vinaychand
-
వలస కార్మికులకు 12 వస్తువులు
సాక్షి, మహారాణిపేట: లాక్డౌన్ కారణంగా పనుల్లేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు 12 రకాల నిత్యావసర సరకులు అందజేయనున్నట్టు కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి తదితర ప్రాంతాల్లో 12 వేల మంది వలస కార్మికులను గుర్తించామని వెల్లడించారు. వీరికి గురువారం నుంచి ప్యాకింగ్ చేసిన 12 రకాల సరకులు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 10 కిలోల బియ్యం, ఐదు కిలోల చొప్పున గోధుమ పిండి, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, రెండు కిలోల చొప్పున కందిపప్పు, కిలో చొప్పున ఉప్పు, నూనె, పంచదార, పావు కిలో కారం, చింతపండు, 100 గ్రాముల పసుపు, 200 గ్రాముల టీ పొడితో 20 వేల ప్యాకింగ్‌లు సిద్ధం చేశామన్నారు. గ్రామీణులకూ పరీక్షలు: కేజీహెచ్‌లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా అనుమానితులకు పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. నర్సీపట్నం, అనకాపల్లిలో ట్రూ నైట్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో ఫలితం గ్రీన్ వస్తే కేజీహెచ్‌కు పంపిస్తామన్నారు. నర్సీపట్నం కేంద్రం పరిధిలో నర్సీపట్నం, పాడేరు, అరకు, యలమంచలి.. అనకాపల్లి పరిధిలో అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలు వస్తాయన్నారు. కేజీహెచ్‌లో కరోనా నిర్ధారిత పరీక్షల సామర్థ్యం రోజుకు వంద నుంచి 450కు పెంచుతామని, పలు రకాలైన కిట్లు వస్తే రోజుకు 700 మంది వరకు పరీక్షలు నిర్వహించవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో లాక్డౌన్ నిబంధనల అమలుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ మినహాయింపులు వర్తించవని స్పష్టం చేశారు. 10,600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: రబీలో పండించిన వరి, మొక్కజోన్న కొనుగోలు కోసం ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. 10,600 మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేయనున్నట్టు చెప్పారు. మొక్కజోన్న కొనుగోలుకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ అనుబంధ పంటలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఏజెన్సీలో 12 వేల ఎకరాల్లో కాఫీ విస్తరణ పనులు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. కూలీలకు ఇబ్బంది లేకుండా ఉపాధి పనులు కలి్పస్తున్నామన్నారు. ఉపాధి పనుల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. లాక్డౌన్ సమయంలో కంపెనీలు, షాపులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కారి్మకులకు జీతాలు చెల్లించాలని సూచించారు. ఈ నెల 21 నుంచి రోడ్డు, నీటి పారుదల ప్రాజెక్టులు, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు, భవన నిర్మాణాలు చేపట్టవచ్చన్నారు. ఐటీ కంపెనీలు 50 శాతం ఉద్యోగులతో పనిచేయించుకోవచ్చన్నారు. ఆస్పత్రులు, వాటికి సంబంధించిన సరీ్వసులు ప్రారంభించవచ్చని.. మినహాయింపులు ఉన్న చోట తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జార్ఖండ్ కూలీల అడ్డగింత మాధవధార కల్యాణ మండపంలోని షెల్టర్‌కు తరలింపు విశాఖపట్నం: లాక్డౌన్ కారణంగా ఆటోనగర్‌లో పైప్‌లైన్ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో జార్ఖండ్‌కు చెందిన 22 మంది కార్మికులు కాలినడకన సొంతూళ్లకు పయనమవ్వగా.. మార్గమధ్యలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని, తమ ఊళ్లకు పంపించాలని కార్మికులు కోరగా.. వారిని నిలువరించి మాధవధారలోని నిరాశ్రయుల కేంద్రానికి తరలించారు. ఆటోనగర్‌లో గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణానికి ఓ కాంట్రాక్టర్ ద్వారా ఆన్‌షోర్ కన్స్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో పని చేయడానికి ఫిబ్రవరిలో జార్ఖండ్ నుంచి పలువురు కార్మికులు విశాఖకు వచ్చారు. ఇంతలో కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో పనులు నిలిచిపోయాయి. పోలీసులు అడ్డుకోవడంతో కంచరపాలెం పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద కూర్చున్న కార్మికులు గత నెల 23 నుంచి కార్మికులు ఆటోనగర్‌లో తాత్కాలిక షెడ్లలోనే ఉన్నారు. వీరిని తీసుకువచ్చిన కాంట్రాక్టర్ భోజన ఏర్పాట్లు సక్రమంగా చేయకపోవడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 14తో లాక్డౌన్ ముగుస్తుందని భావించినప్పటికీ.. కేంద్రం మరో 19 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఇక్కడ ఉండడం కన్నా, తమ ఇళ్లకు వెళ్లిపోవాలని భావించిన 22 మంది బుధవారం కాలినడకన జార్ఖండ్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద పోలీసులు వారిని గమనించి అడ్డుకుని వివరాలు ఆరా తీశారు. తమను ఇళ్లకు పంపించాలని కార్మికులు పోలీసులను వేడుకున్నారు. అయితే పోలీసులు వారిని నిలువరించి అక్కడే భోజన ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికారులకు ఈ సమాచారం చేరవేశారు. అనంతరం వారిని మాధవస్వామి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నిరాశ్రయుల కేంద్రానికి తరలించారు. -
కట్టుదిట్టంగా జీవీఎంసీ ఎన్నికలు: కలెక్టర్
