vikas parv
-
మచ్చలేని పాలన బీజేపీ సొంతం
భీమవరం : మచ్చలేని పాలన బీజేపీ సొంతమని, రెండేళ్ల పాలనను అవినీతి రహితంగా పూర్తి చేయడం తమ పార్టీ ఘనత అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. భీమవరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు శనివారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ అధ్యక్షతన నిర్వహించిన వికాస్ పర్వ్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనంతా అవినీతే ప్రధాన ధ్యేయంగా సాగిం దని విమర్శించారు. అందుకు భిన్నంగా నరేంద్రమోదీ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తోందని మాణిక్యాలరావు పేర్కొన్నారు. కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ గుర్తింపు పొందిందన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 28లక్షల మంది పార్టీ సభ్యులున్నారని చెప్పారు. విదేశాల్లో సైతం మన దేశం గౌరవ ప్రతిష్టలు పెంపొందించడానికి ప్రధాని మోదీ కృషిచేస్తుంటే, కొందరు రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ.65 వేల కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.25 వేల కోట్లను కేవలం నూతన రాజధాని అమరావతికి కేటాయించారని వివరిం చారు. పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసే లక్ష్యంతో కేంద్రం ఉందన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారం కోసం కాకుండా ఒక సిద్ధాంతం కోసం పని చేస్తోందన్నారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ పార్టీ మనకేం చేసిందని కాకుండా, పార్టీకి మనమేం చేశామని ప్రశ్నించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. పార్టీ నాయకులు పీవీఎస్ వర్మ, డీఆర్కే రాజు, న రసింహారెడ్డి, కోడూరి లక్ష్మీనారాయణ, అల్లూరి సాయిదుర్గరాజు, కురెళ్ల నరసింహరావు, బూచి సురేంద్రనాథ్ బెనర్జీ పాల్గొన్నారు. -
మిత్రులుగా మిగిలిపోవద్దు
సొంతంగా ఎదుగుదాం అస్తిత్వాన్ని నిలబెట్టుకుందాం వికాస్ పర్వ్’లో మనోగతాన్ని వెల్లడించిన కమలనాథులు ముగిసిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఏలూరు : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా మిగిలిపోకుండా.. సొంత కాళ్లపై ఎలా నిలబడాలనే విషయంపై బీజేపీలో చర్చ జరిగింది. భీమవరంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు శనివారం రాత్రి ముగిశాయి. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దానిపై ‘వికాస్ పర్వ్’ పేరిట కమలనాథులు మేధోమథనం సాగించారు. ఇప్పటికిప్పుడే టీడీపీతో తెగతెంపులు చేసుకునే పరిస్థితి లేనందున.. ఆ పార్టీతో మిత్రత్వాన్ని కొనసాగిస్తూనే పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేలా ముందుకు వెళ్లాలని ముఖ్యనేతలు దిశానిర్దేశం చేశారు. సమావేశాల్లో పాల్గొన్న వక్తలంతా ప్రధాని నరేంద్రమోదీని, ఆయన పాలనా తీరును పొగడటానికే ఎక్కువ సమయం కేటాయించారు. ‘నిధులు, పథకాలు మనవి.. లబ్ధి వారికా’ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా నిధులు ఇస్తోందని, అయితే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంపై సమావేశాల్లో సుదీర్ఘ చర్చ సాగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పెద్దఎత్తున ఇస్తున్న నిధులు తదితర అంశాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని నాయకులు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పిం చారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణం వంటి వాటిని త్వరితగతిన పూర్తిచేసే లక్ష్యంతో కేంద్రం ముందడుగు వేస్తోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు నిధులిస్తున్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించాలని హితబోధ చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్ట్‌ల కోసం ఇప్పటికే రూ.1.43 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్న విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని, అసంఘటిత రంగ కార్మికులకు కోసం కేంద్రం ప్రవేశపెట్టిన బీమా పథకాన్ని టీడీపీ సర్కారు చంద్రన్న బీమా పేరుతో అమలుచేస్తున్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. మరోవైపు రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలనే అంశంపైనా చర్చించారు. పట్టణ ప్రాంతాల్లో పార్టీకి మంచి పట్టు ఉన్నందున పొత్తులేకుండా ఒంటరిగా పోటీ చేయాలని పలువురు వాదించారు. ఇప్పుడే ఒంట రిగా పోటీ చేయడం సరికాదని, మిత్రపక్షంతో కలిసిపోటీ చేద్దామని ముఖ్య నేతలు సూచించారు. మొత్తానికి రెండు రోజులపాటు జరిగిన సమావేశాలు కీలకమైన నిర్ణయాలు తీసుకోకుండానే ముగిశాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎలాంటి ప్రకటన చేయకుండా వాయిదా వేశారు. అదే సమయంలో పార్టీలో అంతర్గత క్రమశిక్షణ లోపించిన విషయంపైనా చర్చ జరిగింది. సదావర్తి భూముల కుంభకోణంలో సొంత పార్టీవారే విజయవాడలో ధర్నా చేయడం పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించిందన్న భావన నేతల్లో వ్యక్తమైంది. -
