vijayawada crime
-
యాంకర్లతో రాసలీలలు?
సాక్షి, మచిలీపట్నం: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో హైటెక్ వ్యభిచారం చాపకింద నీరులా విస్తరిస్తోంది. హోటల్స్, అపార్టుమెంట్లు, నగర శివారుల్లోని ఇండిపెండెంట్ హౌస్‌లలో ఈ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. వాట్సప్‌లలో అమ్మాయిల ఫొటోలు పంపడం.. నచ్చితే కోరుకున్న సమయానికి కోరుకున్న చోటకు వార్ని పంపిస్తూ రెండు చేతూలా ఆర్జిస్తున్నారు. గంటలు.. రోజుల తరబడి కూడా బుకింగ్‌లు జరుగుతున్నాయంటే ఏ స్థాయిలో ఇక్కడ వ్యభిచారం సాగుతుందో అర్థం చేసుకో వచ్చు. కొన్ని హోటల్స్ అందుకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ముఖ్యంగా నగరం నడిబొడ్డులోని ఓ ప్రముఖ హోటల్లో దర్జాగా ఈ వ్యాపారం సాగుతోంది. అందుకోసం ఈ హోటల్లో కొన్ని రూమ్‌లను రిజిస్ట్రర్ చేయకుండా అన్‌రిజిస్ట్రర్ కోటాలో వదిలివేస్తారు. ఈ హోటల్లో ఐదారుగురు అమ్మాయిలు ఎప్పుడూ ఉంటారని, వారిని బుక్ చేసుకుంటే హోటల్లో రూమ్ కూడా ఫ్రీగా ఇస్తుంటారని వినికిడి. (జూబ్లీహిల్స్ వ్యభిచార గృహంపై దాడి) గంటకు రూ.3వేలు నుంచి.. గంటకు రూ.3వేల నుంచి 5వేలు, ఒక రాత్రికి రూ.5 నుంచి 10 వేల వరకు బుకింగ్‌లు జరుగుతున్నాయని సమాచారం. ఇక హౌసింగ్ బోర్డు కాలనీ, భాస్కరపురం తదితర ప్రాంతాల్లో కొన్ని అపార్టుమెంట్లలో అద్దెకు తీసుకున్న ప్లాట్లలో కూడా ఈ తరహా వ్యభిచారం సాగుతోందని చెబుతున్నారు. ఇక నగర శివారుల్లో ఇండిపెండెంట్ హౌసుల్లో కూడా ఈ తరహా వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందని తెలుస్తోంది. ఎక్కువగా 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతులను విజయవాడ, గుడివాడ తదితర పట్టణాల నుంచి ఇక్కడకు తీసుకొచ్చి నగరంలో రుచిమరిగిన విటులకు వారి ఫొటోలను పంపి వారి కోరికలు తీరుస్తున్నారు. నగరంలో యువతనే టార్గెట్ చేస్తూ ఈ వ్యాపారం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు కంటే ఇప్పుడు ఎక్కువైందని చెబుతున్నారు. ఈ మధ్య ఓ చానల్లో పనిచేసే సిబ్బంది ఒకరు తన ఇంట్లోనే వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. యాంకర్లతో రాసలీలలు? టీవీల్లో చిన్న చితకా పాత్రల్లో నటించిన నటులు, యాంకర్లను బుక్ చేసుకుని నగరానికి తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. స్థానిక హోటల్స్‌లో వీరికి బస ఏర్పాటు చేసి తమకు కావాల్సినప్పుడు తమకు కావాల్సిన చోటకు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన బీచ్ ఫెస్టివల్స్‌లో నిర్వహించిన ఈవెంట్స్‌లో పాల్గొన్న యాంకర్లలో ఒకర్ని సంబరాల రాంబాబు ఇటీవలే నగరానికి తీసుకొచ్చి బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో నాలుగురోజుల పాటు ఉంచి ఎంజాయి చేశారని విశ్వసనీయ సమాచారం. ఆ యాంకర్ ఉన్న మాట వాస్తవమేనని, రోజు ఎవరో కారులో వచ్చి ఆమెను తీసుకెళ్లే వారని వారెవరని తమకు తెలియదని ఆ హోటల్లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. నగరంలో జరిగే ఈ హైటెక్ వ్యభిచారం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం ఉన్న వారు తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
అప్పు ఇచ్చి కోరిక తీర్చమని వేధింపులు
