ఆస్పత్రుల చరిత్ర చెప్పే ‘హెల్దీ’ యాప్
పంజగుట్ట: హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, క్లినిక్‌లు, బ్లడ్ బ్యాంక్‌ల సమాచారం తెలుసుకునేందుకు విధూ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ‘హెల్దీ’ (Healtheey) పేరుతో కొత్త మొబైల్ యాప్ తయారు చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యాప్ రూపకర్తలు గణేష్, సంపత్, సుదర్శన్ దీన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. బయటి నుంచి నగరానికి వచ్చి ఆస్పత్రుల వివరాలు తెలియక సతమతమయ్యే వారికి ఈ యాప్ ఉపయోగ పడుతుందన్నారు.
నగరంలో ఎక్కడి నుండైనా ఆస్పత్రుల సమాచారం కోసం ఈ యాప్‌ను ఉపయోగించుకుంటే.. సదరు వ్యక్తి నిలబడిన చోటు నుంచి 5 కిలోమీటర్ల లోపు ఉన్న ఆస్పత్రుల వివరాలు, సదరు ఆస్పత్రి ఏ వ్యాధికి విజయవంతంగా చికిత్స అందిస్తుంది.. అక్కడి వైద్య పరికరాలు, వైద్యుల వివరాలు, సౌక ర్యాలు, ఆస్పత్రి చరిత్ర వస్తాయని తెలిపారు. ఇప్పటివరకూ యాప్‌లో నగరంలోని 50 ఆస్పత్రుల వివరాలు పొందుపరిచామని, త్వరలో మరికొన్ని ఆస్పత్రుల వివరాలు ఉంచనున్నట్లు తెలిపారు.