View Points
-
శ్వేత మయూరం మన కశ్మీరం
పచ్చటి పర్వత శ్రేణులను ముద్దాడుతున్న మేఘమాలలు..దట్టంగా కమ్ముకున్న పొగమంచు.. శ్వేత వర్ణంలో మెరిసిసోయే మంచు దుప్పట్లు.. మలుపు తిరిగే కొండ అంచుల్లో కనువిందుచేసే అటవీ అందాలు.. ఓవైపు చల్లని గాలులు మరోవైపు ఆకుపచ్చని హరిత అందాలు.. అడవులపై పరిచినట్టుగా పవళించే మేఘాలు.. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేయాలంటే కశ్మీర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. లంబసింగిని సందర్శిస్తే సరిపోతుంది. ఇక్కడ ప్రకృతి అందాలను చూస్తేవావ్ అనాల్సిందే. చింతపల్లి: మండలంలోని లంబసింగికి తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రత్యేకత ఉంది. చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఇదే కావడం అందుకు కారణం. చలికాలం బాగా ఉధృతంగా ఉండే తరుణంలో ఇక్కడ సగటు ఉష్ణోగ్రత మూడు డిగ్రీలకు మించదు. అత్యల్ప ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్‌గా ఇక్కడ వివిధ సందర్భాల్లో నమోదైంది. 3,600 అడుగుల ఎత్తులో.. సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తున ఉన్న లంబసింగి ఒకప్పుడు ఎలాంటి ప్రత్యేకతలూ లేని చిన్న గిరిజన పల్లె. అటవీశాఖ చెక్‌పోస్టు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆశ్రమ గురుకుల పాఠశాల మాత్రమే ఉండేవి. విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు నుంచి బస్సులు మాత్రం ఈ ప్రాంతం మీదుగా తరచూ తిరిగేవి. ⇒ శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న చెక్‌పోస్టు సెంటర్లో చాలాకాలం క్రితం ఓ చెట్టుకింద ఒక వ్యక్తి చలికి కొయ్యబారి చనిపోయాడని చెబుతుంటారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని కొర్రబయలు అని కూడా పిలిచేవారు. ⇒ మైదాన ప్రాంతంలో సాధారణంగా ఏడాదికి నాలుగు నెలలు మాత్రం చలి ఉంటుంది. కానీ లంబసింగి ప్రాంతంలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలి వణికిస్తుంది. సెపె్టంబర్ మొదటి వారం నుంచి చలి ప్రభావం కనిపిస్తుంది. డిసెంబర్లో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదైన సందర్బాలు ఉన్నాయి. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే చింతపల్లిలో ఉష్ణోగ్రత ఇక్కడకన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. నిత్యం భోగి మంటలే.. ప్రతీ ఇంట్లో అందరికీ పెద్ద రగ్గులు ఉంటాయి. స్వెటర్లు, కంబళ్లు తప్పనిసరి. మంట కోసం కట్టెలు సిద్ధంగా ఉంచుకుంటారు. సాయంత్రమయ్యేసరికి ప్రతి ఇంట్లో అన్నం వండుకోవడానికన్నా ముందు కుంపట్లు సిద్ధం చేసుకుంటారు.తాజంగిలో బోటు షికార్, జిప్‌లైన్ తాజంగి జలాశయంలో ఐటీడీఏ ఏర్పాటుచేసిన బోట్ షికార్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. లంబసింగి వచ్చే పర్యాటకులందరూ 20 నిమిషాలు బోటులో షికారు చేసి ఎంతో సంతోషం పొందుతుంటారు. జలాశయం మీదుగా ఏర్పాటుచేసిన జిప్వే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 250 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ జిప్ లైన్ ద్వారా కొండపై నుంచి చెరువు వరకు జారుతూ ప్రకృతి అందాలను తిలకిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తుంటారు. మరో వ్యూపాయింట్ నర్సీపట్నం నుంచి లంబసింగి వచ్చే మార్గంలో బోడకొండమ్మ ఆలయం వద్ద మరో వ్యూపాయింట్ అందుబాటులోకి వచ్చింది. గత అరకు ఎంపీ మాధవి నిధులు వెచ్చించి దీనిని నిర్మించారు. ⇒ నర్సీపట్నం నుంచి ప్రయాణం ప్రారంభించాక చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో మలుపులతో కూడిన రోడ్లు, పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో కాఫీ, మిరియం తోటలు ఆకట్టుకుంటాయి. ⇒ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచే కాకుండా ఏకంగా బెంగళూరు నుంచి కూడా వాహనాల్లో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. దీనిని బట్టి ఈ ప్రదేశానికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం, నర్సీపట్నం నుంచి ఈ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.