Veterans
-
భారత్, ఖతార్ బంధం సుదృఢం
దోహా: భారత్, ఖతార్ దేశాల బంధం మరింత బలోపేతం అవుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఖతర్ పర్యటనలో ఉన్న మోదీ గురువారం ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్–థానీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయి శిక్షలు పడిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులకు ఖతార్ ప్రభుత్వం విడిచిపెట్టిన నేపథ్యంలో ఖతార్ పాలకునితో మోదీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘ ఎమీర్‌ను కలవడం అద్భుతం. ఇరుదేశాల మధ్య భిన్నరంగాల్లో విస్తృతస్తాయి సహకారానికి ఈ భేటీ బాటలు పరుస్తోంది. పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చే నూతన రంగాల్లో కలిసి పనిచేసేందుకు భారత్, ఖతార్ సిద్ధంగా ఉన్నాయి’’ అని భేటీ తర్వాత మోదీ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. నేవీ అధికారులను విడిచిపెట్టినందుకు థాంక్యూ ‘ఇరు నేతల చర్చలు ఫలవంతమయ్యాయి. ఖతార్‌లోని భారతీయుల సంక్షేమ బాధ్యతలు తీసుకున్న ఖతార్ ఎమీర్‌కు మోదీ ధన్యవాదాలు చెప్పారు. కఠిన శిక్షలు పడిన 8 మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులను వదిలిపెట్టినందుకు ఖతార్ ఎమీర్‌కు మోదీ థాంక్యూ చెప్పి మెచ్చుకున్నారు. భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆయనను మోదీ ఆహా్వనించారు’’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా వెల్లడించారు. -
భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష!
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై భారత నావికాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష విధించారు. గురువారం ఖతార్‌లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ వెల్లడించింది. అయితే.. ఈ తీర్పుపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై అప్పీలుకు వెళ్లనున్నట్టు ప్రకటించింది. ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పు వివరణాత్మక కాపీ కోసం ఎదురు చూస్తున్నామనీ, బాధితుల కుటుంబ సభ్యులు, న్యాయవాద బృందంతో చర్చించి అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుకు అధిక ప్రాముఖ్యతనిస్తామని, అన్ని రకాల సాయాన్ని అందిస్తామని వెల్లడించింది. గూఢచర్యం కేసులో ఈ 8 మందిని గతంలో అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. ఇండియన్ నేవీకి చెందిన 8 మందితో పాటు ఖతార్‌కు చెందిన మరో ఇద్దరిపై కూడా గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయి. దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు కూడా ఉన్నట్లు ఖతార్ అధికారులు వాదన. వీరి బెయిల్ పిటీషన్లను పలుమార్లు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కోర్టు తాజా తీర్పు సంచలనం రేపుతోంది. నిందితులు ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పని చేస్తున్న క్రమంలో ఇటలీనుంచి అధునాతన జలాంతర్గాముల కొనుగోలుకు ఖతార్ రహస్యకార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్‌కు అందించా రనేది వారి ఆరోపణ. ఖతార్ అధికారులతో కలిసి ఈ నిఘాకు పాల్పడినట్టు ఆరోపింది. ఇదే కేసులో ఒక ప్రైవేటు డిఫెన్స్ కంపెనీ సీఈవోను, ఖతార్‌కు చెందిన అంతర్జాతీయ సైనిక కార్యకలాపాల అధిపతిని కూడా అరెస్ట్ చేసింది. వీరందరినీ భారతీయ నౌకాదళానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు ఎనిమిది మందిని 2022 ఆగస్టులో ఖతార్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పటినుంచి అంటే ఏడాదికిపైగా కాలంగా వీరంతా జైల్లోనే ఉన్నారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న వారిలో కెప్టెన్ నవతేజ్‌సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, అమిత్‌నాగల్, పురేందు తివారి, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, సెయిలర్ రాజేశ్ ఉన్నారు. -
గొర్రెపిల్ల....మురిసె గొల్ల
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: గొర్రె బలుస్తే గొల్లకు లాభం.. అనే నానుడి వాస్తవ రూపం దాల్చుతోందని అంటున్నారు.. పశుసంవర్ధక శాఖ అధికారులు. జిల్లాలో గతేడాది గొల్ల, కుర్మల లబ్ధిదారులకు సబ్సిడీపై పంపిణీ చేసిన గొర్రెలకు సుమారు 93 వేల గొర్రె పిల్లలు జన్మించాయని పశు సంవర్థక శాఖ గుర్తించింది. తద్వారా సుమారు రూ.30 కోట్ల మేరకు లబ్ధిదారులకు ఆదాయం లభించినట్లు అంచనా వేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో గొర్రెల పంపిణీ పథకం కింద జిల్లాలో 9,631 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 8,522 యూనిట్లు పంపిణీ చేయగలిగారు. ఒక్కో యూనిట్ వ్యయం రూ.1.25 లక్షలు ఉండగా.. లబ్ధిదారులకు 20 గొర్రెలు, ఒక పొట్టేలును పంపిణీ చేశారు. ఇందుకోసం మొదటి విడతలో రూ.94.59 కోట్లు ఖర్చు చేశారు. మూడు నెలల వయస్సు దాటిన గొర్రె పిల్ల సుమారు రూ.మూడు వేల వరకు విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రకు మన బృందాలు.. మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెలను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో కొనుగోలు చేశారు. ఈసారి మాత్రం మహారాష్ట్రలోని హింగోళి, జాల్నాలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఐదుగురు పశువైద్యులు, కొందరు లబ్ధిదారుల ప్రతినిధుల బృందం ఇటీవల హింగోళి, జాల్నాకు వెళ్లారు. ఈ ఆర్థిక సంవత్సరం 2018–19లో 9,475 గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 472 యూనిట్లు గొర్రెలు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్‌తో జాప్యం.. ఎన్నికల కోడ్ కారణంగా రెండో విడత గొర్రెల పంపిణీలో కొంత జాప్యం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత మూడు నెలలుగా కోడ్ అమలులో ఉంది. దీంతో లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయడం వీలు కాలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పశుసంవర్థక శాఖ ఈ గొర్రెల పంపిణీ పథకంపై దృష్టి సారించింది. గొర్రెల కొనుగోలుకు ప్రక్రియను వేగవంతం చేసింది. చనిపోయిన గొర్రెల స్థానంలో.. గతేడాది లబ్ధిదారులకు పంపిణీ చేసిన గొర్రెల్లో సుమారు 5,230 గొర్రెలు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డాయి. గొర్రెల బీమా పథకం కింద చనిపోయిన గొర్రెల స్థానంలో పంపిణీ చేయాల్సిన గొర్రెలను కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. మరణించిన 5,230 గొర్రెలకు సంబంధించి బీమా కంపెనీ నుంచి పరిహారం నిధులు విడుదలయ్యాయి. జిల్లా కలెక్టర్ ఖాతాలో ఈ నిధులు జమ చేశారు. ఈ బీమా పరిహారం నిధులతో చనిపోయిన గొర్రెల స్థానంలో కొనుగోలు చేస్తామని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేశాం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో గొర్రెల కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో లేకపోవడంతో ఈ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేశాము. ఇప్పటి వరకు 557 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశాం. వీటితో పాటు, గొర్రెల బీమా ప్రీమియం, రవాణా ఖర్చులు, దాణా వంటివి లబ్ధిదారులకు ఈ పథకం కింద అందజేచేస్తున్నాము. డాక్టర్ బాలిక్ అహ్మద్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి -
ఈ వయసులోనే మోకాలి కీలు మార్పిడి అక్కర లేదు
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 45. నాకు కుడి మోకాలి లోపలి భాగంలో గత రెండేళ్లుగా నొప్పి వస్తోంది. అది క్రమంగా పెరుగుతూ పోయి, ఐదు నిమిషాల తర్వాత తీవ్రమవుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మోకాలిచిప్ప పూర్తిగా అరిగిపోయిందనీ, మోకాలి కీలు మార్పిడి చేసి కొత్త మోకాలి కీలును అమర్చాలన్నారు. నాకు శస్త్రచికిత్స అంటే భయం. ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? - ఎలిజబెత్, గుంటూరు వృద్ధుల్లో... ఆర్థరైటిస్ వల్ల మోకాలి చిప్ప పూర్తిగా అరిగిపోతే, వాళ్లకు మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ) అవసరమవుతుంది. అంతేగానీ మీ వయసు వారికి నీ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స అంత మంచి ప్రత్నామ్నాయం కాదు. ఇంకా చెప్పాలంటే మీరు ఈ శస్త్రచికిత్స చేయించుకునేంతగా వయసు పైబడ్డ వారు కాదు. మీ ఒరిజినల్ మోకాలి చిప్పను మార్చకుండానే కొన్ని మామూలు చికిత్స ప్రక్రియల తర్వాత కూడా మీలో నొప్పికి ఉపశమనం కలిగించలేనప్పుడు మాత్రమే చివరి ప్రయత్నంగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయాలి. టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలకు ప్రత్యామ్నాయంగా ఆస్టెటోమైస్ వంటి శస్త్రచికిత్సలు ఉన్నాయి. వీటివల్ల మీకు మరో పది, పదిహేనేళ్లు మంచి ఉపశమనం ఉంటుంది. మీలాంటి వారికోసం మరికొన్ని పాక్షిక మార్పిడి శస్త్రచికిత్సలూ ఉన్నాయి. మోకాలి పూర్తి మార్పిడి చేయాల్సిన వారిలో ఈ ప్రక్రియల ద్వారా 20 శాతం మందిలో ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ముందుగా అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణులను సంప్రదించండి. నా కుడి ముంజేయి రెండేళ్ల క్రితం విరిగింది. శస్త్రచికిత్స చేసి మెటల్ ప్లేట్లు వేసి, స్క్రూలు బిగించి సరిచేశారు. ఇప్పుడు మళ్లీ ఇంకో సర్జరీ చేసి లోపల బిగించి ఉన్నవాటిని తొలగించాలని విన్నాను. ఇలా మరో శస్త్రచికిత్స చేయడం తప్పదా? - వెంకటేశ్, వరంగల్ మీలాంటి ఫ్రాక్చర్ కేసులలో లోపల అమర్చి ఉన్న లోహపు ప్లేట్లు, స్క్రూలను అలాగే వదిలేస్తే దీర్ఘకాలంలో అవి మరికొన్ని ఇతరత్రా సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి వాటిని తొలగించడమే మేలు. వృద్ధులలో మాత్రమే శస్త్రచికిత్స వల్ల ఇతరత్రా సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉందేమో అనుకున్నప్పుడు వాటిని అలాగే వదిలేస్తాం. ఇక యువకులలో సైతం చేతులలోని పైభాగపు ఎముకల విషయంలో తీవ్రంగా నొప్పి కలిగిస్తుంటే తప్ప... కొన్నిసార్లు అలాగే వదిలేయాల్సి వస్తుంటుంది. మీరు ముంజేయి అంటున్నారు కాబట్టి లోపల అమర్చిన ఇంప్లాంట్‌ను తొలగించడమే మంచిది. లేకపోతే వాస్తవ ఎముక మరింత బలహీనమై పోయి, తేలిగ్గా విరిగేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ప్లేటును తొలగిస్తారనే శస్త్రచికిత్స విషయంలో ఆందోళన చెందకండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్