Vijay murder case
-
నా చావుకు కారణం డాక్టర్, ఆయన భార్యే!
నరసన్నపేట : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని నిక హడ్కో కాలనీకి చెందిన కాడింగుల వెంకట్ (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. సాయంత్రం 4 గంటల సమయంలో వెంకట్ తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల వరకూ కుటుంబ సభ్యులతో బాగానే మాట్లాడిన వెంకట్.. గంట వ్యవధిలోనే మృతి చెందడంతో భార్య అన్నపూర్ణ, పిల్లలు సోనాలిక, యోగి, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నా చావుకు కారణం డాక్టర్, ఆయన భార్యే.. : వెంకట్ సూసైడ్ నోట్.. తన చావుకు మమత నర్సింగ్ హోం డాక్టర్ పొన్నాన సోమేశ్వరరావే కారణమని మృతుడు వెంకట్ తన సూసైడ్ నోట్లో స్పష్టం చేశాడు. మృతదేహాంపై ఉన్న బనీనుకు పిన్నీసుతో అతికించి ఉన్న సూసైడ్ నోట్‌ను భార్య అన్నపూర్ణ విలేకరులకు చూపించారు. ‘మన ఊరి డాక్టర్ సోమేశ్వరరావుతో వివాదం ఉన్న విజయ్ ఆగస్టు 24న హత్యకు గురయ్యాడు. హత్య కేసులో డాక్టర్‌తోపాటు, ఆయన బంధువు రెడ్డి బుచ్చిబాబు నన్ను ఇరికించారు. నా భార్య, పిల్లలను పెంచుకొనే పరిస్థితి లేకుండా నన్ను చాలా మోసం చేశారు. సోమేశ్వరరావు ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వలేదు. నా వ్యాపారం పోయి చివరికి మానసికంగా కుంగిపోయాను. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. నా భార్య చాలా కుంగిపోయింది. నా చావుకు కారణం పొన్నాన సోమేశ్వరరావు, ఆయన భార్యే..’ అని సూసైడ్ లెట్లో తన ఆవేదన తెలిపాడు. నా భర్త మృతికి డాక్టరే కారణం.. ‘నా భర్తతో డాక్టర్ సోమేశ్వరరావు చేయకూడని పని చేయించారు. మాకు సంఘంలో తీవ్ర అవమనాలకు గురి చేశాడు. çవిజయ్ హత్య సందర్భంగా ఇస్తామన్న డబ్బు కూడా ఇవ్వలేదు. దీంతో ఉన్న పని పోయి నా భర్త వీధినపడ్డాడ’ని వెంకట్ భార్య అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేసింది. డాక్టర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్సై పరిశీలన.. సమాచారం అందుకున్న నరసన్నపేట ఎస్సై ఎన్.లక్ష్మణ సంఘటనా స్థలానికి చేరుకు ని మృతదేహన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు ముందు వెంకట్ స్నానం చేసి దేవుడి గదిలో దీపం పెట్టినట్లు తెలుస్తోంది. మృతుడు హత్య కేసులో నిందితుడు గత ఆగస్టు 24న జరిగిన అదే కాలనీకి చెందిన మల్లా విజయ్ హత్య కేసులో వెంకట్ ఎ–4 నిందితుడు. అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలనం కలిగించింది. విజయ్ను హత్య చేయడంలో వెంకట్ పాత్ర కీలకం. ప్రస్తుతం అంతా ఈ వ్యవహారాన్ని మరిచిపోతున్న తరుణంలో వెంకట్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. స్థానిక మమత నర్సింగ్ హోం డాక్టర్ పి.సోమేశ్వరరావుకు.. హత్యకు గురైన విజయ్‌కు వివాదం ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్ను వెంకట్‌తో పాటు ఇతరుల సహాయంతో సోమేశ్వరరావు హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కూడా ఈ మేరకు కేసు నమోదు చేశారు. విజయ్ హత్యోదంతంపై కోర్టులో చార్జిషీట్ వేసేందుకు చర్యలు తీసుకుంటుండగా.. వెంకట్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. -
విజయ్ హత్య కేసులో మరో ఇద్దరి అరెస్టు
