Vishakapatnamn
-
రూ.50 కోట్ల బంగారం అమ్మకాల్లో గోల్మాల్..
సాక్షి, విశాఖపట్నం: బంగారం అమ్మకాల్లో తప్పుడు బిల్లులు సృష్టించి పన్నులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించిన హోల్‌సేల్ వర్తక దుకాణంపై రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ అధికారులు కొరడా ఝుళిపించారు. రూ.50 కోట్ల వరకూ బంగారం కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీల్లో తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినందుకు రూ.6,56,08,424 చెల్లించాలంటూ శుక్రవారం నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. ఈ వ్యాపార సంస్థ వ్యవహారాన్ని జేసీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ సర్కిల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సుంకర శ్రీలక్ష్మి, ఇంటిలిజెన్స్ విభాగాధికారులు కలిసి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మదింపు చేస్తూ.. గుట్టురట్టు చేశారు. ఒడిశాకు చెందిన ట్రిజాల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ హోల్‌సేల్ బంగారు, వెండి వ్యాపార సంస్థ విశాఖలో 2017–18న బ్రాంచ్ ప్రారంభించింది. 2018–19 నుంచి వ్యాపార లావాదేవీలు కొనసాగించింది. ఈ సమయంలో హోల్‌సేల్ ఇన్వాయిస్లను దుకాణాల పేరుతో కాకుండా వ్యక్తుల పేర్లతో చూపించారు. వీటిలో కూడా ఎస్టిమేషన్ స్లిప్స్‌కు, విక్రయ బిల్లుల్లో ఉన్న మొత్తానికి భారీ వ్యత్యాసాలున్నట్లు గుర్తించారు. మొత్తంగా రూ.50 కోట్ల విలువైన బంగారం, వెండి విక్రయాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని జేసీ శ్రీనివాసరావు తెలిపారు. 90 రోజుల్లో జరిమానా మొత్తం చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
మంటగలిసిన మానవత్వం, కాసేపటికే వ్యక్తి మృతి
గోపాలపట్నం (విశాఖ పట్నం): నరవలో జీవీఎంఈ వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్న సత్తి గంగరాజు (38) అనారోగ్యంతో మృతి చెందారు. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..కోటనరవలో నివాసముంటున్న గంగరాజు వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శనివారం ఉదయం పరిస్థితి విషమించడంతో ఆటోలో బయలుదేరాడు. గోపాలపట్నం స్టేషన్ రహదారిలో సాయిబాబా ఆలయ సమీపానికి వచ్చేసరికి అపస్మాకర స్థితిలోకి వెళ్లాడు. దీంతో భయపడిన ఆటో డ్రైవర్ గంగరాజును రోడ్డు పక్కన విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత గంగరాజు కుప్పకూలిపోయాడు. అటుగా వెళుతున్న పారిశుద్ధ్య కార్మికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వద్దనున్న పుస్తకంలోని ఫోన్ నంబర్ల ఆధారంగా వివరాలు సేకరించారు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా బావయ్యపాలెం వాసి. అతడి భార్య దుబాయిలో ఉంటోంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఉద్యోగ రీత్యా నరవలో ఒక్కడే ఉంటున్నాడు. ఎస్.కోటలో నివాసముంటున్న గంగరాజు సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి గోపాలపట్నం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. గంగరాజు అంత్యక్రియలకు 89వ వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్ రూ. 10వేలు సాయమందించారు. (చదవండి: విశాఖలోని ఆస్పత్రిపై కేసు నమోదు) -
గర్భం దాల్చిన ఆశ్రమ పాఠశాల బాలిక
జి.మాడుగుల (పాడేరు): ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో చదువుతున్న మైనార్టీ తెగకు చెందిన బాలిక గర్భం దాల్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం నుర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బీసీ (మైనార్టీ) విద్యార్థిని గర్భం దాల్చినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. నుర్మతిలో పాఠశాల లేక పోవడంతో ఆ బాలికకు గ్రామస్తుల వినతి మేరకు ఆశ్రమ పాఠశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు ప్రవేశం కల్పించారు. ఆశ్రమ పాఠశాలకు దగ్గరలో ఇంటి నుంచి పాఠశాలకు రాకపోకలు సాగిస్తూ చదువుతోంది. బాలికకు మలేరియా, టైఫాయిడ్ జ్వరం రావటంతో మందులు వాడేందుకు రోజూ ఇంటి నుంచి పాఠశాలకు రాకపోకలు సాగించడానికి ఆగస్టు 18న తల్లి అనుమతిపత్రం అందించటంతో ఒప్పుకున్నట్టు హెచ్ఎం సింహాచలం తెలిపారు. పాఠశాలకు చదువు నిమిత్తం వస్తున్న బాలిక శరీర ఆకృతిలో తేడా గమనించి పీహెచ్సీలో వైద్య పరీక్షలు చేయంచడంతో గర్భం దాల్చినట్టు నిర్ధారణ అయ్యిందని పాఠశాల ఏఎన్ఎం చెప్పారు. బాలిక తల్లిదండ్రులను పాఠశాలకు రప్పించి విషయాన్ని తెలియజేయడంతో బాలికను నిలదీయగా అదే గ్రామానికి చెందిన గిరిజన యువకుడితో ప్రేమలో పడినట్టు, అది శారీరక సంబంధానికి దారితీసినట్టు తేలిందని హెచ్ఎం తెలిపారు. మహిళా కమిషన్ సభ్యురాలి విచారణ పాఠశాలను మాజీ మంత్రి, మహిళా కమిషన్ సభ్యురాలు మత్స్యరాస మణికుమారి సందర్శించారు. హెచ్ఎం సింహాచలం, డిప్యూటీ వార్డెన్ రాజేశ్వరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆమె చెప్పారు. బాలిక గర్భం దాల్చిన ఘటనపై సోమవారం పాడేరు గిరిజన సంక్షేమ డీడీ విజయ్‌కుమార్ విచారణ చేపట్టారు. నుర్మతి ఆశ్రమోన్నత పాఠశాలలో విచారణ చేస్తున్న పాడేరు డీడీ విజయ్‌కుమార్ -
మూడో రోజు కొనసాగుతున్న సిట్ ఫిర్యాదులు
-
విశాఖ : మూడో రోజు కొనసాగుతున్న సిట్ ఫిర్యాదులు
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నంలోని సిరిపురం వుడా చిల్డర్డ్స్ ఎరీనా పార్క్‌లో సిట్ ఫిర్యాదుల స్వీకరణ మూడో రోజు ప్రారంభమైంది. సిట్‌కు ఫిర్యాదు చేయడానికి మూడో రోజు అధిక సంఖ్యలో వస్తుండడంతో సిట్ సభ్యులు అనురాధ, భాస్కర్ రావు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి రెండు రోజులు వచ్చిన 236 ఫిర్యాదుల్లో 41 సిట్ పరిధిలోకి రాగా, మిగతా 195 దీని పరిధిలోకి రాలేదు. కాగా, రెండవ రోజున మొత్తం 27 సిట్ ఫిర్యాదులు రాగా వాటిలో ఆన్లైన్లో ఏడు, భీమునిపట్నం మూడు, గాజువాక రెండు, గోపలపట్నం ఒకటి, పరవాడ మూడు, పద్మనాభం ఒకటి, పెందుర్తి ఆరు, సబ్వరం రెండు ఉన్నాయి. రెండవరోజు తమ భూములు ట్యాంపరింగ్ జరిగాయంటూ స్వాతంత్ర సమరయోధుల వారసులు సిట్‌కు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం తమను మోసం చేసి మా భూములు లాక్కొని తగిన నష్ట పరిహారం కూడా చెల్లించలేదని మెడ్‌టెక్ బాధితులు ఆరోపించారు. -
విశాఖకు మరో విమానాశ్రయం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో మరో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కావల్సిన స్థలాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం విశాఖకు వచ్చింది. నక్కపల్లి, ఎస్‌రాయవరం ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అలోక్ సిన్హాతో పాటు ఇతర ఉన్నతాధికారులు వచ్చారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయం ఉన్న సంగతి తెలిసిందే.