పర్యాటక సీజన్లో కళకళ పర్యాటక సీజన్ వచ్చిందంటే చాలు లంబసింగి పర్యాటకులతో కళకళలాడుతుంది. ఇక్కడ పూర్తిస్థాయిలో వసతులు లేనందున సమీప నర్సీపట్నంలో బస చేసి తెల్లవారుజామున ఇక్కడి పర్యాటకులు వచ్చేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రిసార్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ కాటేజీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.కొండల్లో ‘పాల సముద్రం’ చెరువులవేనం కొండల్లో ప్రకృతి అందాలు పాలసముద్రాన్ని తలపిస్తాయి. ఈ ప్రాంతం లంబసింగికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో పొగమంచు దట్టంగా కమ్మి ఉంటుంది. మేఘాలు మనతో మాట్లాడుతున్నాయా అనిపిస్తుంది. ఈ అపురూప అందాలను తిలకించేందుకు ఎక్కడెక్కడినుంచో ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండేలా పాడేరు ఐటీడీఏ వ్యూపాయింట్‌ను నిర్మించింది. ⇒ శీతల వాతావరణం ప్రారంభమైన నాటి నుంచి వచ్చే పర్యాటకులతో తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి లంబసింగి సెంటర్ జాతరను తలపిస్తుంది. వీకెండ్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. శని, ఆదివారాల్లో అయితే చెరువులవేనం జనసంద్రంగా మారుతుంది. కొంతమంది శనివారం రాత్రి లంబసింగి వచ్చి గుడారాలు వేసుకొని రాత్రంతా జాగారం చేస్తూ దట్టంగా కురుస్తున్న పొగమంచును ఆస్వాదిస్తూ గడుపుతారు. వేకువజామున చెరువులవేనం వెళ్లి ప్రకృతి అందాలను తిలకిస్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు వెచ్చించి అభివృద్ధి చేసింది. తాజంగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణం చేపట్టింది. చెరువులవేనం, బోడకొండ గుడి వద్ద వ్యూపాయింట్లు నిర్మించింది.కృష్ణాపురం వద్ద ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేసింది. తాజంగి జలాశయాన్ని అభివృద్ధి చేసింది. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యేకనీస వసతులు అవసరం పర్యాటక ప్రాంతంగా పాచు ర్యం పొందడంతో ఈ ప్రాంత అందాలను చూడడానికి ఎంతోమంది కుటుంబాలతో వ స్తున్నారు.ఈ ప్రాంతంలో కనీస వసతులు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటుకు అ««ధికారులు చర్యలు చేపట్టాలి.వాహనాల నిలుపుదలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. – ప్రశాంత్, పర్యాటకుడు విజయనగరం -
విశాఖపట్నంలో కూటమి నేతల హంగామా
విశాఖ సిటీ/ ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ నగరంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. రుషికొండ పర్యాటక భవనాలపై టీడీపీ జెండా ఎగుర వేశారు. బీచ్‌రోడ్డులో అభివృద్ధి చేసిన వైఎస్సార్ వ్యూపాయింట్ వద్ద ఉన్న వైఎస్సార్ నేమ్ బోర్డును కాళ్లతో తన్నుతూ తొలగించారు. వీఐపీ రోడ్డు జంక్షన్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ఏర్పాటు చేసిన స్టాపర్లను తొలగించారు. ట్రాఫిక్ పోలీసులు వారిస్తున్నా.. జేసీబీతో కొన్ని స్టాపర్లను తీసేశారు. బుధవారం టీడీపీ విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీతో పాటు మరికొందరు నాయకులు, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్టాపర్లను తొలగించారు. సాయంత్రానికి పోలీసులు మళ్లీ వాటిని ఏర్పాటు చేశారు.