viziangaram
-
మహిళలకోసం ప్రత్యేకంగా పట్టణంలోని ప్రకాశం పార్క్
-
క్షణికావేశం.. భార్య మద్యం తాగి రావడంతో..
సాక్షి, పాచిపెంట: భార్యాభర్తల మధ్య మద్యం వివాదం పెద్దదైంది. క్షణికావేశంలో భర్త దాడిచేయడంతో భార్య తనువుచాలించిన విషాదకర ఘటన పాచిపెంట మండలం మాతుమూరు సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా అరకు మండలం పూజారిపుట్టు గ్రామానికి చెందిన మర్రి శోభన్ (30), భార్య మర్రి తులసి(24) ఏడాది కిందట నుంచి మాతుమూరులోని ఓ రైతుకు చెందిన పామాయిల్ తోటలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తులసి తన తల్లితో కలిసి శనివారం ఉదయం సాలూరు వెళ్లింది. మద్యం సేవించి సాయంత్రం ఇంటికి వచ్చింది. మద్యం సేవించడంపై భర్త శోభన్ మందలించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ నేపథ్యంలో తాము నివసిస్తున్న ప్రదేశానికి కొంత దూరం భార్యను తీసుకెళ్లి మోహంపై కర్రతో కొట్టాడు. తీవ్రగాయాలైన తులసి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న సాలూరు సీఐ ఎల్.అప్పలనాయడు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ ప్రసాద్ తెలిపారు. చదవండి: ‘నేను చనిపోతున్నా.. నా చావుకు ఎవ్వరూ కారణం కాదు..’ -
వేటకెళ్తూ దారితప్పి.. బంగ్లాదేశ్ జలాల్లోకి
సాక్షి, విజయనగరం/పూసపాటిరేగ: జిల్లాలోని మత్స్యకార గ్రామాలు మరోసారి ఉలిక్కిపడ్డాయి. వేటకు వెళ్లిన తమవారు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి వెళ్లి అక్కడ బందీలయ్యారనే వార్త విని ఇక్కడి వారి కుటుంబాలు తల్లడిల్లాయి. గత అనుభవాల దృష్ట్యా తమ వారు ఎప్పుడొస్తారో తెలి యక వారంతా అల్లాడిపోయా రు. కనీసం తమ వారితో అధికారులు ఫోన్లో మాట్లాడించినా... బాగుండని బోరున విలపించారు. కానీ అదృష్టవశాత్తూ వా రు సురక్షితంగానే ఉన్నారని తెలియగానే వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే ఆ దేశ కోస్టుగార్డులు వెనక్కిపంపించారన్న సమాచారంతో తిప్పలవలస, పతివాడ బర్రిపేట, చింతపల్లి గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రపంచం మొత్తానికి కీడు చేస్తున్న కరోనా వీరికి మాత్రం ఒకరకంగా మేలు చేసిందనే చెప్పాలి. బందీలుగా చిక్కింది ఇలా... పూసపాటిరేగ మండలం తిప్పలవలస, పతివాడబర్రిపేట, చింతపల్లికి చెందిన ఎడుగురు మత్స్యకారులు మరో ఐదు గురు మత్స్యకారులతో కలిసి విశాఖ హార్బర్ నుంచి నవంబర్ 7వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. నిబంధనలపై అవగాహన లేక మన దేశ సరిహద్దు దాటి బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి పొరపాటున ప్రవేశించారు. నవంబర్ 29 తెల్లవారు జామున 3 గంటల సమయంలో బంగ్లాదేశ్ రక్షక దళాలు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నాయి. పట్టుబడిన వారిలో పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్క దానయ్య, రాయితి లక్ష్మయ్య, నక్క బోడోడు, పతివాడబర్రిపేటకు చెందిన గరికిన ఎల్లయ్య, గరికిన శ్రీను, మైలపల్లి కొర్లయ్య, చింతపల్లికి చెందిన చొక్కా శ్రీను ఉన్నారు. బోటులో మత్స్యకారుల పక్కనే మన దేశ సముద్ర జలాల్లో వేట చేస్తున్న మత్స్యకారుల ద్వారా బోటు యజమాని వాసుపల్లి ప్రసాదుకు అక్కడి నుంచి సమాచారం పంపించారు. సోమవారం ఉదయానికి మత్స్యకారుల స్వగ్రామాలకు విషయం తెలియచేయడంతో వారి కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు. అదృష్ట వశాత్తూ గంటల వ్యవధిలోనే మత్స్యకారులను కరోనా భయంతో బంగ్లాదేశ్‌లో విడిచిపెట్టారు. జీపీఆర్ఎస్, వలలు తీసుకొని సరిహద్దు లు ఎందుకు దాటారని బంగ్లాదేశ్ కోస్టుగార్డులు ఆ గ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే కఠిన చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలేశారు. మత్స్య కారులు సురక్షితంగా వస్తున్నారని మ త్స్యశాఖ జిల్లా ఉప సంచాలకులు నిర్మలా కుమారి ధ్రు వీకరించారు. చిక్కితే జైలుకే పొట్టకూటి కోసం వలస పోతున్న మత్స్యకారులు సముద్రంలో దారి తెలీక పొరపాటున పరాయి దేశ జలాల్లోకి వెళ్లి అక్కడి రక్షఖ దళాలకు బందీలుగా చి క్కుతున్నారు. జిల్లాలోని తీరప్రాంత మండలాలకు చెందిన వేలాది మంది కడలి బిడ్డలు విశాఖపట్నం, కర్ణాటక పోర్టులకు వెళ్లి, అక్కడి నుంచి సముద్రంలో వేటకు వెళుతుంటారు. దారి తప్పి విదేశీలకు బందీలు గా మారి ఏళ్ల తరబడి జైళ్లల్లో మగ్గిపోతున్నారు. 2018 నవంబర్ 28వ తేదీన అరేబియా మహాసముద్రంలో వేటాడుతూ పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారంటూ అక్కడి అధికారులు ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులను అరెస్టు చేశారు. దాదాపు 13 నెలల తర్వాత వీరు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విడుదలయ్యారు. ఆ తరువాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారుల సంక్షేమానికి అనేక వరాలనిచ్చా రు. వేట విరామ సయంలో ఇచ్చే సాయాన్ని రూ. 6 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. డీజిల్ రాయితీలను కూడా పెంచారు. అయితే ఈసారి చిక్కిన వారిని ఒకరకంగా కరోనా కాపాడిందంటున్నారు. ఇక రాడేమోనని భయపడ్డాం నా కొడుకు నక్కా దానయ్య బందీగా చిక్కాడని కబురు తెలియగానే గుండెలు గుభేల్ మన్నాయి. ఎందుకంటే గతంలో బందీలుగా చిక్కిన మా బంధువులు సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోయారు. మా బాబు పరిస్థితీ అంతేనా అని భయపడ్డాం. ఇంతలోనే అక్కడివాళ్లు విడిచిపెట్టారని సమాచారం వచ్చింది. దేవుడే మావోడ్ని కాపాడాడు. – నక్కా లక్ష్మీ, నక్కా దానయ్యతల్లి, తిప్పలవలస. ఆశలు వదులుకున్నాను... నా కొడుకు నక్క బోడోడు బంగ్లాదేశ్ మత్స్యకారులకు చిక్కా డని తెలియగానే నాకు దిక్కు ఎవరని బోరున ఏడ్చాను. దాదాపుగా ఆశలొదిలేసుకున్నాను. అంతలోనే అక్కడి అధికారులు మావోల్ని ఒదిలీసేరని తెలిసింది. నిజంగా దేవుడు మాపక్కనున్నాడు. అందుకు మావోడు వచ్చేత్తన్నాడు. వాడిని తనివితీరా సూసుకోవాలనుంది. – నక్క అప్పన్న, నక్క బోడోడు తండ్రి తిప్పలవలస మా అల్లుడికి మరో జన్మే మా అల్లుడు రాయితి లక్ష్మయ్య బంగ్లాదేశ్ కోస్టుగార్డులకు చిక్కి రోజు వ్యవధిలోనే తిరిగి ఇక్కడికి బయలుదేరినట్లు తెలిసింది. కలలో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు. బంగ్లాదేశ్ అధికారులకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించడంతో తిరిగి స్వగ్రామాలుకు పంపించారు. – మైలపల్లి అప్పయ్యమ్మ, రాయితి లక్ష్మయ్య అత్త, తిప్పలవలస. -
నాగలి పట్టిన కుర్రాడు.. నేడు డీఎస్పీ
సాక్షి, ప్రొద్దుటూరు: ఆ యువకుడు సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు.. వారికున్న కొద్దిపాటి పొలంలో వ్యవసా యం చేసి కష్టపడి తల్లిదండ్రులు బాగా చదివించారు.. తన అభ్యున్నతి కోసం తండ్రి పడిన కష్టాలను చిన్నప్పటి నుంచి కళ్లారా చూశాడు ఆ యువకుడు. కుటుంబ పరిస్థితులు అతడిలో కసిని పెంచాయి. బాగా చదివి పది మందికి సాయం చేసే ఉద్యోగం పొందాలి... తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. ఎంతో క్రమశిక్షణ.. అంతకు మంచి నిబద్ధతతో చదివాడు. నాడు నాగలి పట్టిన విజయనగరం కుర్రాడు నేడు లాఠీ పట్టాడు. ప్రొద్దుటూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఏగిరెడ్డి ప్రసాదరావు గురించి ఆయన మాటల్లోనే.. రైతు కుటుంబం నుంచి... విజయనగరం జిల్లాలోని పార్వతీపురం సమీపంలో ఉన్న గుణానుపురం మా స్వగ్రామం. తల్లిదండ్రులు మహాలక్ష్మి, సత్యంనాయుడు. మేము ఇద్దరం అన్నదమ్ములం. మా అన్న శంకర్రావు ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. గ్రామంలో ఆరు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయమే మాకు జీవనాధారం. కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసి మా తల్లిదండ్రులు మా ఇద్దరినీ చదివించారు. మేము నాన్నతో పాటు పొలం పనులు చేసేవాళ్లం. మా ఊళ్లోని ప్రభుత్వ హైస్కూళ్లో 10వ తరగతి వరకు చదివాను. విజయవాడలోని గౌతమ్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశా ను. గౌహతిలోని ఐఐటీలో డిగ్రీ చదివాను. తర్వాత హైదరాబాద్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను. కుటుంబ పరిస్థితుల ప్రభావంతో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను, గ్రూప్స్‌లో మంచి ర్యాంక్ రావడంతో ఇష్టమైన పోలీసు శాఖలో చేరాను. 2018 బ్యాచ్‌లో డీఎస్పీగా ఎంపికై అనంతపురంలోని పీటీసీలో శిక్షణ పొందాను. డి్రస్టిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిగా వైఎస్సార్ జిల్లాలోనే చేశాను. రాయచోటి, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, పులివెందులలో ట్రైనీ డీఎస్పీగా విధులు నిర్వర్తించా ను. అందువల్ల జిల్లాపై మంచి అవగాహన ఉంది. చట్టపరిధికి లోబడి పని చేస్తా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తారనే భావన చాలా మందిలో ఉంది. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి చెప్పుకోవచ్చు. నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ మా విధానం. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారు. సబ్‌డివిజన్‌లోని అన్ని గ్రామాలు తిరిగి స్వయంగా సమస్యలు తెలుసుకుంటాను అని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. -
జలయజ్ఞ ప్రదాత రాజన్న
సాక్షి, విజయనగరం: భూమి ఉన్నా నీరు లేక... అదను దాటిపోతున్నా దున్నుకోలేక.. సొంత పొలమున్నా సాగులేక... బతుకు తెరువు కోసం పరాయి పంచన కూలీలై కష్టాలు పడుతున్న జిల్లా రైతుల పాలిట రాజశేఖరరెడ్డి అపర భగీరథుడయ్యారు. ఆసియాలోనే తొలి రబ్బరు డ్యామ్‌ను జంఝావతి నదిపై నిర్మించారు. పెద్దగెడ్డ నుంచి పంట చేలకు సాగునీరందేలా రిజర్వాయర్ కట్టించారు. తోటపల్లి ప్రాజెక్టును తొంభైశాతం పూర్తి చేశారు. సాగు, తాగునీరు ఇబ్బందుల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు పూర్తిస్థాయిలో చేయూతనందించి ఇక్కడి అన్నదాతలకు దేవుడయ్యారు. ఆ మహనీయుని 71వ జయంతి నేడు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాలను కలుపుతూ తోటపల్లి సాగునీటి కాలువ ఏర్పడింది. రూ. 84 కోట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ, సుజలధార తాగునీటి పథకాన్ని చీపురుపల్లి నియోజకవర్గానికి మంజూరు చేశారు. వేపాడ మండలంలో విజయరామసాగర్‌ను మినీరిజర్వాయర్‌గా తీర్చిదిద్దాలని నిధులు మంజూరు చేశారు. మక్కువ మండలంలో సురాపాడు ప్రాజెక్టు నిర్మించారు. వెంగళరాయ సాగర్ రిజర్వాయర్‌కు సంబంధించిన కాలువలు అభివృద్ధి పనులు చేశారు. అరుదైన రబ్బర్ డ్యామ్ కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 1976లో జంఝావతి డ్యామ్‌నకు శ్రీకారం చుట్టారు. కానీ పూర్తిస్థాయిలో భూ సమీకరణ చేపట్టకపోవడంతో ఒడిశాతో వివాదం ఏర్పడింది. ఈ వివాదాన్ని తొలగించేందుకు అటు ఒడిశా, ఇటు ఏపీ ప్రభుత్వాలు పలు మార్లు చర్చలు జరిపినప్పటికీ ఒడిశా ప్రభుత్వం ముంపు గ్రామాలను వదులు కోవడానికి ససేమిరా అనడంతో అక్కడ డ్యామ్ రివర్ గ్యాప్ మూసివేయకుండా వదిలేశారు. దీనివల్ల నదిగుండా ప్రవహించే నీరు వృథాగా పోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదన గమనించిన మహానేత 2006లో ఆ్రస్టియా టెక్నాలజీతో రూ.5 కోట్లతో ఆసియాలోనే మొట్టమొదటి సారిగా రబ్బరు డ్యామ్‌ను నిర్మించారు. రబ్బరు డ్యామ్ ద్వారా నీటిని నిల్వచేసి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పొలాలకు సాగునీటిని అందించే అవకాశం కలిగింది. డ్యామ్ లోపలి భాగంలో 0.03 టీఎంసీల నీరు నిల్వ ఉండి లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుకూలమైంది. దీని ద్వారా 12వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. తోటపల్లితో మారిన దశ గరుగుబిల్లి మండలంలో తోటపల్లి ప్రాజెక్టుకు రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. సింహభాగం పనులు టీడీపీ అధికారం చేపట్టకముందే జరిగాయి. తోటపల్లి చానల్ ద్వారా సుమా రు 3వేల ఎకరాలకు నీరందించేందుకు పైలాన్ ప్రారంభోత్సవాన్ని వైఎస్ అప్పట్లో చేశారు. పార్వతీపురం మండలం అడారుగెడ్డ నిర్మాణానికి కూడా రాజశేఖరరెడ్డి హయాంలోనే నిధులు కేటాయించారు. విజయనగరం పట్టణానికి తాగునీటి కోసం నిర్మించతలపెట్టిన తారకరామతీర్థసాగర్‌కు 2007లో సుమారు రూ.187 కోట్లను విడుదల చేశారు. నెల్లిమర్ల పట్టణంతో పాటు గుర్ల, గరివిడి మండలాలకు తాగునీటిని అందించేందుకు రామతీర్థం మంచినీటి పధకాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. తొలి జలయజ్ఞ ఫలం పెద్దగెడ్డ పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ రిజర్వాయర్ పేరు చెప్పగానే అక్కడి ప్రజలకు గుర్తుకొచ్చేది వైఎస్సార్. జలయజ్ఞంలో భాగంగా సుమారు రూ.100 కోట్లతో పెద్దగెడ్డ రిజ ర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌ను 2006లో ఆయనే ప్రారంభించారు. ఈ సమయంలోనే సమీపంలోని అరుకు–పాచిపెంట ప్రాంతాల్లో హెలికాఫ్టర్ ద్వారా ఏరి యల్ సర్వే నిర్వహించారు. ఇక్కడ అందాలను చూసి అబ్బురపడ్డారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమాలోచనలు చేశారు. అప్పుడే సుమారు 2 ఎకరాల పా ర్క్ ఏర్పాటయ్యింది. రిజర్వాయర్‌లో ఉండే నాటు పడవల స్థానంలో విశాఖపట్నం నుంచి మిషన్బోట్లు తీసుకువచ్చా రు. ఇవే గాకుండా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయనే రూపకల్పన చేసి వాటి ఫలాలను జిల్లాకు అందించారు. -
జిల్లాలో అకస్మాత్తుగా పెరుగుతున్నకరోనా
సాక్షిప్రతినిధి,విజయనగరం: కనిపించని శత్రువు నిశ్శబ్దంగా జిల్లాను కమ్మేస్తోంది. లాక్డౌన్ 3.0 ప్రకటించే నాటికి రాష్ట్రంలో గ్రీన్ జోన్లో ఉన్న ఏకైక జిల్లా విజయనగరం. కానీ వలస కూలీల రాకతో సేఫ్ జోన్లో ఉన్న జిల్లా రెడ్‌జోన్‌లోకి మారుతోంది. ఇప్పటికే నాలుగు కరోనా పాజిటివ్ కేసుల్లో ఒకరు మృతి చెందగా మరో మూడు కేసులు వెలుగు చూడటంతో జిల్లా ఉలిక్కిపడింది. ఒకే రోజు మరో మూడు కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవా రం విడుదల చేసిన బులిటెన్‌లో అధికారికంగా ప్రకటించడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. అప్రమత్తమైన అధికారు లు పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు. కంటైన్మెంట్ జోన్లుగా ఓంపల్లి, గరుగుబిల్లి బొండపల్లి మండలం ఓంపల్లి, మెంటాడ మండలం జక్కువ, గరుగుబిల్లి మండల కేంద్రంలో కరోనా కేసులు నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమమైంది. ఆ రెండు గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తిస్తూవిజయనగరం ఆర్డీవో, పార్వతీపురం సబ్ కలెక్టర్ శుక్రవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ గ్రామాలకు రాకపోకలను పూర్తిగా నియంత్రించడంతో పాటు, ఇక్కడ ప్రత్యేక పారిశుద్ధ్య కార్య క్రమాలు ప్రా రంభించారు. జక్కువ గ్రామానికి చెందిన వ్యక్తి క్వారంటైన్ సెంటర్లో ఉన్నప్పుడే వ్యాధి బయటపడటంతో, ఆతన్ని అక్కడినుంచే నేరుగా కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. ఇంటి వద్దకే నిత్యావసరాలు, కూరగాయలు వ్యాధి నిర్ధారణ జరిగిన వ్యక్తి ఇంటి చుట్టుపక్కల ఒక కిలోమీటరు వరకూ ఎపిక్ కంటైన్మెంట్జోన్గా ప్రకటించారు. దీనిప్రకారం గరుగుబిల్లి ఎస్సీ కాలనీలోని 737 ఇళ్లు, ఓంపల్లిలోని 428 ఇళ్లు ఆ పరిధిలోకి చేరాయి. ఈ ప్రాంతాలకు ఇతర గ్రామాలనుంచి రాకపోకలను నిలిపివేశారు. వైద్యులు తదితర అత్యవసర సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ ప్రాంతంలో నివాసం ఉన్నవారంతా ఇళ్లకే పరిమితం కావాల్సిఉంది. వీరికి నిత్యావసరాలు, కూరగాయలను ఇంటికే సరఫరా అవుతాయి. మరికొన్ని అనుమానిత కేసులు: జిల్లాకు రోజూ వలస కూలీలు, యాత్రికులు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వస్తూనే ఉన్నారు. కాశీ నుంచి దాదాపు 39 మందిరాగా వారిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో వారందరికీ పరీక్షలు నిర్వహించారు. చెన్నై నుంచి వచ్చిన ఇద్దరిలో కరోనా లక్షణాలు ఉండటంతో వారికీ పరీక్షలు జరిపారు. పూర్తి రిజల్ట్ రావాల్సి ఉంది. వీరితో పాటు ఇప్పటి వరకూ జిల్లాకు వచ్చిన వలస కూలీలు, మత్స్యకారులు 3571 మంది 59 క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. శుక్రవారం ఒక్కరోజే 296 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. బఫర్ జోన్లలో బారికేడ్లు కంటైన్మెంట్ జోన్‌కు చుట్టుపక్కల 3 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను బఫర్‌జోన్‌గా ప్రకటించారు. బొండపల్లి మండలం వేండ్రాం, కొండకిండాం, అయ్యమ్మ అగ్రహారం, కిండాం అగ్ర హారం, గంట్యాడ మండలం నీలావతి, జగ్గాపురం, గొర్లెపేట, పెనసాం, నందాం, విజయనగరం మండలం గుంకలాం గ్రామాలున్నాయి. గరుగుబిల్లి బఫర్‌జోన్‌లో పెద్దేరు, ఉద్దవోలు, గొట్టివలస ప్రాంతాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ని వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లడం గానీ, ఇతరులు అందులోకి పవేశించకుండా పోలీసు లు బారికేడ్లు ఏర్పాటు చేశారు. గరుగుబిల్లి ఎస్సీ కాలనీ, హిక్కంవలస, పెద్దేరు రోడ్డు, పెట్రోలు బంకులవద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఓంపల్లి–వేండ్రాం జంక్షన్, ఆంజనేయస్వామి విగ్రహం వద్ద, వేండ్రాం–గరుడుబిల్లి రోడ్డు, నీలావతి జంక్షన్, పెనసాం జంక్షన్, కొండకిండాం ఔటర్రోడ్లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, రాకపోకలను నియంత్రిస్తున్నారు. -
ఇసుక సమస్యకు చెక్
సాక్షి, విజయనగరం : ఇసుక సమస్యకు ఇక చెక్ పడనుంది. ఇన్నాళ్లుగా ఇదో ఆయుధంగా మలచుకున్నవారి నోటికి తాళం పడనుంది. గురువారం ఉదయం నుంచే ఇసుక ర్యాంపుల ద్వారా ఇసుక సరఫరా చేయాలని జిల్లా సయుక్త కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల వర్షాలు కురవడం వల్ల ఇసుక ర్యాంప్‌లు నీటితో తడిసిపోవడం వల్ల నెలరోజుల పాటు ఇసుక సరఫరా చేయలేదన్నారు. కలెక్టరేట్ సమావేశ భవనంలో అధికారులు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయకులకు బుధవారం ఇసుక సరఫరాపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ ప్రవేశపెట్టిందని, పంచాయతీ కార్యదర్శుల ద్వారా ప్రజలకు ఇసుక సరఫరా చెయ్యాలని ఆదేశాలు జారీచేశారన్నారు. జిల్లాలో 26 మండలాల్లో 70 ఇసుక రీచ్ లను గుర్తించామనీ, ఈ రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను 70 మంది పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడమైందన్నారు. మిగిలిన మండలా ల్లో కూడా ఇసుక రీచ్ లను గుర్తిస్తామని, వీరికి ఇసుక అవసరమైతే గుర్తించిన రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా చేయ్యాలన్నారు. కార్యదర్శులు స్మార్ట్ ఫోన్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని ఎస్3 ఫారం జనరేట్ చేసుకోవాలన్నారు. ఫారం జనరేట్ అయిన తర్వాత యూనిక్ నంబరు వస్తుందని దానిని ప్రింట్ తీసుకోని, 48 గంటల లోపు ఇసుకను తీసుకు వెళ్లాలన్నారు. ఒక టన్ను ఇసుక ధర రూ.375లు గా నిర్ణయించామనీ, ఇందులో రూ.285 లు ప్రభుత్వానికి, మిగిలిన రూ.90 లు లోడింగ్ చార్జీల కింద కార్మికులకు చెల్లించాలన్నారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా మాత్రమే ఇసుక సరఫరా చెయ్యాలని స్పష్టం చేశారు. ఒక ఎడ్ల బండికి అరటన్ను కు రూ.150లు, ఒక ట్రాక్టర్‌కు నాలుగున్నర టన్నుల ఇసుక పడుతుందని, రూ.1283 లు అవుతుందన్నారు. ఇసుకను యంత్రాలతో లోడ్ చేయవద్దని, కార్మికుల ద్వారా లోడింగ్ చేయించాలన్నారు. వాహనానికి ఎస్3 ఫారం అతికించాలని, అది లేకుండా ఇసుకను తరలిస్తే మొదటిసారి రూ.10 వేలు, రెండవసారి రూ.20 వేలు జరిమానా, మూడవ సారి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. రెండురోజుల తర్వాత నేరుగా నగదు స్వీకరించే అవకాశం కల్పిస్తామని వివరిచారు. జిల్లాకు 1,50,000 టన్నుల నుంచి 2లక్షల టన్నుల వరకు అవసరమని తెలిపారు. నీతి, నిజాయితీగా, పారదర్శకంగా పనిచెయ్యాలని, ఎటువంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా అర్హులైన వారికే ఇసుక కేటాయించాలన్నారు. కార్యక్రమంలో భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకుడు పూర్ణ చంద్రరావు, సహాయ సంచాలకుడు ఎస్.వి.రమణారావు, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ, ఎన్ఐసీ అధికారి నరేంద్ర కుమార్ , ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఓడిన రాజులు.. కూలిన రాజ్యాలు
-
నేలరాలిన సాహితీ కుసుమం
విజయనగరం టౌన్: సాహితీ కుసుమం నేలరాలింది. విజయనగర వాసుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమాను తిరుగుతుంటే ఆయన వ్యాఖ్యానం లేనిదే ఆ మాను కదలదు.. తన ఆరోగ్యం సహకరించకపోయినా అమ్మవారి పండగలో వ్యాఖ్యానంతో పాటు వేదాశీర్వచనాల ను చివరి వరకూ కొనసాగించారు.. ఎందరో సాహితీవేత్తలకు ఆయన ఆదర్శప్రాయుడు.. 13 ఏళ్లపాటు సంస్కృత విద్యను నేర్పించి, ఎందరో విద్యార్థులకు దిక్సూచీగా నిలిచిన మానాప్రగడ శేషశాయి (90) గొంతు మూగబోయింది. మంగళవారం వేకువజామున పూల్‌బాగ్‌లో ఉన్న ఆయన స్వగృహంలో అస్తమించారు. ఆయన మృతివార్త తెలుసుకున్న సాహితీవేత్తలు, అభిమానులు భౌతిక కాయాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శేషశాయి జీవిత చరిత్ర ఇదీ... పశ్చిమగోదావరి జిల్లా గుణపర్రులో సూరమ్మ, బాపిరాజు దంపతుల ద్వితీయపుత్రినిగా 1927 ఆగస్టు 14న మానాప్రగడ జన్మించారు. ఏలూరు, గుంటూరు, రాజమండ్రిలలో విద్యాభ్యాసం, నం తరం బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా స్వీకరించారు. ఏలూరు, మద్రాసు, అనంతరం, కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకునిగా పనిచేశారు. 1966–79 వరకు విజయనగరం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో ఆచార్య పదవిలో కొనసాగారు. జీవి తాన్ని కళాశాల అభివృద్ధికే అంకితం చేశారు. అధ్యాపకులు, వేదపండితులకు యూజీసీ స్కేల్ అమలుచేయడంలో ఆయన పోరాటం ఆదర్శనీ యం. 1969లో కళాశాల శతజయంతి ఉత్సవాన్ని పురప్రముఖుల సహాయ సంపత్తులతో నిర్వహించడం వారి కార్యనిర్వహణ దక్షతకు నిలువెత్తు దర్పణం. ఆయన హయాంలో డాక్టర్ సి.నారాయణరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, వేదాంతం వంటి మహామహులు సత్కరించబడ్డారు. నాటి గవర్నర్ ఖండూబాయ్ దేశాయ్, రాష్ట్రపతి వీవీ గిరి, మాజీప్రధాని పీవీ నరసింహరావు (అప్పట్లో విద్యామంత్రిగా ఉన్నప్పుడు) విజయనగర వైభవాన్ని చూసి శేషశాయికి మంగళాశాసనం చేశారు. కవితాపరంగా చూస్తే సింహాచలేశునికి పద్యాల చలువగంధం పూసారు. అన్నవరం స్వామికి కవితా కల్హారాలు అర్పించారు. అరసవిల్లి సూర్యనారాయణమూర్తికి కావ్యోపహారంతో అలరించారు. చందస్సు సుందరమైన పద్యాన్ని రసభరితంగా రచించి సహృదయహృద్యంగా వినిపించడం ఆయన ఘనత. సిరిమానోత్సవంలో ఆయన పాత్ర కీలకం.. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం, తిరుపతి బ్రహ్మోత్సవాల కార్యక్రమాల వ్యాఖ్యానం శ్రోతృ కర్ణామృతంగా వినిపించడంలో ఆయనకు ఎవరూ సాటిలేరు. అంబరాన్నంటే సంబరాలన్నా.. వెర్రిముండావాడన్నా, తెల్లారినట్లే ఉందన్న పదాలు వినిపిస్తే అవి మానాప్రగడ వ్యాఖ్యానాలు అని ఇట్టే చెప్పేయవచ్చు. 1989 జూన్ 25న మానాప్రగడ షష్టిపూర్తిని జిల్లా ప్రజలు ఘనంగా జరిపారు. ఆయన శ్రీ చందనం, సత్యదేవ శతకం, ఆంధ్రసాహిత్యంలో హాస్యం, శ్రీమల్లిఖార్జున శతకం, ప్రసన్న భాస్కరం, జయదేవ సరస్వతి, పైడితల్లి అమ్మవారి సుప్రభాతాలను రచించారు. నాలుగు దశాబ్దాలుగా మందార మకరంద సుందర పద ప్రబంధ సుగంధాలు వెదజల్లుతూ పైడితల్లిని సేవిస్తూ, అక్షర ప్రసూనాలతో అర్చిస్తూ, వాక్యాల చంద్రికలను కురిపిస్తూ అపర వ్యాసమహర్షిగా నిలిచారు. విజయాలకు గోపు రం.. పలుకుల చెలినూపురం అని రాసినా.. సాహిత్యం సంగీతం స్తంభేరమ స్వచ్ఛ యశోబింబం గంటస్తంభం అని రాసినా ఆ ఘనత ఆయనదే. సాహితీలోకానికి ఆయన లేని లోటు తీరనిది. నివాళులర్పించిన వారిలో... మానాప్రగడ శేషశాయి మృతి పట్ల పలువురు కవులు, రచయితలు, సాహితీవేత్తలు తమ ప్రగాడ సంతాపాన్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద, రాష్ట్ర అధ్యక్షుడు కె.చంద్రశేఖర్, కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ప్రధాన కార్యదర్శి మద్దాళి రఘురామ్, దూరదర్శన్పూర్వ డైరెక్టర్ వోలేటి పార్వతీశం, కొవ్వలి లక్ష్మీనరసింహారావు, జిల్లా సాహితీవేత్తలు పి.లక్ష్మణరావు, ధవళ సర్వేశ్వరరావు, మండపాక రవి, మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నహైందవి, బ్రాహ్మణసంఘ ప్రతినిధులు సాంబశివ శాస్త్రి ఉన్నారు. మానాప్రగడ మృతి తీరనిలోటు సాహితీవేత్త మానాప్రగడ శేషశాయి మృతి తీరనిలోటని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి, జెసి–2 జె.సీతారామారావులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన స్వగృహానికి వెళ్లి ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. బాధకలుగుతోంది చదువుల తల్లి సిగ సిరిమల్లి, సంస్కృతాంధ్రాల్లో మకుటం లేని మహారాజు, మధురవచస్వి శేషశాయి తిరిగిరాని లోకాలకు తరలిపోవడం తెలుగు సాహితీ సరస్వతికి తీరనిలోటు. 2013లో తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గిడుగు జయంతి, అదే ఏడాది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజున తెలుగుభాష గొప్పతనాన్ని ఆయన విద్యార్థులకు వివరించారు. 2014లో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్, అలయన్స్ క్లబ్ సంయుక్తంగా శేషసాయికి పానుగంటి లక్ష్మీనరసింహరావు స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశాం.– సముద్రాల గురుప్రసాద్, తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు -
చంద్రబాబూ... అలా ఎలా చెప్పారు?
