ఆకట్టుకుంటున్న 'దైవాన్నే అడగాలా' లిరికల్‌ సాంగ్‌.. | Diavanne Adagala Lyrical Song Out From Love You Ra Movie | Sakshi
Sakshi News home page

Love You Ra Movie: ఆకట్టుకుంటున్న 'దైవాన్నే అడగాలా' లిరికల్‌ సాంగ్‌..

Published Fri, Jan 7 2022 8:35 PM | Last Updated on Fri, Jan 7 2022 8:36 PM

Diavanne Adagala Lyrical Song Out From Love You Ra Movie - Sakshi

Diavanne Adagala Lyrical Song Out From Love You Ra Movie: ప్రసాద్‌ ఏలూరి దర్శకత్వంలో చిన్ను క్రిష్‌, గీతిక రతన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'లవ్‌ యు రా'. సముద్రాల సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం నుంచి హార్ట్‌ టచింగ్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదలైంది. 'దైవాన్నే అడగాలా.. మరణించి బతకాలా' అంటూ ప్రముఖ సింగర్ విజయ్‌ ప్రకాష్‌ ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. రాజా రత్నం రాసిన లిరిక్స్‌కు తగినట్లుగా ట్యూన్‌ చేశారు మ్యూజిక్ డైరెక్టర్‌ ఈశ్వర్‌ పెరవలి. ప్రేమించిన అమ్మాయి కోసం పరితపించే అబ్బాయి మనస్తత్వాన్ని ఈ సాంగ్‌లో బాగా చూపించారు. ఈ సాంగ్‌ లవ్‌లో ఫెయిల్‌ అయిన యూత్‌కు బాగా కనెక్ట్‌ కానుంది. 

లవ్‌ యు రా సినిమాకు నిర్మాతగా సముద్రాల మంత్రయ్య బాబు వ్యవహరించగా రవి బైపల్లి సినిమాటోగ్రఫీ అందించారు. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చివరి దశకు చేరుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇటీవలే మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ రిలీజ్‌ చేసిన యూత్ అబ్బా మేము అనే పాటకు కూడా విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. విలక్షణ ప్రేమ కథా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో శేఖర్‌ బండి, సాయినాగ్, మధుప్రియ తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు. 



ఇదీ చదవండి: జిమ్‌లో బుట్టబొమ్మ కసరత్తులు.. 'ప్రేరణ' పొందేలా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement