Vishakapattanam
-
‘మీరు తాట తీస్తే మేము తోలు తీస్తాం’
సాక్షి, విశాఖపట్టణం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో చేసింది లాంగ్ మార్చ్ కాదు, ఈవినింగ్ వాక్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఎద్దేవా చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. పవన్ విజయసాయి రెడ్డి కాలిగోటికి కూడా సరిపోడని విమర్శించారు. నాయకత్వ లక్షణాలు లేని నీకు రాజకీయాలెందుకని విరుచుకుపడ్డారు. రెండు కిలోమీటర్లు కూడా నడవకుండా లాంగ్ మార్చ్ పేరును చెడగొట్టారని మండిపడ్డారు. నిన్నటి వరకు నీ అన్న చిరంజీవిని విమర్శించిన అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడుల పక్కన కూర్చోడానికి సిగ్గుగా అనిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం తరపున టిక్కెట్లు నీవు ఇవ్వలేదు. ఒకవేళ నువ్వే ఇచ్చినా చాలా మంది ఓడిపోయారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. పవన్ మానసిక స్థితి బాగోలేదని, ఆయన్ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మీకు తాట తీయడం తెలిస్తే, మాకు తోలు తీయడం తెలుసంటూ పవన్ను హెచ్చరించారు. -
ఏవోబీలో మళ్లీ అలజడి
విశాఖపట్నం: ఏవోబీలో మళ్లీ అలజడి చెలరేగింది. ఏజెన్సీలోని కొయ్యూరు మండలం కన్నవరం గ్రామ శివారులోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులకు దిగారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. -
బీచ్ లవ్ ఫెస్టివల్ వద్దు: విద్యార్థుల ఆందోళన
-
చోడవరం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పాదయాత్ర
-
విశాఖపట్నంలో ఫిల్మ్నగర్ కల్చర్కు భూమి పూజ
-
విశాఖలో ఏడు స్వైన్ఫ్లూ కేసులు
విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు ఏడు స్వైన్ఫ్లూ అనుమానిత కేసులు నమోదయినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్ వెల్లడించారు. శనివారం ఆయన స్వైన్ఫ్లూ వ్యాప్తిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఏడు కేసుల్లో రెండు స్వైన్ఫ్లూగా నిర్ధారణకాగా, మరో రెండింటి రిపోర్టులు అందాల్సి ఉందని తెలిపారు. మరో రెండు కేసులు నెగిటివ్గా తేలాయన్నారు. స్వైన్ఫ్లూ కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాల్లో 14 బృందాలతో స్క్రీనింగ్ పరీక్షలు జరుపుతున్నట్టు జేసీ తెలిపారు.12 బృందాలతో వైద్య శిబిరాలు కూడా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతోపాటు వైద్య సిబ్బందికి మాస్క్లు అందజేయనున్నట్టు చెప్పారు.