visakha garjana
-
విశాఖలో మంత్రులపై దాడి ఘటనలో ఏసీపీ, సీఐలపై వేటు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడి ఘటన సమయంలో బందోబస్తు కల్పనలోను, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పర్యటనలో విధుల నిర్వహణలోనూ విఫలమైన కారణంగా వెస్ట్ డివిజన్ ఏసీపీ టేకు మోహనరావు, అప్పటి ఎయిర్పోర్ట్ సీఐ సీహెచ్ ఉమాకాంత్‌లను నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ సస్పెండ్ చేశారు. గత నెల 15న విమానాశ్రయం వద్ద మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్ల మీద జనసేన కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మంత్రి రోజా వ్యక్తిగత సహాయకుడి తలకు తీవ్ర గాయమైంది. ఘటనలో ఇప్పటికే సుమారు 100 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరో 80 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత నెల 15వ తేదీన పవన్ విశాఖ పర్యటనకు వస్తున్న సందర్భంలో జనసేన కార్యకర్తలు ఎయిర్‌పోర్టులో రచ్చ రచ్చ చేశారు. పవన్‌కళ్యాణ్ విమానంలో సాయంత్రం 4.30 గంటలకు రాగా.. కార్యకర్తలు మాత్రం మధ్యాహ్నం ఒంటిగంటకే పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని హంగామా చేశారు. ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న హోర్డింగ్స్ పైకెక్కి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఆ రోజున విశాఖ గర్జన ర్యాలీ ముగించుకుని మంత్రులు ఎయిర్‌పోర్టుకు వస్తున్న విషయం తెలిసినప్పటికీ వారికి బందోబస్తు కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపించాయి. దీంతో మంత్రులకు భద్రత, పవన్ పర్యటనకు బందోబస్తు చూసుకోవాల్సిన ఏసీపీ, సీఐలు విఫలమయ్యారని సీపీ వారిపై చర్యలు తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ సీఐ ఉమాకాంత్‌ను గత నెల 18నే అక్కడి నుంచి బదిలీ చేసి రేంజ్‌కు సరెండర్ చేశారు. -
ఆ చెప్పు అయినా నీదా.. లేదా నీ యజమానిదా ? : జోగి రమేష్
-
Pawan Kalyan: రెచ్చిపోయిన పవన్.. బూతులు మాట్లాడుతూ..
సాక్షి, మంగళగిరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి రెచ్చిపోయారు. తనదైన సినిమా స్టైల్లో ఆవేశంతో ఊగిపోతూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. కాగా, పవన్ మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశంలో మంగళవారం మాట్లాడారు. నా** అంటూ రాయలేని భాషలో బూతులు వల్లించారు. పొలిటికల్ లీడర్ అనే స్పృహ లేకుండా.. ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్స్ చేశారు. అక్కడే ఫలితంలేకనే విజయవాడకు పయనం.. ఇదిలా ఉండగా.. విశాఖ గర్జన సందర్భంగా జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ఈనెల 16న జనవాణి కోసం 15వ తేదీ సాయంత్రం ఆయన విశాఖ వెళ్లారు. అదే రోజు మంత్రుల కార్లపై విశాఖ విమానాశ్రయంలో జనసేన రౌడీమూకలు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అనంతరం, పవన్ హోటల్‌కు వెళ్లిపోవడం.. ఆ మర్నాడు జనవాణి జరిగే పోర్టు స్టేడియం వద్ద ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో జనవాణిని నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో దానిని వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రుల కార్లపై దాడులకు పాల్పడి అరెస్ట్ అయిన రౌడీ మూకలను విడిచిపెట్టే వరకు విశాఖలోనే ఉంటానని పవన్ బీరాలు పలికారు. ఇలా, మూడు రోజుల పాటు విశాఖలో మకాం వేసి హంగామా చేసిన పవన్ తాను ఆశించిన ఫలితం దక్కకపోవడంతో విజయవాడకు తిరిగొచ్చారు. ఇది కూడా చదవండి: ‘ పవన్.. ఓపెనింగ్ షాట్లు, క్లైమాక్స్ డైలాగులు తప్ప నువ్వేమీ పీకలేవు’ -
కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ బూతులు
-
ఇది ఆరంభం మాత్రమే
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానుల ఉద్యమం అంతం కాదని.. ఆరంభం మాత్రమే అని ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ అన్నారు. విశాఖ గర్జన విజయవంతం చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల ఉద్యమకారులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై జేఏసీ కమిటీతో చర్చిస్తామన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విశాఖ గర్జన’ విజయోత్సవ సభలో మాట్లాడారు. ‘అమరావతి ప్రజలంటే మాకు కోపం లేదు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు బావుండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు.. ఏనాడూ మాకు రాజధాని కావాలని డిమాండ్ చేయలేదు. అన్నింటికీ తల ఊపుతూనే వచ్చాం. ఇకపై కూడా అన్యాయం జరుగుతుంటే అలానే తల ఊపుతూ కూర్చోలేం. మా మంచితనాన్ని అమాయకత్వమనుకుంటే పొరపాటే’ అని హెచ్చరించారు. వికేంద్రీకరణను అందరూ స్వాగతించాలి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అత్యంత వెనకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అని, విశాఖను పరిపాలన రాజధాని చేసి పేదరికంలో ఉన్న తమ బతుకులు మారుస్తామంటే అభినందించాల్సింది పోయి అడ్డుకోవడం దారుణం అని టీడీపీ, జనసేన వైఖరిపై అజపతిరాయ్ మండిపడ్డారు. అమరావతి–అరసవల్లి యాత్ర ద్వారా మా ప్రాంతంలో మా దేవుని దగ్గరకి వచ్చి మా ప్రాంతంలో రాజధాని వద్దని మా నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జేఏసీ సభ్యులు, ఉత్తరాంధ్ర జేఏసీ సభ్యులు ప్రొఫెసర్ విజయకుమార్, కొల్లూరి సూర్యనారాయణ, పాల్, బాల మోహన్‌దాస్, షరన్ రాజ్, ఎస్ఎస్ శివశంకర్, డాక్టర్ పి.రామారావు, పైలా కృష్ణమోహన్, దువ్వాడ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పవన్.. చిల్లర వేషాలేస్తే ఊరుకోం
సాక్షి, అమరావతి: ‘విశాఖ గర్జన’లో పాల్గొని విమానాశ్రయానికి వస్తున్న తమపై జనసేన కార్యకర్తలు దాడిచేశారని, ఇలాంటి చిల్లర వేషాలేస్తే ఊరుకోబోమని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను మంత్రి జోగి రమేష్ శనివారం హెచ్చరించారు. ఈ ఘటనలో తమ వాళ్లకు గాయాలయ్యాయని దాడి అనంతరం ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన ర్యాలీ, బహిరంగ సభను ముగించుకుని ఎయిర్‌పోర్టుకు టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి ఆర్కే రోజా, తాను వస్తున్నామని.. విమానాశ్రయానికి రాగానే తమ కార్లపై జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారని మంత్రి వివరించారు. ఈ దాడిలో తమ కార్ల అద్దాలు ధ్వంసం కావడంతోపాటు మంత్రి రోజా సహాయకుడికి గాయాలయ్యాయని తెలిపారు. తాగుబోతు కుర్రాళ్లను, ఆరాచక శక్తులను, అల్లరి మూకలను, రౌడీలను పోగుచేసి దాడిచేయించటం సరికాదని.. పవన్ తన కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జోగి రమేష్ హితవు పలికారు. తమ కార్యకర్తలను పురమాయిస్తే పవన్ ఎక్కడ కూడా తిరగలేడని ఆయన హెచ్చరించారు. నాయకుడికి స్వాగతం చెప్పుకోడానికి, జిందాబాద్... అని నినాదాలు ఇవ్వడానికి వచ్చిన వారి వద్ద రాళ్లు, కర్రలు ఎందుకు ఉన్నట్లని మంత్రి ప్రశ్నించారు. జనసైనికుల దాడిపై పవన్‌కల్యాణ్ వెంటనే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
పరిపాలన రాజధాని వచ్చే వరకూ విశ్రమించం
సాక్షి, విశాఖపట్నం: ‘ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి స్వస్తి పలుకుతూ.. అభివృద్ధి బాటలో నడిపించేందుకు చేపట్టిన ఉద్యమంలో ఇది తొలి అడుగు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేసుకునేంత వరకు ఊరూ వాడా ఏకమై ఉద్యమిద్దాం. మరోసారి రాష్ట్రం విడిపోకుండా సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయానికి ప్రతి ఒక్కరం మద్దతు పలుకుదాం. ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న వారిని ఈ ప్రాంతం లో నిషేధిద్దాం. ఉద్యమాల పురిటిగడ్డపై వేషగాళ్లు వెనకడుగు వేసేంత వరకూ గర్జిద్దాం..’ అంటూ నాన్ పొలిటికల్ జేఏసీ, మద్దతునిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచెయ్యకుండా సాగిన విశాఖ గర్జన ర్యాలీ ముగింపు సభ బీచ్‌రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం సమీపంలో జరిగింది. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఏర్పాటైన జేఏసీ నేతృత్వంలో జరిగిన ఈ సభలో ప్రజా ప్రతినిధులు, మేధావులు, న్యాయవాదులు, ప్రజా, యువజన సంఘాల నేతలు పాల్గొని తమ ఆకాంక్షను చాటారు. జేఏసీ నేతలు దేవుడు, కొయ్య ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్న దొర, బూడి ముత్యాల నాయుడు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, సీదిరి అప్పలరాజు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, భీశెట్టి సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, మాజీ మంత్రులు పేర్ని నాని, ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, మేయర్ జి.హరివెంకటకుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. విశాఖకు రాజధాని రావాల్సిందే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం న్యాయంగా చేస్తున్న మా పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలి. ఇప్పటికే మూడుసార్లు మన రాష్ట్రాన్ని విభజించారు. మళ్లీ అమరావతే ఏకైక రాజధాని అయితే.. భవిష్యత్తులోనూ మళ్లీ విభజన డిమాండ్ పురుడు పోసుకుంటుందనడంలో సందేహం లేదు. రాజధాని వచ్చేంత వరకూ పోరాటం సాగిద్దాం. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. విశాఖకు రాజధాని రావాల్సిందే. – ప్రొఫెసర్ లజపతిరాయ్, నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ టీడీపీ, జనసేనకు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇష్టం లేదు మన హక్కుల్ని మనం కాపాడుకుందాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఇదే తరహాలో నినదిద్దాం. ఏపీ సువిశాలంగా.. మూడు ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ కాంక్షిస్తుంటే.. అమరావతి పేరుతో 29 గ్రామాలున్న ప్రాంతానికి మాత్రమే అభివృద్ధిని పరిమితం చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుతంత్రాలు పన్నుతున్నారు. పైన ఆకుపచ్చ చొక్కాలు.. లోపల పసుçపు పచ్చ ఆలోచనలతో.. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాదయాత్ర పేరుతో వారు దండయాత్ర చేస్తుండటం సిగ్గు చేటు. అధికారంలో ఉండగా, అమరావతి ప్రాంతంలో రైతులను దోచుకున్న చంద్రబాబే.. అమరావతి రైతుల పేరుతో పాదయాత్ర చేయిస్తున్నారు. కేవలం విశాఖ మాత్రమే కాకుండా.. అమరావతి, కర్నూలు ప్రాంతాలు కూడా సమానాభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్ సంకల్పించినా.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఇష్టం లేని టీడీపీ, జనసేన దాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మూడు రాజధానులే ఈ రాష్ట్రానికి శరణ్యం. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉత్తరాంధ్ర ప్రజలకు సెల్యూట్ విశాఖను రాజధానిగా చేయాలన్న ఆకాంక్ష ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయింది. వర్షాన్ని లెక్క చేయకుండా వచ్చిన జనానికి సెల్యూట్ చేస్తున్నా. విశాఖ రాజధాని ఉద్యమానికి మద్దతిచ్చేందుకు ఇంత మంది జనం తరలివస్తారని ఊహించలేదు. విశాఖ గర్జనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నించినా, వారి కుట్రలు ఫలించలేదు. ఇప్పటికైనా టీడీపీ, జనసేన, ఇతర పార్టీల నేతలు ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను గౌరవించి విశాఖ రాజధాని ఉద్యమానికి మద్దతివ్వాలి. – గుడివాడ అమర్నాథ్, ఐటీ శాఖ మంత్రి జగన్ ఉండగా.. మనకెందుకు భయం? విశాఖను పాలన రాజధానిగా చేయాలన్న తపన.. వేలాది మందిని ఇక్కడికి నడిపించింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటూ ప్రకృతి కూడా గర్జించి.. ఆమోదం తెలిపింది. తాత ముత్తాతలు మూడేళ్లు కర్నూలు రాజధానికి వెళ్లారు. మన తండ్రులు, మనం హైదరాబాద్ వెళ్లాం. ఇకపై అక్కడెక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో.. ఉత్తరాంధ్రని వెనుకబాటు నుంచి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ విశాఖను పాలన రాజధానిగా ఎంపిక చేస్తూ అరుదైన అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని మనం వదులుకోరారు. మా ప్రాంతానికి ఉద్యోగాలు రాకుండా, ఉపాధి లేకుండా, పరిశ్రమలు రాకుండా అడ్డుకోవాలనుకుంటున్న వారి ఆటలిక సాగవు. 130 ఏళ్ల నుంచి వస్తున్న వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఈ రోజు గర్జిస్తుంటే.. దాన్ని అడ్డుకోవాలని చూస్తున్న వారు మిత్రులు కాదు.. ఉత్తరాంధ్ర ద్రోహులు. విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రంలో భిన్నమైన అభిప్రాయాలు కలిగిన నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి అవసరమని సూచించింది. రాష్ట్రంలో అన్ని నగరాలకంటే విశాఖపట్నం రాజధానికి సరైనదని స్పష్టం చేసింది. దీనికి భిన్నంగా.. చంద్రబాబు తన తొత్తులైన నారాయణ, సుజనాచౌదరి, ఇతర నేతలతో కూడిన కమిటీ వేసి రాజధాని అమరావతి అని నిర్ణయించేశారు. ఈ అధికారం ఎవరు ఇచ్చారు? అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఏపీని తాకట్టు పెట్టడానికి 35వేల ఎకరాలు చుట్టేసి, చుట్టూ భూముల్ని చంద్రబాబు సన్నిహితులు, టీడీపీ నేతలు కొనుగోలు చేసేశారు. భవిష్యత్తులో హైదరాబాద్ మాదిరిగా.. అమరావతి నుంచి మనల్ని వెళ్లగొడితే దిక్కెవరు? ఇప్పటికైనా మనం గట్టిగా నిలబడదాం. బలమైన నాయకుడు సీఎం వైఎస్ జగన్ ఉండగా.. మనకెందుకు భయం? పోరాటాన్ని మరింత ఉధృతం చేద్దాం. – ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ మంత్రి అందరూ బాగుండాలన్నదే మా ఆకాంక్ష విశాఖ వాసులు ఉక్కు సంకల్పంతో రాజధానిని సాధించుకోవాలనే కాంక్షతో భారీ వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా గర్జించారు. విశాఖ రాజధానిని సాధించుకొని బానిస సంకెళ్ల నుంచి బయటపడాలి. కర్నూలు, హైదరాబాద్‌ని రాజధాని చేసినా ఉత్తరాంధ్ర ప్రజలు సరే అన్నారు. కానీ.. ఈసారి మాత్రం ఆ తప్పు చేయకూడదు. వికేంద్రీకరణ జరగాల్సిందే. విశాఖలో రాజధాని ఏర్పాటు కావాల్సిందే. నాది గుంటూరు జిల్లా అయినా.. వికేంద్రీకరణ మా అభిమతం. విశాఖ ప్రజల ఉగ్రరూపం ఎలా ఉంటుందో అందరూ చూశారు. ఈరోజు విశాఖ గర్జన చూస్తే చంద్రబాబు బ్యాచ్‌కు నిద్రపట్టదు. ఉక్కు సంకల్పంతో విశాఖను పరిపాలన రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలు సాధిస్తారు. పెయిడ్ ఆర్టిస్టులతో చేస్తున్న పాదయాత్రతో దేనికి సంకేతమిస్తున్నారు? అందరూ బాగుండాలని మేము కోరుకుంటే.. అమరావతి మాత్రమే బాగుండాలని టీడీపీ, జనసేన, ఇతర నేతలు కోరుకోవడం సమంజసమేనా? – విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రూ.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చెయ్యాలనుకుంటున్నారా? రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది దివంగత వైఎస్సార్ కల. ఇవాళ విశాఖ గర్జన ర్యాలీకి ఇంత మంది తరలి రావడం చూసి ఆనందం ఉప్పొంగుతోంది. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలన్న బలమైన ఆకాంక్షతోనే ఇంత మంది ప్రజలు విశాఖ గర్జనకు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంత మంది వచ్చారంటే వారంతా విశాఖకు మద్దతిస్తున్నారనే అర్థం. విశాఖ రాజధాని కేవలం ఆ నగర ప్రజలకు మాత్రమే కాదు.. రాష్ట్రం మొత్తానికి అవసరం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు విశాఖకు రాజధాని రావాల్సిన అవసరం ఉంది. పోర్టులు, రైల్వే ఫ్యాక్టరీ వంటి సదుపాయాలున్న విశాఖకు రాజధాని వస్తే పెట్టుబడులు పెరిగి నిధులు సమకూరుతాయి. ఇలాంటి నగరాన్ని వదిలేసి రూ.5 లక్షల కోట్లతో రాజధానిని కట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని వృథా చేయాలనుకుంటున్నారు. అసలు అమరావతి ఎలా రాజధాని అవుతుంది? అది కేవలం దోపిడీ మాత్రమే. 29 గ్రామాలనే అభివృద్ధి చేసి దానిని రాజధాని అంటే ఎవరు నమ్ముతారు? అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరూ మద్దతివ్వాలి. – బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి టీడీపీ కార్యాలయాల్లో క్షుద్రపూజలు! ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లీ బానిస బతుకులు బతకాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని సంకల్పించారు. పరిపాలన రాజధాని వస్తే.. ఈ ప్రాం తంలో అభివృద్ధి జరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ.. మనం స్వతంత్రంగా ఉండకూడదనే కుటిలబుద్ధితో కొందరు లుచ్ఛాలు, పచ్చ నేతలు.. టీడీపీ, దానికి కొమ్ముకాస్తున్న పార్టీలు కలిసి.. టీడీపీ కార్యాలయాల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఎన్ని క్షుద్ర పూజలు చేసినా.. ఈ పోరాటం ఆగదు. రాబందుల్ని ఇక్కడి నుంచి పంపించి.. ఉత్తరాంధ్రకు రాజధాని సాధించేంత వరకు చేయి చేయి కలుపుతూ.. సీఎం జగన్ ఇచ్చిన అవకాశాన్ని నెరవేర్చుకుందాం. – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్ విశాఖ నుంచి త్వరలో పరిపాలన అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ సంకల్పిస్తే.. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, ఆ ప్రాంతంలో తమ భూముల రేట్లు పెంచుకుని దోచుకోవాలని టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు చూస్తున్నాయి. సీఎం జగన్ నిర్ణయం మేరకు మూడు రాజధానులను ఏర్పాటు చేసుకుంటాం. విశాఖ నుంచే సీఎం త్వరలో పరిపాలన సాగిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పాదయాత్ర పేరుతో ఈ ప్రాంతంపై దండయాత్ర చేస్తున్న వారు, ఆ దండయాత్రకు మద్దతిస్తున్న టీడీపీ, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌లను ఉత్తరాంధ్ర ప్రజలు నిలదీయాలి. విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకునేందుకు, జేఏసీ ఏ పోరాటం చేసినా మద్దతు ఇస్తాం. – వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉమ్మడి విశాఖ ఇన్చార్జ్ మన ఆకాంక్ష నెరవేరే వరకు పోరాడుదాం ఈ ప్రాంతంపై దశాబ్దాలుగా పాలనా పరమైన వివక్ష చూపారు. ఈ కారణంగానే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి గురైంది. ఉద్యమాలకు పురిటిగడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నాడు ఉద్యమాలు జరిగితే.. ఈరోజు మళ్లీ మన బతుకుల బాగు కోసం విశాఖే పరిపాలన రాజధానిగా ఉండాలని ఉద్యమిస్తున్నాం. ఆకలి మంటలతో చచ్చే బదులు.. పోరాడి చద్దాం. ప్రతి పురుషుడు, ప్రతి మహిళ, ప్రతి యువకుడు.. ఈ కదన రంగంలోకి దిగాలి. మరో ఉద్యమం రాకుండా వికేంద్రీకరణ అనే పవిత్రమైన నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారు. ఏపీని సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీల్ని నిలదీయాలి. మన హక్కుల్ని సాధించుకునే అవకాశం దశాబ్దాల తర్వాత సీఎం జగన్ ఇచ్చారు. పోరాడి తెచ్చుకుందాం. సీఎం ఇక్కడి నుంచి పాలన ప్రారంభించేంత వరకూ ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం. – తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్ చంద్రబాబును, దత్తపుత్రుడిని తరిమికొట్టాలి రాయలసీమలో పుట్టినా ఉత్తరాంధ్ర ప్రజలకు మద్దతు ఇస్తున్నాను అంటే సీఎం జగన్ నిర్ణయం ఎంత బలమైనదో అర్థం చేసుకోవాలి. దేశంలో చక్రం తిప్పానని చెప్పుకుంటూ, తుప్పు పట్టిన సైకిల్ చక్రం అధినేత చంద్రబాబు మన రాష్ట్రానికి చేసిందేమీ లేదు. చంద్రబాబు అసమర్థ పాలన వల్లే ఉత్తరాంధ్ర, రాయలసీమలు అన్యాయానికి గురయ్యాయి. సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయానికి 26 జిల్లాల ప్రజలు మద్దతు తెలియజేస్తుంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. అమరావతి రైతుల ముసుగులో వస్తున్న పెయిడ్ ఆర్టిస్టులకు మద్దతిస్తున్నారు. వారిని తమిరి కొట్టాలా.. వద్దా? చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్ పెళ్లి చేసుకోడానికి విశాఖ అమ్మాయి కావాలి. షూటింగులకు విశాఖ కావాలి. నటన నేర్చుకోడానికి వైజాగ్ కావాలి. చివరికి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా విశాఖ కావాలి. కానీ.. వైజాగ్‌కు రాజధాని వద్దు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదా? గాజువాక ప్రజలు విజన్ ఉన్న వాళ్లు కాబట్టే.. ఈయన నిజ స్వరూపం ముందే తెలుసుకొని చిత్తుగా ఓడించారు. ఆకలి పోరాటం విలువ తెలిసిన ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే.. పవన్ కల్యాణ్ చిత్తు అవ్వడం ఖాయం. వికేంద్రీకరణ కోరుకున్న వాళ్లంతా పిచ్చికుక్కలంటూ ఉత్తరాంధ్రలో పుట్టిపెరిగిన అచ్చోసిన ఆంబోతులా అచ్చెన్న మాట్లాడుతున్నారు. 26 జిల్లాల అభివృద్ధిని 29 గ్రామాలకు మాత్రమే కావాలనుకుంటున్న వారే పిచ్చికుక్కలు, గజ్జికుక్కలు, ఊరకుక్కలు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు చెయ్యలేని అభివృద్ధిని సీఎం జగన్ మూడేళ్లలో చేసి చూపించారు. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి ఇక్కడ పేపర్లు, పచ్చళ్లు అమ్మడం లేదా? హైదరాబాద్ తరహాలో రాష్ట్ర సంపదంతా ఒకే చోట అమరావతిలో ఖర్చు చేశాక, మిగతా ప్రాంతాల్లో ఉద్యమాలు వస్తే దానికి ఎవరు బాధ్యులు? ఇకపై ఇలా జరగరాదనే సీఎం జగన్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. విశాఖ గర్జన చూశాక అయినా, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు ప్రజల మద్దతు ఎవరికి ఉందో తెలుసుకోవాలి. అమరావతికే మద్దతు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో లేదా? ఈనాడు రామోజీరావు ఇక్కడ పేపర్లు, పచ్చళ్లు అమ్ముకోవడం లేదా? రాధాకృష్ణ, టీవీ–5 చానళ్లు ఇక్కడ నడపడం లేదా? వీళ్లందరికీ అమరావతి మీదే ఎందుకు ప్రేమ అంటే, వీళ్లంతా ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్నారు. జగన్ సీఎం అయ్యాక వారి పప్పులు ఉడకడం లేదు. అమరావతిలో రూ.40లక్షలు పెట్టి కొన్న భూములు రూ.4 కోట్లు కాలేదన్న బాధతో వీరంతా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. తమ ఆస్తుల కోసం ఉత్తరాంధ్ర మీద విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు ఒక 420. పిల్లనిచ్చి, పార్టీలో చేర్చుకున్న ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పార్టీని, ముఖ్యమంత్రి పదవిని ఆక్రమించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఎందర్నో వేధించి.. 210 లోకేష్ కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు తన ఆస్తుల మీద, పార్టీ మీద, కొడుకు లోకేష్ మీద తప్పితే.. ప్రజల మీద ప్రేమ, దయ, బాధ్యత ఉండదు. ఉత్తరాంధ్ర ద్రోహులందరినీ బ్యాన్ చెయ్యాలి. వారి పేపర్లు, పచ్చళ్లు కొనొద్దు, చానల్స్ రాకుండా కేబుల్ ఆపరేటర్లతో మాట్లాడండి. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు.. వారు ఇటువైపు చూడాలంటే భయం కలిగేలా చేయండి. కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా ఉత్తరాంధ్ర అభివృది ్ధని కోరుకుంటున్నాయి. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందు తుంది. – కొడాలి నాని, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే. -
అది గర్జన ఉద్యమంపై దాడి
సాక్షి, విశాఖపట్నం: ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులపై జరిగిన దాడిని విశాఖ గర్జనపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ.. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయనకు ఉత్తరాంధ్ర ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. శనివారం ఆయన స్థానిక సర్క్యూట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖను పాలనా రాజధానిగా చేయాలన్న నినాదంతో శనివారం నిర్వహించిన విశాఖ గర్జన కార్యక్రమాన్ని అన్ని టీవీ ఛానళ్లు, జాతీయ వార్తా సంస్థలు ప్రధానంగా చూపిస్తుండటం చూసి ఓర్వలేక ఈ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారని మండిపడ్డారు. ఉద్యమానికి నాలుగు రోజుల ముందు నుంచే పవన్ కళ్యాణ్ వైజాగ్ వస్తారని తెలిసి, అతని పర్యటనను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. విశాఖ వచ్చి ఉద్రిక్తతను సృష్టించారని, తద్వారా మీడియా దృష్టిని తన వైపునకు మరల్చుకుని, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షల పై నీళ్లు చల్లే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అమర్నాథ్ ఇంకా ఏమన్నారంటే.. ఇక ఫ్లవర్ కళ్యాణ్ అనాలి.. ► తనకు, తన పార్టీకి నష్టం వాటిల్లినా పర్వాలేదు కానీ చంద్రబాబుకు మంచి జరగాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారు. ► గతంలో ఒక పత్రికా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తూ అడ్డొచ్చిన వారికి గన్ చూపించిన పవన్ కళ్యాణ్ నైజం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ► ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను సమర్థించని పవన్.. విశాఖ వచ్చి ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారు. అందుకే ఆయన్ను పవన్ కళ్యాణ్ అని కాకుండా.. ఫ్లవర్ కళ్యాణ్ అని పిలిస్తే బావుంటుంది. గత ఎన్నికల్లో ఓడించారని ఈ ప్రాంతంపై కక్షకట్టి విధ్వంసం సృష్టిస్తున్నారు. ► సైకో పార్టీకి సైకో కార్యకర్తలే ఉంటారు. జనసేన పార్టీకి సిద్దాంతాల్లేవు.. ఒక స్టాండ్ లేదు.. వ్యక్తిత్వం లేదు.. ఒక లక్ష్యం లేదు.. ఆకతాయి కార్యకర్తలు.. జనసేన పార్టీ నాయకుడే ఒక ఆకతాయి.. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం రాజధానంటావు.. ఊసరవెల్లిలా మాటలు మారుస్తావు.. నీకెందుకు పార్టీ? నీకెందుకు రాజకీయం? ఇంట గెలవని పవన్‌కళ్యాణ్ రాష్ట్రాన్ని ఏమి ఉద్దరిస్తాడు? పెళ్లి అనేది ఒక సర్దుబాటు జీవితం. అందులో ఇమడలేని వాడివి ప్రజా జీవితంలో ఎలా నెగ్గుకువస్తావు? పెళ్లాంతో కాపురం చేయలేని వాడు.. రాజకీయ పార్టీ పెట్టి ప్రజలను ఏవిధంగా పరిపాలిస్తాడు? అందుకే ఆ ఫ్రస్టేషన్ అంతా చూపిస్తున్నావు. ఈ సైకో పనులేమిటి? ► ఈ సైకో పనులు ఏమిటి? మంత్రులు, నాయకుల మీద దాడి ఏమిటి? వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తల్చుకుంటే మీరు కనీసం ఒక్క నిమిషం ఉండగలరా? మా ఫ్లెక్సీలు చింపడం ఏమిటి? అసలు నాయకుడికి క్యారెక్టర్ ఉంటే కదా? అది ఉంటే కార్యకర్తలు కూడా పద్ధతిగా ఉంటారు. ► నీకు నటన జీవితం ఇచ్చింది విశాఖపట్నం. తొలుత నీకు పిల్లను ఇచ్చింది విశాఖపట్నం. చివరికి నీవు పోటీ చేసింది విశాఖలోనే. అయినా అన్నీ మర్చిపోయావు. ఉత్తరాంధ్రను వాడుకుని, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తీయాలని చూస్తున్నావు. ఉద్యమానికి తూట్లు పొడవాలని చూస్తున్న నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పదు. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. ఎవరు ఎవరి మీద దాడి చేశారు? -
మంత్రుల కార్లపై జనసేన దాడి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం వద్ద జనసేన రౌడీమూకలు వీరంగం సృష్టించారు. రాష్ట్ర మంత్రులపై దాడులకు తెగబడ్డారు. కర్రలు, వాటర్ బాటిళ్లు, చెప్పులు విసురుతూ తెగ రెచ్చిపోయారు. మంత్రుల భద్రతా సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. వారిపై కూడా విచక్షణారహితంగా దాడిచేశారు. వారి వాహనాలను చుట్టుముట్టి, కర్రలతో కొడుతూ, రాళ్లు విసురుతూ నానా బీభత్సం సృష్టించారు. మంత్రులు, మహిళలు అని ఏమాత్రం కూడా చూడకుండా జనసేన రౌడీమూకలు రెచ్చిపోయారు. దాడిచేస్తున్న సమయంలో వీరి ధోరణి చూస్తే.. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే పక్కా ప్రణాళిక ప్రకారం నడుచుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఇక ఈ కేసు విషయంలో శనివారం రాత్రి జనసేనకు చెందిన పలువురిని అరెస్టుచేసినట్లు సమాచారం. ‘విశాఖ గర్జన’ కార్యక్రమాన్ని ముగించుకుని విజయవాడకు వెళ్లేందుకు విమానాశ్రయానికి విడివిడిగా చేరుకున్న మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, రోజా, విడదల రజని.. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై ఈ అల్లరి మూకలు విచక్షణారహితంగా దాడులకు దిగాయి. ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న చెత్తకుండీపైనున్న స్టీల్ మూతతో దాడిచేయగా మంత్రి రోజా వ్యక్తిగత సిబ్బందిలోని ఒకరి తలకు బలంగా గాయమైంది. దీంతో 15 నిమిషాల పాటు విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతలో విమానాశ్రయ భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని మంత్రులను సురక్షితంగా ఎయిర్‌పోర్టులోకి తీసుకెళ్లారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన కార్యక్రమం భారీ వర్షంలోనూ జన సందోహంతో విజయవంతం కావడంతో డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే జనసేన రౌడీమూకలు దాడికి యత్నించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు.. విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్, అదనపు కమిషనర్ (ఎస్బీ) ఆనందరెడ్డి విమానాశ్రయానికి చేరుకుని విచారణ చేపట్టారు. విశాఖపై విషం.. వాస్తవానికి విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గం నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ పోటీచేశారు. అయితే, ఆయనకు ఇక్కడి ప్రజలు బుద్ధిచెప్పారు. దీంతో అప్పటినుంచి ఆయన.. అవకాశం ఉన్నప్పుడల్లా విశాఖపై విషం చిమ్ముతూనే ఉన్నారు. మొదటగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కనీసం స్పందించని పవన్.. ‘నన్ను గెలిపించారా? నేను మాట్లాడడానికి’ అని ఎదురు ప్రశ్నించారు. ఇప్పుడు పరిపాలన రాజధాని కోసం చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమానికి పోటీగా జనవాణి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే విశాఖపై విషం చిమ్మేందుకు టీడీపీ డైరెక్షన్లో జనసేన నేత ముందుకెళ్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ప్రణాళికతోనే.. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన కార్యక్రమాన్ని అక్టోబరు 15న నిర్వహిస్తున్నట్లు నాన్ పొలిటికల్ జేఏసీ ప్రకటించింది. ఇందుకు వైఎస్సార్సీపీ కూడా మద్దతు పలికింది. అయితే, అప్పటివరకు కనీసం విశాఖపట్నం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించని పవన్.. హడావుడిగా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అది కూడా అక్టోబరు 16న నిర్వహించే కార్యక్రమానికి 15నే విశాఖకు వస్తున్నట్లు టూర్ షెడ్యూల్ ప్రకటించారు. దీనిపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ నేతలు అనుమానం వ్యక్తంచేశారు. విశాఖ గర్జన కార్యక్రమం రోజునే ఎందుకు విశాఖ వస్తున్నారని.. కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు. అయినప్పటికీ మొదటగా 15వ తేదీ మ.3.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారని జనసేన నేతలు ప్రకటించారు. ఆ తర్వాత టైం మారిపోయింది. సరిగ్గా విశాఖపట్నం నుంచి విజయవాడకు ఉన్న ఒకే ఒక విమాన సర్వీసు సమయంలోనే ఆయన విశాఖలో ల్యాండ్ అయ్యారు. అదే సమయంలో విశాఖ గర్జన ముగించుకుని విమానాశ్రయానికి చేరుకున్న వైవీ సుబ్బారెడ్డి, మేరుగు నాగార్జున, జోగి రమేష్, రోజా, రజని కార్లపై దాడికి యత్నించారు. 20 మందిపై కేసు నమోదు విమానాశ్రయంలో మంత్రి రోజా అనుచరుడు దిలీప్‌పై దాడిచేసినందుకు జనసేన రౌడీమూకలపై 307, 324, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, పోలీసులు విధులకు ఆటంకం కలిగించినందుకు పెందుర్తి సీఐ నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు 353 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఈ రెండింటిలోనూ మొత్తంగా 20 మంది జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. జనసేన రౌడీమూకలపై మంత్రుల ఆగ్రహం విశాఖపట్నం విమానాశ్రయంలో జనసేన రౌడీమూకలు వీరంగం సృష్టించడంపై రాష్ట్ర మంత్రులు మేరుగు నాగార్జున, ఆర్కే రోజా, విడదల రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో సీఎం వైఎస్ జగన్ పరిపాలన సాగిస్తున్నారని.. ఇది తట్టుకోలేని ప్రతిపక్షనేత చంద్రబాబుతో పాటు పవన్‌కళ్యాణ్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ఉద్యమానికి మద్దతుగా వెళ్లిన ఉమ్మడి విశాఖ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, మంత్రుల కార్లపై దాడిచేయడం దారుణమన్నారు. అఘాయిత్యాలు, అమానుషాలు చేసి ప్రజలను భయపెట్టి గెలవాలనుకోవడం పవన్ అవివేకమన్నారు. తాము కూడా అలాగే ప్రవర్తిస్తే జనసేన మూకలు కనిపించరని వారు తెలిపారు. పవన్‌కు అమరావతి మాత్రమే కావాలనుకుంటే స్పష్టంగా చెప్పాలని సూచించారు. ఆయన బలమేమిటో 2019 ఎన్నికల్లోనే తెలిసిపోయిందని.. ఇప్పటికైనా పవన్‌కళ్యాణ్ వీలుంటే సినిమాలు తీసుకోవాలని.. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే సహించేదిలేదని మంత్రులు హెచ్చరించారు. జనసేన రౌడీమూకలు రాళ్లు, కర్రలతో తమ కార్లపై విరుచుకుపడడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యామని.. ఎంత బతిమలాడినా వినకుండా కార్లపై రాళ్లు, కర్రలు విసిరారని వారు వివరించారు. దాదాపు 20 నిమిషాలపాటు నరకాన్ని ప్రత్యక్షంగా చూశామన్నారు. ఈ దాడికి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం విశాఖ విమానాశ్రయ వద్ద సంఘటన జరిగిన తీరును పరిశీలించాం. అక్కడ సీసీ కెమెరాల దృశ్యాలనూ చూశాం. దాడి జరిగిన తీరును, అందుకు బాధ్యులపై న్యాయపరంగా ముందుకెళ్తాం. నిర్వాహకులు ర్యాలీకి ఎటువంటి అనుమతి పొందలేదు. అయినప్పటికీ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల మీద ప్రదర్శన చేశారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – శ్రీకాంత్, నగర పోలీసు కమిషనర్ దాడులపై ఎవరేమన్నారంటే.. జనసేన రౌడీమూకల, ఆరాచక శక్తుల వికృత చేష్టలు, భౌతిక దాడులను వైఎస్సార్సీపీ సహించదు. భవిత్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే చూస్తూ ఊరుకోం. – వి. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రుల కార్లపై దాడికి పాల్పడిన జనసేన రౌడీమూకలు, అందుకు ప్రోత్సహించిన వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దాడికి పాల్పడడం హేయమైన చర్య. – తానేటి వనిత, హోంమంత్రి పవన్‌కళ్యాణ్ ఉన్మాదాన్ని ప్రేరేపిస్తూ యువతను రెచ్చగొడుతున్నారు. మొదట్నుంచీ హింసావాదాన్ని రెచ్చగొట్టడం ఆయనకు పరిపాటిగా మారిపోయింది. విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే పవన్ విశాఖకు వెళ్లారు. – కొట్టు సత్యనారాయణ, డిప్యూటీ సీఎం ఎప్పుడూ సుద్దులు చెప్పే పవన్‌కళ్యాణ్ తక్షణం దీనిపై స్పందించాలి. ఒక్క సీటు కూడా లేకపోతేనే జన సైనికులు ఇలా ఉంటే, మరి ఐదారు సీట్లు వస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారో. – అంబటి రాంబాబు, జల వనరుల శాఖ మంత్రి జనసేన అల్లరిమూకలను పవన్ అదుపు చేసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. మేం తలుచుకుంటే రాష్ట్రంలో నీవు తిరగగలవా? మా నాయకులకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. – సామినేని ఉదయభాను, ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే -
వికేంద్రీకరణకు మద్దతుగా 'గర్జించిన విశాఖ'
ఒకవైపు సముద్రం హోరు.. ఇంకో వైపు వర్షం జోరు.. మరో వైపు ఈ రెండింటితో పోటీపడుతూ జన గర్జన పోరు.. వికేంద్రీకరణ కోసం ఉద్యమ కెరటం ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసింది. పరిపాలన రాజధానికి ‘విశాఖ గర్జన’ జైకొట్టింది. వరుణ దేవుడి సాక్షిగా అశేష జనవాహిని గర్జనతో విశాఖ దిక్కులు పిక్కటిల్లాయి. థింసా నృత్యం, చెక్కభజన, కొమ్ము నృత్యం, కోలాటం, తప్పెటగుళ్లు వంటి ఉత్తరాంధ్ర ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఆద్యంతం వికేంద్రీకరణ నినాదాలు హోరెత్తాయి. పాలన రాజధానిగా విశాఖను వ్యతిరేకిస్తే ఖబడ్దార్.. అంటూ ఉత్తరాంధ్ర జనం నిప్పులు చెరిగారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ సాక్షి, విశాఖపట్నం/ డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన విశాఖ గర్జన అంచనాలకు మించి విజయవంతమైంది. విశాఖపట్నానికి పరిపాలన రాజధానిగా చేయాలన్న నినాదం మిన్నంటింది. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన విశాఖ గర్జన పాదయాత్ర, సభ ఆద్యంతం భారీ వర్షంలోనే కొనసాగింది. ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అనే నినాదాలతో పాదయాత్ర హోరెత్తింది. ఉదయం 9 గంటలకే ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద గర్జన హడావుడి ప్రారంభం కాగా.. మొదట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జేఏసీ చైర్మన్ లజపతిరాయ్‌తో పాటు పలువురు మంత్రులు నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. ఎల్ఐసీ బిల్డింగ్ నుంచి 10.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర సెవన్‌హిల్స్ హాస్పిటల్ మీదుగా సర్క్యూట్ హౌస్, సిరిపురం జంక్షన్, పెదవాల్తేరు ఆంధ్రా యూనివర్సిటీ గేటు నుంచి బీచ్ రోడ్డులోని పార్కు హోటల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు 3.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర మొత్తం వర్షంలోనే సాగింది. ఇసుకవేస్తే రాలనంతగా జన సందోహం మధ్య పాదయాత్ర గంటకుపైగా సాగింది. అక్కడ దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం గర్జన సభ మొదలైంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంలోనూ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి జనం భారీగా హాజరయ్యారు. వికేంద్రీకరణలో భాగంగా విశాఖకు జై కొట్టారు. భారీగా కురుస్తున్న వర్షం తమను ఆశీర్వదిస్తున్నట్టుగా ఉందని ఆనందపడ్డారు. ఉత్తరాంధ్ర జోలికొస్తే ఉప్పు పాతరేస్తామని హెచ్చరించారు. ఈ గర్జనతోనైనా చంద్రబాబు, పవన్‌లకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. ఇప్పటికే రాష్ట్రాన్ని మూడుసార్లు విభజించారని.. మళ్లీ అమరావతి మాత్రమే రాజధాని అంటే భవిష్యత్‌లోనూ ఇబ్బందులు తప్పవని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. తమ పోరాటానికి అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఏ కార్యక్రమం నిర్వహించినా తాము మద్దతు ఇస్తామని వైఎస్సార్సీపీ ప్రకటించింది. మొత్తంగా సముద్రపు కెరటాల్లా ఎగసిపడ్డ జన సమూహం.. విశాఖకు జై కొట్టింది. విశాఖ గర్జనకు భారీ ర్యాలీగా తరలివస్తున్న జన సందోహం.. భారీగా పాల్గొన్న యువత ప్రధానంగా ఇన్ని రోజులుగా ఉత్తరాంధ్ర వెనుకబాటులో ఎక్కువగా నష్టపోయింది యువతే. ఈ నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ ద్వారా పరిపాలన రాజధానిగా విశాఖ అవతరిస్తే ఇటు విద్యా రంగంతో పాటు ఉపాధి రంగంలోనూ కొత్త అవకాశాలు వస్తాయన్న ఆశ వారి మాటల్లో ధ్వనించింది. తద్వారా ఉద్యోగాల కోసం పొట్ట చేత పట్టుకుని ఎక్కడికో పోవాల్సిన అవసరం ఉండదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమైంది. ర్యాలీలో వర్షం జోరులో చిందేస్తూ.. జై విశాఖ అని నినదిస్తూ యువతీ, యువకులు పోటీపడుతూ నినాదాలతో హోరెత్తించారు. పాలిటెక్నిక్ కాలేజీతో పాటు డిగ్రీ, పీజీ విద్యార్థులు విశాఖ గర్జనలో భారీగా పాల్గొన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే తమ బతుకులు మారతాయని.. ఉద్యోగాలకు వలస వెళ్లాల్సిన బాధలు తప్పుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యువకులతో పోటీ పడి మరీ యువతులు చిందేస్తూ నినాదాలతో పాదయాత్ర కొనసాగించడం విశేషం. తీన్మార్ డప్పులు.. కోబ్రా డ్యాన్స్‌లు.. సాగరతీరాన ఉత్తరాంధ్ర ఆవేదన కడలి ఘోషలా మారింది. విశాఖ పరిపాలన రాజధాని వద్దంటూ..తమ ప్రాంతంపైకి దండయాత్రగా వస్తున్న వారికి వ్యతిరేకంగా, ఉత్తరాంధ్ర ప్రజానీకం.. కళాకారులు కడలి తరంగంలా ఎగసిపడ్డారు. విశాఖకు పరిపాలన రాజధాని వద్దంటే..పరిణామాలు మునుపటిలా ఉండవని సత్తా చూపారు. ‘గురజాడ, శ్రీశ్రీ, వంగపండు ప్రసాదరావు, రావి శాస్త్రి వంటి గొప్ప వారిని కన్న నేల ఉత్తరాంధ్ర. అలాంటి మా ప్రాంతానికి రాజధాని వద్దా? ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి మీకు పట్టదా? అమరావతి రాజధాని పేరిట మాపై దండ యాత్రకు వస్తారా? మాకు కడుపు మండదా? అంటూ నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్ర కళాకారులు పాటలు, నృత్యాలు, జానపద గేయాలు, గిరిజన నృత్యాలు, బిందెలు తలపై ఉంచుకుని డ్యాన్స్‌లతో ప్రదర్శననిస్తూ.. అందరూ బాగుండాలి.. అందులో మేముండాలంటూ నినదించారు. ‘మన విశాఖ.. మన రాజధాని’ పేరిట నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెల్లివిరిశాయి. విశాఖ గర్జనకు హాజరైన అశేష జన సందోహంలోని ఓ భాగం తప్పెటగుళ్లతో ఉత్తరాంధ్ర వెనుకబాటును వివరిస్తూ కళాకారుల ప్రదర్శన పలువురి మన్ననలు పొందింది. పులి వేషధారణతో కళాకారులు ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. పొడుగాటి మనుషులమంటూ కాళ్లకు కర్రలు కట్టుకుని..నెత్తిన బిందెలు పెట్టుకుని వేసిన బిందెల డ్యాన్స్‌లు మురిపించాయి. పాముల వేషాలతో రెల్లి కులస్థులు వేసిన కోబ్రా డ్యాన్స్‌కు యువత సై కొట్టింది. కళాకారులతో పాటు యువత కూడా ఆ నృత్యంలో భాగస్వాములై పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేశారు. తీన్మార్ డప్పులు.. కాంగో డప్పులతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. కళాకారులు వాయించిన డప్పులకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నృత్యాలు చేస్తూ విశాఖ గర్జనలో పలువురు పాలుపంచుకున్నారు. గిరిజనుల కోయ డ్యాన్సులు.. ఖాళీమాతా డ్యాన్సులు.. అష్టలక్ష్మి నృత్యాలు గర్జనకు తోడయ్యాయి. ఎటు చూసినా జన ప్రభంజనమే విశాఖలో శనివారం ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపించింది. దీనికి భారీ వర్షం తోడు కావడంతో వీధులు, రోడ్లు ‘జన’ ‘సంద్రం’గా మారాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఏ ఉద్యమానికి రానంతగా విశాఖ గర్జనకు జనం పోటెత్తి సరికొత్త చరిత్ర సృష్టించారు. అంబేడ్కర్ సర్కిల్లో గంటన్నరకు పైగా జనం వర్షంలో నిల్చుని మన విశాఖ.. మన రాజధాని అంటూ నినదించారు. సర్వమత ప్రార్థనల అనంతరం జోరు వానలో తడిసి ముద్దవుతూ కొందరు.. గొడుగులు చేతబట్టి మరికొందరు అడుగులు ముందుకేశారు. ‘విశాఖే పరిపాలన రాజధాని’ అన్న నినాదాలతో ఉన్న జెండాలు ర్యాలీ పొడవునా రెపరెపలాడాయి. విశాఖ నగరంలో 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురవడం గమనార్హం. అడుగడుగునా అదే ఆకాంక్ష విశాఖ గర్జనలో ఆసాంతం వికేంద్రీకరణ ఆకాంక్ష స్పష్టంగా కనిపించింది. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఉత్తరాంధ్ర నలుమూలల నుంచీ జనం ఉదయమే బయలుదేరారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటుకుని.. నిలువెల్లా తడుస్తూ తమ ఆకాంక్షను బలంగా చాటారు. ఉదయం 9 గంటలకే ఎల్ఐసీ బిల్డింగ్ జంక్షన్ వద్ద కోలాహలం మొదలైంది. ఉత్తరాంధ్ర ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలతో విశాఖ గర్జన ప్రారంభమైంది. ర్యాలీ ప్రారంభమైన తర్వాత వర్షం జోరు మరింత పెరిగింది. అయినప్పటికీ వర్షంలో తడుస్తూనే పాదయాత్ర కొనసాగించారు. కొద్ది మంది గొడుగులు పట్టుకుని పాదయాత్రకు రాగా.. ప్రధానంగా యువత మాత్రం వర్షంలో నినాదాలు చేస్తూ ముందుకు అడుగులు వేశారు. విద్యార్థులు, న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, కార్మికులు... ఇలా అన్ని వర్గాల వారు విశాఖ గర్జనలో తమ నినాదాన్ని వినిపించారు. ఎక్కడికక్కడ పాదయాత్రకు స్థానిక విశాఖ జనం సాదరంగా ఆహ్వానం పలికారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Visakha Garjana: దిక్కులు పిక్కటిల్లేలా గర్జించిన విశాఖ (ఫొటోలు)
-
జన సంద్రాన్ని తలపించిన ‘ విశాఖ గర్జన’
విశాఖ గర్జన.. జన సంద్రాన్ని తలపించింది. వికేంద్రీకరణకే మా ఓటు అంటూ నినదించింది. విశాఖ జన తుఫాన్లో వర్షం కూడా ‘చిన్న’ బోయింది. ప్రజా పోరాటంతో ఉత్తరాంధ్ర మురిసి ముద్దయ్యింది. వెరసి వికేంద్రీకరణే లక్ష్యంగా చేపట్టిన నేటి(శనివారం) విశాఖ గర్జన విజయవంతమైంది. ఈరోజు ఉదయం విశాఖ గర్జన ఎలా? అనే ప్రశ్న మొదలైంది. దానికి కారణం గర్జన సమయానికి వర్షం పడుతూ ఉండటమే. కానీ దాన్ని సైతం ప్రజలు లెక్క చేయలేదు. తరతరాల తమ వెనుకబాటుతనంపై పోరాటం చేసే అవకాశం రావడంతో జనం వర్షం అన్న సంగతే మరిచారు. వారిలో ఉన్నది ఒకే ఒక్క సంకల్పం. విశాఖ గర్జన సక్సెస్ చేయడమే. తమ నినాదాన్ని, తమ ఆత్మగౌరవ పోరాటాన్ని విశాఖ గర్జన వేదికగా చాటాలనుకున్నారు.. అది చేసి చూపించారు. విశాఖ గర్జనలో లక్షకు మందికి పైగా ర్యాలీలో పాల్గొనడమే ఇందుకు ఉదాహరణ. కుల, మత, వర్గ భేషజాలం లేకుండా ప్రజలంతా నడుంబిగించారు. అమరావతి పేరుతో చేస్తున్న పాదయాత్రకి తమ నిరసన ఎలా ఉంటుందో చూపించారు. వికేంద్రీకరణే లక్ష్యంగా తమ గొంతు వినిపించే క్రమంలో ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు నడుం బిగించారు. దీనిలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’లో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ గర్జనకు విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. విశాఖ అంబేద్కర్ సర్కిల్ నుంచి బీచ్‌రోడ్డు వరకూ చేపట్టిన ర్యాలీలో అశేష జనవాహిని పాల్గొంది. భారీ వర్షంలోనూ సుమారు రెండున్నర గంటల పాటు ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా ర్యాలీకి విశాఖ ప్రజల సంఘీభావం తెలపగా, విశాఖకు రాజధాని రావాలంటూ నినాదించారు. ఈ ర్యాలీలో ప్రజలు, ప్రజా సంఘాలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్రులు ఉగ్రరూపం చూపించారు: మంత్రి విడదల రజని
-
ఉత్తరాంధ్ర గర్జన ముందు బాబు గర్జన బలాదూర్: స్పీకర్ తమ్మినేని
-
మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి: కొడాలి
-
అందుకే పవన్‌ను చిత్తుగా ఓడించారు: మంత్రి రోజా
-
రాష్ట్ర ప్రజలకు బాబు గురించి క్లారిటీగా అర్ధమైంది: మంత్రి రోజా
-
వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి: మంత్రి బుగ్గన
-
ఉత్తరాంధ్రకు మద్దతుగా..
-
సీఎం జగనన్న ఊరికే అనలేదు.. పీకేకు ప్యాకేజీ..! బాబుకు సీఎం..!?
-
వికేంద్రీకరణే లక్ష్యంగా విశాఖ గర్జన
-
Visakha Garjana: విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్
Updates విశాఖ గర్జనలో జన తుఫాన్ విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్ జనసంద్రమైన విశాఖ, ర్యాలీకి లక్షమందికి పైగా హాజరు సభలో మంత్రి విడదల రజని మాట్లాడుతూ.. అందరూ బాగుండాలనే మా ఆలోచన అన్ని ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం అమరావతి పాదయాత్ర చేస్తున్నది చంద్రబాబు బినామిలే: మేరుగ నాగార్జున అందరూ అభివృద్ధి చెందాలంటే 3 రాజధానుల అవసరం: మేరుగ నాగార్జున విశాఖ సభలో మంత్రి రోజా మాట్లాడుతూ.. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది జగనన్న సంకల్పం దానికి ఉత్తరాంధ్ర ప్రజలంతా సంఘీభావం తెలపాలి మీ జన సునామీలో చంద్రబాబు, పవన్‌లు కొట్టుకుపోవాలి ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించండి 2024... జగనన్న వన్స్‌మోర్ కలెక్షన్లు, షూటింగ్‌ల కోసం పవన్‌కు విశాఖ కావాలి పోటీ చేయడానికి విశాఖ కావాలి కానీ విశాఖలో రాజధాని వద్దా: మంత్రి రోజా పెయిడ్ ఆర్టిస్ట్‌లను సపోర్ట్ చేస్తున్న పవన్‌ను తరిమికొట్టాలి ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుందో పవన్‌కు చూపించాలి అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ.. ఒకవైపు జడివాన.. మరో వైపు జనవాన ఉత్తరాంధ్ర గర్జన ముందు బాబు గర్జన బలాదూర్ ఉత్తరాంధ్ర అన్ని రకాలుగా వివక్షకు గురైంది భావితరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం అంబేడ్కర్ సర్కిల్ నుంచి బీచ్‌రోడ్డుకు చేరిన ర్యాలీ. నేతలు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. భారీ వర్షంలో రెండున్నర గంటలు సాగిన ర్యాలీ దారి పొడవునా ర్యాలీకి విశాఖ ప్రజల సంఘీభావం. విశాఖకు రాజధాని రావాలంటూ హోరెత్తిన నినాదాలు. జనసంద్రమైన విశాఖ, ర్యాలీకి లక్షమందికి పైగా హాజరు విశాఖ పరిపాలనా రాజధాని అంటూ హోరెత్తిన నినాదాలు మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి అంటూ ప్రజల నినాదాలు 29 గ్రామాలు కాదు.. 26 జిల్లాలు అభివృద్ధి చెందాలంటూ నినాదాలు అమరావతి పేరుతో దాడులు చేస్తే సహించేది లేదు అంటూ హెచ్చరిక చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి: మంత్రి ధర్మాన ఉత్తరాంధ్ర కోసం అందరూ గొంతెత్తి నినదించాలి: మంత్రి ధర్మాన ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు: మంత్రి ధర్మాన ఉత్తరాంధ్ర కోసం రాజకీయ పోరాటం చేస్తాంఫ మంత్రి ధర్మాన ప్రస్తుత పరిస్థితుల్లో వికేంద్రీకరణ చాలా అవసరం: బుగ్గన అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి అచ్చెన్నాయుడికి రాజకీయ సమాధి తప్పదు చంద్రబాబుకు అచ్చెన్నాయుడు బానిస: దువ్వాడ శ్రీనివాస్ ఆ బానిసకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది: ప్రొఫెసర్లు ప్రపంచంలోని అద్భుత నగరాల్లో విశాఖ ఒకటి: ప్రొఫెసర్లు విశాక రాధానిని ప్రజలంతా స్వాగతిస్తున్నారు: ప్రొఫెసర్లు ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలు ఇంకెన్నాళ్లు: ప్రొఫెసర్లు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే రాజధాని రావాలి వర్షంలోనే కొనసాగుతున్న ‘విశాఖ గర్జన’ ర్యాలీ భారీ వర్షంలోనే కొనసాగుతున్న ర్యాలీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా తరలివచ్చిన ప్రజానీకం మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. చంద్రబాబుకు 29 గ్రామాల అభివృద్ధే కావాలి మేం అందరి అభివృద్ధిని కోరుకుంటున్నాం మేం చేసేది ప్రజా పోరాటం చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ పోరాటం విశాఖ గర్జనకు భారీ ప్రజా స్పందన రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు 3 రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి అంటూ ప్రజా సంఘాల నినాదాలు కొడాలి నాని మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబాటను రూపుమాపేందుకే విశాఖ రాజధాని ప్రజల ఆకాంక్షలకు అందరూ మద్దతు తెలుపుతున్నారు అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం ఆస్తుల సంపాదనే చంద్రబాబు ధ్యేయం ఆ నలుగురి అభివృద్ధే చంద్రబాబుకు కావాలి మహిళలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు వికేంద్రీకరణే లక్ష్యంగా ప్రజా గళం.. వికేంద్రీకరణే లక్ష్యంగా తమ గొంతు వినిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు నడుం బిగించారు. దీనిలో భాగంగా శనివారం జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’లో పాల్గొనడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ గర్జనకు విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలు, ప్రజా సంఘాలతో పాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొంటున్నారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వైఎస్సార్ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగుతోంది. రాజకీయాలకతీతంగా భారీ ప్రదర్శన చేపట్టగా దీనికి అన్ని వర్గాల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది. ఈ మేరకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తరతరాల వెనుకబాటు తనంపై ఒక్కటైన ఉత్తరాంధ్ర ప్రజానీకం వికేంద్రకరణతోనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నినదిస్తున్నారు. ‘టీడీపీ- జనసేనకు ఉత్తరాంధ్ర ఇప్పడు గుర్తుకువచ్చింది’ ‘విశాఖ గర్జన భయంతో ఇప్పుడు టీడీపీ- జనసేనకు ఉత్తరాంధ్ర గుర్తుకు వచ్చింది. విశాఖ గర్జన విజయవంతం ఖాయం. విశాఖ రాజధాని అవకాశాన్ని వదులుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ‘ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకే విశాఖ పరిపాలన రాజధాని. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞతతో ఒక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ పరిపాల రాజధానిగా ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. విశాఖ గర్జనకు విశేషమైన స్పందన లభిస్తోంది’ అని మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. ఇక వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్న వారికి కనువిప్పు కలగాలని విశాఖ గర్జన ర్యాలీ. వర్షం వచ్చినా విశాఖ గర్జన ర్యాలీ ఆగదు.వర్షం కంటే ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మస్థైర్యం గొప్పది. ఉత్తరాంధ్రకు టిడిపి నాయకులు ఏం చేశారో సమాధానం చెప్పాలి.రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను టిడిపి నేతలు దోచుకున్నారు.జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత ఉత్తరాంధ్ర పై టిడిపి నేతలకు ప్రేమ పుట్టుకొచ్చింది’ అని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)