Vipul
-
Vipul Varshney: ఎదుర్కోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి
‘కోరుకున్న రంగంలో రాణించాలంటే మనలో ఒక తపన ఉండాలి. ఒక తపస్సులా ఆ రంగాన్ని స్వీకరించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి’ అంటారు ఐదు పదుల వయసు దాటిన విపుల్ వర్షిణే. లక్నోవాసి అయిన విపుల్ వర్షిణే ముప్పైఏళ్లుగా ఆర్కిటెక్చర్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ, గుర్తింపు పొందారు. ఒక్కరూ తన మాట వినడం లేదు అనే నిరాశ నుంచి రెండు విమానాశ్రయాల రూపకల్పన చేసేంత స్థాయికి ఎదిగారు. విపుల్ వర్షిణే తనను తాను శక్తిగా మలుచుకున్న విధానం నేటి మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుంది. ‘నా పేరు విపుల్ అనే ఉండటంతో మగ ఆర్కిటెక్ట్ అనుకుని, సంప్రదించేవారు. నేను మహిళను అని తెలిసి వర్క్ ఇవ్వడానికి వెనకడుగు వేసేవారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొంతమార్పు చూస్తున్నాను కానీ, 30 ఏళ్ల క్రితం నేను ఆర్కిటెక్ట్ అని చెబితే చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు నేను రెండు విమానాశ్రయాలను డిజైన్ చేసే స్థాయికి ఎదిగాక ఈ రంగంలో అమ్మాయిలూ రాణించగలరు అనే స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని నిరూపించడానికి నేను చేసిన ప్రయత్నం ఆషామాషీ కాదు. సృజనతో అడుగు పుట్టి, పెరిగింది లక్నోలో. స్కూల్ ఏజ్ నుంచి పెయిం టింగ్స్ వేయడం, కార్టూన్స్ గీయడం వంటివి చూసి వాటిని పత్రికలకు పంపించే వారు నాన్న. మొదట నేను మెడిసిన్ చదవాలని కోరుకున్న మా నాన్న నాలోని సృజనాత్మకత చూసి ఆర్కిటెక్ట్ ఇంజినీరింగ్ చేయమని సలహా ఇచ్చారు. ఎందుకంటే ఆర్కిటెక్చర్ సైన్స్, సృజనాత్మకతల సమ్మేళనంగా ఉంటుంది. మా నాన్న మనసులో నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, అది నాకు సురక్షితమైనదని భావించేవారు. నేను ఎంచుకున్న రంగం చాలా శ్రమతో కూడుకున్నదని ఆయనకు తెలియదు. అప్పట్లో కంప్యూటర్లు లేవు కాబట్టి రాత్రంతా డ్రాయింగ్ బోర్డ్ పైనే పని చేయాల్సి వచ్చేది. ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.. ’’నేను ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు మా క్లాస్‌లో ముగ్గురం మాత్రమే అమ్మాయిలం. ఈ వృత్తిలో అబ్బాయిలదే అధిపత్యమని అప్పుడు అర్థమైంది. కాలేజీలో చదివే సమయంలోనే పెళ్లి అయ్యింది. మావారు సివిల్ ఇంజనీర్ కాబట్టి పెళ్లయ్యాక ఆయనతోనే కెరీర్ప్రారంభించాను. భవనాలు కట్టే లొకేషన్‌కు వెళ్లేటప్పుడు నాతో మాట్లాడేందుకు కూలీలు తడబడేవారు. మేస్త్రీలు నా మాటలను అస్సలు పట్టించుకునేవారు కాదు. ఒక మహిళ యజమానిగా మారడం వారెవరికీ ఇష్టం ఉండదని అప్పుడు అర్ధమైంది. అసలు నన్ను వారు నిర్మాణశిల్పిగా అంగీకరించలేదు. నిరాశగా అనిపించేది. కానీ, నా డిజైన్ ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని నా నిర్ణయాన్ని సున్నితంగానూ, అంతే కచ్చితంగానూ తెలియజేశాను. అక్కడ నుంచి ఆర్కిటెక్ట్‌గా ఎదగడానికి నన్ను నేను మార్చుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆఫీస్‌లో నాకు, నా భర్తకు విడివిడిగా క్యాబిన్లు ఉండేవి. క్లయింట్స్ వచ్చినప్పుడల్లా నా సలహా తీసుకోవాలని నా భర్త తరచూ వారికి చె΄్పాల్సి వచ్చేది. తీసుకున్నప్రాజెక్ట్ పూర్తి చేయడం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టేదాన్ని. కానీ వచ్చిన వాళ్లు మాత్రం ‘మిస్టర్ విపుల్ వర్షిణే ఎప్పుడు వస్తారు’ అని అడిగేవారు. నేనే విపుల్ అని, ఆర్కిటెక్ట్ అని తెలిసి ఆశ్చర్యపోయేవారు. 200 భవనాల జాబితా భవన నిర్మాణంలో నా వర్క్‌ని కొనసాగిస్తూనే లక్నోలోని చారిత్రక కట్టడాలపై, వాటి పరిరక్షణ గురించిప్రాజెక్ట్ వర్క్ చేశాను. అక్కడి వారసత్వ కట్టడాల పట్ల ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదని తెలుసుకొని దాదాపు 200 భవనాల జాబితాను తయారు చేశాను. ఆ జాబితాను పురావస్తు శాఖకు అప్పగించాను. ఆ సమయంలోనే 500 పేజీల ఆప్రాజెక్ట్ వర్క్‌ని పుస్తకంగా తీసుకువస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న సన్నిహితుల సలహాతో బుక్‌గా తీసుకువచ్చాను. అలా రచనా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఇప్పటి వరకు మన దేశ వారసత్వ సంపదపైన ముఖ్యంగా లక్నో సంస్కృతి, వారసత్వ నగరం, చరిత్ర ద్వారా నడక, మ్యూజింగ్స్ ఇన్ బెనారస్, ఎ కెలిడోస్కోప్ ఆఫ్ ది హార్ట్, లక్నో ఎ ట్రెజర్ పేర్లతో 5 పుస్తకాలు ప్రచురిత మయ్యాయి. ఇటేవలే అయోధ్యకు సంబంధించి ఎ వాక్ త్రూ ది లివింగ్ హెరిటేజ్ ప్రచురితమైంది. ‘షామ్ ఎ అవద్ పుస్తకంలో లక్నో సంస్కృతిపై స్కెచ్‌లు కూడా వేశాను. లక్నోలోని చికంకారీ ఎంబ్రాయిడరీ, ఈ నగరంలోని వీధులు, మార్కెట్ల గురించి ప్రస్తావించాను. లక్నో ఇన్టాక్కి కన్వీనర్‌గా ఉన్నాను. లేహ్ విమానాశ్రయం .. ఓ సవాల్! 2018లో లేహ్ ఎయిర్పోర్ట్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. ఈప్రాజెక్ట్ నాకు అత్యంత సవాల్‌గా ఉండేది. ఎందుకంటే అక్కడ భూమి, పర్యావరణం చాలా భిన్నంగా ఉంటాయి. పర్వతాల కారణంగా భూభాగం చాలా తేడాగా ఉంటుంది. విమానాశ్రయం అరైవల్, డిపార్చర్ లాంజ్‌ల మధ్య 3 అంతస్తుల వ్యత్యాసం ఉంది. అక్కడ లగేజీ బెల్ట్ రివర్స్ చేయాల్సి వచ్చింది. ఉష్ణోగ్రత చాలా తక్కువ కాబట్టి, ఎయిర్ కండీషనర్లలో ఉపయోగించే ద్రవం ఘనీభవన స్థానం కంటే తక్కువగా ఉంది. అలాంటప్పుడు ప్రత్యేక రసాయనాలను ఉపయోగించి, దానిని ఏర్పాటు చేశాను. లేహ్‌లో అనేక బౌద్ధ విహారాలు ఉన్నాయి. ప్రవేశం ద్వారం వద్ద 30 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహాన్ని ఉంచాను. అక్కడి స్థానిక సంస్కృతి, కళ, హస్తకళలను దృష్టిలో ఉంచుకుని రంగు రంగుల వలలు,ప్రార్థన చక్రాలను ఏర్పాటు చేయించాను. అయోధ్య విమానాశ్రయం పనిప్రారంభించినప్పుడు అక్కడ మహంతులు, సాధువులను కలుస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే అక్కడి నిర్మాణాన్ని బాగా అర్థం చేసుకోవాలి, సరైన సమాచారం కోసం చాలా పుస్తకాలు చదివాను. వివిధ వృత్తులలో ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. దీంతో అయోధ్యపై నాకు ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత దానినే పుస్తకంగా తీసుకు వచ్చాను. ఒక సృజనాత్మక వ్యాపకం నన్నూ నా దిశను మార్చింది. సవాల్‌గా ఉన్న రంగంలో సమున్నతంగా నిలబడేలా చేసింది. ఏ రంగం ఎంచుకున్నా అందులో మనదైన ముద్ర తప్పక వేయాలి. అప్పుడే, ఎక్కడ ఉన్నా సరైన గుర్తింపు లభిస్తుంది’ అని వివరిస్తారు విపుల్ వర్షిణే. -
