Vijayanagar Colony
-
విద్యార్థుల మెస్ ఛార్జీలను వెంటనే పెంచాలి
విజయనగర్ కాలనీ: రాష్ట్రంలోని 8 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్, గురుకుల పాఠశాలలు, కళాశాల హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను పెరిగిన ధరల ప్రకారం పెంచాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల మెస్ చార్జీలు, స్కాలర్షిప్లను పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్, జి.అంజిల ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్ బీసీ సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం నాటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్‌ఛార్జీలు, స్కాల్‌షిప్‌లను నేడు పెరిగిన నూనెలు, పప్పులు, ఇతర నిత్యావసరాల ధరల మేరకు పెంచాలన్నారు. ఉద్యోగుల జీతాలు రెండుసార్లు పెంచారని మంత్రులు, శాసన సభ్యుల జీతాలు మూడురేట్లు, వృద్ధాప్య పెన్షన్లు ఐదురేట్లు పెంచిన ప్రభుత్వం విద్యార్థుల స్కాల్‌షిప్‌లు, మెస్‌ఛార్జీలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్‌ఛార్జీలను నెలకు రూ.1500 నుంచి రూ.3 వేలకు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్‌ఛార్జీలను రూ.950 నుంచి రూ.2 వేలకు పెంచడంతో పాటు గత రెండేళ్లుగా చెల్లించాల్సిన ఫీజు బకాయిలు రూ.3500 కోట్లను వెంటనే చెల్లించాలని కోరారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రం అందించారు. జాతీయ నాయకులు గుజ్జకృష్ణ, పి.సుధాకర్, సి.రాజేందర్, గుజ్జ సత్యం, అనంతయ్య, పి.రాజ్‌కుమార్, నిఖిల్, భాస్కర్ పాల్గొన్నారు. -
విజయ'నరకం' కాలనీ
♦ నెల రోజులుగా బిక్కుబిక్కుమంటు కాలం వెల్లదీస్తున్న కాలనీవాసులు ♦ రాజకీయ చిచ్చుతో పేదల బతుకులు రోడ్డు పాలు ♦ ఎమ్మెల్యే నిర్వాకంతోనే ఇళ్లు కూల్చేశారంటున్న స్థానికులు ⇒ కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న విజయనగర్‌కాలనీ ఇది.. నిరాశ్రయులు.. రోజు కూలీలు, చిరువ్యాపారులు..ఆటో కార్మికులు.. ఇలా ఎందరో అభాగ్యులు.. ‘గూడు’ కట్టుకున్న కష్టాలతో పగలనక..రాత్రనక అష్టకష్టాలు పడి తినీ తినక తలదాచుకునేందుకు ఇంత ఆశ్రయం కల్పించుకున్నారు. అంతలోనే పాలకులు, అధికారుల కళ్లు కుట్టాయి...రాజకీయ కక్షతో పేదల గుండె‘గూడు’ను ఛిదిమేశారు. గంటల వ్యవధిలోనే ఎందరో బతుకులు ఛిద్రమయ్యాయి.. నిలువనీడ కోల్పోయారు...పిల్లాపాపలు, చిన్నా పెద్ద, ముసలి ముతక అంతా దిక్కులేనివారయ్యారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిల్చారు..ఇది జరిగి సరిగ్గా 34 రోజులవుతున్నా.. ఆశ్రయం లేదు. ఆదుకునేవారు లేక ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. – అనంతపురం న్యూసిటీ: అమ్మకు అన్నం పెట్టరు కానీ..పిన్నమ్మకు బంగారు గాజులు! 200 ఇళ్లు నేలమట్టమయ్యాయి. 34 రోజులుగా ఈ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. వీళ్లంతా ప్రతిపక్ష పార్టీ వర్గీయులనుకుంటే పొరపాటు. అధికార టీడీపీలో ఉంటూ.. ఆ పార్టీ నేతలు చెప్పడంతో విజయనగర్ కాలనీలో ఓ గూడు కట్టుకున్న నిరుపేదలు. అనంతపురం ఎమ్మెల్యేకు.. అదే పార్టీలోని స్థానిక కార్పొరేటర్‌కు మధ్య నెలకొన్న విభేదాలతో కష్టజీవుల గూడు చెదిరింది. కన్నీటి గాథ మిగిలింది. శిథిలాల మధ్య న్యాయం కోసం నిరీక్షిస్తున్నా.. కనీసం ఆ పార్టీ నాయకులు ఎవరు కూడా ఓ ముద్ద అన్నం పెట్టని పరిస్థితి. ఇదిగో అక్కడే పడున్న సీఎం చంద్రబాబు ఫొటో సాక్షిగా ఇప్పుడు అక్కడ వర్గపోరు రాజ్యమేలుతోంది. కృతజ్ఞత కూడా చూపలేదు.. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సొంత పార్టీ వారినే మోసగించారు. సంవత్సరాలుగా కష్టపడి రూ. 3 లక్షలతో ఇల్లు కట్టుకున్నా. ఎన్నికల ముందు ఆయన గెలుపునకు ప్రచారం చేసిన కృతజ్ఞత కూడా చూపలేదు. నేను నా భార్య మాబి కులాంతర వివాహం చేసుకున్నాం. ఏడాదిన్నర పాప ఉంది. ప్రస్తుతం నా భార్య 9 నెలల గర్భిణి. రాత్రి ఇదే కవర్షెడ్డులో ఉంటున్నాం. మా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి. పార్టీనే నమ్ముకుని జీవిస్తున్న మాలాంటోల్లకు ఇలా చేస్తే ఎలా. – జగదీష్, విజయనగర్ కాలనీ అనంతరపురం నగర పరిధిలోని 29వ డివిజన్ విజయనగర్ కాలనీ ఎక్స్టెన్షన్లో ఏడాదిన్నరగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ట్రాన్స్‌కో అధికారులు కరెంటు లైన్ లాగి ఇళ్లకు కరెంటు ఇచ్చారు. నగరపాలక సంస్థ అధికారులు ఇంటి పన్ను వేసేందుకు రంగం సిద్ధం చేశారు. కలెక్టరేట్‌కు సమీపంలో ఉండే విజయనగర్ కాలనీలో నిర్మాణాలు జరుగుతున్నా ఏనాడూ రెవెన్యూ అధికారులు అటువైపు తొంగి చూడలేదు. అన్నీ తెలిసే అధికారులు ఏమీ చేయలేదు. తెలుగుదేశం పార్టీలోని గ్రూపు రాజకీయాలతో నిరుపేదలు రూ. లక్షలు వెచ్చించి కట్టుకున్న ఇళ్లను అక్రమ నిర్మాణం చేపట్టారని రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. రోడ్డువైపు చిన్న బండి పెట్టుకుంటేనే నానా హంగామా చేసే అధికారులు.. పేదలు ఇల్లు నిర్మించుకుంటున్నప్పుడు కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయి, తీరా ఇల్లు కట్టుకున్నామనుకున్నాక తొలగించారని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు ఎమ్మెల్యే కారణంగానే ఇళ్లు తొలగించారంటూ ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. అధికార పార్టీ అండదండలతోనే రెవెన్యూ అధికారులు పేదల జీవితాలతో ఆడుకున్నారని బాధితులు చెప్పుకుంటున్నారు. రాజకీయ కక్షతోనే.. టీడీపీలోని గ్రూపు రాజకీయాలు విజయనగర్ కాలనీ ఎక్స్టెన్షన్లో ఇళ్లు కట్టుకున్న పేదలకు శాపంగా మారాయి. రాజకీయచిచ్చులో పేదల బతుకులు చిద్రమయ్యాయి. 34 రోజుల క్రితం విజయనగర్ కాలనీ ఎక్స్టెన్షన్లో రెవెన్యూ అధికారులు సుమారు 200 ఇళ్లును నేటమట్టం చేసిన విషయం విదితమే. ఎండనక, వాననక కష్టపడి కూడబెట్టుకున్న నగదు కొంత, బంగారాన్ని తాకట్టు పెట్టిన సొమ్ము కొంత కలుపుకుని సొంతి ళ్లు కట్టుకున్నారు. అధికారపార్టీ నేతలు వారి సొం తింటి కళను దూరం చేశారు. అధికార పార్టీలోని గ్రూపు రాజకీయాలతో పేద ప్రజలు నెల రోజులుగా ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. అప్పటి నుంచి ఎవరో ఒకరు తమకు దారి చూపుతారని ఆశతో ఎదురు చూస్తున్నారు ఆ అభాగ్యులు. ప్రత్యక్ష నరకం...: ఇల్లు కట్టుకున్నాం.. ఇక తలదాచుకోవచ్చనుకునే సమయంలో అన్నీ కూల్చేశారు. నిలువనీడలేకుండా చేశారు. ఇప్పుడేమో