Virus tests
-
మంకీపాక్స్-చికెన్‌పాక్స్ తేడాలు తెలుసా?
కరోనా కథ తగ్గుముఖం పడుతుందనుకున్న టైంలో.. మంకీపాక్స్ వైరస్ కలకలం మొదలైంది. కేవలం ఆఫ్రికాకు మాత్రమే పరిమితం అయ్యిందనుకున్న ఈ వైరస్.. యూరప్, అమెరికా ఖండాల్లో కేసులతో కలకలం రేపుతోంది. ఇప్పుడు భారత్‌లోనూ కేసులు వెలుగు చూస్తుండడం, తాజాగా కేరళలో ఒక మరణం నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో కలకలం.. అంటూ నిత్యం ఏదో మూల దేశంలో ఇప్పుడు ఇది వినిపిస్తోంది. దీనికి తోడు వ్యాధి లక్షణాలు కనిపించిన వాళ్లకు.. మంకీపాక్స్ సోకిందేమో అని అధికారులు హడలిపోతుండడం, వైరస్ నిర్ధారణకు శాంపిల్స్‌ను పంపిస్తుండడం.. చూస్తున్నాం. అయితే నెగెటివ్‌గా తేలిన కేసులన్నీ చాలావరకు చికెన్‌పాక్స్ కావడం ఇక్కడ అసలు విషయం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, రాజస్థాన్, యూపీ.. ఇలా చాలా చోట్ల వైరస్ భయంతో పరీక్షించగా.. నెగెటివ్‌గా తేలడం, అవన్నీ చికెన్‌పాక్స్ కేసులు కావడం గమనార్హం. అయితే.. మంకీపాక్స్ లక్షణాలు చాలా వరకు చికెన్ పాక్స్ తరహాలోనే ఉండటంతో గందరగోళం నెలకొంటోంది. వర్షాల నేపథ్యంలో చికెన్ పాక్స్ విస్తరిస్తుండడంతోనే ఇదంతా. పైగా లక్షణాలు కూడా ఒకేలా ఉండడంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు. చికెన్ పాక్స్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుండడమే అందుకు కారణం. రెండింటి తేడా తెలుసుకుంటే.. కొంతవరకు ఆందోళన తగ్గవచ్చు. చికెన్ పాక్స్ లక్షణాలు ► ముందుగా చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి. ► ఆ తర్వాత జ్వరం లక్షణం కనిపిస్తుంది. ► చికెన్ పాక్స్ లో దద్దుర్లు కాస్త చిన్నగా ఉంటాయి. విపరీతంగా దురద ఉంటుంది. ► అరచేతులు, పాదాల దిగువన దద్దుర్లు ఏర్పడే అవకాశం చాలా తక్కువ. ► చికెన్ పాక్స్ వల్ల ఏర్పడే దద్దుర్లు..పొక్కులు ఏడెనిమిది రోజుల తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. మంకీపాక్స్ లో .. ► మంకీపాక్స్ సోకిన వారిలో ముందుగా జ్వరం, తలనొప్పి, కొందరిలో దగ్గు, గొంతు నొప్పి, లింఫ్ నాళాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ► సుమారు నాలుగు రోజుల తేడాలో చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి. ► మంకీపాక్స్‌లో దద్దుర్లు పెద్దగా ఉంటాయి. దురద ఎక్కువగా ఉండదు. ► పొక్కులు ముందుగా చేతులు, కళ్ల వద్ద ఏర్పడి.. తర్వాత శరీరమంతా విస్తరిస్తాయి. ► మంకీ పాక్స్ లో అర చేతులు, పాదాలపైనా దద్దర్లు వస్తాయి. ► చాలా మందిలో 21 రోజుల వరకు కూడా అవి ఏర్పడుతూనే ఉంటాయి. ► జ్వరం కూడా ఎక్కువ రోజుల పాటు ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఇక.. ఆందోళన వద్దు, కానీ.. మంకీ పాక్స్, చికెన్ పాక్స్ రెండూ కూడా ప్రమాదకరం కాదని, మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండింటిలో దేని లక్షణాలు గుర్తించినా.. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. ఒక్కోసారి వ్యక్తుల రోగ నిరోధక శక్తిని(ఇమ్యూనిటీ) బట్టి లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఏ అనారోగ్యమైనా సరే కచ్చితంగా వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
పరీక్షలు చేయించుకోకపోతే.. హత్యాయత్నం కేసు..
కాన్పూర్/గువాహటి: తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొని, కరోనా వైరస్ పరీక్ష చేయించుకోకుండా మొండికేస్తున్న వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతోపాటు కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని(ఎన్ఎస్ఏ) సైతం ప్రయోగిస్తామని ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. దేశంలో ఇప్పటికే బయటపడ్డ 4,069 కరోనా పాజిటివ్ కేసుల్లో కనీసం 1,445 కేసులు తబ్లిగీ జమాత్‌కు సంబంధించినవేనని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో చాలామంది కరోనా పరీక్షలు చేయించుకోవడం లేదు. వారు ఇప్పటికైనా ముందుకు రావాలని, ఇదే చివరి అవకాశమని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ చెప్పారు. పరీక్షల కోసం రాకపోతే హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని, వారిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తామని తేల్చిచెప్పారు. తబ్లిగీ జమాత్ సభ్యులతోపాటు వారిని కలిసినవారికి కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఎన్ఎస్ఏ ప్రకారం.. ఒక వ్యక్తిని 12 నెలల వరకు నిర్బంధించవచ్చు. తబ్లిగీ జమాత్ సభ్యులు సహకరించకపోతే కఠిన చర్యలు తప్పవని ఉత్తరాఖండ్ డీజీపీ అనిల్‌కుమార్ రాతూరీ స్పష్టం చేశారు. 25,500 మంది తబ్లిగీ సభ్యుల క్వారంటైన్ ఇప్పటిదాకా 25,500 మందికిపైగా తబ్లిగీ జమాత్ సభ్యులను, వారితో సంబంధం ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించినట్లు హోంశాఖ సీనియర్ జాయింట్ సెక్రెటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ వెల్లడించారు. హరియాణాలో ఐదు గ్రామాలను పూర్తిగా దిగ్బంధించి, అక్కడి ప్రజలందరినీ క్వారంటైన్ చేశామన్నారు. తబ్లిగీకి చెందిన విదేశీ సభ్యులు ఆయా గ్రామాల్లో తలదాచుకున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన 2,083 మంది విదేశీయుల్లో ఇప్పటివరకు 1,750 మందిని బ్లాక్‌లిస్టులో చేర్చామన్నారు. -
ఆ ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు..
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి కొన్ని ప్రైవేటు ల్యాబ్స్‌కు అనుమతిచ్చింది.12 ప్రైవేటు ల్యాబ్‌తో కూడిన ఓ జాబితాను కేంద్రం సోమవారం విడుదల చేసింది. అందులో ల్యాబ్ పేరు, పూర్తి అడ్రస్‌ను పేర్కొంది. మహారాష్ట్రలో 5, హరియాణాలో 2, తమిళనాడులో 2, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటకలలో ఒక్కో ల్యాబ్ చొప్పున కరోనా నిర్ధారణ పరీక్షలకు అవకాశం కల్పించింది. కాగా, ఇప్పటివరకు దేశంలో 433 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ప్రైవేట్ ల్యాబ్స్.. -
ఎబోలా నిరోధానికి కసరత్తు
19, 20 తేదీల్లో రాష్ట్రాల అధికారులకు ఢిల్లీలో శిక్షణ న్యూఢిల్లీ/ముంబై: ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకించి, పశ్చివూఫ్రికా దేశాల్లో దాదాపు 4వేలమందికిపైగా వుృతికి కారణమైన భయనక ఎబోలా వ్యాధి నిర్ధారణ, నిరోధంపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య అధికారులకు శిక్షణ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం సంకల్పించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్, కేంద్ర హోంశాఖ కార్యద ర్శి అనిల్ గోస్వామి నిర్వహించిన ఉన్నతస్థారుు సవూవేశంలో ఈ మేరకు నిర్ణయుం తీసుకున్నారు. ఈ నిర్ణయుంమేరకు ఎబోలా నిరోధంపై వివిధ రాష్ట్రప్రభుత్వాల అధికారులు ఈ నెల 19,20 తేదీల్లో ఢిల్లీలో శిక్షణపొందుతారని, వారు తవుతవు రాష్ట్రాలకు తిరిగివచ్చి, అధికారులకు శిక్షణ ఇస్తారని అధికారవర్గాలు తెలిపారుు. దేశంలోకి ప్రవేశించే ప్రతి ప్రయూణికుడి కీ ఎబోలా పరీక్షలు నిర్వహించేందుకు తవు తవు రాష్ట్రాల్లోని వివూనాశ్రయూల్లో, ఓడరేవుల్లో తగిన ఏర్పాట్లు చేయూలని, ఎబోలా వైరస్ సోకిన వారెవరూ దేశంలోకి రాకుండా చూడాలని రాష్ట్రప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఆదేశించారు. ఎబోలా ప్రపంచమంతటా వ్యాపించే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని, నిరోధంపై పూర్తిశ్రద్ధతో వ్యవహరించాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచిం చింది. జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి ఎబోలా వ్యాధిలక్షణాలున్నవారితో అతి దగ్గరి శారీరక సంబంధాలవల్లనే ఎబోలా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 8వేల మందికి పైగా ఎబోలా వ్యాధి సోకగా, వారిలో 4వేల మంది మరణించారు. కాగా, ఆఫ్రికా దేశాలనుంచి దేశంలో ప్రవేశించే ప్రయణికులందరిపైనా, ఎబోలా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అంతర్జాతీయు విమానాశ్రయూలన్నింటిలోనూ, అంతర్జాతీయు విమానాలు దిగే పుణె, నాగపూర్ విమానాశ్రయూల్లోను థర్మల్ ఇమేజి స్కానర్లను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం బొంబాయి హైకోర్టుకు తెలియజేసింది. కేంద్రం తరఫు న్యాయవాది రూయ్ రోడ్రిజెస్ ఈ విషయన్ని బొంబాయి హైకోర్టు ధర్మాసనానికి నివేదించారు. ఇదిలా ఉండగా, ఎబోలా సంక్షోభం ఇలాగే కొనసాగిన పక్షంలో అది తీవ్రమైన ఆహార సంక్షోభానికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.