విశాలాక్షినగర్ సమీపంలో బీచ్‌రోడ్డులో సీతకొండ వద్ద వైఎస్సార్ సీ వ్యూ పాయింట్ బోర్డును కొందరు ధ్వంసం చేశారు. ఇక్కడ వై.ఎస్.ఆర్. అనే అక్షరాలపై మంగళవారం రాత్రి అబ్దుల్ కలాం పేరుతో ఉన్న సిక్కర్‌ను అంటించారు. బుధవారం ముగ్గురు వ్యక్తులు అబ్దుల్ కలాం స్టిక్కర్‌ను తొలగించారు. బోర్డుపై ఉన్న వై.ఎస్.ఆర్. అక్షరాలను రాడ్డులతో కొట్టి తీసేశారు.మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి ఇంటిపై టీడీపీ దాడిసుబ్బారెడ్డి సోదరుడికి తీవ్ర గాయాలు ∙ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంప్రసాద్ రెడ్డి సమక్షంలోనే దాడిరాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండలం మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి ఇంటిపై టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రశాంతంగా ఉన్న ఎండపల్లి గ్రామంలో అలజడి మొదలైంది. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సిద్దార్థ గౌడ్, అతని అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లు సుబ్బారెడ్డి కుటుంబీకులు చెబుతున్నారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన రాంప్రసాద్ రెడ్డి సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఆ సమయంలో అనారోగ్యం కారణంగా సుబ్బారెడ్డి ఇంటిలో లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఎండపల్లి గ్రామం బోయపల్లెలో సుబ్బారెడ్డి ఇంటిపైకి సిద్ధార్ధ గౌడ్, అతని అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. రాళ్లు రువ్వుతూ దాడికి తెగబడ్డారు. ఇంటి బయట ఉన్న సుబ్బారెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. దాడిని అడ్డుకోబోయిన సుబ్బారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి పైనా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. వెంకటరామిరెడ్డి ఇంట్లోకి చొరబడి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న రాయచోటి డీఎస్పీ రామచంద్రరావు, అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి హుటాహుటిన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడుతున్న వారిని చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి చెప్పారు. -
విశాఖలోని సీత కొండ వ్యూ పాయింట్ కు వైఎస్సార్ పేరు
-
అగుడు కదిపితే చాలు అద్భుత లోకాల్లో ఉన్న అనుభూతి..
ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు కొత్త టూరిస్టు స్పాట్లు వెలుగు చూస్తున్నాయి. అగుడు కదిపితే చాలు అద్భుత లోకాల్లో ఉన్న అనుభూతిని పంచుతున్నాయి. పాల సంద్రాన్ని తలిపించే మంచు మేఘాలతో పాటు ఇప్పుడు హొయలొలికే కొత్త జలపాతాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. అంతెత్తునుంచి ఎగసిపడే జలసవ్వడులు సుమధుర సంగీత ఝరిలో జలకాలాడిస్తున్నాయి. వాటిని సందర్శించేందుకు పర్యాటకులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు భారీగా తరలిస్తున్న సందర్శకులు అయిష్టంగానే తిరిగి ఇళ్లకు వెళుతున్నారు. గూడెంకొత్తవీధి/అరకులోయ రూరల్: జిల్లాలో కొత్తగా వెలుగులోకి వస్తున్న టూరిస్టు స్పాట్లు సైతం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఒకదానిని మించి ఒకటి అన్నట్టు ఉన్న కొత్త ప్రాంతాలను టూరిస్టులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. అనంతగిరి, లంబసింగి, తాజంగి, చెరువులవెనం, పాడేరులోని వంజంగి మేఘాల కొండలే కాదు. అంతకు మించిన ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు అరకులోయ, గూడెంకొత్తవీధి తదితర మండలాల్లో చాలా ఉన్నాయి. సప్పర్ల రెయిన్ గేజ్ గూడెంకొత్తవీధి మండల కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సప్పర్ల రెయిన్‌గేజ్ ప్రాంతం సముద్రమట్టానికి సుమారు 4000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ 24 గంటలూ అత్యంత శీతల వాతావరణంతోపాటు మంచు మేఘాలు చాలా కిందనుంచి సందర్శకులను తాకుతూ వెళుతుంటాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన దారకొండ దారాలమ్మ ఆలయంతోపాటు సీలేరు వెళ్లే పర్యాటకులంతా తప్పనిసరిగా ఇక్కడ రెయిన్‌గేజ్ వద్దకు వెళ్లి కాసేపు ఉండి ఇక్కడ అందాలను ఆస్వాదిస్తారు. గతంలో అప్పటి ఉమ్మడి విశాఖ కలెక్టర్ యువరాజ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి పర్యటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత సీజనులో దూరప్రాంతాలనుంచి ఇక్కడకు వస్తున్న పర్యాటకులసంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేస్తామని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. రణజిల్లేడలో.. ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో మరో అద్భుతమైన టూరిజం స్పాట్ చూపరులకు కనువిందు చేస్తోంది. పద్మాపురం పంచాయతీ రణజిల్లేడ జలపాతం ఇప్పటికే ప్రాచుర్యం పొందగా, దాని సమీపంలో అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలు పర్యాటకులను పరవశింప చేస్తున్నాయి. ఇక్కడి మంచు సోయగాలు, సూర్యోదయ అందాలు ఆకర్షిస్తున్నాయి. మాడగడలో వ్యూ పాయింట్ కొద్ది రోజుల నుంచి పర్యాటకులతో సందడిగా మారిన మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ సోమవారం పర్యాటకులతో కిటకిటలడింది. వివిధ ప్రాంతల నుంచి వచ్చిన పర్యాటకులు సందడి చేశారు, తెల్లవారుజామునలో చల్లని వాతవరణంలో మంచు అందాలను వీక్షించి ఫొటోలు తీసుకుంటూ గడిపారు. మూడు కొత్త జలపాతాలు గూడెంకొత్తవీధికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లికి సమీపంలో దోనుగుమ్మల జలపాతం కొత్తగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడికి వెళ్లేందుకు కొద్దిదూరం సీసీ రోడ్డు నిర్మిస్తే చాలు ఈప్రాంతానికి పర్యాటకంగా ఆదరణ లభించే అవకాశం ఉంది. దోనుగుమ్మల జలపాతానికి రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశామని పంచాయతీరాజ్ జేఈ జ్యోతిబాబు తెలిపారు. జలపాతాలకు వెళ్లేందుకు రహదారి నిర్మాణానికి రూ.19లక్షలు మంజూరు చేసినట్టు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. కార్యరూపం దాల్చితే త్వరలోనే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సంపంగిగొంది జలపాతం కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది. అనంతగిరి మండలం చిట్టంపాడు జలపాతం ఇటీవల వెలుగుచూసింది. అక్కడికి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వెళుతున్నారు. -
చూడముచ్చటైన జలపాతాలు.. అబ్బురపరిచే వ్యూపాయింట్లు
కనుచూపు మేర కనిపించే పచ్చని కొండలు.. జలజల జాలువారే జలపాతాలు.. అబ్బుర పరిచే వ్యూ పాయింట్లు... పిల్లలను ఆకర్షించే పార్కులు.. బోటు షికారు.. గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే కళాఖండాలు.. పర్యాటకులను మురిపించి.. ఆహ్లాదపరిచే ప్రదేశాలు.. పార్వతీపురం మన్యం జిల్లా సొంతం. ప్రపంచ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్ 27) సందర్భంగా మన్యం అందాలను ఓ సారి తిలకిద్దాం. సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు... పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆహ్లాదపరుస్తున్నాయి. పచ్చని