Vivah
-
సల్మాన్ ‘వివాహ్’కి పనికిరాడన్న దర్శకనిర్మాత
ఇంతింతై అన్నట్టుగా ఎదిగిన సల్మాన్(Salman Khan) తొలి సినిమా ఏది? అని అడిగితే వెంటనే ఠక్కున మైనే ప్యార్ కియా అని చెప్పేస్తారు. కానీ చాలా మందికి తెలీని విషయం బీవీ హోతో ఐసీ (భార్య అంటే ఇలా ఉండాలి) అనే సినిమా సల్మాన్ తొలిసినిమా. 1988లో విడుదలైన ఈ సినిమాలో సల్మాన్ సహాయనటుడి పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత చేసిన మైనే ప్యార్ కియా సూపర్ డూపర్ హిట్ అవడంతో తొలి సినిమా తెరమరుగైపోయింది.. సల్లూభాయ్‌కి లవర్ బాయ్ ఇమేజ్ కూడా వచ్చేసింది.భార్య అంటే ఇలా ఉండాలి అనే అర్ధం వచ్చేలా టైటిల్‌తో తొలిసినిమా ఎలాగైతే సల్మాన్ కెరీర్లో అస్పష్టం ఉండిపోయిందో...సల్మాన్ వివాహం కూడా అలాగే ఉండిపోయింది. అదలా ఉంచితే... బాలీవుడ్లో అత్యంత ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన సల్మాన్‌ఖాన్‌కి దేశవ్యాప్తంగా అసంఖ్యాక అభిమానుల్ని అందించిన తొలి సినిమా మైనే ప్యార్ కియా కాగా దానికి దర్శకుడు సూరజ్ బర్జాత్యా(Sooraj Barjatya). హమ్ ఆప్ కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై వంటి సూపర్ డూపర్ హిట్స్ తో టాప్ డైరెక్టర్‌గా మారారు. పై చిత్రాలతో పాటు ప్రేమ్ రతన్ ధన్‌పాయో కూడా సల్మాన్‌ఖాన్‌తోనే రూపొందించారీ కుటుంబ చిత్రాలకు పేరొందిన ఈ దర్శకుడు. సల్మాన్‌తో అత్యధిక హిట్స్ తీశాడు. అలాగే ఆయన త్వరలో తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్‌తో మరో చిత్రంలో మళ్లీ చేయబోతున్నాడు, అయితే కెరీర్ ప్రారంభం నుంచీ వరుసగా సల్మాన్‌తో చిత్రాలు తీస్తూ వచ్చిన ఆయన ప్రేమ్ రతన్ ధన్పాయోకి ముందు వివాహ్(Vivah) పేరిట ఒక సినిమాని రూపొందించినప్పుడు ఆ సినిమాలో షాహిద్ కపూర్‌ని హీరోగా ఎంచుకున్నారు.సల్మాన్ ఖాన్ తో త్వరలో మరో చిత్రంలో మళ్లీ జతకట్టబోతున్న సూరజ్ బర్జాత్యా... వివాహ్ సినిమా కు హీరో ఎంపిక విషయంలో సల్మాన్‌ని దూరంగా పెట్టడానికి కారణం ఏమిటి? అనే విషయంపై బాలీవుడ్లో అప్పట్లో చర్చోపచర్చలు జరిగాయి. ఈ నేపధ్యంలో సూరజ్ బర్జాత్యా ఇటీవల ఆ విషయం గురించి మాట్లాడాడు.‘‘ అప్పట్లో మీరట్‌కు చెందిన ఒక టైలర్, కాలిన గాయాలతో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్త గురించి చెప్పి, మా నాన్న నాకు ఆ వార్తాపత్రిక కటింగ్‌ను చూపించారు. ప్రేమ మానవత్వం ఆధారంగా సినిమాను రూపొందించాలని అనుకున్నాం. ఆ సినిమా కథ కొత్తగా కనపడే ఒక అమాయకుడికి నప్పుతుంది. కాబట్టి సల్మాన్ ఖాన్ ఆ సినిమాకి నప్పే సరైన హీరో కాదు. అందుకే షాహిద్ ను ఎంచుకున్నా’’ అంటూ చెప్పారు సూరజ్ బర్జాత్యా. మొత్తానికి ఇంత కాలమైనా ప్రేమలు, అనుబంధాలకు దగ్గరగా అదే సమయంలో వివాహానికి దూరంగా ఉంంటూ వివాహ వ్యవస్థలో ఒదగలేకపోతున్న సల్మాన్... వివాహ్ అనే సినిమా లో పాత్రలో సైతం నప్పకపోవడం... విచిత్రం. -
సామూహిక వివాహాల్లో 30 జంటలకు ‘మళ్లీ పెళ్లి’
ప్రభుత్వం పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో చేపడుతున్న కొన్ని పథకాలు పెడదారి పడుతున్నాయి. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలనే ఆశతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో జరిగిన సామూహిక వివాహ యోజనలో పలు అక్రమాలు వెలుగు చూశాయి. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుతో పాటు ఇంటి సామగ్రి పొందాలనే ఆశతో 30 జంటలు ఈ కార్యక్రమంలో మళ్లీ పెళ్లి చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే దుర్గ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిగాయి. 301 జంటలకు వివాహం జరిగింది.ఈ కార్యక్రమానికి సీఎం విష్ణుదేవ్ సాయి కూడా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఇక్కడ వివాహాలు చేసుకున్న జంటలలో 30 జంటలు మళ్లీ పెళ్లిచేసుకున్నాయని మీడియాకు తెలియవచ్చింది. అలాగే ఇక్కడ పెళ్లిళ్లు చేయిస్తామంటూ కొందరు ఏజెంట్ల తయారైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. వీరు కొందరు జంటల నుంచి సొమ్ము వసూలు చేసినట్లు భోగట్టా. ఒక జంటకు ఇద్దరు పిల్లలను ఉన్నప్పటికీ వారు ఇక్కడ మళ్లీ పెళ్లి చేసుకున్నారని తెలియవచ్చింది.దుర్గ్‌లోని అగ్రసేన్ భవన్లో ఏర్పాటు చేసిన సామూహిక వివాహ కార్యక్రమంలో సినిమా తరహా దృశ్యాలు అనేకం కనిపించాయి. ఒకరు పెళ్లి విషయంలో గొడవ పడుతూ, డబ్బు కోసం పెళ్లి చేసుకున్నట్లు కనిపించింది. అలాగే ఒక ఏజంట్ ఏడు జంటలను మళ్లీ పెళ్లి కోసం తీసుకువచ్చినట్లు నిర్వాహకుల విచారణలో తేలింది. కాగా ఈ ఏజెంట్ ఆ జంటల నుంచి రూ. రెండు వేలు చొప్పున వసూలు చేశాడని సమాచారం. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకునే జంటలకు రూ. లక్షతో పాటు ఇతరత్రా సామాను అందిస్తుంటుంది. -
బాలీవుడ్ రీమేక్.. బెల్లంకొండ బ్రదర్‌తో కృతిశెట్టి?