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 13 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు. 14న నామినేషన్ల పరిశీలన.. 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకి గడువు ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 23న పోలింగ్..27న కౌంటింగ్ జరుపుతామని పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికలకు మొత్తం 1712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ నిర్వహణకి 2200 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశామని చెప్పారు. (ఏపీలో మోగిన పుర భేరీ) 10,600 మంది పోలింగ్ సిబ్బంది గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికలకి 10,600 మందిని పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించామన్నారు. ప్రిసైడింగ్ అధికారులకి సైతం ఎన్నికల నిర్వహణపై మూడు రౌండ్ల శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల తుది జాబితాకు అనుగుణంగా పూర్తి పోలీస్ రక్షణ మధ్య బ్యాలెట్ పేపర్ల ముద్రణ చేపడుతున్నామన్నారు. జీవీఎంసీ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,52,927... కాగా, 8,80,481 పురుషు ఓటర్లు, 8,73,320 మహిళా ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వివరించారు. (ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ల నియామకం) కట్టుదిట్టమైన చర్యలు ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు విశాఖ కమిషనర్ ఆర్కే మీనా, డిసీపీ రంగారెడ్డి తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పోలీస్, రెవెన్యుతో జాయింట్ తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నూతన చట్టం ప్రకారం డబ్బు,మద్యం పంపిణీ చేస్తే ఎన్నికైనా తర్వాతైనా అనర్హత వేటు పడుతుందని స్పష్టం చేశారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయబోతున్నామని పేర్కొన్నారు. -
‘సంచలనాత్మక నిర్ణయాలు అమలు చేశారు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబూరావు, విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, జీవీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రం.. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటుకు మహానుభావుడు పొట్టి శ్రీరాములు చేసిన కృషి అనిర్వచనీయం అని పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగాన్ని నేడు స్మరించుకోవాల్సిన రోజు అని అన్నారు. సంచలన నిర్ణయాలు అమలు చేశారు.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల కాలంలోనే సంచలనాత్మమైన నిర్ణయాలు అమలు చేశారన్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా సచివాలయాల ఉద్యోగాల భర్తీ అత్యంత చారిత్రాత్మకం అని కొనియాడారు. గత నాలుగు నెలల కాలంలోనే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని వెల్లడించారు. పాడేరులో త్వరలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు కాబోతోందని తెలిపారు. విశాఖ నగర వాసులకి తాగునీటి సమస్య తీర్చేలా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. విశాఖలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ తెలిపారు. గత ప్రభుత్వం విస్మరించింది.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని గత టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. అమరజీవి పొట్టి శ్రీరాములను స్మరించుకోవడానికే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోందన్నారు. నేడు తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజు అని వెల్లడించారు. పవిత్రదినంగా పాటించాలి.. ఆంధ్రులకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. నవంబర్ 1ని పవిత్ర దినంగా పాటించాలని సూచించారు. చరిత్రలో నిలిచిపోయిన రోజు.. ‘నవంబర్ 1’ చరిత్రలో నిలిచిపోయిన రోజు అని వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగానే తెలుగు రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పారు. నాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖపట్నం అభివృద్ధి జరిగిందని గుర్తుచేశాడు. నేడు సీఎం వైఎస్ జగన్ విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. పొట్టి శ్రీరాముల త్యాగాన్ని ప్రతి ఏటా స్మరించే అవకాశాన్ని సీఎం వైఎస్ జగన్ కల్పించారన్నారు. -
ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పరిహార పత్రాల మంజూరు
ఒంగోలు టౌన్ : ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి ముగ్గురు బాధితులకు కలెక్టర్ వి.వినయ్‌చంద్ బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో పరిహార పత్రాలు మంజూరు చేశారు. 2011లో చినగంజాం అంబేడ్కర్ నగర్‌కు చెందిన తెలగతోటి చినగురవయ్య, మేడికొండ శ్రీను, గంటెనపల్లి కిషోర్‌బాబులను అదే గ్రామానికి చెందిన కొంతమంది అగ్రవర్ణాల వారు కులం పేరుతో దూషించి దాడి చేశారు. ఈ మేరకు బాధితులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం ఇంతవరకూ ఇవ్వలేదంటూ బాధితులు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే కేసుకు సంబంధించి బాధితులు ఒక్కొక్కరికి 6250 రూపాయల పరిహారం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సదరు మొత్తాన్ని ఖజానా కార్యాలయం నుంచి డ్రా చేసి వెంటనే బాధితులకు అందజేయాలని చిన్నగంజాం మండల తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించా రు.బాధితులకు పరిహార పత్రాలు మంజూరు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.