verdict today
-
జాధవ్ కేసుపై ఐసీజే తీర్పు నేడే
న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాధవ్‌కి పాకిస్థాన్ విధించిన మరణ శిక్ష విషయంలో నెదర్లాండ్స్‌లోని హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) తీర్పు వెలువరించనుంది. ఇండియాకు అనుకూలమైన తీర్పు రాగలదని మన ప్రభుత్వం భావిస్తోంది. ఐసీజే ఇచ్చే తీర్పును తాము స్వీకరిస్తామని పాకిస్తాన్ అధికారులు కూడా చెప్పినట్లు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. భారత్‌కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) కోసం కుల్‌భూషణ్ గూఢచర్యానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ పాకిస్థాన్ ఆయనను బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో 2016 మార్చి 3న అరెస్టు చేసింది. గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు నిర్ధారిస్తూ 2017 ఏప్రిల్‌లో మిలటరీ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. ఇరాన్లో వ్యాపారం చేసే భారత నౌకాదళ మాజీ అధికారి అయిన జాధవ్‌ను పాక్ ఉద్దేశపూర్వకంగా అపహరించినట్టు భారత్ ప్రకటించింది. అంతర్జాతీయ ఒప్పందాలను, తీర్మానాలను ఉల్లంఘించిన ఆ దేశంపై ఐసీజేలో పిటిషన్ దాఖలు చేసింది. జాధవ్ మరణ శిక్షను రద్దు చేయాలని, తక్షణమే ఆయనను విడుదల చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో తుది తీర్పు వెలువడే వరకూ శిక్షను నిలుపుదల చేయాల్సిందిగా ఐసీజే పాక్‌ను గతంలో ఆదేశించింది. 2017 డిసెంబరులో జాధవ్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన తల్లిని, భార్యను భయపెట్టే విధంగా పాకిస్థాన్ వ్యవహరించినట్టు అప్పట్లో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విమర్శించింది. వారిద్దరి చేత బలవంతంగా దుస్తులు మార్పింపచేయడం, మాతృభాషలో మాట్లాడేందుకు అనుమతించకపోవడం వంటి చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది. పునర్విచారణ జరుగుతుందా? గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఇండియాకు చెందిన సరబ్జిత్ సింగ్‌కు సైతం గతంలో పాకిస్థాన్ మరణ శిక్ష విధించింది. 22 ఏళ్ల పాటు పాక్ జైలులో మగ్గిపోయిన సింగ్ జైలులో తన తోటి ఖైదీలు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ముంబయి టెకీ అన్సారీని కూడా గతంలో ఆ దేశం లాహోర్ జైలులో నిర్బంధించింది. ఇండియా జోక్యంతో నిరుడు అతణ్ణి విడుదల చేసింది. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో జాధవ్ కేసుపై పునర్విచారణ జరపాల్సిందిగా ఐసీజే ఆదేశించవచ్చుననే మాటలు వినిపిస్తున్నాయి. కాగా అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు విచారణను పక్కదారి పట్టించేందుకు పాకిస్థాన్ మూడుసార్లు ప్రయత్నించినట్టు ప్రముఖ భారతీయ న్యాయవాది హరీశ్ సాల్వే గతంలో తెలిపారు. ఐసీజేను ఓ నాటకశాలగా మార్చిందంటూ భారత్‌పై ఆడిపోసుకుంటున్న పాకిస్థాన్.. జాధవ్‌ను రక్షించేందుకు పెట్టిన కేసును కొట్టేయాలని వాదిస్తోంది. -
కర్నాటకంపై నేడే సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ/బెంగళూరు: గత పక్షం రోజులుగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం సుప్రీంకోర్టులో తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించనుంది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్ రమేశ్‌ను ఆదేశించాలంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు పెట్టుకున్న అర్జీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం వాదనలు వింది. రెబెల్స్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ , సీఎం కుమార స్వామి తరఫున సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధావన్, స్పీకర్ తరఫున ఏఎం సింఘ్వి వాదించారు. మూడు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. కాగా, ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. స్పీకర్‌ది పక్షపాత వైఖరి రెబెల్ ఎమ్మెల్యేల పక్షాన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హతపై యథాతథ స్థితి కొనసాగించాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల అమలును కొనసాగించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల హాజరు నుంచి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను మినహాయించాలని, ప్రభుత్వం మైనారిటీలో ఉన్నందున సంకీర్ణ ప్రభుత్వం విప్ చెల్లదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసేలా ఒత్తిడి తెచ్చేందుకే రాజీనామాలను పక్కనబెట్టారన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికే స్పీకర్ వారి రాజీనామా విషయాన్ని జాప్యం చేస్తున్నారని, అనర్హతను తప్పించుకునేందుకు రాజీనామా చేయడంలో వారి తప్పేమీ లేదని రోహత్గీ తెలిపారు. ‘ఏం చేయాలనుకుంటే అది చేయడం ఎమ్మెల్యే ప్రాథమిక హక్కు. స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదిస్తారా లేదా అనే విషయంతో అతనికి సంబంధం లేదు‘ అని రోహత్గీ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర సీఎం కుమారస్వామి తరఫున సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధావన్ తన వాదనలు వినిపించారు. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని ఓసారి, యథాతథస్థితి కొనసాగించాలంటూ మరోసారి.. ఇలా రెండు మధ్యంతర తీర్పులిచ్చే అధికారం న్యాయస్థానానికి లేదన్నారు. గడువులోగా ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించాలంటూ స్పీకర్‌పై ఒత్తిడి తేలేరన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాల ప్రక్రియ సరిగాలేదని తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని, అందుకే వారి వినతిని పట్టించుకోవద్దని కోరారు. ‘వారంతా ముంబైలోని ఓ హోటల్లో మకాం వేశారు. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో మంత్రి కావాలనుకుంటున్నారు. ఇది స్పీకర్‌కు కోర్టుకు మధ్య వివాదం కాదు. ముఖ్యమంత్రికి.. ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న మరొకరికి మధ్య పోరాటం. అందుకే ఆ ఎమ్మెల్యేల రాజీనామాలు నిజమైనవేనా, స్వచ్చందంగా ఇచ్చినవేనా అనే విషయాన్ని స్పీకర్ ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. స్పీకర్‌ను ఆదేశించలేరు స్పీకర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ ఏఎం సింఘ్వి మాట్లాడుతూ.. గత ఏడాది యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని స్పీకర్ కోరగా అర్థరాత్రి తీర్పు వెలువరించిన కోర్టు స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హతలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని, వారిని శిక్షించేందుకు అధికారాలు కోర్టుకున్నాయన్నారు. రాజీనామాలు చేసిన వారి విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలన్న మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోరారు. ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హతలకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వుల్లో న్యాయస్థానం మార్పులు చేస్తే బుధవారం కల్లా స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారని సింఘ్వి అన్నారు. -
మాల్యాపై తీర్పు నేడే..!
బెంగళూరు: వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాపై కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కేసులో రుణ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) గురువారం తీర్పును వెలువరించనుంది. మాల్యా బ్యాంకులకు చెల్లించాల్సిన రూ 9,000 కోట్లను రాబట్టేందుకు ఎస్బిఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ పై ఇవాళ ఆర్డర్ ను పాస్ చేయనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కేసుకు సంబంధించిన బ్యాంకుల మధ్యంతర పిటిషన్ పై తీర్పును వెలువరించనున్నట్టు డీఆర్ టీ ప్రిసైడింగ్ అధికారి కె శ్రీనివాసన్ బుధవారం ప్రకటించారు. దీంతో దాదాపు మూడేళ్ల న్యాయపోరాటానికి తెరపడనుంది. 17బ్యాంకులకు చెందిన ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం పిటిషన్‌ను డిసెంబర్ 1994 నుంచి డీఆర్ టీ విచారిస్తోంది. ఎస్బీఐతో సహా 17 బ్యాంకుల వద్ద మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీ దాదాపు రూ.9 వేల కోట్ల రుణాలను తీసుకుంది. కాగా వాటిని తిరిగి చెల్లించడం లేదని బ్యాంకుల కన్సార్టియం డీఆర్టీని ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై విచారణ పూర్తయిందని ఇటీవల ప్రకటించిన ట్రిబ్యునల్ తీర్పును మాత్రం పెండింగ్‌లో ఉంచింది. కాగా మాల్యా గత సంవత్సరం మార్చి 2 న దేశం వదిలి బ్రిటన్ కు చెక్కేశాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసున కేసులో ముంబై పీఎంఎల్ ఏ కోర్టుగా ఉద్దేశ పూర్వగ ఎగవేతదారుడుగా తేల్చిన సంగతి తెలిసిందే.