నరసన్నపేట : జిల్లాలో సంచలనం కలిగించిన నరసన్నపేట హడ్కో కాలనీకి చెందిన మల్లా విజయ్(గవాస్కర్) హత్య కేసులో మరో ఇద్దరి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నిందితులను ఎస్సీ బ్రహ్మారెడ్డి విలేకరుల ఎదుట బుధవారం హాజరుపరిచారు. హత్య కేసులో నిందితులైన పొన్నాడ రామచంద్రరావుతో పాటు ఆయనకు ఆశ్రయం ఇచ్చిన వైద్యుడు సోమేశ్వరరావు మిత్రుడు, రణస్థలం ఆయుష్ వైద్యుడు ఎం.సునీల్‌కుమార్‌ను అరెస్టు చేసినట్టు ఎస్పీ చెప్పారు. సంఘటన జరిగిన రెండు రోజుల్లోనే ఏడుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశామని, తాజాగా వైద్యుని సోదరుడు పొన్నాన రామచంద్రరావును పొందూరు సమీపంలో ఎం.సునీల్‌కుమార్ ఇంటి వద్ద అరెస్టు చేసినట్టు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ సిగ్నల్ ఆధారంగా రామచంద్రరావు ఆచూకీని కనుగొనన్నట్టు తెలిపారు. హత్య కేసులో నిందితునిగా ఉన్న రామచంద్రరావుకు తన ఇంట్లో ఆశ్రయమిచ్చిన ఆయుష్ వైద్యుడు ఎం.సునీల్‌కుమార్‌ను కూడా అరెస్టు చేశామన్నారు. నిందితులను రహస్యంగా ఉంచడం కూడా నేరమే అవుతుందని ఎస్పీ చెప్పారు. విజయ్ హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేసినట్టు తెలిపారు. పోలీసు సిబ్బందిని అభినందించారు. ఎస్పీతో పాటు సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు ఎన్.లక్ష్మణ, నర్సింగరావు ఉన్నారు. -
రూ.6 వేలకో తపంచా.. రూ.200కో తూటా ?
లింగాలఘణపురం, న్యూస్‌లైన్ : సెటిల్మెంట్లు.. సుపారీ హత్యలకు జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.. బీహార్‌లాంటి రాష్ట్రాల్లో రూ.6 వేలకో తపంచా.. రూ.200 ఒక తూటా లభిస్తుండడం ప్రైవేట్ గ్యాంగ్‌లకు వరంగా మారింది. నెల్లుట్ల శివారు వడ్డెరకాలనీలో జరిగిన విజయ్ హత్య కోసం నిందితులు ఇదే తరహాలో ఆయుధాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ నెల 23న నెల్లుట్ల శివారు వడ్డెర కాలనీలో శివరాత్రి విజయ్(35) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆరు నెలలుగా విజయ్ను హతమార్చేందుకు ఎదురు చూస్తున్న అతడి ప్రత్యర్థి పందిగోటి మురళి ఈ పని కోసం పలువురిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అడ్వాన్స్‌గా సుమారు రూ.రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడికి జనగామలో దాబా నిర్వహించే ఓ వ్యక్తితో పరిచయమేర్పడింది. అతడు కిశోర్‌తో విజయ్ హత్యకు రూ.6 ల క్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. అందులో అడ్వాన్స్‌గా కిషోర్‌కు రూ.80 వేలు ముట్టజెప్పారు. అనంతరం అతడు తన డైరీ ఫామ్‌లో పనిచేసే బీహార్ కూలీలతో మాట్లాడి అక్కడి నుంచి రూ.6 వేలకు తపంచా, ఒక్కో తూటాను రూ.200కు కొనుగోలు చేసినట్లు సమాచారం. వారు రెండు తపంచాలను అక్కడి నుంచి కొనుగోలు చేసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి వస్తున్న నిందితులు భువనగిరి టోల్‌ప్లాజా సమీపంలోని అడవుల్లో తపంచాల పనితీరును రిహర్సల్స్ చేసినట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. విజయ్ హత్య కేసులో కారు డ్రైవర్ మినహా ప్రధాన నిందితులంతా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో నిందితులందరిని పోలీసులు రిమాండ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బతుకుదెరువు కోసం వచ్చి హత్యోదంతం.. దేశంలో బీహర్ అనగానే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పేరుంది. అక్షరాస్యత అంతగాలేని ఆ రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధిలేక అనేకమంది ఇతర రాష్ట్రాల్లో కూలీలుగా వలసలు వెళుతున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా డైయిరీ ఫాంలో పనిచేసేందుకు వస్తుంటారు. అనేకమంది కూలీలు వరంగల్ జిల్లాలోని పలు ప్రైవేట్ డైరీల్లో పనిచేస్తున్నారు.