వానాకాలం.. ఎక్కడ తలదాచుకోవాలో తెలియదు.. ఎండకు ఎండుతున్నాం.. వానకు తడుస్తున్నాం.. కరెంటు లేదు.. చిమ్మచీకటిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని బాధితులు వాపోతున్నారు. శివారు ప్రాంతం కావడంతో విషపురుగులు సంచారం ఎక్కువగా ఉంది. చిన్న పిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో కాలం గడుపుతున్నామని కాలనీవాసులు అంటున్నారు. బంగారం తాకట్టుపెట్టి కట్టుకున్నాం నా భర్త రత్నం బేల్దారి పని చేస్తాడు. మాది పేద కుటుంబం. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూ.3లక్షలు పోసి ఇల్లు కట్టుకున్నాం. బంగారం తాకట్టు పెట్టడంతో పాటు మా బంధువులతో అప్పుతెచ్చాం. ఇప్పుడేమో వారు అసలిస్తే చాలు వడ్డీ వద్దని డిమాండ్ చేస్తున్నారు. కట్టుకున్న ఇల్లు పోయింది. రోడ్డున పడ్డాం. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి. రాత్రి వేళలో పురుగూపుట్ర ఎక్కడ కుడుతాయోనని భయంగా కాలం వెల్లదీస్తున్నాం. – అరుణ, విజయనగర్ కాలనీ రాజకీయ కుట్రతోనే ఇళ్లు కూల్చారు రాజకీయ కుట్రతోనే పేదల ఇళ్లు కూల్చారు. నాపై ఉన్న కక్షతోనే ఎమ్మెల్యే ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. మూడేళ్లుగా ఇళ్లు కట్టినప్పుడు అధికారులకు కనపడలేదా?..కరెంటు ఇచ్చి, ఇంటి పన్ను వేస్తామని ఇప్పుడిట్ల చేస్తే ఎలా? – ఉమామహేశ్వర్, 29వ డివిజన్ కార్పొరేటర్ -
వాటర్ సప్లై ఈఈ నివాసంపై ఏసీబీ దాడి
హైదరాబాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. నిజామాబాద్ వాటర్ సప్లయ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సిరాజుద్దీన్ నివాసంపై ఏసీబీ అధికారులు సోమవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. హైదరాబాద్ విజయ్‌నగర్ కాలనీ జానకీపురంలోని సిరాజుద్దీన్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి. సిరాజుద్దీన్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ దాడులు చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భర్త తరచూ మందలిస్తున్నాడని...
హైదరాబాద్: భర్త తరచూ మందలిస్తున్నాడని ఓ గృహిణి మనస్త్తాపం చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని తీవ్ర గాయాలకు గురైంది. ఈ సంఘటన హుమయూన్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఈశ్వరయ్య కథనం ప్రకారం... విజయనగర్‌కాలనీలో ఉండే బాబయ్య, పార్వతి(29)లకు గత 9 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా దంపతుల మధ్య గత కొంతకాలంగా చిన్న చిన్న విషయాలపై ఘర్షణ జరుగుతుంది. తరచూ భర్త గొడవ పడుతూ తిట్టడాన్ని భరించలేక పార్వతి తన పుట్టింటికి వెళ్లింది. దీంతో భర్త బాబయ్య బుధవారం భార్యకు నచ్చజెప్పి తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి తీసుకు వచ్చిన వెంటనే ఇంటి ముందు బాబయ్య తన సమీప బంధువులతో భార్యను తిట్టుకుంటూ అవమానకరంగా మాట్లాడాడు. ఇది విన్న భార్య పార్వతి ఇంట్లోకి వెళ్ళి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. దీంతో అక్కడే ఉన్న భర్త మంటలార్పి చికిత్స నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తీరుమారని ‘ఉస్మానియా’!
