విశాఖపట్నం జిల్లాలో మరో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు.
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో మరో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కావల్సిన స్థలాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం విశాఖకు వచ్చింది.
నక్కపల్లి, ఎస్‌రాయవరం ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అలోక్ సిన్హాతో పాటు ఇతర ఉన్నతాధికారులు వచ్చారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయం ఉన్న సంగతి తెలిసిందే.