అప్పు ఇచ్చి కోరిక తీర్చమని వేధింపులు | Bar Owner Molestation on Worker in Krishna | Sakshi
Sakshi News home page

అప్పు ఇచ్చి కోరిక తీర్చమని వేధింపులు

Published Thu, Feb 14 2019 1:50 PM | Last Updated on Thu, Feb 14 2019 1:50 PM

Bar Owner Molestation on Worker in Krishna - Sakshi

వరుసకు కూతురు అయ్యే ఓ వివాహితపై బార్‌ యజమాని లైంగిక దాడి?

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌): అతను ఓ బార్‌కు యజమాని.. అంతకంటే ముఖ్యంగా ఓ మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌కు భర్త.. బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన అతగాడు మహిళలపై తనదైన రీతిలో వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే మహిళలనే టార్గెట్‌ చేసుకొని వారి అవసరాలకు ఆదుకుంటున్నట్లుగా నటిస్తూ ఆపై తన కోరిక తీర్చాలంటూ పీక్కుతింటుంటాడు. ఈ క్రమంలో వరుసకు కూతురు అయ్యే ఓ మహిళపై కూడా లైంగిక దాడికి పాల్పడటంతో బాధితురాలు సింగ్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించింది.

మేనల్లుడికి డబ్బులిచ్చి..
సేకరించిన వివరాల ప్రకారం సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ ప్లాంట్‌ రోడ్డులో నివసిస్తున్న తాళ్లూరి శ్రీనివాసరావు సింగ్‌నగర్‌ పైపుల రోడ్డులోని ఓ బార్‌లో పార్ట్‌నర్‌గా ఉంటూ వ్యాపారం చేస్తుంటాడు. అయితే తనకు మేనల్లుడి వరుస అయ్యే వ్యక్తికి గతేడాది రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పటి నుంచి డబ్బుల పేరుతో తరచూ ఇంటికి వెళ్తూ అతని భార్యతో మాట్లాడటం చేస్తుండేవాడు. భర్త ఇంట్లో లేని సమయంలో డబ్బుల కోసం వెళ్లి భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అతని చేష్టలతో విసిగిపోయిన ఆమె భర్తకు చెబితే ఏమవుతుందోననే భయంతో శ్రీనివాసరావు ఇంటికి వచ్చినప్పుడు బయటకు వెళ్లిపోయి సమాధానం చెప్పేది. అయితే ఇటీవల కాలంలో ఇదే విధంగా స్నానం చేస్తున్న సమయంలో ఇంటికి వచ్చిన శ్రీని వాసరావు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె విషయాన్ని భర్తకు చెప్పడంతో వారి ద్దరు సింగ్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిపై 376, 506 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిసింది. నిందితుడిని గురువారం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. దీనిపై సింగ్‌నగర్‌ పోలీసులను వివరణ కోరగా ఈ కేసుపై ఇంకా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement