ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పరిహార పత్రాల మంజూరు
ఒంగోలు టౌన్ : ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి ముగ్గురు బాధితులకు కలెక్టర్ వి.వినయ్‌చంద్ బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో పరిహార పత్రాలు మంజూరు చేశారు. 2011లో చినగంజాం అంబేడ్కర్ నగర్‌కు చెందిన తెలగతోటి చినగురవయ్య, మేడికొండ శ్రీను, గంటెనపల్లి కిషోర్‌బాబులను అదే గ్రామానికి చెందిన కొంతమంది అగ్రవర్ణాల వారు కులం పేరుతో దూషించి దాడి చేశారు. ఈ మేరకు బాధితులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం ఇంతవరకూ ఇవ్వలేదంటూ బాధితులు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే కేసుకు సంబంధించి బాధితులు ఒక్కొక్కరికి 6250 రూపాయల పరిహారం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సదరు మొత్తాన్ని ఖజానా కార్యాలయం నుంచి డ్రా చేసి వెంటనే బాధితులకు అందజేయాలని చిన్నగంజాం మండల తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించా రు.బాధితులకు పరిహార పత్రాలు మంజూరు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.