒక ప్రాంతీయమైన సమాజాన్ని కవి తా వస్తువుగా తీసుకుని విశ్వం రాసిన ‘పెన్నేటి పాట’ అజరామరమైనది. విశ్వం పెన్నేటి పాటను దాశరథి తెలంగాణ రచయితల సంఘం ద్వారా ప్రచురింపచేశాడు. అయితే కేవలం గత వైభవాన్ని కీర్తిస్తూ విశ్వం ఆగిపోలేదు. వల్లంపాటి వెంకటసు బ్బయ్య అన్నట్టు గత కీర్తి పట్ల విశ్వంకు పలవరింత గానీ, వెర్రి వ్యామోహంగానీ లేవు. బ్రిటిష్ జవాన్లతో పోరాడి అమరుడైన హం పన్న కథను ‘ఒకనాడు’ కావ్యంగా విశ్వం రాశాడు. విశ్వం అనువాద కృషిని ప్రత్యేకంగా చెప్పాలి. మేఘ సందేశం, కాదంబరి, కిరాతార్జునీయం, దశకుమార చరిత్ర గ్రంథాలు సంస్కృత సాహిత్యంలో ఒక్కోటి విలక్షణమైనవీ, గొప్పవీ! ఈ నాలుగు గొప్ప గ్రంథా లను గొప్పగా తెలుగు చేశాడు. కల్హణుని రాజ తరం గిణి, నీతి చంద్రికను చక్కగా అనువదించారు. ప్రాచ్య విద్యలు చదివి సామ్యవాదం వైపు మొగ్గిన ప్రజ్ఞావంతులలో విద్వాన్ విశ్వం ప్రముఖు లే కాదు, గొప్ప సమన్వయవాది కూడా. మృదు వుగా మాట్లాడుతూ విరుద్ధమైన అభిప్రాయం చెప్ప డంలో విశ్వం అందెవేసిన చేయి. ఆధునికతను ఆహ్వానిస్తూనే సంప్రదాయంలోని ఔచిత్యాన్ని విడ మరచి చెప్పడం అతనికి చాలా సులువు. అయితే విశ్వం వ్యక్తిగత జీవితం బాధాకరంగా పరిణమించింది. కూతురు అకాల మరణం, కుమా రుడు ఇల్లు విడిచిపోవడం ఆయనను బాగా దెబ్బ తీశాయి. 1987 అక్టోబర్ 20వ తేదీన విశ్వం తిరు పతిలో కన్నుమూశారు. ఆయన పాండితీ సమన్వ య ధోరణి, విశాల దృక్పథం తెలుగు సమాజానికి చక్కని సందేశాన్ని ఇస్తున్నాయి. (వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త) డా॥నాగసూరి వేణుగోపాల్