కేంద్రానికి ఏపీ అల్లుడు
రాష్ట్రాన్ని ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తారు అడ్డగోలు విభజన వల్లే కాంగ్రెస్ భూస్థాపితం వికాస్ పర్వ్‌లో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఒంగోలు : కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లుడిలా భావించి అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. వరకట్న నిషేధ చట్టం సమయంలో అల్లుడికి కట్న కానుకలను పసుపు కుంకుమల పేరుతో మామలు ముట్ట చెబుతున్నట్లే నేడు ప్రత్యేక హోదా నిషేధం అయినందున ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక ప్యాకేజీల రూపంలో లక్షల కోట్ల నిధులు ఇస్తున్నామని, అందువల్లే ఏపీ జీడీపీ 10.99గా ఉందన్నారు. గురువారం ఒంగోలులోని కాపు కల్యాణమండపంలో మోదీ పాలన రెండేళ్లు పూర్తరుున సందర్బంగా బీజేపీ నిర్వహించిన వికాస్‌పర్వ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో రాష్ట్రంలో బీజేపీ తప్ప మిగితా పార్టీలు, కార్మిక వర్గాలు అంతా సమైక్య నినాదాన్నే చేశాయన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజన చేసినందునే కాంగ్రెస్ భూస్థాపితమైందని మంత్రి స్పష్టంచేశారు. ఇప్పటికి కూడా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు అవినీతి చేయాలని చూస్తున్నారని, అదే జరిగితే తీహార్ జైలు ఖాయం అన్నారు. పదేళ్లు కాదు..మీరిస్తామన్న అయిదేళ్లు ప్రత్యేక హోదా అయిన విభజన చట్టంలో ఏమైందో చెప్పాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నెత్తిన మొట్టి నిలదీయాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. భారతీయ జనతా మహిళా మోర్చా జాతీయ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ గ్రామసీమల్లోను, అమరావతిలోను రోడ్లకోసం వెచ్చిస్తున్న నిధులంతా కేంద్రం జారీచేసినవే అన్నారు. రామాయపట్నం పోర్టుకు కూడా కేంద్రం సిద్దంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే 5వేల ఎకరాలు సేకరించి కేంద్రానికి అప్పచెప్పిన వెంటనే కేంద్రం పోర్టు నిర్మాణానికి సంసిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా, చివరకు కాంగ్రెస్ పాలనలో సైతం కేంద్రం జారీచేసే నిధులకు రాష్ట్రప్రభుత్వం ప్రధాని ఫొటోను, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రచురిస్తుందని, కానీ ఏపీలో మాత్రం అటువంటి పరిస్థితి కనబడడంలేదన్నారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు పులి వెంకట కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా పార్టీ నాయకులు ఎస్.రవీంద్రరాజు, పాతూరి వెంకట సుబ్బారావు, బత్తిన నరశింహారావు, కందుకూరి సత్యన్నారాయణ, మువ్వల వెంకట రమణారావు, మీనాకుమారి, గోలి నాగేశ్వరరావు, పేర్ల సుబ్బన్న, నరాల రమణారెడ్డి, ఈదా సుధాకరరెడ్డి, ఖలీఫాతుల్లాభాషా, ఎం.వెంకటేశ్వర్లు, సెగ్గం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాపులపై వేధింపులను ఉపసంహరించుకోవాలి.. సమావేశం ప్రారంభానికి ముందుగా కాపు సంఘం నేతలు గాదె కృష్ణారావు, ధనుంజయ, కొక్కిరాల సంజీవ్‌కుమార్, తోట రంగారావు, ఆరిగ చలమయ్య తదితరులు మంత్రి మాణిక్యాలరావును దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం ముద్రగడ పద్మనాభం చేపడుతున్న దీక్షకు సంబంధించి వినతిపత్రాన్ని ఆయనకు అందించారు. తునిలో జరిగిన ఘటనలో అమాయకులను కేసుల పేరుతో పోలీసులు వేధిస్తున్నారని, గతంలో సీఎం చెప్పినట్లుగా కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. కాపులను బీసీలలో చేర్చే అంశంపై మంజునాధన్ కమిషన్ వేసినా వాస్తవానికి ఇంతవరకు కమిషన్ అడుగు కూడా ముందుకు వేయలేదని, కనుక తక్షణమే కమిషన్ చర్యలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. -
నేడు కేంద్ర మంత్రి స్మృతీ ఇరాని రాక
విజయవాడ : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరాని మంగళవారం నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా పార్టీ చేపట్టిన వికాస్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె నగరంలో పర్యటించనున్నట్లు ఉమామహేశ్వరరాజు తెలి పారు. ఉదయం 11.30 గంటలకు వన్‌టౌన్ కేబీఎన్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో, సాయంత్రం 4గంటలకు ఎ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని ఆయన వివరించారు.