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): అతను ఓ బార్‌కు యజమాని.. అంతకంటే ముఖ్యంగా ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్‌కు భర్త.. బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన అతగాడు మహిళలపై తనదైన రీతిలో వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే మహిళలనే టార్గెట్ చేసుకొని వారి అవసరాలకు ఆదుకుంటున్నట్లుగా నటిస్తూ ఆపై తన కోరిక తీర్చాలంటూ పీక్కుతింటుంటాడు. ఈ క్రమంలో వరుసకు కూతురు అయ్యే ఓ మహిళపై కూడా లైంగిక దాడికి పాల్పడటంతో బాధితురాలు సింగ్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. మేనల్లుడికి డబ్బులిచ్చి.. సేకరించిన వివరాల ప్రకారం సింగ్‌నగర్ ఎక్సెల్ ప్లాంట్ రోడ్డులో నివసిస్తున్న తాళ్లూరి శ్రీనివాసరావు సింగ్‌నగర్ పైపుల రోడ్డులోని ఓ బార్లో పార్ట్నర్గా ఉంటూ వ్యాపారం చేస్తుంటాడు. అయితే తనకు మేనల్లుడి వరుస అయ్యే వ్యక్తికి గతేడాది రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పటి నుంచి డబ్బుల పేరుతో తరచూ ఇంటికి వెళ్తూ అతని భార్యతో మాట్లాడటం చేస్తుండేవాడు. భర్త ఇంట్లో లేని సమయంలో డబ్బుల కోసం వెళ్లి భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అతని చేష్టలతో విసిగిపోయిన ఆమె భర్తకు చెబితే ఏమవుతుందోననే భయంతో శ్రీనివాసరావు ఇంటికి వచ్చినప్పుడు బయటకు వెళ్లిపోయి సమాధానం చెప్పేది. అయితే ఇటీవల కాలంలో ఇదే విధంగా స్నానం చేస్తున్న సమయంలో ఇంటికి వచ్చిన శ్రీని వాసరావు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె విషయాన్ని భర్తకు చెప్పడంతో వారి ద్దరు సింగ్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిపై 376, 506 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిసింది. నిందితుడిని గురువారం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. దీనిపై సింగ్‌నగర్ పోలీసులను వివరణ కోరగా ఈ కేసుపై ఇంకా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
హత్య, దోపిడీ కేసులో నిందితురాలి అరెస్టు
విజయవాడ : ఓ మహిళను హత్య చేసి ఆపై దోపిడీకి పాల్పడిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత మార్చి 23వ తేదీన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో న్యూ ఆర్ఆర్. పేట రోడ్డు, ఫార్చూన్ హైట్స్ ఆపార్ట్మెంట్ ఫ్లాట్ నెం.305లో జరిగిన మహిళ హత్య, దోపిడీ కేసులో నిందితురాలిని సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి రూ.2.50 లక్షల విలువైన 84 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి బందర్ రోడ్డులో కంట్రోల్ కమాండ్ రూంలో క్రైమ్ డీసీపీ బి. రాజకుమారి విలేకరులకు వివరాలను వెల్ల డించారు. ప్లాట్ నెం.305లో ఒంటరిగా నివసిస్తున్న పేరం నాగమణి (57) ని ఎదురింట్లో ఉంటున్న మహ్మద్ ఆసియా బేగం అలియాస్ బేగం (46) హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుంది. నాగమణికి తన ఇంటి ముందున్న అసియా బేగంతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆసియా బేగంకు భర్తతో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ కలహాల్లో నాగమణి జోక్యం చేసుకుంది. ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఆసియా బేగం ఆమె భర్తకు గొడవ జరిగింది. ఈ గొడవలో నాగమణి జోక్యం చేసుకుని మార్చి 23వ తేదీన ఆసియా బేగం ఫ్లాట్‌లోకి వెళ్లింది. నీవు నీ భర్తకు సొంత భార్యవా, లేక ఉంచుకున్నదానివా.. అంటూ ఆసియా బేగంను నాగమణి ప్రస్తావించింది. ఆ మాటలకు కోపంతో నాగమణి జుట్టు పట్టుకుని ఎదురుగా ఉన్న గోడకు బలంగా కొట్టింది. నాగమణికి తల వెనుక భాగంలో బలంగా దెబ్బ తగలడంతో కిందిపడిపోయింది. ఎంతసేపటికి నాగమణి లేవకపోవటంతో ఆమె మృతి చెందినట్లు భావించింది. దీంతో కంగారు పడిన ఆసియాబేగం.. నాగమణిని ఆమె ఇంట్లోని బెడ్ రూంకు తీసుకెళ్లింది. చున్నీతో ఆత్మహత్య చేసుకున్నట్లు సృష్టించింది. మృతురాలి ఇంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కూడా అపహరించుకుపోయింది. ఏమీ తెలియనట్లు ఇంటికి తాళం వేసేసింది. క్రైమ్ ఏసీపీ మక్చూల్ ఆధ్వర్యంలో పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. ఎదురింటి ఆసియా బేగంపై అనుమానంతో సత్యనారాయణపురం రైతుబజార్ వద్ద ఆసియా బేగంను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం బయట పడింది. దాంతో నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. విలేకరుల సమావేశంలో క్రైమ్ ఏసీపీలు మక్చుల్, వర్మ, సుందరరాజు తదితరులు పాల్గొన్నారు. సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి కేసు దర్యాప్తు చేశారు. -
జంక్షన్లో భారీ చోరీ
కృష్ణా , హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం) : హనుమాన్జంక్షన్కు చెందిన ఓ ప్రముఖ హోల్‌సేల్ కిరాణా వ్యాపారి ఇంట్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో సుమారు 40 కాసుల బంగారు ఆభరణాలు, రూ.9.20 లక్షల నగదు అపహరణకు గురైంది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి తలుపులు పగులకొట్టి దొంగలు లోనికి చొరబడ్డారు. గత ఐదు రోజులుగా ఇంట్లో ఎవ్వరూ లేకపోవటాన్ని గుర్తించిన దుండగులు పక్కా పధకంతో చోరీకి తెగబడ్డారు. హనుమాన్‌జంక్షన్ ప్రధాన కూడలికి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఇంట్లోనే దుండగులు చోరీకి పాల్పడటం ఖాకీలకు సవాల్‌గా మారింది. నాలుగైదు రోజులుగా పోలీసులు ఇతర కేసు దర్యాప్తులో బీజీగా ఉండటంతో దుండగులు చోరీకి అనువైన స్థలంగా ఎంచుకున్నారనే అనుమానాలు వినిపిస్తున్నారు. పక్కింటి పైనుంచి మొదటి అంతస్తులోకి.. స్థానిక గుడివాడ రోడ్డులోని విజయలక్ష్మీ జనరల్ స్టోర్స్ అధినేత రాగిపిండి లక్ష్మీరెడ్డి నివాసంలో చోరీ జరిగింది. ఈ నెల 23వ తేదీన లక్ష్మీరెడ్డి భార్య విజయలక్ష్మికి శస్త్రచికిత్స నిమిత్తం ఇంట్లో వాళ్లందరూ విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో ఐదు రోజులు ఇంటికి తాళం వేసి ఉంది. లక్ష్మీరెడ్డి హోల్‌సేల్ కిరణా వ్యాపారం కావటంతో ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో గోడౌన్ ఏర్పాటు చేసుకుని సరుకు నిల్వ చేశారు. ఈ గోడౌన్లో రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు పనివాళ్లు ఉంటారు. ఇంటి మొదటి అంతస్తులో లక్ష్మీరెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. పై అంతస్తుకు వెళ్లటానికి ఖచ్చితంగా గోడౌన్ వద్ద ఉన్న మెట్ల మార్గం ద్వారానే వెళ్లాలి. కానీ దుండగులు పక్క డాబాపైకి ఎక్కి అక్కడి నుంచి లక్ష్మీరెడ్డి నివాసం ఉంటున్న బిల్డింగ్ మొదటి అంతస్తుకు ఉన్న అద్దాల కిటికి తొలగించి లోనికి ప్రవేశించారు. మొదటి అంతస్తులోని వెనుక భాగంలోకి కారిడార్ గుండా వెళ్లి గది తలుపులు పగులకొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. రెండు బెడ్రూమ్స్లో బీరువాలను తెరిచి అందులోని దుస్తులు చిందరవందర చేశారు. మొదటి బెడ్రూంలోని బీరువాలో దాచిన రూ.70 వేలు, బంగారు ఆభరణాలు అపహరించారు. ఆ తర్వాత రెండో బెడ్రూం తలుపులను పలుగు సాయంతో పగులకొట్టి, ఆ గదిలోని టేబుల్ సొరుగులో ఉన్న రూ.8 లక్షలు, బీరువాలోని బంగారు ఆభరణాలను దొంగిలించారు. కొన్ని వస్తువులు వదిలేసి.. లక్ష్మీరెడ్డి ఇంట్లో చోరీ కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. దుండగులకు ఇంట్లో ఎవ్వరూ లేరనే విషయం తెలియటంతో చాకచక్యంగా చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో డబ్బులు, ఆభరణాలు భద్రపరిచే ప్రదేశాలు కూడా స్పష్టంగా దుండగులకు తెలిసి ఉండవచ్చనే అనుమానం ఘటనా జరి గిన తీరును బట్టి పోలీసులు అంచనా వేస్తున్నా రు. శుక్ర, శనివారాల్లో రాత్రిపూట లక్ష్మీరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఇంటికి వచ్చి నిద్రపోయారని, దీంతో ఆదివారం లేక సోమవారం రాత్రి వేళలోనే దొంగతనం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆస్పత్రికి దుస్తులు తీసుకువెళ్లేందుకు లక్ష్మీరెడ్డి కుటుంబ సభ్యులు కృష్ణవేణి, రత్నకుమారి ఇంటికి వచ్చారు. ప్రధాన ద్వారం తెరిచి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి రెండు బెడ్రూమ్స్ తలుపులు తీసి ఉండటం, వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉండటంతో భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని లక్ష్మీరెడ్డికి చెప్పటంతో హుటాహుటిన ఇంటికి వచ్చి చోరీ జరిగిన సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. దీంతో జం క్షన్ ఎస్ఐ వి.సతీష్ ఘటనా స్థలికి వచ్చి పరిశీ లించటంతో పాటు లక్ష్మీరెడ్డిని పలు విషయాలపై ఆరా తీశారు. దుండగులు బెడ్రూంలో కొన్ని ఆభరణాలను అక్కడే వదిలి వేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. దొంగతనానికి వచ్చి బీరువాలో ఒకేచోట ఉన్న కొన్ని బంగారు వస్తువులు తీసుకువెళ్లి, మిగిలిన ఆభరణాలు వదిలివేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీరువా తలుపులు కూడా పగలకొట్టకుండా ఇం ట్లోనే భద్రపర్చిన వాటి తాళాలను నిందితుడు వెతికి వాటి ద్వారానే బీరువా తెరవటం కూడా పోలీసులను విస్మయానికి గురి చేసింది. ఇంటి వెనుక వైపు గది తలుపులు చాలా బలహీనంగా ఉండటంతో సునాయాసంగా పగులకొట్టుకుని దుండగులు లోనికి వచ్చారు. మచిలీపట్నం నుంచి సీఐ బాబూరావు నేతృత్వంలోని క్లూస్ టీం లక్ష్మీరెడ్డి ఇంట్లో నిందితులకు సంబంధించిన ఆధారాలు, చేతి వేలిముద్రలను సేకరించారు. ఈ చోరీపై హనుమాన్‌జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆపదలో ఆడబిడ్డ
సాక్షి, మచిలీపట్నం/విజయవాడ క్రైం, న్యూస్‌లైన్: బందరుకు చెందిన శింగవరపు ఎస్తేర్ అనూహ్య (23) హత్యోదంతం పోలీసులు, పాలకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ అనూహ్యంగా నరరూప రాక్షసుల చేతికి చిక్కి దారుణహత్యకు గురికావడంతో జిల్లాలో గతంలో జరిగిన ఘోరాలు గుర్తుకొస్తున్నాయి. అనూహ్య ఘటనతో కన్నీరుపెట్టిన జిల్లావాసులు గతం తాలూకు మానని అకృత్యాల గాయాలను ఒకమారు తరచిచూస్తున్నారు. గతంలో శ్రీలక్ష్మి, ఆయేషామీరా వంటి ఎంతోమంది యువతులపై జరిగిన దురాగతాలపై జనం పోలీసులు, పాలకుల తీరును తప్పుబడుతున్నారు. గత ఘటనలు ఒకమారు పరికిస్తే కిరాతకుల అడుగుజాడలు ఊడల మాదిరిగా పాతుకుపోతున్న వైనం కనిపిస్తుంది. మరెన్నో మానని గాయాలు.. ఏడాది కాలంగా జిల్లాలో ఎంతో మంది మహిళలు అనేక కారణాలతో హత్యకు గురయ్యారు. గత ఏడాది ఫిబ్రవరి ఏడున భట్లపెనుమర్రులో వివాహిత చాముండేశ్వరి హత్యకు గురైంది. మార్చి 10న ఇబ్రహీంపట్నం కొండపల్లిలో అనుమానంతో భార్య కుమారిని భర్తే హత్యచేశాడు. మార్చి 24న గుంటూరులో వార్డెన్‌గా ఉద్యోగం చేస్తున్న మైలవరానికి చెందిన యువతి సూర్యలంక బీచ్‌లో హత్యకు గురైంది. జూన్ 9న చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో కొమ్ము శకుంతల (55) దారుణ హత్యకు గురైంది. సెప్టెంబర్ 4న హనుమాన్‌జంక్షన్‌లో వరలక్ష్మిని చంపేశారు. సెప్టెంబర్ 7న మైలవరానికి చెందిన శ్రీలతను భర్తే హత్య చేశాడు. నవంబర్ 6న కలిదిండిలో కృష్ణకుమారిని కట్టుకున్నవాడే చంపేశాడు. ఆగని మృగాళ్ల అకృత్యాలు .. నిర్భయ వంటి కఠినమైన చట్టాలు వచ్చినా మృగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడలేదు. గత ఏడాది జనవరి మూడో తేదీన హాస్టల్లో చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థినులను తీసుకుపోయిన ముగ్గురు యువకులను జనవరి 20న మైలవరం పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 10న మచిలీపట్నంలో 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశారంటూ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 24న మచిలీపట్నంలో బాలికపై లైంగిక దాడికి ఒక రిక్షాపుల్లర్ ప్రయత్నించాడు. మే 3న చాట్రాయి మండలంలో వివాహితపై లైంగికదాడికి యత్నం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 14 ఉయ్యూరులో 19 ఏళ్ల యువతిపై అత్యాచారయత్నం జరిగింది. పోలీసుల రికార్డులకు ఎక్కిన మృగాళ్ల అకృత్యాలు గమనిస్తే 2011లో 76మంది, 2012లో 66 మంది, 2013లో 51మంది మహిళలపై అత్యాచారాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీలక్ష్మి నుంచి అనూహ్య వరకు... రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన రావూరి శ్రీలక్ష్మి కేసులో పోలీసులు ముందుగా స్పందించి ఉంటే ఆమె దక్కేది. విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదివే శ్రీలక్ష్మిని అదే తరగతి చదివే మనోహర్ ప్రేమపేరిట వేధించాడు. దీంతో ఆమె అప్పట్లో యాంటీగూండా స్క్వాడ్ (ఏజీఎస్) పోలీసులను ఆశ్రయించింది. అయినా పోలీసులు పెద్దగా స్పందించలేదు. 2004 జూన్ 21న పరీక్షలు రాసేందుకు కాలేజీకి వెళ్లిన శ్రీలక్ష్మిని మనోహర్ కత్తితో దారుణంగా నరికి చంపాడు. పటమటకు చెందిన కోనేరు నాగశ్రీ (15) 2006 సెప్టెంబర్ 11న దారుణ హత్యకు గురైంది. తొమ్మిదో తరగతి చదివే నాగశ్రీని అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు బలవంతంగా తీసుకెళ్లి పెనమలూరు సమీపంలో హత్య చేశారు. ఈ కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ఎంతగానో శ్రమపడాల్సి వచ్చింది. గుడివాడకు చెందిన రేడియో జాకీ బి.లక్ష్మీసుజాత (23) 2007 ఫిబ్రవరి 10వ తేదీన గవర్నరుపేటలోని ఓ లాడ్జిలో దారుణ హత్యకు గురైంది. తాను పనిచేసే చానల్లో మేకప్‌మన్‌గా పనిచేసే చందు మరో యువకుడితో కలిసి ఆమెను దారుణంగా హత్య చేశాడు. తనను ప్రేమించడం లేదనే కోపంతో నమ్మకంగా లాడ్జికి తీసుకెళ్లి హత్య చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదివే ఆయేషామీరా 2007 డిసెంబర్ 27వ తేదీన దారుణహత్యకు గురైంది. ఆమె హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ స్థాయి హక్కుల సంఘాలు సైతం ఇక్కడికి వచ్చి విచారణ నిర్వహించాయి. అనేక వివాదాలు, అనుమానాల నడుమ ఆయేషామీరా హత్య కేసులో పాత నేరస్థుడైన సత్యంబాబును నగర పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణలంక బాపనయ్యనగర్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని మీనాకుమారిపై అదే కాలేజీకి చెందిన సందీప్ 2008 ఏప్రిల్ 9వ తేదీన కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో మాట్లాడే నెపంతో ఇంటికి వచ్చిన సందీప్ ఆమెపై దాడి చేసి, తానూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కోలుకోగా.. రెండేళ్లకు ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడం విషాదకరం. మీనాకుమారిపై దాడి జరిగిన వెంటనే అప్పటి నగర పోలీసు కమిషనర్ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడేవారిపై రౌడీషీట్లు తెరవాలంటూ అప్పట్లో పోలీసు కమిషనర్ జారీ చేసిన ఆదేశాలు వణుకు పుట్టించాయి. తరచు ఈవ్‌టీజింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్న 50 మందిపై రౌడీషీట్లు తెరిచారు. మరో 100 మందిపై సస్పెక్ట్ షీటు తెరిచారు.