మహాత్ముడు రేడియోలో మాట్లాడిన వేళ! | If Mahatma talking on the radio | Sakshi
Sakshi News home page

మహాత్ముడు రేడియోలో మాట్లాడిన వేళ!

Published Wed, Nov 12 2014 12:18 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మహాత్ముడు రేడియోలో మాట్లాడిన వేళ! - Sakshi

మహాత్ముడు రేడియోలో మాట్లాడిన వేళ!

భారతీయ రేడియో చరిత్రలో 1947 నవంబర్ 12వ తేదీ ఓ అపురూప సందర్భం. ఆరోజు మహాత్మాగాంధీ తన జీవితంలో తొలి, చివరి పర్యాయం ఆకాశవాణిలో ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన రేడియో ప్రసంగం ద్వారా, విద్యుత్ లేకున్నా లభించే ఈ మాధ్యమం ప్రశస్తి మళ్లీ చర్చల్లోకి వచ్చింది.
 
ఆ రోజు దీపావళి... నవంబర్ 12, 1947! పాకిస్థాన్ కాందిశీకు లను ఉద్దేశించి గాంధీజీ కురు క్షేత్రవెళ్లి ప్రసంగించాలి. అయితే ఆయన అక్కడికి వెళ్లలేకపోయా రు. ఆ సందర్భంగా ఆకాశవాణి ద్వారా ప్రసంగించమనే సూచ నతో పాటు ఆయనపై ఒత్తిడి పెరిగింది. నిజానికి గాంధీజీకి రేడియో అంటే ఎందుకో కాస్త బిడియం. అయితే చాలా మంది అభ్యర్థన కారణంగా గాంధీజీ ఢిల్లీ రేడియో కేంద్ర ప్రసార స్థలమైన  బ్రాడ్ కాస్టింగ్ హౌస్‌కు మధ్యా హ్నం 3 గంటలకు రాజకుమారి అమృత్‌కౌర్‌తో కలిసి వచ్చారు. అప్పట్లో ముందుగా రికార్డు చేసి, వినిపించే సాంకేతిక సదుపాయం రాలేదు. ఎలా మాట్లాడితే అలా, అప్పుడే శ్రోతలను చేరేది. గాం ధీజీ కోసం - నిత్యం ప్రార్థన వేళలో వాడే చెక్క వేదిక వంటిది రేడియో కేంద్రం స్టూడియోలో ఏర్పా టు చేశారు. తనకు సదుపాయంగా ఉండాలనే ఉద్దేశం. అప్పటికి మనకు స్వాతంత్య్రం వచ్చి మూ డు నెలలు కూడా కాలేదు.

గాంధీజీ అంటే అపారమైన గౌరవ భావమని వేరుగా చెప్పనక్కరలేదు. గాంధీజీ స్టూడియో చేరగానే చాలా సహజంగా మారిపోయారు. తన సొంత పరికరంగా రేడియో మైక్‌ను భావించారు. అది అద్భుతమైన శక్తి అన్నారు. మరుసటి రోజు అంటే 1947 నవంబర్ 13వ తేదీ ‘ది హిందుస్తాన్ టైమ్స్’ ఆంగ్లపత్రిక గాంధీజీ ప్రసంగం గురించి - 20 నిమిషాల పాటు సాగిన ప్రసంగం అంటూ, గాంధీజీ గళం అత్యంత స్పష్టంగా  ఉందని పేర్కొం ది. గాంధీ ప్రసంగం తర్వాత వందేమాతరం వినిపించారని కూడా హిందుస్తాన్ టైమ్స్ రాసింది.

1947 నవంబర్ 12న గాంధీ మహాత్ముడు రేడియో కేంద్రం సందర్శించిన సమయంలో ఉన్న శ్రీ పి.వి.కృష్ణమూర్తిగారు ఆ విషయాలను ఇటీవల గుర్తు చేసుకున్నాడు. ఆయన బర్మా కాందిశీకుడు, కలకత్తా వాసి అయిన తమిళ వ్యక్తి. 1944లో అనౌన్సర్‌గా చేరి ఆకాశవాణి, దూరదర్శన్‌లలో పని చేసి చివరికి 1979లో దూరదర్శన్ తొలి డెరైక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.

 ఈ సంగతులు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం తొలి కేంద్ర నిర్దేశకులుగా పనిచేసిన హెచ్. ఆర్.లూథ్ర రచించిన ‘ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్’ గ్రంథంలో కూడా చూడవచ్చు. 1948 జనవరి 30వ తేదీన గాంధీజీ హత్య అయిన తర్వాత బోధపడింది ఏమిటంటే ఆకాశవాణి కేంద్రానికి (ఢిల్లీకి), రేడియో ప్రసంగం కోసం గాంధీజీ ఒక్కసారే వచ్చారని. ఈ విషయానికి సంబంధించిన వివరాలు ‘ది ఇండి యన్ లిజనర్’ 1948 ఫిబ్రవరి సంచికలో ఉన్నాయి.

కనుక నవంబర్ 12 అనేది భారతీయ రేడియో చరిత్రలో ఒక అపురూపమైన సందర్భంగా మారిపో యింది. 2001వ సంవత్సరం నుంచి నవంబర్ 12వ తేదీని ప్రజోపయోగ ప్రసార దినోత్సవంగా గుర్తించి - లాభాపేక్ష లేకుండా సమాజానికి ఉపయోగపడే ప్రసారాల గురించి అవగాహన కలిగించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

అప్పటికి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపం చీకరణ మొదలై ఒక దశాబ్దమైంది. ప్రైవేట్ ఎఫ్‌ఎం రేడియో కేంద్రాలు అప్పటికి ప్రారంభం కాలేదు. కానీ లాభాపేక్షతో నడిచే టీవీ చానళ్లు మన దేశంలో మొదలై పదేళ్లు అయింది. కనుక పబ్లిక్ బ్రాడ్ కాస్ట్ సర్వీస్ అనేది కేవలం రేడియోకే అని భావించ నక్కరలేదు.

1947లో టెలివిజన్ ఉండి ఉంటే ఆకాశవాణితో పాటు దూరదర్శన్ కూడా తప్పనిసరిగా గాంధీజీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి ఉండేది. ప్రస్తు తం పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్ట్ అవసరం గురించీ; కమర్షియల్ టెలివిజన్ ప్రసారాలు కలిగించే అనర్థం గురించీ చర్చ మొదలైంది. స్వలాభం, అవసరం లేని వినియోగం, శ్రమలేని ఫలితం అవసరం లేదనే భావన కలిగిన గాంధీ ఆలోచనలకు ప్రజోపయోగ ప్రసారాల దినోత్సవం చక్కని సందర్భం.

నిజానికి టెలివిజన్‌తో పోలిస్తే రేడియో అత్యం త సరళమైన మాధ్యమం. విద్యుత్ లేకపోయినా లభించే మాధ్యమం; ఇంట్లోనే కాకుండా బయట కూడా హాయిగా అందుబాటులో ఉండే సాధనం రేడియో. ఈ విషయాన్ని స్పష్టంగా గమనించిన వ్యక్తి ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ. మనసులో మాట అని ప్రధాని రేడియోలో ఈ దీపావళి రోజున ప్రసంగించారు. ఈ రేడియో ప్రసంగం క్రమం తప్పకుండా నెలకో, పక్షానికో ఒకసారి ఉంటుందని స్పష్టంగా ప్రకటించారు.

ప్రధాని రేడియో ప్రసంగం కారణంగా ప్రైవేట్ టీవీ చానళ్ల తెరపై రేడియో ప్రస్తావన, రకరకాల రేడియో శ్రోతలు కనబడ్డారు. కళ్లెదుటే ఉన్న, చాలా మంది గుర్తించలేని ప్రత్యామ్నాయం - రేడియోను ప్రధాని గమనించి వాడటం ఒక విలక్షణమైన ధోరణి! సరళమైన రీతిలో ఎక్కువ మంది సగటు వ్యక్తులను చేరే సాధనం రేడియో! అలాగే రేడియో సినిమా పాటలు వినడానికే కాదు, పనికి వచ్చే ప్రసంగాలు వినడానికి కూడా చక్కని సాధనమని తేటతెల్లమైంది? ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ బ్రాడ్ కాస్ట్ గురించి ఇప్పుడు ఆసక్తి, గౌరవం పెరిగాయి.

http://img.sakshi.net/images/cms/2014-11/41415731943_Unknown.jpg (వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త)  డా॥నాగసూరి   వేణుగోపాల్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement