న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి కొన్ని ప్రైవేటు ల్యాబ్స్‌కు అనుమతిచ్చింది.12 ప్రైవేటు ల్యాబ్‌తో కూడిన ఓ జాబితాను కేంద్రం సోమవారం విడుదల చేసింది. అందులో ల్యాబ్ పేరు, పూర్తి అడ్రస్‌ను పేర్కొంది. మహారాష్ట్రలో 5, హరియాణాలో 2, తమిళనాడులో 2, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటకలలో ఒక్కో ల్యాబ్ చొప్పున కరోనా నిర్ధారణ పరీక్షలకు అవకాశం కల్పించింది. కాగా, ఇప్పటివరకు దేశంలో 433 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ప్రైవేట్ ల్యాబ్స్..
Comments
Please login to add a commentAdd a comment