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ టాలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓ మూవీ షూటింగ్ దశలో ఉండగా ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా గణేష్ హీరోగా మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా 2006లో షాహిద్ కపూర్, అమృతారావు జంటగా నటించిన చిత్రం ‘వివాహ్’ అనే బాలీవుడ్ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నారు. దీనికి సంబంధించి రీమేక్ హక్కులను కూడా సొంతం చేసుకున్నారట. ఈ మూవీలో బెల్లంకొండ గణేష్‌కు జోడీగా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్గా చేయనున్నట్లు సమాచారం. తొలి చిత్రం ఉప్పెనతో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న కృతిశెట్టి అయితే ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో దీనికి సంబంధించి ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, కృతి కూడా దీనికి పాజిటివ్‌గా రెస్పాండ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ మంగళూరు బ్యూటీ చేతిలో ఓ అరడజను సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నాని హీరోగా తెరకెక్కుతోన్న శ్యామ్ సింగ రాయ్‌తో పాటు.. సుధీర్ బాబు నటిస్తోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. చదవండి : Krithi Shetty: ‘బేబమ్మ’కు ఓ కోరిక ఉందట.. నెరవేర్చేదెవరు? శాండల్ వుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు వీళ్లే! -
తాజ్ కృష్ణలో ట్రెండ్జ్ వివహ్ కలెక్షన్
-
నాణ్యత పెరిగింది
టీవీ షోలలో నాణ్యత పెరిగిందని బాలీవుడ్ నటి అమృత ప్రకాశ్ చెప్పింది. బుల్లితెరలో నటించడం కూడా తనకు ఇష్టమేనని ‘వివాహ్’ సినిమాలో అమృతారావుకు సోదరిగా నటించిన అమృత తన మనసులో మాట బయటపెట్టింది. బుల్లి తెర కథలు ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా ఉంటాయంది. ‘1990 నాటి మాదిరిగానే బుల్లితెర ప్రయోగాల దశలో నడుస్తోంది. అప్పట్లో ‘రిస్తే’, స్టార్ బెస్ట్ సెల్లర్స్’ వంటి లఘుచిత్రాలు కూడా వచ్చాయి. గంటలోనే సిరీస్ మొత్తం పూర్తయ్యేది’ అని తెలిపింది. కాగా ‘స్మృతి’, ‘సాత్ ఫేరే’, ‘యే మేరే లైఫ్ హై’ సాత్ ఫేరే’ వంటి హిట్ ధారావాహికల్లో అమృత నటించింది. ప్రస్తుతం ‘సావధాన్ ఇండియా, ‘ఏ హై ఆషిఖి’, ‘గుమ్రాహ్’ తదితర ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమాల్లో నటిస్తోంది. ‘ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమాలు బాగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. వీటికి డిమాండ్ కూడా బాగా పెరుగుతోంది. లఘుచిత్రాలు కూడా టీవీల్లో ప్రవాహం మాదిరిగా వస్తున్నాయి. వీటి స్క్రిప్టులు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. కథలు గొప్పగా ఉంటున్నాయి’ అని అంది. కాగా 27 ఏళ్ల ఈ సుందరి సినిమాల్లోకి బాలనటిగా అడుగిడింది. ‘తుమ్ బిన్’, కోయీ మేరా దిల్ మే హై’ వివాహ్ వంటి హిట్ సినిమాల్లో నటించింది. 2010లో ‘వుయ్ ఆర్ ఫ్యామిలీ’ అనే సినిమాలో చివరిసారిగా కనిపించింది. అందులో అతిథి పాత్ర పోషించింది. మరి సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారంటూ మీడియా ప్రశ్నించగా ఒకే రకమైన పాత్రలున్న సినిమాల్లో నటించానంది. ఇదే పరంపర కొనసాగుతుందేమోననే భయంతో ఆ తర్వాత అనేక అవకాశాలొచ్చినా తిరస్కరించానని తెలిపింది. అయితే అది సరైన నిర్ణయమా? కాదా ?అనే విషయం తనకు తెలియదంది.