Vijayanagara Empire
-
శ్రీకృష్ణదేవరాయలకు రక్షణగా ‘గట్టు’
గద్వాల: శ్రీకృష్ణదేవరాయులు తన విజయనగర సామ్రాజ్యాన్ని ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలకూ విస్తరించారు. ఆంధ్ర ప్రాంతంలో ఎత్తయిన ప్రదేశంగా ఉన్న గట్టు ప్రాంతంలో ఆయన శత్రువుల నుంచి రక్షణ కోసం కోటగోడ ప్రాకారాలు నిర్మించారు. ఈ క్రమంలోనే అక్కడ రాజ్యవిస్తరణ జరిగి గట్టు సంస్థానం వెలసినట్టు చరిత్రకారులు చెబుతారు. అందుకే శ్రీకృష్ణదేవరాయలను ఆంధ్ర, కన్నడ ప్రజలు గొప్ప చక్రవర్తిగా అభిమానిస్తారు. ఆంధ్రా భోజుడిగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడ్డారు.సోమనాద్రికి అండగా..పూడూరు కేంద్రంగా నలసోమనాద్రి గద్వాలలో తన రాజ్యస్థాపన చేసే క్రమంలో కోట నిర్మాణం చేశారు. అయితే దీనిని సహించని ఉప్పేరు నవాబు నలసోమనాద్రిపై యుద్ధం ప్రకటించారు. ఈ క్రమంలో ఉప్పేరు నవాబు రాయచూరు నవాబు సాయం కోరారు. గట్టు ఆరగిద్ద ప్రాంతంలో హోరాహోరీగా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నలసోమనాద్రి విజయ దుందుభి మోగించారు. తన విజయంలో గట్టు ప్రాంతం ఎంతో కీలక పాత్ర పోషించిందని నలసోమనాద్రి చెప్పినట్టు చరిత్రకారులు చెబుతారు. ఆ యుద్ధం అనంతరం సోమనాద్రి తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకొని పాలించారు. రతనాల గట్టు.. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలం(1509–1529)లో సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి బాగా ఉండేదని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఎనిమిది చావిడ్లు ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో గట్టు సంతబజారులో రతనాలు, బంగారు నాణేలను రాశులుగా పోసి క్రయవిక్రయాలు జరిపే వారని చరిత్ర తెలిసిన పెద్దలు నేటికీ చెబుతుంటారు. గట్టులో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. సారవంతమైన భూమిలో మంచి పంటలు పండించేవారు. శ్రీ కృష్ణదేవరాయలు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ప్రోత్సహించేవారు. అందులో భాగంగానే చెరువులు, కాల్వలు తవ్వించి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడ్డారు. అనేక రకాల పండ్ల తోటలు పెంచేవారు. వ్యవసాయాధార పరిశ్రమలు ప్రతి గ్రామంలోనూ ఉండేవి. బెల్లం, నీలిమందు తయారీ, వస్త్ర తయారీ వంటివి కూడా ప్రోత్సహించారు. గట్టులో పట్టుపరిశ్రమను ప్రోత్సహించారు. అప్పట్లో మగ్గాలపై వ్రస్తాలను తయారు చేసేవారు. ఇలా తయారు చేసిన వ్రస్తాలను రాయలసీమలోని రాయదుర్గానికి తరలించే వారని చెబుతారు. శ్రీకృష్ణదేవరాయల తర్వాతి కాలంలో.. శ్రీకృష్ణదేవరాయల తర్వాతి కాలంలో పాలించిన రాజులు గట్టు ప్రాంతంపై నిర్లక్ష్యం చూపడంతో పూర్తి వెనుకబాటుకు గురైంది. దీంతో ఈ ప్రాంతంలో పేరుమోసిన ఓ దొంగ గట్టును ఆవాసంగా చేసుకున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో దోచుకున్న సొమ్మును గట్టులో భద్రపర్చుకునే వాడని చెబుతారు. ఈ సొమ్ముకు కాపలాగా తన సోదరిని పెట్టగా.. ఆమె ఓ బాటసారిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న దొంగ తన సోదరిని పక్కనే ఉన్న గంగిమాన్దొడ్డిలో ఆమె చివరి జీవనం వరకు బందీగా చేశాడని చెబుతారు. రక్షణ ప్రాంతంగా.. కర్ణాటకకు సరిహద్దు ప్రాంతంగా ఉండే గట్టును శ్రీకృష్ణదేవరాయలు రక్షణ ప్రాంతంగా నిర్మించారు. గ్రామం చుట్టూ కోటబురుజులతో కూడిన ప్రహరీ, లోపల 8 వరకు చావిడిలను నిర్మించారు. వీటిపై అర్ధచంద్రాకార గుర్తులు ఉన్నాయి. చీకటి పడితే కోటగోడలపై కాగడాలు వెలిగించి, సైనికులు కాపలా కాసేవారని చెబుతారు. కరువుకు నిలయం..రాజుల కాలంలో సిరిసంపదలతో తులతూగిన గట్టు ప్రాంతం.. రాజులు పోయి, రాజ్యాలు అంతరించిన తర్వాత అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా పేరుగాంచింది. కరువుకు నిలయంగా మారింది. ఇక్కడి నుంచే పొట్టచేత పట్టుకొని కుటుంబాలకు కుటుంబాలు పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్న దైన్యస్థితి నెలకొంది.40 ఏళ్ల క్రితం..సుమారు 40 ఏళ్ల క్రితం గట్టు నేతాజీ చౌరస్తాలో గుప్తనిధుల తవ్వకాలలో పెద్దఎత్తున అలనాటి విలువైన నిధులు, బంగారు నాణేలు బయటపడ్డాయి. వీటిలో కొంతమేర అన్యాక్రాంతం కాగా.. మిగిలిన వాటిని ప్రభుత్వం స్వాదీనం చేసుకొని హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియంలో భద్రపరిచారు. -
16వ శతాబ్దంలోనే ప్రపంచ పటంలో..
సాక్షి, వెల్దుర్తి: విజయనగర సామ్రాజ్య ఘనత గురించి ప్రస్తావన వస్తే ఆనాటి ఆలయాల నిర్మాణాలు, శత్రుదుర్భేద్య కోటలు, రక్షణ గోడలు, రాయల పరిపాలనతో పాటు అప్పట్లో విశాలమైన వీధుల్లో ముత్యాలు, కెంపులు, నీలాలు, వజ్రాలు రాశులుగా పోసి విక్రయించిన వైనాన్ని చెప్పుకోవాల్సిందే. ఆ వీధుల్లో అమ్మిన వజ్రాలు ఎక్కువగా ఎక్కడి నుంచి తెచ్చారని తెలుసుకోవాలని ఉందా.. అయితే నాటి రవ్వల కోట వజ్ర వైభవాన్ని గుర్తుకు చేసుకోవాల్సిందే. 16వ శతాబ్దంలోనే ప్రపంచ వజ్ర నిక్షేప పటంలో స్థానం సంపాదించుకున్న నేటి రామళ్లకోటకు ఎంతో ఘన చరిత్ర ఉంది. రాజులు, నవాబులు, బ్రిటీషు వారి కాలంలో పాలనా కేంద్రంగా విరాజిల్లిన ఈ గ్రామం ఎన్నో విశేషాలకు నిలయంగా నిలిచింది. పూర్వం కృష్ణా, తుంగభద్ర నదీ పరీవాహక, సంగమ ప్రాంతాల్లోని దక్షిణ భాగం దాదాపు 300కి.మీ.ల వరకు అపార వజ్ర నిక్షేపాలుండేవి. వాటిలో గుంటూరు జిల్లా కొల్లూరుతోపాటు, వివిధ జిల్లాల్లోని పరిటాల, గొల్లపల్లి, మాలవల్లి, బెల్లంకొండ, బనగానపల్లె, రామళ్లకోట, వజ్రకరూర్, జొన్నగిరి ప్రాంతాలు ప్రసిద్ధి. వజ్రాన్వేషణ సందర్భంగా రవ్వలకొండపై కారి్మకుల రాళ్ల గృహాల ఆనవాళ్లు ఈ ప్రాంతాల నుంచే కోహినూర్, గ్రేట్ మొఘల్ వజ్రాలు వెలికి తీశారని చరిత్ర చెబుతోంది. రవ్వల కోటగా ప్రసిద్ధి కెక్కిన కొండల పక్కనే రవ్వల వెలికితీత గనుల్లో వేల మంది కార్మికులు పని చేసిన చారిత్రక ఆధారాలున్నాయి. వారు నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో కుగ్రామంగా ఏర్పడింది. పదుల సంఖ్యలో బ్రాహ్మణులు, రెడ్డి, కరణాలు, తదితర కులవృత్తుల వారు ఉండేవారు. చాళుక్యులు, చోళలు, కాకతీయుల అనంతరం విజయనగర సామ్రాజ్య స్థాపన తర్వాత శ్రీకృష్ణదేవ రాయల ఏలుబడిలో రామళ్లకోటకు చరిత్రలో ప్రత్యేక స్థానం లభించింది. ఈ ప్రాంతాల నుంచి వెలికితీసిన వజ్రాలు నాడు విజయనగర (హంపి, పెనుకొండ తదతర ప్రాంతాల్లో) వీధుల్లో, అంగళ్లో విక్రయించారని ఇప్పటికీ చెబుతుంటారు. ఆనాటి ఆర్డీఎం నేటి కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) తరహాలోనే నాడు ఆర్డీఎం (రామళ్లకోట డైమండ్ మైన్స్)గా ఇక్కడి వజ్రాల గనులు ప్రసిద్ధి చెందాయి. 1776 నవంబర్ 12న ఈస్టిండియా కంపెనీతో కుదిరిన ఒప్పందం ప్రకారం నాటి నిజాం నవాబు, దత్త మండలంగా పిలువబడిన నేటి రాయలసీమ ప్రాంతం ఆంగ్లేయులు స్వా«దీనం చేశారు. నాటి నుంచి 19వ శతాబ్దం మధ్య వరకు రామళ్లకోటలో బ్రిటీషర్ల పాలన సాగింది. మొత్తంగా గుంటూరు జిల్లాలోని ప్రఖ్యాత కొల్లూరు మైన్స్‌తో కలిపి వివిధ మైన్స్‌లలో (వజ్రాల గనులలో) దాదాపు 60 వేల మంది కార్మికులు ఆనాడు పని చేస్తుండగా ఒక్క రామళ్లకోటలో దాదాపు 30 వేల మంది కారి్మకులు పనిచేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వీరి కాలంలోనే దశాబ్దాల పాటు వజ్రాన్వేషణ అధికమై, కొండలను జల్లెడ పట్టి విలువైన సంపద తరలించినట్లు తెలుస్తోంది. ఆనాడు వజ్రాల కొనుగోళ్లకు యురోపియన్ దేశాల నుంచి వ్యాపారులు వచ్చారు. స్వాతం్రత్యానంతరం 1955 వరకు ఇక్కడ వజ్రాన్వేషణ సాగింది. నేడు ఆ గనులు ఒట్టిపోయి నాటి స్మృతుల ఆనవాళ్లు మాత్రం కనిపిస్తున్నాయి. నవాబుల కాలంలో.. తళ్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనానంతరం రామళ్లకోట ప్రాంతం బహుమనీ సుల్తానులు, గోల్కొండ నవాబుల పాలన కిందకు వచ్చింది. కుతుబ్‌షాహీ, అసంజాహీ (గోల్కొండ) నవాబులు, ఇక్కడి అపార వజ్ర నిక్షేపాలు వెలికి తీసి తరలించుకున్నారు. ఖనిజాల ఖిల్లా వజ్ర నిక్షేపాలకు నిలయమైన నాటి రామళ్లకోట అపార ఖనిజ సంపదకు ఆలవాలమై తన ప్రత్యేకత నిలుపుకుంటోంది. సమీప కొండలు, పొలాల గర్భంలో ఇపుప ఖనిజం, సున్నపురాయి, పచ్చసుద్ధ, సిలికా శ్యాండ్ లభిస్తోంది. స్వాతంత్రానికి పూర్వం నుంచి జోషి కంపెనీ ఇక్కడి ఇనుప ఖనిజాన్ని వెలికితీస్తోంది. పలువురు సైతం మైనింగ్ చేస్తున్నారు. బ్రిటీషు పాలనలో అభివృద్ధి.. 1839–58ల మధ్య కాలంలో బ్రిటీషర్లు కర్నూలు జిల్లాను 8 తాలూకా కేంద్రాలు (నందికొట్కూరు, పత్తికొండ, శిరివెళ్ల, నంద్యాల, మార్కాపురం, రామళ్లకోట)గా విభజించి పరిపాలన సాగించారు. 1886లో రామళ్లకోట తాలూకాలో రామళ్లకోట కేంద్రంగా 106 గ్రామాలు (కర్నూలు కలిపి)ఉండేవి. జనాభా 1,42,855 మంది. ఈ కాలంలోనే రామళ్లకోటలో సబ్ రిజి్రస్టార్ కార్యాలయం, ట్రెజరీ, జైలు (కలిపి కచేరి అనేవారు) నిర్మించబడి, పోలీసు వ్యవస్థ ప్రారంభమైంది. ఈ తాలూకా పరిధి కర్నూలు, సుంకేసుల వరకు భూములు, ఆస్తుల రిజి్రస్టేషన్లు రామళ్లకోటలోనే సాగాయి. అప్పట్లో రామళ్లకోట వాసులు పన్నులకు వ్యతరేకంగా బ్రిటీషర్లతో పోరాడగా వారిని పోలీసు వ్యవస్థతోపాటు, పాలెగాళ్లతో బెదిరించి వసూలు చేశారు. చెక్కుచెదరని దారులు.. బ్రిటీష్ పాలనలో రవాణా సౌకర్యం కోసం కొండ ప్రాంతాల్లో గుర్రాలపై, కాలినడక వెళ్లేందుకు నిర్మించిన దారులు నేటికీ చెక్కు చెదరలేదు. పెద్ద బండ రాళ్లతో పాదచారులు, గుర్రాలు అలుపెరగకుండా ప్రయాణించేలా నిర్మిచారు. ఈ దారుల్లో కొన్ని (సిద్ధినగట్టు, కృష్ణాపురం నుంచి రామళ్లకోటకు, రామళ్లకోట నుంచి కల్లూరు మండలం వైపు) నేటికీ వాడుకలో ఉన్నాయి. ఆంగ్లేయులు నిర్మించిన గుర్రపు ఓణీ రాయల పాలనలో.. శ్రీకృష్ణదేవరాయలు ఈ గ్రాంలో తాత్కాలిక విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఐదు కోట బురుజులు, వాటి పక్కనే కోట వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, గ్రామదేవత కాలమ్మల(మిగతా రెండు గుర్తించడానికి వీలులేకుండా ఉన్నవి) ఆలయాలు ఆనాడు నిర్మితమైనవే. అలాగే వనం శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరుడి ఆలయ నిర్మాణం శిల్ప కళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. చైత్రమాసంలో నవమి సందర్భంగా బ్రహ్మోత్సవాలు చేపడతారు. అలాగే ముక్కోటి ఏకాదశిని ఘనంగా నిర్వహిస్తారు. ఈనెల 6వ తేదీన ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయం మండపం మధ్యలో ఆకుపచ్చ వర్ణంలోని బండను (గ్రానైట్ రకానికి చెందినది) గ్రామస్తులు సత్యపీఠంగా భావిస్తారు. దానిపై నిలుచుని ఎవరూ అబద్దాలు చెప్పరని ప్రజల విశ్వాసం. అలాగే రాయల నీటి 101 ఆలయాలు, 101 బావుల్లో కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వనం శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని దిగుడు బావి రెండు వైపులా మెట్లతో నిర్మితమై నాటి కళను సాక్ష్యాత్కరిస్తోంది. అలాగే నాగులబావి (పూర్యం ఈ బావిలో వేకువజామున దేవకన్యలు వచ్చి జలకాలాడేవారని ప్రసిద్ధి), పూలబావి (పూర్వం పూల పంట కోత అనంతరం పూలను బావిలోని నీటితో తడిపిన తర్వాతనే అమ్మకానికి తీసుకెళ్లేవారు), కోట్లబావి, గిలకలబావి, గాడుబావి, పీర్లబావి, దిగుడుబావి, కోనేటిబావి, చేదుడుబావి, పార్వతిగారి బావులు ఇప్పటికీ ఉన్నాయి. ఉట్ల మంటపాలు, రచ్చకట్టలు వైష్ణవ సంప్రదాయంలో స్వామి వారి సేవకు (ఊయల సేవ) ఈ మంటపాలు నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ మంటపాల్లో ఉత్సవాల నాడు స్వామి వారికి సేవలు కొనసాగిస్తున్నారు. అలాగే గ్రామంలో వీధికో మహా వృక్షం, చుట్టూ అరుగు ఉన్నాయి. వీటిలో రావిమాను రచ్చ (వ్యవసాయ, వాణిజ్యాలకు నిలయం), ఎర్రన్న గారి రచ్చ, పోతురాజు కట్ట, తదితర దాదాపు 10కి మించి రచ్చకట్టలు విజయనగరరాజుల కాలంలోనూ, బ్రిటీష్ వారి కాలంలోనూ నిర్మితమైనట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. వనం శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని రెండువైపులా దిగుడు మెట్ల బావి శిథిలావస్థలో చారిత్రక సంపద గ్రామ చరిత్రను తెలిపే పలు సాక్ష్యాలు శిథిలమైపోయాయి. విజయ నగర రాజుల కాలం నాటి పలు ఆలయాలు, బావులు శిథిలమైపోయాయి. ప్రహరీ, కోట బురుజులు కూలిపోయాయి. ప్రస్తుత పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉండే నాటి బ్రిటీషర్లు పాలన సాగించిన రిజి్రస్టార్, ట్రెజరీ, చెరసాల (కచేరి) కూలిపోయింది, విలువైన చెక్క సంపద చెదలు పట్టింది. 1955లో పంచాయతీగా.. రామళ్లకోట గ్రామం వెల్దుర్తి మండలంలోని పెద్ద పంచాయతీల్లో ఒకటి. మండల కేంద్రం నుంచి తూర్పు దిక్కున 11 కి.మీ. దూరంలో ఉంది. ప్రస్తుత జనాభా దాదాపు 5 వేలు. కుటుంబాలు 1000కు మించి ఉన్నాయి. 1227 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. కూలీలు ఎక్కువ. 1955 సంవత్సరాన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అక్షరాస్యత 56 శాతం. గ్రామం నుంచి వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ శాఖలలో ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు ఎంతో మంది ఉన్నారు. రామళ్లకోట ఏరియల్ వ్యూ ప్రపంచ గుర్తింపు తేవాలి ఘన చరిత్ర ఉన్న రామళ్లకోటకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు తెచ్చేందుకు పాలకులు, అధికారులు కృషి చేయాలి. విశిష్టత గుర్తుకు తెచ్చేలా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించాలి. గ్రామ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి. చరిత్రకు సాక్ష్యంగా శిథిలావస్థలోని కోటలో వీరభద్రస్వామి బురుజు, స్వామి వారి ఆలయ జీరో్ణద్ధారణ ప్రభుత్వ సాయంతో చేయాలి. – మంచిరెడ్డి శశి, వీరభద్రస్వామి ఆలయ కమిటీ ప్రతినిధి చింతకాయలకు పన్ను కట్టారు గతంలో చింతచెట్లు వనంలా ఉండేవి. రైతులకు ఎంతో కొంత చెల్లించి, ఆ చెట్ల నుంచి వచ్చిన ఫలసా యాన్ని పొంది మా పూరీ్వకులు జీవనోపాధి పొందేవారు. అయితే బ్రిటీషుల పాలన వచ్చిన తర్వాత నుంచి చింతచెట్ల నుంచి చింతకాయలు తీసుకునేందుకు ఒక్కో చెట్టుకు ఇంత పన్ను అన్నట్లుగా ప్రత్యేకంగా పన్నులు కట్టారు. అందుకు మా దగ్గర ఇప్పటకీ ఆధారాలు ఉన్నాయి. – గునారి వీరయ్య, రామళ్లకోట -
రోజురోజుకు పెరిగే యాగంటి బసవయ్య
చుట్టూ అడవి..ఎర్రటి కొండలు..పచ్చటి పరిసరాలు..రణగొణులు లేని ప్రశాంత క్షేత్రం యాగంటి. బనగానపల్లెకు 13 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్థ్యం ఉంది. నిత్యం ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మికతను పంచే యాగంటి క్షేత్రంపై ప్రత్యేక కథనం. సాక్షి, బనగానపల్లె(కర్నూలు): యాగంటి క్షేత్ర ఉనికి పురాణకాలం నుంచి ఉందని భక్తుల నమ్మకం. అపర శివభక్తుడైన భృగుమహర్షి ఇక్కడ శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేశారని, ఫలితంగా భార్యా సమేతంగా ఇక్కడ శివుడు కొలువైయ్యాడని ఒక కథనం. మరో జానపద కథ కూడా ఉంది. ఇక్కడ పూర్వం చిట్టెప్ప అనే శివభక్తుడు శివుడి కోసం తపస్సు చేశాడట. కొన్ని రోజులకు అతడికి పెద్ద పులి కనిపించిందట. ఆ పెద్దపులినే శివుడని భావించిన చిట్టెప్ప సంతోషంతో ‘‘నేకంటి నేకంటì ’’ అని కేరింతలు కొట్టడంతో అదే కాలక్రమంలో యాగంటి అయ్యిందని అంటారు. ఎర్రమల కొండల్లో ఏకాంతంగా స్వచ్ఛంగా ఉండే ఈ క్షేత్రం నిరాడంబరంగా తన ఆధ్యాత్మిక కిరణాలను వెదజల్లుతూ ఉంటుంది. ఏకశిలపై నందిని ఉమామహేశ్వరులు వెలిసిన క్షేత్రం దేశంలో ఇది ఒక్కటే. కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారు కలియుగాంతానికి ఒక సూచనగా ఈ క్షేత్ర ప్రస్థావన చేశారు. అగస్త్యుని ఆలయం యాగంటి క్షేత్రానికి అగస్త్యుడు వచ్చాడని ఒక కథనం. ఆయన ఇక్కడ విష్ణువు ఆలయాన్ని నెలకొల్పాలని భావించడనీ, అయితే అందుకు సిద్ధం చేసిన శ్రీవిష్ణువు మూలవిరాట్టు చివరి నిమిషంలో భగ్నం కావడం వల్ల ఆ పని నెరవేరలేదని కథనం. యాగంటి క్షేత్రం వైష్ణవాలయానికి తగినట్టుగా గాలి గోపురంతో ఉంటుంది. అయితే దీనిని నిర్మించదలిచినప్పుడు అప్పటి రాజు కలలో కనిపించిన ఈశ్వరుడు ఇది శేవ క్షేత్రానికే సముచితమని చెప్పడంతో శివాలయంగా మారిందని అంటారు. ఈ వివరాలు ఎలా ఉన్నా యాగంటి ప్రధానాలయానికి చుట్టూ ఉన్న గుహలయాల్లో ఒక దానిలో శ్రీ వెంకటేశ్వరుడి గుడి ఉంది. ఆ మూర్తికి కూడా ఎడమకాలి బొటనవేలు భగ్నం అయి ఉండటానికి భక్తులు దర్శించవచ్చు. హరిహరరాయల కాలం నాటి క్షేత్రం ఈ క్షేత్రం ఎప్పుడు ఏర్పడిందనేది ఖచ్చితంగా తెలియకపోయినా హరిహరాయిలు, బుక్కరాయల కాలంలో (14వ శతాబ్దం) ఈ ఆలయం అభివృద్ధి చెందిందని ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించినట్టు దాఖలాలు ఉన్నాయి. ఈ గుడి నిర్మాణంలో, విస్తృతిలో విజయనగర కాలం నాటి ధోరణి కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న కోనేరు స్వచ్ఛమైన నీటితో కనిపిస్తుంది. (అలాంటిదే మహానంది క్షేత్రంలో చూడవచ్చు). అజ్ఞాత కొండధారతో నిండే ఈ కోనేరులో స్నాం చేస్తే సమస్త రుగ్మతలు పోతాయని ఒక నమ్మకం. మరో అజ్ఞాత కొండధారతో వచ్చే నీటిని ‘‘అగస్త్య పుష్కరిణి’’గా చెప్తారు. ఈ పుష్కరిణిలో ఉన్న నీటిని కేవలం స్వామి అభిషేకానికి వాడతారు. శని దోషం లేదు... కాకి ప్రవేశం లేదు ఈ క్షేత్రంలో శనీశ్వరుని వాహనమైన కాకికి ప్రవేశం లేకపోవడం ఒక వింత. ఒకానొక సమయంలో అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తేంటే కాకాసురడనే కాకుల నాయకుడు అనేక కాకుల సమూహంతో వచ్చి తపస్సుకు ఆటంకం కలిగించిన్నట్లు ప్రతీతి. ఆగ్రహించిన ఆగస్త్యముని ఈక్షేత్ర ప్రాంతంలో కాకులు సంచరించరాదని శపించాడు. అప్పటి నుంచి నేటి వరకు ఈ దివ్యక్షేత్రంలో కాకులు మచ్చుకైనా కానరావు. కాగా కాకి శనిదేవుని వాహనం కనుక తన వాహనానికి స్థానం లేని ఈ క్షేత్రంలో తాను ఉండనని శనీశ్వరుడు ప్రతిన బూనాడు. కనుక ఇక్కడ నవగ్రహాలు ఉండవు. ఫలితంగా శని ప్రభావం లేని ప్రభావవంతమైన క్షేత్రంగా విలసిల్లుతోంది. దర్శన వేళలు ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1గంట నుంచి 3గంటల వరకు కూడా భక్తులకు దర్శనం ఉంటుంది. రోజురోజుకు పెరిగే యాగంటి బసవయ్య యాగంటి క్షేత్రం బసవయ్య పేరుతో ఉన్న నందీశ్వరుడి విగ్రహం విశేషమైనది. సాధారణంగా నంది కొమ్ముల నుంచి చూస్తే శివాలయాల్లో శివలింగ దర్శనం అవుతుంది. అయితే ఈ క్షేత్రంలో అయ్యవారు అమ్మవారితో కొలువైన్నారు. కాబట్టి వారికి కాస్త చాటు కల్పించడానికి నందీశ్వరుణ్ణి ఈశాన్యంలో ప్రతిష్టించారని అంటారు. ఈ నంది రోజు రోజుకూ పెరుగుతోందని భావిస్తున్నారు. తొంభై ఏళ్ల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసే వీలు ఉండేదనీ, ఇప్పుడు నంది పెరగడంతో మంటపం స్తంభాలకూ నందికీ మధ్య ఉన్న స్థలం పూర్తిగా తగ్గిపోవడం గమనించవచ్చు. పురావస్తుశాఖ అంచనా ప్రకారం ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతోంది. కలియుగాంతానికి ఇది లేని రంకె వేస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. ఒకే శిలపై ఉమామహేశ్వరులు వసతి ఇక్కడ బస చేసేందుకు ఏపీ టూరిజం, శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదానం, బ్రహ్మణి రెసిడెన్సీ, టూరిజం, రెడ్ల, వాసవి ఆర్యవైశ్య, వేదగాయత్రి బ్రాహ్మణ తదితర వసతి గృహాలు ఉన్నాయి. నిత్యాన్నదాన సౌకర్యం ఉంది. -
వెలుగు చూసిన పురాతన ఆలయం
బి.కొత్తకోట మండలం ఒకప్పుడు వైడుంబ సామంత రాజ్యంలో ఉండేదా..? తర్వాత పల్లవులు, విజయనగర రాజుల పాలనలో సాగిందా..? శీలంవారిపల్లె సమీపంలోని కోనాపురం ప్రాంతంలో సోమవారం వెలుగులోకి వచ్చిన ఆలయ శిథిలాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బి.కొత్తకోట మండలంలో చారిత్రక కట్టడాలకు కొదువలేదు. అందులో శిథిలమైన ఈ ఆలయం తాజాగా వెలుగుచూసింది. పొలం పనులు చేస్తుండగా బయటపడిన ఆలయ శిథిలాలు, అక్కడ కనిపించే శిలలు, స్తంభాలు, శిలాశాసనం, శిల్పకళ, చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో మూడు రాజ్యాల పాలన సాగిందని కన్పిస్తోంది. శిథిలాలను పూర్తిగా తొలగిస్తే మరిన్ని విగ్రహాలు, ఆధారాలు వెలుగుచూసే అవకాశం ఉందని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. సాక్షి, బి.కొత్తకోట(చిత్తూరు) : మండలంలోని శీలంవారిపల్లె సమీపంలోని పొలంలో ఆలయ శిథిలాలు లభ్యమైన ప్రాంతం ఒకప్పుడు కోనాపురం గ్రామంగా విరాజిల్లింది. ఇప్పటికీ ఇక్కడి వారు ఈ ప్రాంతంగా కోనాపురంగానే పిలుచుకుంటున్నారు. ఆలయం, దాని పరిసరాల్లో నివాసాలతో నిండి ఉండేదని తెలుస్తోంది. దీనికి దగ్గర్లోని చిటికివారిపల్లె ఆలయం శిథిలం తర్వాత ఏర్పడినట్టుగా చెబుతున్నారు. నివాసాలకు సంబం ధించిన ఆధారాలు కనిపిస్తున్నాయి. తొమ్మిది నుంచి 13వ శతాబ్దం వరకు చిత్తూరు జిల్లా వైడుంబి సామంతరాజుల పాలనలో ఉండేదని శాసనాల ద్వారా తెలుస్తోంది. వీరు పశ్చిమ చాణుక్యులకు సామంతులుగా కూడా పనిచేశారు. వీరికి రాష్ట్ర కూటులు, బాణులు, నలంబ పల్లవులు సమకాలికులు. వీరు పీలేరు నియోజకవర్గంలోని కలకడ, కర్ణా్ణటకలోని కోలా రును రాజధానులుగా చేసుకుని పాలన సాగించారు. వీరి కాలంలో వేసిన శిలా శాసనం ఒకటి ఆల య శిథిలాలకు సమీపంలోని పొలంలో ఉం డడం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఒక వీరుడు స్వర్గస్తుడై స్వర్గానికి చేరినట్టుగా చెక్కారు. అతనే కుడిచేతిలో కత్తి, ఎడమచేతిలో విల్లు కలిగి ఉన్నాడు. ఇతను సాహసవంతుడు అని తెలిపేలా కింద గుర్రం, దానిపైన రెండు నాగుపాము పడగలు ఉన్నాయి. అతని విల్లుకు ఎదురుగా ముగ్గరు ఉన్నట్టు శిల్పం చెక్కారు. వీటిపైన తెలుగు–కన్నడ భాషలా కనిపించే అక్షరాలు లిఖించి ఉన్నాయి. ఈ శాసనాన్ని వీరగల్ శాసనంగా పేర్కొంటున్నారు. ఇతను శత్రువులను తదముట్టించి వారి చేతిలో చనిపోగా, అతన్ని వీరుడిగా చిత్రీకరిస్తూ వేసిన శిలాశాసనాన్ని బట్టి అది వైడుంబ రాజులు వేయించినట్టుగా నిర్ధారణ అవుతోంది. వైడుంబి పాలనలోనే వీరులు ఎక్కువగా ఉండేవారు కావడంతో వీరి శిలాశాసనం ద్వారా నిర్ధారణ అయ్యింది. వీరి సామంత పాలనకు సాక్ష్యంగా పురాతన సున్నం తో తయారైన శిలకు చెందిన శిరస్సు లభ్యమైం ది. సున్నంతో శిలల తయారీ వీరి కాలం నాటిదే అని పురావస్తు అధికారులు స్పష్టం చేస్తున్నారు. పల్లవ, విజయనగర రాజ్యాల్లో.. ఈ ప్రాంతాన్ని క్రీ.శ 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు పల్లవులు, క్రీ.శ 1336 నుం చి 1646 వరకు విజయనగర రాజులు పాలిం చారని తెలుస్తోంది. ఆలయ శిథిలాల్లోని శిల్పాలు, వాటిపై చెక్కిన శిల్పకళ, వన్యప్రాణులు, దేవతా విగ్రహాలు, నామాలు పరిశీలిస్తే పల్లవులు, విజయనగర రాజుల పాలనలో ఈ ఆల యం విరాజల్లినట్టుగా కనిపిస్తుంది. స్తంభాలపై సింహాల చిత్రాల శైలి పల్లవుల కాలం నుంచి ఉంది. కానీ విజయనగర పాలనలోనూ ఇలాగే కనిపిస్తాయి. స్తంభాలను మోస్తున్న భారవాహకుడు, యక్షుడు ఈ రాతి స్తంభాలకు పునాదులు గా కనిపిస్తారు. మకరం (మొసలి), సింహాల గుర్తులు పల్లవుల రాజ్య శైలి అయినప్పటికీ విజయనగర పాలనలో మకరం గుర్తులు కనిపిస్తాయి. ఇలాంటి గుర్తులే ములకలచెరువు మం డలంలోని సొంపాళ్యంలోని చెన్నకేశవాలయంలో కనిపిస్తాయి. వాటి పోలికలు శిథిలాల్లోని శిల్ప కళలో కనిపిస్తుండగా, ఆలయం విజయనగర పాలనకు ముందే నిర్మాణమైనట్టుగా ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఆధారాలను బట్టి విష్ణు ఆలయమే శీలంవారిపల్లె సమీప పొలాల్లో లభ్యమైన శిథిలాలు, మహలక్ష్మి విగ్రహాన్ని పరిశీలిస్తే ఇది కచ్చితంగా విష్ణు ఆలయమే అన్న అభిప్రాయం ఉంది. పురావస్తుశాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు కూడా అంగీకరిస్తున్నారు. లభించిన పానవట్టం, శిథిలాల్లో కనిపిస్తున్న నిర్మాణ ఆకా రాలు, స్తంభాల ఆధారం, వాటిపై చెక్కిన శం ఖు, చక్రాలతో విష్ణు ఆలయంగా నిర్ధారణ అవుతోంది. పేరు ఏదైనా వైష్ణవ ఆలయం కచ్చితమని స్పష్టంగా తెలుస్తోంది. కాగా శిథిలాల్లో విష్ణువు, గరుడుడు తదితర విగ్రహాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. కాగా ఆలయాన్ని మూడెంచెల పద్ధతిలో నిర్మించినట్టు కనిపిస్తుంది. ఆలయం చుట్టూ కోటలాంటి కట్టడం కనిపిస్తుంది. తర్వాత రెండో అంచెలో మైదానం, మూడో అంచెలో గర్భగుడి నిర్మాణం జరిగినట్టుంది. ఇప్పడు కనిపిస్తున్న శిథిలాలే గర్భగుడిగా నిర్ధారణ అయ్యింది. మహాలక్ష్మి విగ్రహానికి విశిష్ట ప్రత్యేకలు లభ్యమైన మహాలక్ష్మి విగ్రహానికి ఎన్నో విశిష్ట ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం అరుదైనదిని భావిస్తున్నారు. విగ్రహానికి నాలుగు చేతులున్నాయి. పైనున్న రెండు చేతుల్లో తామర పూలు ఉండగా, ఎడమ చేయి వరద హస్తం, కుడిచేయి అభయహస్తం కలిగి ఉన్నా యి. నుదుట మూడు నామాలు, శరీరంపై జం ద్యం ఉన్నాయి. అరచేతులు, కాళ్లకు రేఖలు కనిపిస్తున్నాయి. సుఖ ఆసనంలో ఉన్నట్టు కనిపిస్తున్న విగ్రహం మెడలో గొలుసు, ఇరువైపులా చెవులకు చక్రాలు, తలపై విష్ణువు ధరించే కిరీ టం కనిపిస్తాయి. అన్నింటికంటే ప్రధానంగా శిల్పం చెక్కిన తీరు అద్భుతం. సాధారణంగా శిల్పం ముందుభాగంలోనే విగ్రహం తయారవుతుంది. ఈ విగ్రహానికి ముందు, వెనుక రెండు వైపులా శిల్పాన్ని తయారు చేశారు. ఒకవైపే కాకుండా ముందు, వెనుక వైపు శరీర ఆకృతి ఉండడం విశేషం. పోలీస్‌స్టేషన్‌లో శ్రీమహాలక్ష్మి పాపం దేవుళ్లకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లక తప్పలేదు. శీలంవారిపల్లె సమీపంలోని కోనాపు రం పొలంలో సోమవారం శ్రీమహాలక్ష్మి విగ్రహం బయల్పడ్డ విషయం తెలిసిందే. గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో తహసీల్దార్ సుబ్బన్న, ఎస్ఐ సుమన్ పరిశీలిం చి వివరాలు నమోదు చేశారు. శ్రీమహాలక్ష్మి విగ్రహాన్ని ఎస్ఐకి తహసీల్దార్ అప్పగించారు. ఎస్ఐ సోమవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. గదిలో నేలపై వస్త్రాన్ని పరచి విగ్రహాన్ని పడుకోబెట్టారు. ఆలయంలో ఉండాల్సిన శ్రీమహాలక్ష్మి ఇలా పోలీస్‌స్టేషన్ చేరుకుంది. విగ్రహాన్ని తమకు అప్పగించాలని పలు గ్రామాలకు చెందిన ప్రజలు అధికారులను కోరారు. నిబంధనల ప్రకారం ఇవ్వడానికి కుదరదని స్పష్టంచేసి తీసుకొచ్చారు. మంగళవారం మళ్లీ అధికారుల వద్దకు వెళ్లిన గ్రామస్తులు రాతి విగ్రహం ఇస్తే పూజలు చేసుకుంటామని, తమ సంరక్షణలో ఆలయంలో ఉంచుతామని పట్టుబట్టారు. దీనిపై విగ్రహం అప్పగించేందుకు తహసీల్దార్ సుబ్బన్న అంగీకరించారు. విగ్రహాన్ని అప్పగించనున్నట్టు ఆయన తెలిపారు. లిపిని శోధించాలి వీరగల్ శిలాశాసనంలోని లిపిని శోధిస్తే ఆలయ చారి త్రక ఆధారాలు లభ్యమవుతాయి. ఈ లిపి తెలుగు–కన్నడ భాష కనిపిస్తోంది. ఆలయ ప్రాం గణం, లభించిన మహాలక్ష్మి విగ్రహాన్ని పరి శీలిస్తే అది కచ్చితంగా విష్టు ఆలయమే. అయితే చెన్నకేశవ, నరసింహ, వేణుగోపాలస్వామి ఆలయాల్లో ఒకటి కావొచ్చు. ఇది శిలలు, వాటిపై చెక్కిన బొమ్మలను పరి శీలిస్తే పల్లవరాజుల శైలి, విజయనగర రాజు ల చిహ్నలు ఉన్నాయి. దీన్నిబట్టి శిథిలాల్లో ఇంకా శాసనాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. విగ్రహాలు కూడా లభించవచ్చు. ఆలయ చరిత్ర వెలుగులోకి తీసుకురావడానికి కృషిజరగాలి. – విజయకుమార్, రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్, పురావస్తుశాఖ ఆలయ విగ్రహాల తరలింపు శిథిలాలున్న ప్రాంతంలో కోనాపురం గ్రామంగా ఉండేదని మా పూర్వీకులు చెప్పేవారు. ఆలయానికి చెందిన ధ్వజస్తంభం, బలిపీఠాన్ని బి.కొత్తకోట మండలంలోని కాండ్లమడుగు అమరనారాయణపురం ఆలయంలో ప్రతి ష్ఠించారు. కొన్నింటిని తిరుమల, తెట్టు వేణుగోపాలస్వామి, గట్టులోని ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయాలకు తరలించినట్టు చెప్పేవారు. ఆలయ నిర్వహణకు సంబంధించిన కొన్నిపేర్లు వాడుకలో ఉన్నాయి. వాయిద్యాకారులకు ఇచ్చిన భూమి ప్రాం తాన్ని మేళ్లచెరువుగా, పూలను తెచ్చేవారి కోసం నిర్మించిన ప్రాంతాన్ని పూలచెట్ల బావిగా, ఉత్సవాల కోసం పేరుమాళ్లబండ పేర్లతో పిలుచుకునే ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. – శీలం వేణుగోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్, శీలంవారిపల్లె -
మహామంత్రి తిమ్మరుసు
ఈ కథ కళ్లతో మొదలై కళ్లతో అంతమవుతుంది. విజయనగర సామ్రాజ్య పాలనలో సాళువ వంశం అంతమయ్యి తుళవ వంశం మొదలయ్యింది. సైన్యాధికారి అయిన తుళువ నరస నాయకుడు రాజ్యానికి విశ్వాసపాత్రునిగానే ఉంటూ అనుకోని పరిస్థితిలో పాలకుడయ్యాయి. అతని హయాం ముగిసి అతని పెద్ద కుమారుడు వీర నరసింహ నాయకుని పాలన వచ్చింది. విజయనగరం కళకళలాడుతోంది. ఇంకా కళకళలాడబోతోంది. ఇంతలో నరసింహ నాయకుడు జబ్బు పడ్డాడు. తన తర్వాత తన రాజ్యం తన కుమారుడికి దక్కాలని ఆశించాడు. అయితే ఆ కుమారుడికి పట్టుమని పదేళ్లు కూడా లేవు. కాని నిజంగా రాజ్యానికి ఇప్పుడు కావాల్సింది సమర్థుడైన ఒక పాలకుడు. ఆ పాలక లక్షణాలు సమృద్ధిగా కలిగిన దక్షుడు కృష్ణదేవరాయలే అని మంత్రి తిమ్మరుసు భావించాడు. నరసింహ నాయకుడి సవతి తమ్ముడే కృష్ణదేవరాయలు. కాని ఎప్పటికైనా కృష్ణదేవరాయలి వల్ల తన కుమారుడికి రాజ్యం దక్కకపోయే అవకాశం ఉందని భావించిన నరసింహ నాయకుడు కృష్ణదేవరాయలి కళ్లు పీకించమని ఆదేశాలు జారీ చేశాడు. ఇది పెద్ద నిర్ణయం. అదే గనుక జరిగి ఉంటే విజయనగర సామ్రాజ్య చరిత్ర ఎలా ఉండేదో. కాని మహామంత్రి తిమ్మరుసు అలా జరగనివ్వలేదు. మంత్రాంగం నడిపించాడు. తంత్రం చేశాడు. మేక కళ్లను ప్రభువుకు చూపించి అవే కృష్ణదేవరాయలి కళ్లు అని నమ్మించాడు. పరిస్థితులు చక్కబడే వరకు కృష్ణదేవరాయలను చంద్రగిరి పంపించి అక్కడే రహస్యంగా ఉంచేశాడు. వీటన్నింటి ఫలితంగా రాజ్యాధికారం దక్కించుకుని తిమ్మరసు మీద అచంచల విశ్వాసం, అభిమానం పెంచుకున్న ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు. ‘అప్పాజీ’ అని పిలుస్తూ తండ్రి స్థానం ఇచ్చి అనురాగంతో మసులుకున్న ప్రభువు అతను. ఈ ఇద్దరూ కలిసి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని దశదిశలా వ్యాపింప చేశారు. సూర్యచంద్రులు ఉన్నంతవరకు దాని గురించి శ్లాఘించే పరిస్థితి కల్పించారు. కాని కాలం ఊరికే ఉంటుందా? వీరి మైత్రి చూసి దాని కన్ను కుట్టుకుండా ఉంటుందా? శ్రీకృష్ణదేవరాయలి ముఖ్యసఖి చిన్నాదేవి. ఆమె ఆస్థాన నాట్యకారిణి. ఆమె మీద మనసు పడ్డ దేవరాయలు ఆమెను వివాహం చేసుకోదలిచాడు. అయితే రాజ్య విస్తరణ తంత్రంలో భాగంగా శ్రీరంగపట్న పాలకుల ఆడపడుచు తిరుమల దేవిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరు భార్యలు. తిరుమల దేవి. చిన్నాదేవి. కాని మరో భార్య కూడా ఆయన జీవితంలో ప్రవేశించాల్సి వచ్చింది. విజయనగర రాజ్యానికి ప్రధాన శత్రువులు గజపతులు. ఈ ఒరిస్సా పాలకులను ఓడించడమే కృష్ణదేవరాయలి ప్రధమ కర్తవ్యం. దీనికి కారణం కూడా ఉంది. గజపతులది సూర్య వంశం. కృష్ణదేవరాయలుది చంద్రవంశం. తమతో పోలిస్తే ఆ వంశం నిమ్నమైనది అని గజపతుల భావన. పైగా కృష్ణదేవరాయలి తల్లి నాగలాదేవి క్షత్రియురాలు కాదని మొదటి రాణికి ఆమె దాసిగా పని చేసింది కనుక కృష్ణదేవరాయలు దాసీపుత్రుడని వారి అభియోగం. కాని అపరపరాక్రమవంతుడైన కృష్ణదేవరాయలు గజపతుల పీచమణిచి వారిని ఓడించాడు. అందుకు బదులుగా వారి ఆడపడుచు అన్నపూర్ణాదేవిని వివాహం చేసుకున్నాడు. కాని కృష్ణదేవరాయలు వల్ల తమ రక్తం సంకరం కావడం గజపతులకు ఇష్టం లేదు. పరువు హత్యకు కూడా వారు వెనుకాడని స్థితికి తెగించారు. తమ మనిషిని విజయనగర రాజ్యంలో ప్రవేశ పెట్టారు. తిరుమల దేవికి పుట్టిన కుమారుణ్ణి (అన్నపూర్ణా దేవికి పుట్టిన కుమారుడిగా సినిమాలో చూపించారు) విష ప్రయోగం చేసి చంపించారు. ఈ నేరం తిమ్మరుసును చుట్టుకుంది. మైనర్ కుమారుడికి యువరాజు పట్టాభిషేకం జరిపేందుకు తిమ్మరుసు అంగీకరించలేదు కనుక, తనకు నచ్చినవారినే రాజుగా చేయగల సామర్థ్యం ఆయనకు ఉంది కనుక ఈ హత్య ఆయనే చేయించి ఉంటాడని కృష్ణదేవరాయలకు నూరి పోశారు. ఈ అపవాదు తిమ్మరుసుకు శరాఘాతం. ఈ రాజ్యానికైతే తాను విశ్వాసపాత్రుడుగా ఉన్నాడో ఏ ప్రభువు ఉన్నతి కోసం తాను అహర్నిశలు శ్రమ పడ్డాడో ఎవరి కోసం తాను అనుక్షణం అప్రమత్తంగా మసిలాడో ఆ ప్రభువే తనను అనుమానిస్తే తానిక ఎక్కడికి పోవాలి అని హతాశుడై విచారణ సమయంలో విరాగమౌనం దాల్చాడు. శిక్ష ఖరారు అయ్యింది. తిమ్మరుసు కళ్లు కాల్చేయాలని శిక్ష. ఈ శిక్ష ఆధారాలతో వేసినదా మనస్ఫూర్తిగా వేసినదా ఆగ్రహంలో వేసినదా అనుమానంతో వేసినదా ఇప్పటికీ తెలియదు. కాని అంతటి మహామంత్రి, మేధావి, మంత్రాంగ ప్రవీణుడు, వంద కళ్లతో రాజ్యాన్ని కాచినవాడు తన విశ్వాసానికి ప్రతిఫలంగా కళ్లు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత కృష్ణదేవరాయలు తను చేసిన తప్పు తెలుసుకున్నాడని కథనం.సినిమా ముగింపులో తిమ్మరుసు రాజ్యంలోనే ఉన్నాడని చూపించినా వాస్తవంలో ఆయన చివరి రోజులను అనామకంగా తిరుపతిలో గడిపాడని అక్కడే దీనమైన జీవతం గడిపి మరణించాడని అంటారు. తెలుగువాడైన తిమ్మరుసు జీవితాన్ని, తెలుగు వల్లభుండైన కృష్ణదేవరాయలితో ఆయన మైత్రిని కథాంశంగా తీసుకుని కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1962లో విడుదలైన సినిమా ‘మహామంత్రి తిమ్మరుసు’. మనకు కృష్ణదేవరాయలు ఎంత సన్నిహితుడో తిమ్మరుసు కూడా అంతే సన్నిహితుడు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతంలో ‘తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయలి కీర్తి’ అని ఉంటుంది. ఆ రెంటినీ సమర్థంగా చూపి ఆకట్టుకున్న సినిమా మహామంత్రి తిమ్మరుసు. కృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్, తిమ్మరుసుగా గుమ్మడి అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఎన్టీఆర్ ప్రభువుగా దర్పాన్ని చూపుతూనే పుత్రసమాన వినయాన్ని ప్రదర్శించడం గుమ్మడి తిమ్మరుసుగా పెద్దరికాన్ని ప్రదర్శిస్తూనే తండ్రి సమానమైన వాత్సల్యాన్ని ప్రదర్శించడం చూసి తీరాలి. ఇందులో ఒక ముఖ్యమైన సన్నివేశం ఉంది. సినిమా చివరలో కృష్ణదేవరాయలు తిమ్మరుసు కళ్లు పొడిపించమని తీర్పు వెలువరిస్తాడు. అది విన్న మరుక్షణం తిమ్మరుసు చేసే పని ఏమిటో తెలుసా? తాను అత్యంత అభిమానించే కృష్ణదేవరాయలును ఆపాదమస్తకం పదే పదే చూసుకోవడం. ఎందుకంటే కళ్లు పోయాక మరిక చూసుకోలేడు కదా. ఆ సన్నివేశానికి మన కళ్లు చెమరుస్తాయి. సినిమాలో తిరుమల దేవిగా జి.వరలక్ష్మి, చిన్నాదేవిగా ఎల్.విజయలక్ష్మి, అన్నపూర్ణగా దేవిక కనిపిస్తారు. గజపతుల ప్రతినిధి హంవీరగా లింగమూర్తి అద్భుతమైన నటనను కనపరుస్తాడు. ఈయన ఎక్కువ సినిమాలలో నటించకపోవడం గతకాలపు నష్టాలలో ఒకటి. ఈ కథను, మాటలను మహా రచయిత పింగళి నాగేంద్రరావు సమకూర్చారు. ఇందులో జనరంజకమైన పాటలు లేవు. ఉంటే మరెక్కడికో వెళ్లి ఉండేది. అష్ట దిగ్గజాలు ఈ కొలువులోనే ఉన్నా సినిమాలో అల్లసాని పెద్దన తప్ప మరెవవ్వరూ కనిపించరు. విజయ నగర సామ్రాజ్యమనగానే ఎన్నో అనుభూతులు పూర్వస్మృతులు చెలరేగుతాయి. గర్వం, అతిశయం కలుగుతాయి. కాని ఆ పాలనలోనే ముగిసిపోయిన తిమ్మరుసు విషాద ఘట్టం తలుచుకోగానే అదే మనసుకు చివుక్కుమనిపిస్తుంది. చరిత్ర ఎప్పుడూ ఏదో ఒక పాఠాన్ని వదిలిపెట్టే వెళుతుంది. తిమ్మరుసు కథ కూడా అటువంటి ఒక చేదు పాఠమే తిమ్మరుసు జైలు తిమ్మరుసు కళ్లు పీకించాక ఆయనను బందిఖానాలో ఉంచారని కథనం. మన అనంతపురం జిల్లా పెనుకొండలో ‘తిమ్మరుసు జైలు’ అనే కట్టడం ఇప్పటికీ ఉంది. ఒక్క తిమ్మరుసునే కాదు ఆయన కుటుంబం మొత్తం కళ్లు పీకించారని ఒక కథనం. తిమ్మరుసు బ్రాహ్మణుడు కనుక బ్రాహ్మణ హత్య మహాపాతకం కనుక కళ్లు పీకించడంతో ఊరుకున్నారని ఒక పరిశీలన. ఇక మనందరం ‘ఏకశిలారథం’ అని చెప్పుకునే రథం హంపీలో ఉంది. దీనికి ఈ పేరు రావడానికి కారణం ఆత్రేయ అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ‘ఏకశిలా రథముపై లోకేశు ఒడిలోన’.. అని ఆయన రాయడం వల్ల మనమందరం అదేమాట నిజమనుకుంటుంటాం. కాని ఆ రథాన్ని ఇరవై ఆరు భాగాలుగా చెక్కి పూన్చారు. తెలుగువారు హంపీని ఒక్కసారైనా దర్శించాలి. మన గొప్ప పాలకుడికి మనం ప్రకటించగలిగే కృతజ్ఞత అదే. – కె -
మైసూర్ రాజవంశానికి శాపమా?
-
మైసూర్ రాజవంశానికి శాపమా!
మైసూర్ రాజవంశానికి ఉసురు తగిలిందా? ఎన్నో ఏళ్ల క్రితం నాటి శాపం, ఇంకా వెంటాడుతోందా?... మైసూర్ సంస్థానం చివరి రాజైన నరసింహరాజ వడయార్ అకాల మరణంతో ఈ ప్రశ్నలే తలెత్తుతున్నాయి. అయితే, ఇవన్నీ మూడ నమ్మకాలే అని కొంతమంది కొట్టి పారేస్తుండగా, మరికొందరు మాత్రం ఇందులో నిజం లేకపోలేదని చరిత్రను తిరగేస్తున్నారు. మరోవైపు వడయార్ అకాల మరణంతో ఆ సంస్థానంలో కొనసాగే రాజు ఎవరనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. అసలు మైసూర్లో జరుగుతున్నదేమిటి? ఎందుకిలా జరుగుతోంది అంటూ ఆరాలు తీస్తున్నారు. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే ... సరిగ్గా 400 ఏళ్ల క్రితం, మైసూర్ రాజులకు ఒక శాపం తగిలింది, ఆ శాపం ఇప్పటికీ కొనసాగుతోంది. ఎవరు నమ్మినా, నమ్మకున్నా .. ఇదే నిజమంటున్నారు చరిత్రకారులు, స్థానికులు. అసలు జరిగిందేమిటంటే ... 1612లో విజయనగర సామ్రాజ్యాన్ని కూలదోసి, తిరుమలరాజా కిరీటాన్ని చేజిక్కించుకుని, మైసూర్‌ను స్వాధీనం చేసుకున్నారు రాజా వొడయార్. ఈ విషయం తెలుసుకుని కలత చెందిన తిరుమలరాజా సతీమణి అలమేలమ్మ వెంటనే రాజ ఆభరణాలు తీసుకుని, సురక్షిత ప్రాంతానికి తరలిపోయింది. దాంతో రాజా వొడయార్ సేనలు నగల కోసం గాలిస్తూ ఆమెను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇకపై వొడయార్లకు సంతాన భాగ్యం ఉండదని శపిస్తూ కావేరీ నదిలో దూకి ప్రాణత్యాగం చేసుకుంది. దీంతో భయపడిపోయిన వొడయార్లు మైసూర్ ప్యాలెస్‌లో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమెకు పూజలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆమె ఉసురు మాత్రం రాజకుటుంబానికి తగిలిందనే ప్రచారం ఉంది. అలాగే ఈ శాపాల వెనక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. కావేరి ఒడ్డునున్న తలకాడ ప్రాంతంలో ఉన్న ఓ అమ్మవారి దేవాలయాన్ని మైసూరు రాజులు తమకు వరం ఇవ్వలేదని అక్కసుతో ఇసుకతో కప్పివేశారట. దానివల్లే రాజుగా ఉన్న వ్యక్తికి సంతానం కలగడం లేదని చెబుతారు. ఇది 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనగా చెప్పుకుంటారు. ఇక యాదృచ్చికమో లేక శాప ఫలితమో గానీ మైసూర్‌ను పాలించిన ఏ రాజుకు కూడా వారసులే లేరు. రాజుగా పీఠాన్ని అధిష్టించిన వారికి మగ సంతానం లేకపోవడంతో వాళ్ల తోబుట్టువుల సంతానానికి పట్టం కట్టడం మొదలైంది. వొడయార్ వంశవృక్షాన్ని పరిశీలిస్తే, 17వ శతాబ్ధం నుంచి ఇప్పటివరకూ ఉన్న ఆరుగురు రాజుల్లో ఎవ్వరికీ సంతానం కలగలేదు. దాంతో వారంతా తమ మేనల్లుళ్లని వారసులుగా ప్రకటించారు. అంతెందుకు వొడయార్ రాజుల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నల్వాది కృష్ణరాజ వొడయార్‌కు సంతానం లేకపోవడంతో, ఆయన మేనల్లుడు జయచామరాజాను వారసుడిగా ప్రకటించారు. ఈ జయచామరాజా తనయుడే గుండెపోటుతో కన్నుమూసిన శ్రీకంఠదత్తా. ఇప్పుడు శ్రీకంఠదత్తాకు సంతానం లేదు. దీంతో ఆయన సోదరి రాణి గాయత్రీ దేవి కొడుకైన కాంతరాజే శ్రీకంఠకు తుది సంస్కారాలు నిర్వహించారు. నరసింహరాజుకు ఐదుగురు సోదరీ మణులు ఉండగా వారిలో రెండో సోదరి గాయవూతిదేవి కుమారుల్లో పెద్దవాడైన చదురంగా కాంతరాజును తదుపరి రాజుగా ప్రకటించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఇదంతా శాపం వల్లే జరుగుతోందని కొందరి అభిప్రాయం. అయితే, దీని వెనక ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంటుందని, పాపపుణ్యాలు, శాపలన్నీ మూఢనమ్మకాలని మరికొందరి వాదన. ఏది ఏమైనా ... మైసూర్లో మొత్తానికి ఏదో మిస్టరీ దాగుంది.