vivek tankha
-
మోదీకి ప్రతిబింబమే కేసీఆర్: వివేక్ థంకా
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య గొంతుకను అణచివేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి ఒక్కటేనని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ అధికార ప్రతినిధి వివేక్ థంకా విమర్శించారు. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ప్రతిబింబమని, ఇద్దరి పాలనా నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా నిలుస్తోందని దుయ్యబట్టారు. ఢిల్లీలో బడా మోదీ.. రాష్ట్రంలో చోటా మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వాలను పారద్రోలి, మార్పు తేవాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ కళాభవన్‌లో ‘సేవ్ తెలంగాణ చేంజ్ తెలంగాణ’ పేరుతో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. సదస్సులో వివేక్ థంకా మాట్లాడు తూ, కుటుంబం గురించి ఆలోచించే వారు, అవి నీతికి పాల్పడే వారు, ప్రజాస్వామ్యాన్ని అపహా స్యం చేసే సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఇలాంటి వారిని తరిమేయడమే శరణ్యమని, లేదంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి మానవ హక్కుల హననానికి పాల్పడుతోందని ఏఐసీసీ లీగల్ సెల్ చైర్మన్ విపుల్ మహేశ్వరి ఆరోపిం చారు. మీడియా, ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, పీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డితోపాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
‘నన్నెందుకు వీఐపీలా చూస్తున్నారు..’
న్యూఢిల్లీ: సాధారణంగా తనను ప్రత్యేకంగా చూడాలని, వీఐపీలా ట్రీట్ చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంటారు. కానీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మాత్రం తనను వీఐపీలా చూసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ’నేను కూడా అందిరిలాంటి మనిషినేగా ఎందుకు ప్రత్యేకంగా పరిగణిస్తూ మానసికంగా వేధిస్తారు’ అని ఆయనకు కలిగిన ఇబ్బందిని బయటపెట్టారు. మధ్యప్రదేశ్ నుంచి కొత్తగా రాజ్యసభకు వివేక్ తనఖా అనే వ్యక్తి ఎన్నికయ్యారు. ఆయన జబల్పూర్ నుంచి ఢిల్లీకి ఒక కార్యక్రమంపై వెళ్లారు. ఆ సమయంలో ఆయనతోపాటు ఓ లోక్ సభ సభ్యుడు కూడా ఉన్నాడు. స్పైస్ జెట్ విమానంలో వారిద్దరు వెళ్లారు. అయితే, ఢిల్లీ విమానాశ్రయం చేరుకోగానే ముందుగా తమకు మాత్రమే ఫ్లైట్ దిగిపోయే అవకాశం ఇచ్చి మిగితా ప్రయాణికులను కొద్ది సేపు ఆపేశారని, తాము పూర్తిగా వెళ్లిపోయాక వారిని వదిలారని, ఇది ఏమాత్రం గర్హించరాని విషయం అంటే స్పైస్ జెట్ కు ఫిర్యాదు చేశారు. తాము కూడా మిగితా ప్రయాణికుల్లాంటి వారిమేనని చెప్పారు.‘నేను చాలా తీవ్రంగా బాధపడ్డాను. నేను అందరిలాంటి ప్రయాణికుడినే. వారికి ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారో నాకు వాటినే వర్తింపజేయాలి. నన్ను కూడా ఒక పౌరుడిగా పరిగణించినప్పుడు ప్రత్యే్క సేవలు, మర్యాద అవసరం లేదనే చెప్తాను. మీకు వీలైతే వీఐపీలా ఎంపీలను, లేదా కొంతమందిని ట్రీట్ చేయడం మానేయండి. అదీ కుదరకుంటే.. కనీసం నన్నయినా వీఐపీలా ట్రీట్ చేయడం మానండి’ అంటూ ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.