భారత్‌లో మరిన్ని పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ సీఈవో (దక్షిణాసి యా) విపుల్ తులి తెలిపారు. దేశీయంగా మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. భారత్‌లో కేవలం తమ థర్మల్ పోర్ట్‌ఫోలియోనే విక్రయిస్తున్నామని, దేశం నుంచి నిష్క్రమించే యోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేయబోమంటూ 2020లో చేసిన ప్రకటనకు అనుగుణంగానే థర్మల్ పోర్ట్‌ఫోలియో నుంచి తప్పుకుంటున్నామని పేర్కొన్నారు. ఒమన్‌కి చెందిన తన్వీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సెంబ్‌కార్ప్ ఎనర్జీ ఇండియా (ఎస్ఈఐఎల్)లో పూర్తి వాటాలు విక్ర యించడం వల్ల సంస్థ ఉద్యోగులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఆయ న స్పష్టం చేశారు. కొత్త యా జమాన్యం కింద వారు యథాప్రకారం కొనసాగుతా రని తులి వివరించారు. ఈ లావాదేవీ పూర్తయ్యాక తమ సంస్థ పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామ ర్థ్యం 1730 మెగావాట్లుగా ఉంటుందని, 700 మెగావాట్ల ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నాయని ఆయ న పేర్కొన్నారు. ఈ డీల్‌తో వచ్చే నిధుల్లో కొంత భాగాన్ని పునరుత్పాదక విద్యుత్ పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసుకోవడం కోసం వినియోగించనున్న ట్లు వివరించారు. అగ్రగామి పవన విద్యుత్ సంస్థ ల్లో ఒకటిగా ఉన్న తమ కంపెనీ, సౌర విద్యుత్ విభాగంలోనూ శక్తివంతమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించు కునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తులి చెప్పారు. అలాగే విద్యుత్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి విభాగాల్లో నూ అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు. -
విపుల్ అంబానీ అరెస్ట్
న్యూఢిల్లీ/ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) కుంభకోణం కేసులో సీబీఐ కొరడా ఝుళిపించింది. ఇంతవరకూ పీఎన్బీ అధికారుల అరెస్టుతోనే సరిపెట్టిన సీబీఐ.. నీరవ్ మోదీ కంపెనీ ‘ఫైర్ స్టార్ డైమండ్’లో అత్యున్నత హోదాలో కొనసాగుతున్న కంపెనీ ప్రెసిడెంట్(ఫైనాన్స్) విఫుల్ అంబానీని అదుపులోకి తీసుకుంది. ఆయనతోపాటు మరో నలుగురు ఎగ్జిక్యూటివ్‌లను కూడా అరెస్టు చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త దివంగత ధీరూభాయ్ అంబానీకి విఫుల్ బంధువని తెలుస్తోంది. మరోవైపు ఆదాయపు పన్ను శాఖ ఈ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ భార్య అనితా సింఘ్వీకి నోటీసులు జారీచేసింది. నీరవ్ కంపెనీలకు చెందిన 8 మంది, గీతాంజలి గ్రూపునకు చెందిన 10 మంది ఉన్నత స్థాయి అధికారుల్ని సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. అనంతరం విఫుల్ అంబానీతో పాటు నీరవ్ కంపెనీలకు చెందిన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కవితా మన్కికర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ పాటిల్, నక్షత్ర గ్రూపు, గీతాంజలి గ్రూపుల సీఎఫ్ఓ కపిల్ ఖండేల్వాల్, గీతాంజలి గ్రూపు మేనేజర్ నితెన్ షాహిలను అరెస్టుచేసింది. అలాగే పీఎన్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తో పాటు మరో 9 మంది సీనియర్ అధికారుల్ని విచారించింది. మోదీ, చోక్సీలకు చెందిన 13 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించి రూ. 10 కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసింది. పన్ను ఎగవేత కేసులో గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్ చోక్సీ, అతని అనుబంధ కంపెనీలకు చెందిన 20 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. గీతాంజలి జెమ్స్ మూసివేతకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపు 5 వేల మంది ఉద్యోగులను రాజీనామాలు ఇవ్వాలని కోరుతూ యాజమాన్యం పింక్ స్లిప్‌లు జారీ చేసింది. కాగా, నీరవ్ కేసును సిట్‌తో దర్యాప్తు చేయించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది. నీరవ్ కంపెనీతో సంబంధం లేదు: సింఘ్వీ అభిషేక్ సింఘ్వీ భార్య, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీకి ఈ కేసుతో ప్రమేయముందని బీజేపీ ఇప్పటికే ఆరోపించగా.. నాలుగేళ్ల క్రితం మోదీ షోరూం నుంచి రూ. 6 కోట్ల ఆభరణాలు కొనుగోలుకు ఎంత నగదు చెల్లించారు? చెక్కు రూపంలో ఎంత ఇచ్చారు? వాటి ఆదాయ మార్గాలు చెప్పాలని అనితా సింఘ్వీని ఐటీ శాఖ కోరింది. చెక్కు ద్వారా రూ. 1.5 కోట్లు, నగదు రూపంలో రూ4.8 కోట్లు అనిత చెల్లించినట్లు ఐటీ అంచనాకు వచ్చింది. నోటీసుపై సింఘ్వీ ట్వీటర్లో స్పందిస్తూ.. నగదు రూపంలో కొనుగోలుకు ఎలాంటి ఆధారం లేదని, మొత్తం రూ. 1.56 కోట్లు చెక్కు రూపంలోనే చెల్లించామని చెప్పారు. స్కాంను గుర్తించడంలో విఫలం: జైట్లీ పీఎన్బీ కుంభకోణంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎట్టకేలకు మౌనాన్ని వీడారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఆర్థిక నేరగాళ్లను పట్టుకునేందుకు చివరిదాకా చట్టబద్ధంగా పోరాడడం ప్రభుత్వ భాద్యత’ అని చెప్పారు. నీరవ్ మోదీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు కేసును ప్రస్తావించకుండా.. ఏడేళ్ల నుంచి కుంభకోణం జరుగుతున్నా బ్యాంకు ఆడిటర్లు ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నించారు. ‘మేనేజ్మెంట్లకు అధికారం కట్టబెట్టినప్పుడు.. ఆ అధికారాన్ని సమర్థంగా, సరైన పద్దతిలో వినియోగిస్తారని ఆశిస్తాం. మేనేజ్మెంట్లు విఫలమయ్యాయా? అని ప్రశ్నించుకుంటే సమాధానం అవుననే అనిపిస్తోంది. ఎవరు దారితప్పారో గుర్తించడంలో విఫలమయ్యారు.’ అని జైట్లీ పేర్కొన్నారు. రొటొమ్యాక్కు చెందిన 14 బ్యాంకు ఖాతాలు అటాచ్ రొటొమ్యాక్ కుంభకోణంలో ఆ కంపెనీ, దాని ప్రమోటర్లకు చెందిన 14 బ్యాంకు ఖాతాల్ని ఆదాయపు పన్ను శాఖ అటాచ్ చేసింది. పన్ను ఎగవేత ఆరోపణల మేరకు ఈ చర్యలు తీసుకుంది. 11 ఖాతాల్ని సోమవారం రాత్రి అటాచ్ చేయగా.. మరో మూడు ఖాతాలు గత నెలలోనే అటాచ్ చేసింది. విక్రమ్ కొఠారి, మరో ఇద్దరు కుటుంబసభ్యులు దేశం వదిలి పారిపోకుండా ముందు జాగ్రత్తగా అన్ని ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలకు ఈడీ సమాచారమిచ్చింది. ఆరోపణల్ని నిరూపించలేరు.. నీరవ్ దేశం వదిలి పారిపోయారన్న వార్తల్ని అతని తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ తోసిపుచ్చుతూ.. రూ. 5–6 వేల కోట్లకు పైగా ఆస్తుల్ని వదిలి ఎవరైనా ఎందుకు దేశం వదిలి పారిపోతారని ప్రశ్నించారు. ప్రస్తుతం నీరవ్, చోక్సీలు ఎక్కడున్నారు? భారత్‌కు ఎప్పుడు వస్తారన్న ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు. ‘నేను కేసును అధ్యయనం చేశాను. ఈ కేసుకూ 2జీ, బోఫోర్స్ గతే పడుతుంది. ఆరోపణల్ని కోర్టులో నిరూపించలేరు. అందుకు ఎలాంటి ఆధారాలు లేవు’ అని చెప్పారు. -
కన్నయ్య తపన
‘ఎంత కష్టమైనా తాను అనుకున్నది సాధించాలన్నది ఆ యువకుడి తపన. తన లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకున్నాడు?’అనే అంశంతో తెరకెక్కిన చిత్రం ‘కన్నయ్య’. విపుల్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున ఈ చిత్రాన్ని రాజేష్ జాదవ్, కృష్ణంరాజు పగడాల, రవితేజ తిరువాయిపాటి నిర్మిస్తున్నారు. హర్షిత కథానాయిక. సత్యకశ్యప్, ఘంటసాల విశ్వనాధ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న విడుదల చేశారు. సినిమా ట్రైలర్‌ను కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్. వేణుగోపాలచారి రిలీజ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, కుటుంబ బంధాల మేళవింపుతో తెరకెక్కుతోన్న చిత్రమిది. పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు. చిత్ర నిర్మాతలు, నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, దామోదర ప్రసాద్, మల్కాపురం శివకుమార్, డి.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు. -
కన్నయ్య లక్ష్యం ఏంటి?
విపుల్, హర్షిత జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘కన్నయ్య’. విపుల్ దర్శకత్వంలో జాదవ్ రాజేష్ బాబు, పగడాల కృష్ణంరాజు, తిరువాయిపాటి రవితేజ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కుటుంబ విలువలు, బంధాలు, సెంటిమెంట్, వినోదం అన్నీ సమపాళ్లలో ఉంటాయి. కన్నయ్య ఎవరు? అతని లక్ష్యం ఏంటి? అనేది కథాంశం. సత్యకశ్యప్ సంగీతం ప్రేక్షకులను అలరిస్తుంది. జవహర్ రెడ్డి ప్రతి ఫ్రేమ్‌ను చాలా అద్భుతంగా చూపించారు. త్వరలో పాటలు, ఫిబ్రవరిలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వైవిధ్యమైన కథాంశం నేపథ్యంలో తెరకెక్కిన మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ఉత్తేజ్, కాశీ విశ్వనాథ్, సత్యకృష్ణ, సూర్య తదితరులు నటించారు.