కొండల మధ్య సాగిపోయే ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది. సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట మండలాల్లో ఉన్న 9 జలపాతాల వద్ద ఏడాది పొడవునా నీటి సవ్వడి కనిపిస్తుంది. సీతంపేట ఏజెన్సీ అందాలను గత రెండేళ్లలో 2,58,580 మంది పర్యాటకులు తిలకించారు. సీతంపేటలో గిరిజన మ్యూజియం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆదిమ మానవుడి నుంచి నేటి వరకు మానవ జీవన చక్రం, గిరిజన ఆచార, సంప్రదాయాలు, పండగలు, ప్రపంచ దేశాల ఆదిమ తెగల బొమ్మలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మెట్టుగూడ, సున్నపుగెడ్డ, ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్లు చూసేవారికి కనువిందు కలిగిస్తాయి. కొత్తలోకాన్ని చూపిస్తాయి. మెట్టుగూడ జలపాతాన్ని ఇటీవల కాలంలో సుందరంగా తీర్చిదిద్దారు. పర్యాటకుల కోసం పగోడాలు, ఉండడానికి వీలుగా ఒక భవనం, ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. సున్నపుగెడ్డ, మల్లి, కొండాడ వంటి జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జగతపల్లి వ్యూపాయింట్ వద్ద రీసార్ట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆడలి వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. దీనిలో భాగంగా జలవిహార్‌లో బోటు షికారు, ఆల్టర్న్ వెహికల్ వంటివి ఏర్పాటు చేశారు. వచ్చిన పర్యాటకులు వివిధ సాహస క్రీడల్లో పాల్గొనేందుకు జెయింట్‌వీల్, హ్యాంగింగ్ బ్రిడ్జి, జలవిహార్‌లో బోటుషికారు వంటివి ఉన్నాయి. ఇక్కడ నిర్మించిన 5డీ థియేటర్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కార్తీక మాసంలో ఈ ప్రదేశాలన్నీ వనసమారాధకులతో నిండిపోతాయి. పర్యాటక శాఖ ప్రతిపాదనలు ఇలా.. తొటపల్లి రిజర్వాయర్ వద్ద సమగ్ర పర్యాటక అభివృద్ధికి సుంకి ప్రాంతంలో 22.18 ఎకరాల భూమి అవసరంగా గుర్తించారు. ఇక్కడ కార్తీకవనం, ఓపెన్ థియేటర్, ట్రైబుల్ మ్యూజియం, ట్రైబుల్ ఆర్ట్‌గ్యాలరీ అండ్ బజార్, హెలీప్యాడ్ వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఉల్లిభద్ర ప్రాంతంలో 36 ఎకరాల్లో వైఎస్సార్ హార్టీకల్చర్ పెట్టాలన్న ప్రతిపాదన ఉంది. బోటింగ్ యాక్టివిటీ, రెస్టారెంట్ మినీ కాన్ఫరెన్స్ హాల్, స్పాసెంటర్, చల్లంనాయుడువలస వద్ద 3 ఎకరాల బర్డ్ శాంక్చూరీ వంటివి ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. మూడు రోప్‌వేలు... సీతంపేట మండలం ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్, చంద్రమ్మతల్లి గుడి వద్ద మూడు రోప్‌వేల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జగతపల్లి హిల్ రీసార్ట్ పనులు, గుమ్మలక్ష్మీపురం మండలంలో సవరకోటపాడు వద్ద హార్టికల్చర్ ఫారం పనులు చకచకా సాగుతున్నాయి. (క్లిక్: విశాఖ అందాలను చూసేలా స్కైటవర్.. 100 కోట్లతో స్విట్జర్లాండ్..) పర్యాటకాభివృద్ధికి కృషి జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొదవలేదు. వీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. – నారాయణరావు, జిల్లా పర్యాటకశాఖాధికారి పర్యాటక రంగానికి పెద్దపీట పర్యాటక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మన్యం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న టూరిజం స్పాట్లను అభివృద్ధి చేశాం. మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాను. దీనిపై సీఎం జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
మంచుతెరలు.. సూర్యోదయం అందాలు అదుర్స్.. ఎక్కడంటే!
సాక్షి, అరకు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు – అనంతగిరి ఘాట్‌మార్గంలో గాలికొండ వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలు మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. గురువారం ఉదయం తరలివచ్చిన పర్యాటకుల సెల్ఫోన్ల వీటిని బంధించారు. మలుపుల వద్ద మంచు అందాలను తిలకించి పులకించిపోయారు. వంజంగి హిల్స్‌లో మంచుతెరలు పాడేరు : మేఘాలు, మంచు అందాల నిలయంగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్‌లో గురువారం ప్రకృతి కనువిందు చేసింది. అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బుధవారం రాత్రే వంజంగి హిల్స్‌కు చేరుకుని కల్లాలబయలు, బోనంగమ్మ పర్వతంపై గుడారాలు వేసుకుని బస చేసారు. తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో సూర్యోదయం అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి. కొండల నిండా మంచు నెలకొనడంతో ఇక్కడ ప్రకృతి రమ్యతను చూసి పర్యాటకులంతా మంత్రముగ్ధులయ్యారు. ఉదయం పది గంటల వరకు మంచుతెరలు ఆకట్టుకున్నాయి. (క్లిక్: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు) -
గోదావరి జలాల వినియోగానికి లైడార్ సర్వే
కరీంనగర్ ఎన్టీపీసీ కేంద్రం నుంచి ప్రారంభమైన సర్వే - తొలిరోజు హెలికాప్టర్లో 8 కి.మీ. ప్రయాణం - గగనతలంలో వ్యూ పాయింట్ల ఎంపిక - 15 రోజులపాటు సాగనున్న సర్వే గోదావరిఖని/జ్యోతినగర్: గోదావరి మిగులు జలాలు సముద్రంలో కలవకుండా పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకోవాలనే ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చింది. ఇందుకోసం ప్రాథమికంగా రాష్ట్రంలో నది ప్రవహించే ప్రాంతంలో ఎక్కడెక్కడ నీటి లభ్యత ఉందనే విషయాలను కనుగొనే పనిలో పడింది. నీటి లభ్యత, ప్రాజెక్టుల నిర్మాణానికి అనువైన ప్రాంతాల వివరాలతో పాటు వివిధ ప్రాంతాలకు గోదావరి నీటిని తాగు, సాగుకు తరలించేందుకు అనుగుణంగా మార్గాలనూ ప్రభుత్వం అన్వేషించనుంది. ఈ నేపథ్యంలో ‘లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (లైడార్)’ విధానం ద్వారా గురువారం జీఎంఆర్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రత్యేక హెలిక్యాప్టర్‌తో సర్వే నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ కేంద్రం నుంచి ప్రారంభమైన ఈ సర్వే 8 కి.మీ. దూరం వరకు సాగింది. ఇంజనీర్లు గగనతలంలో వ్యూపాయింట్లను ఎంపిక చేసుకుని వచ్చినట్టు సమాచారం. వాటర్, పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెన్సీ (వ్యాప్కోస్) ప్రతినిధులు వేణుగోపాల్‌రావు, మహేష్, జర్మనీకి చెందిన లైడార్ ఇంజనీర్ ఆలీవర్, నీటిపారుదల శాఖకు చెందిన ఇంజనీర్ ఈ సర్వేను చేపడుతున్నారు. ఈ సర్వేకు రూ.14 కోట్ల విలువైన పరికరాలను ఉపయోగిస్తున్నట్లు జీఎంఆర్ గ్రూప్ ప్రాజెక్టు మేనేజర్ పళణి స్వామి, డీజీఎం బాలకోటేశ్వరబాబులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లైడార్ సర్వే చేయడానికి రక్షణ శాఖ నుంచి అనుమతులు పొందిందని, ఆరు నెలలు అవసరమయ్యే ఈ సర్వేను 15 రోజుల్లో పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎస్ఈ ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రక్షణ శాఖకు సర్వే లక్ష్యాలకు సంబంధించిన వివరాలను అందజేసి, మిగతా సమాచారాన్ని భద్రపరుస్తారని చెప్పారు. సర్వేకు రూ.5 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. సర్వే విధానం ఇలా.. గోదావరి నదిపై హెలికాప్టర్ ద్వారా అత్యాధునికమైన క్యూ680ఐ డిజిటల్ కెమెరా ద్వారా లేజర్ కిరణాల ప్రసారంతో దృశ్యాలను చిత్రీకరిస్తారు. హెలికాప్టర్ వెళ్తున్న మార్గం నుంచి నేలపై 5 కి.మీ. మేర వెడల్పు ఉండే ప్రాంతమంతా ఈ కెమెరాలో నిక్షిప్తమవుతుంది. దీనివల్ల నదిలో నీటి లభ్యత ఎంత లోతులో ఉందో తెలుసుకోవడంతో పాటు నేలపై ఉండే అతి చిన్న పరికరం కూడా స్పష్టంగా కనబడుతుంది. నది పొడవు, వెడల్పు, లోతు స్థాయిలను పరిశీలించి అక్కడున్న వాటిని జీపీఎస్ ద్వారా అనుసంధానం చేస్తారు.