=మరోసారి బయటపడిన వైఫల్యం =క్షతగాత్రులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం =ఆందోళనకు దిగిన బాధితుల బంధువులు =వైద్యుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు =మెరుగైన వైద్యం కోసం కేర్‌కు తరలింపు సాక్షి, సిటీబ్యూరో: క్షతగాత్రులకు వైద్యం అందించడంలో ఉస్మానియా వైద్యుల వైఫల్యం మరోసారి బయటపడింది. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు వైద్యం అందించలేక అభాసు పాలైన ఆస్పత్రి వైద్యులు తాజాగా మరోసారి తమ వైఫల్యాన్ని చాటుకున్నారు. క్షతగాత్రులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ బాధితుల బంధువులు ఆందోళనకు దిగడంతో జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయనగర్ కాలనీ కోటమ్మబస్తీలో గోడ కూలిన ఘటనలో తీవ్రంగా గాయడపడిన మావూళ్లు (30), అతని పెద్దకుమారుడు శ్రీహరి (8)లను గురువారం ఉదయం 7 గంటలకు ఉస్మానియా క్యాజువాలిటీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో సీనియర్ వైద్యులెవరూ అందుబాటులో లేరని బాధితుల తరఫు బంధువులు ఆరోపించారు. ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్ ఏదీ? రక్తమోడుతున్న క్షతగాత్రులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయడం లేదని బంధువులు ఆందోళనకు దిగారు. ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. బంధువుల విజ్ఞప్తి మేరకు క్షతగాత్రులను కేర్‌కు ఆస్పత్రికి తరలించారు. అయితే అనుకోని సంఘటనలు, భారీ ఉపద్రవాలు చోటు చేసుకున్నప్పుడు వచ్చే మాస్ క్యాజువాలిటీని ఎదరుర్కొనేందుకు ఉస్మానియా అధికారుల వద్ద ఇప్పటికీ ఓ ప్రత్యేక ప్రణాళికంటూ లేదు. ఫలితంగా దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల బాధితులను మెరుగైన వైద్య సౌకర్యాల కోసం ఉస్మానియా నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఉదంతంపై అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదురైనా అధికారుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. సవాళ్లను అధిగమించేందుకు అన్ని విభాగాలతో కూడిన ప్రత్యేక ఎమర్జెన్సీ మెడికల్ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు ఆ ప్రయత్నమే చేయలేదు. మందులు వైద్య పరికరాల కొరత పేరుతో బాధితులను వదిలించుకోవడం మినహా క్యాజువాలిటీ సేవ లను మెరుగు పరిచే దిశగా చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. నిర్లక్ష్యం లేదు.. క్షతగాత్రులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ బంధువులు చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. ఎమర్జెన్సీకి వచ్చిన వెంటనే బాధితులను అడ్మిట్ చేసుకున్నాం. సంబంధిత విభాగాలకు తరలించి మెరుగైన వైద్యం అందించాం. బాధితులను కార్పొరేట్ ఆస్పత్రికి తరలించాల్సిందిగా బంధువులు చేసిన విజ్ఞప్తి మేరకే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంతే కానీ ఆస్పత్రిలో వైద్యం అందడం లేదనే అంశంపై కాదు. - డాక్టర్ శివరామిరెడ్డి, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రి -
విజయనగర కాలనీలో కుప్పకూలిన గోడ
హైదరాబాద్: మసబ్ ట్యాంక్ విజయనగర కాలనీలో గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పార్వతి, లక్ష్మి, జనార్థన్ గా గుర్తించారు. శ్రీహరి అనే మరో వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. -
గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్సార్ సీపీ నేతలు
హైదరాబాద్: విజయనగర కాలనీలో గోడ కూలిన ఘటనలో బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, శోభానాగిరెడ్డి, రెహ్మాన్ పరామర్శించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. తమ పార్టీ తరఫున బాధితులకు సాయం చేస్తామని వైఎస్సార్ సీపీ నేతలు హామీయిచ్చారు. మసబ్ ట్యాంక్ విజయనగర కాలనీలో గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పార్వతి, లక్ష్మి, జనార్థన్ గా గుర్తించారు. శ్రీహరి అనే మరో వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలాన్ని మేయర్ మాజిద్ హుస్సేన్, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పరిశీలించారు. జీహెచ్ఎంసీ తరపున లక్ష రూపాయల చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం అందించనున్నట్టు మేయర్ ప్రకటించారు. -
మాసబ్‌ట్యాంక్ విజయ్‌నగర్ కాలనీలో కూలిన భవనం
-
రావూరికి ఘన నివాళి
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజకు తెలుగు సాహితీ జగత్తు ఘనంగా నివాళులర్పించింది. ఆఖరి దాకా అక్షర సేద్యం చేసిన ఆ మహనీయుడికి కన్నీటితో తుది వీడ్కోలు పలికింది. భరద్వాజ మృతితో విజయనగర్ కాలనీలోని ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. శనివారం ఉదయం నుంచే పలువురు ప్రముఖులు తరలివచ్చి రావూరి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వీఐపీల రాకతో స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. నిత్యం మనతో పాటు ఉండే వ్యక్తికి ఇంత ఆదరణ ఉందా? సాదాసీదాగా ఉండే పెద్దాయనపై ఇంత అభిమానం ఉందా? అని చర్చించుకోవడం కనిపించింది. నిత్యం హడావుడిగా ఉండే వారంతా తమ పనులన్నీ పక్కనబెట్టి ఉదయం నుంచి అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు. రావూరి ఆకస్మిక మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలుగు వర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్.గోపి, సాహితీవేత్త డా.ద్వా.నా.శాస్త్రి, డా.పోతుకూచి సాంబశివరావు, గానసభ అధ్యక్షుడు కళాదీక్షితులు, సాధన నరసింహచార్య, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బసవపున్నయ్య, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కార్యదర్శి మామిడి సోమయ్య తదితరులు సంతాపం ప్రకటించారు. కాంతమ్మను చేరిన భరద్వాజ విజయనగర కాలనీలోని తన నివాసం నుంచి ఆరోగ్యం సహకరించిన ప్రతిరోజూ నడచి వెళ్లి దివంగత ‘కాంతమ్మ’తో సంభాషించి వచ్చేవారు రావూరి భరద్వాజ. ఆరోజు విశేషాలన్నీ ఆమె సమాధి వద్ద చెప్పుకునేవారు. శనివారం మధ్యాహ్నం ఆయన ప్రభుత్వ లాంఛనాలతో చివరిసారిగా వెళ్లారు. 1986లో నేలతల్లి ఒడికి చేరిన కాంతమ్మ పక్కనే ఆయన భౌతికకాయాన్ని సంప్రదాయ విధానంలో ఖననం చేశారు. ఏ బడా ఆద్మీ రోజ్ ఆతే థే, అప్నే బీబీసే బాత్ కర్తే థే’ (ఈ పెద్దాయన రోజూ వచ్చేవారు. భార్యతో మాట్లాడేవారు) అని శ్మశానవాటికలోని ఒక మహిళ కన్నీరు పెట్టింది. పేదవాడైన తనను వివాహమాడి, తన నగానట్రాను కుటుంబావసరాలకోసం చిరునవ్వుతో ఇచ్చిన కాంతమ్మ అంటే రావూరికి ఆరాధన. ‘శ్రీమతి రావూరి కాంతమ్మ భరద్వాజ ట్రస్ట్’ ద్వారా ఐదు విశ్వవిద్యాలయాలలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందే ఏర్పాటు చేసిన వితరణశీలి భరద్వాజ!