Vijay Prakash
-
Vijay prakash kondekar: పట్టువదలని విక్రమార్కుడు
విజయ ప్రకాశ్ కొండేకర్. తెల్లగడ్డం, తెల్లని దోతీ, భుజంపై కండువా, ఒంటిపై అంగి కూడా లేకుండా కనిపిస్తాడు. కానీ పట్టు వదలని విక్రమార్కుడనే పదబంధానికి నిలువెత్తు రూపం. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఈయన స్థానిక సంస్థల నుంచి లోక్‌సభ దాకా ఇప్పటికి ఏకంగా 25 సార్లు పోటీ చేశారు. దశాబ్దాలుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి 1980ల్లో రిటైరయ్యారు. ‘బూటు గుర్తునే గెలిపించండి’ అని రాసున్న ప్లకార్డును ఓ బండిపై పెట్టుకుని కాలినడకన ప్రచారం చేస్తుంటారు. నగర వీధుల్లో అతడిని కొందరు పట్టించుకోకుండా వెళ్తే మరి కొందరు సెలీ్ఫలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో ఉచితంగా ప్రచారం దొరికిందంటూ సంతోషిస్తారాయన. గెలిచే అవకాశం లేదని తెలిసినా ప్రచారం కోసం పూరీ్వకుల భూమి, ఇల్లు అమ్మేశాడు. ఎప్పటికైనా ప్రధాని కావాలన్నది ఆయన కలట. దాన్ని నిజం చేసుకోవడానికి ఎన్ని సార్లైనా పోటీ చేస్తూనే ఉంటానంటారు కొండేకర్. ఆయన కంటే ఘనుడు మరొకరున్నారు. ఆయనే కె.పద్మరాజన్. గిన్నిస్ రికార్డు కోసం 170 కంటే ఎక్కువ ఎన్నికల్లో పోటీ చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీపైనే బరిలో దిగారు! అలాగే యూపీలోని ఆగ్రా జిల్లాకు చెందిన 78 ఏళ్ల హస్నురామ్ అంబేద్కరి ఇప్పటిదాకా ఏకంగా 98సార్లు ఎన్నికల్లో తలపడ్డారు. ఈసారి కూడా ఆగ్రా, ఫతేపుర్సిక్రీ స్థానాల్లో నామినేషన్ వేస్తున్నారు. ఆ రెండింట్లోనూ ఓడి సెంచరీ కొడతారట! ‘నీ భార్యే నీకు ఓటేయదు. ఇతరులెలా వేస్తారు’ అంటూ ఓ బీఎస్పీ నేత అవమానించడంతో విజయం కోసం కాకుండా ఓట్ల కోసం ఆయన ఇలా పోటీ చేస్తూనే ఉన్నారు!! -
ఆకట్టుకుంటున్న 'దైవాన్నే అడగాలా' లిరికల్ సాంగ్..
Diavanne Adagala Lyrical Song Out From Love You Ra Movie: ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో చిన్ను క్రిష్, గీతిక రతన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'లవ్ యు రా'. సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం నుంచి హార్ట్ టచింగ్ సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. 'దైవాన్నే అడగాలా.. మరణించి బతకాలా' అంటూ ప్రముఖ సింగర్ విజయ్ ప్రకాష్ ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. రాజా రత్నం రాసిన లిరిక్స్‌కు తగినట్లుగా ట్యూన్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ పెరవలి. ప్రేమించిన అమ్మాయి కోసం పరితపించే అబ్బాయి మనస్తత్వాన్ని ఈ సాంగ్‌లో బాగా చూపించారు. ఈ సాంగ్ లవ్‌లో ఫెయిల్ అయిన యూత్‌కు బాగా కనెక్ట్ కానుంది. లవ్ యు రా సినిమాకు నిర్మాతగా సముద్రాల మంత్రయ్య బాబు వ్యవహరించగా రవి బైపల్లి సినిమాటోగ్రఫీ అందించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇటీవలే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేసిన యూత్ అబ్బా మేము అనే పాటకు కూడా విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. విలక్షణ ప్రేమ కథా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో శేఖర్ బండి, సాయినాగ్, మధుప్రియ తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు. ఇదీ చదవండి: జిమ్‌లో బుట్టబొమ్మ కసరత్తులు.. 'ప్రేరణ' పొందేలా -
ఈసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం: జేఎన్టీయూలో ఈసెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ్ ప్రకాశ్ శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 91.7 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ఈసెట్ ఫలితాల్లో కూడా బాలికలే పైచేయి సాధించినట్టు ఆయన తెలిపారు. ఈసెట్ అర్హత పొందిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంతో నేరుగా చేరవచ్చని విజయ్ ప్రకాశ్ అన్నారు. జూన్ 12 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, ఆ తర్వాతనే ఈసెట్ ఆడ్మిషన్లు ఉంటాయని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన ర్యాంకు కార్డులను ఈ (మే) నెల 25 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని విజయ్ ప్రకాశ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. -
ఇడుపులపాయలో ఆర్జీకేయూటీ ఆఫీస్
హైదరాబాద్‌లో ఏపీ విద్యార్థులకు ఎంసెట్ సెంటర్ అక్కడే వైఎస్సార్ జిల్లాలో ఉర్దూ వర్సిటీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ్ ప్రకాశ్ వేంపల్లె: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీకేయూటీ) ప్రధాన కార్యాలయాన్ని వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేసే అవకాశముందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ్‌ప్రకాశ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు ముందు పరిపాలన సౌలభ్యం కోసం హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని, త్వరలో ఇక్కడికి తరలించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో శనివారం ఆయన అభియంత్ టెక్ ఫెస్టివల్-15ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మే 8న ఎంసెట్ ఉంటుందని, ఇంజనీరింగ్‌కు 7,630, మెడిసిన్‌కు 5,880 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వచ్చే నెల 6తో గడువు ముగుస్తుందని, అయితే పరీక్షకు ఒక రోజు ముందు రూ.10 వేల ఫైన్ చెల్లించి ఎంసెట్ రాయవచ్చని తెలిపారు. మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు 85 శాతం ఏపీ విద్యార్థులకు, మిగతా 15 శాతం తెలంగాణ విద్యార్థులకు కేటాయించినట్టు చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఏపీ విద్యార్థులకు 15 శాతం సీట్లు ఉంటాయన్నారు. హైదరాబాద్‌లో చదివే ఏపీ విద్యార్థులకు(సుమారు 10 వేల మంది) ఎంసెట్ పరీక్ష కేంద్రాలను 99 శాతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన జాయిం ట్ సెక్రటరీకి లేఖ రాశామన్నారు. అనుమతి రాకపోతే కర్నూలులో ఎంసెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో పీజీ అడ్మిషన్లు 16 నుంచి మొదలవుతాయని, విభజన వల్ల విద్యకు ఆటంకం కలి గిందన్నారు. జూన్‌లో 2 వేల అధ్యాపకుల పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు. రాష్ట్రంలో 11 విద్యా సంస్థలు నెలకొల్పాలన్నారు. వీటిలో తొమ్మిదింటికి నిధులు కేటాయించారన్నారు. వైఎస్సార్ జిల్లాలో టూరిజం పార్కు, ఉర్దూ వర్సిటీ, ఫుడ్ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, ఎఫ్‌వో కె.ఎల్.ఎన్.రెడ్డి, ఎన్ఎస్ఎస్ అధికారి జి.వి.రావు పాల్గొన్నారు. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : మయ్యా మయ్యా మయ్యా మయ్యా మయ్యా అరేబియా ఒయాసిస్సులా ఎదురైందయ్యా అమ్మాయిలో అదేం మాయో మనసే లాక్కుందయ్యా రూపాయే పాపాయై నాకే దిల్ దే దియా మమ్మాయ మాయ మాయమా మాయా మాయా (2) ॥ హే బాల హే బాల... డూ... (3) చరణం : 1 రెయిన్బో రంగేళి రంభల్లే దిగి వస్తే నా రాంబో నువ్వంటూ రంగంలో దింపేస్తే గోలార్ గోల్డ్ ఎదురై క్యాట్వాకింగ్ చూపెడితే డాలర్ డార్లింగై ఒళ్లో వాలితే నిగనిగలాడే ఆ లేడి నన్నొల్లేసిందయ్యా ధగధగలాడే సొగసంతా నా సొమ్మేనందయ్యా ॥॥ చరణం : 2 భూటాన్ బంపర్ లాట్రీ బుగ్గే కొరికేస్తే లక్ష్మీబాంబ్ గుండెల్లో భమ్మని పేలిందంటే కాబోయే రాణి నా కౌగిట్లో పడితే కాని కుర్రగాణ్ని నన్నే లవ్వాడితే బేజా అంతా బేజారై నే బేహోష్ అయిపోయా ఇంకేం చేస్తాం రాజాలా నేన్ తయ్యారైపోయా ॥॥ చిత్రం : పైసా (2014), రచన : సిరివెన్నెల సంగీతం : సాయికార్తిక్, గానం : విజయ్‌ప్రకాష్