సాక్షి, విజయనగరం: ఎన్నికల ముందు నుంచే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘంపై బెదిరింపులకు పాల్పడిన బాబు.. అవేవీ ఫలితం ఇవ్వకపోవడంతో ఎన్నికల అనంతరం ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేస్తూ ప్రజలకు ఈసీపై తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, వాటిని హుందాగా స్వీకరించాల్సింది పోయి ఎన్నికల వ్యవస్థను తప్పుపట్టడం సరికాదన్నారు. ‘సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఫ్యాన్ గుర్తుకే పోతుందన్న మీరు.. నిన్నా ఇవాళ టీడీపీకి 130 సీట్లు వస్తాయని ఎలా చెప్పగలుగుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. మీ ఓటమి నిశ్చయమై జైలుకు పోవాల్సి వస్తే కాపాడుకునేందుకే కేంద్రంలో వివిధ పార్టీలతో ఇప్పుడు కలుస్తున్నారా? మీరిచ్చిన హామీలను గుర్తు చేసుకునే ప్రజలు ఓటేశారు. మీరు చేసిన నమ్మకద్రోహాన్ని గుర్తుంచుకుని మరీ ఓటేశార’ని వీరభద్రస్వామి అన్నారు. విజయనగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. ఏప్రిల్ మొదట్లోనే విజయనగరం పట్టణంలో తీవ్ర మంచినీటి ఎద్దడి తలెత్తిందని, ఇలాగే కొనసాగితే రానున్న మే, జూన్ నెలల్లో తలెత్తబోయే నీటి సమస్యను ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరారు. (చదవండి: ఎండల్లో తిరిగి మైండ్ పోయిందా?) -
అధికారుల అత్యుత్సాహం..!
విజయనగరం , చీపురుపల్లి(మెరకముడిదాం): సాధారణంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో అధికార పార్టీ నేతలు ముందుంటారు. సమయం మించిపోతోంది కాబట్టి చివరిలోనైనా ఏవో ప్రారంభోత్సవాలు చేసేద్దామా.. శంఖుస్థాపనలు చేసేద్దామా.. అంటూ ప్రజాప్రతినిధులు అత్యుత్సాహం చూపిస్తుంటారు. కాని ఎన్నికల కోడ్‌ను గౌరవించి అమలు చేయాల్సిన అధికారులే తెలుగుదేశం పార్టీ నాయకుల మెప్పు కోసం కోడ్ ఉల్లంఘిస్తే ఏమనుకోవాలి. సరిగ్గా చీపురుపల్లి నియోజకవర్గంలోని మెరకముడిదాం మండలంలో గల గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదే జరిగింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ విద్యాశాఖ ఆధ్వర్యంలో అక్కడి విద్యార్థులకు సీఎం, మంత్రి ఫొటోలతో ఉన్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో విద్యాశాఖ అధికారులకు ఎన్నికల అధికారుల నుంచి హెచ్చరికలు రావడంతో పంపిణీ నిలిపివేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న సీఎం ఫొటోలనే తొలగించాలి. అంత స్ట్రిక్ట్‌గా కోడ్ అమల్లో ఉంటే గర్భాం పాఠశాలలో ఏకంగా సీఎం, మంత్రి ఫొటోలతో ఉన్న సైకిళ్లను పంపిణీ చేయడం వెనుక అక్కడి విద్యాశాఖ అధికారులకు తెలుగుదేశం పార్టీపై ఎంత ప్రేముందో అర్థం చేసుకోవచ్చు. అయితే కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని నియోజకవర్గాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నుంచి కలెక్టర్ వరకు చెబుతున్న నేపథ్యంలో ఇక్కడ కోడ్ ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయో వేచి చూడాల్సిందే. ఆదరణ సైకిళ్ల పంపిణీ.. గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ రామారావు, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం ఎస్.రమణల నేతృత్వంలో ఆదరణ పథకంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోతో ఉన్న సైకిళ్లను శుక్రవారం పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక విలేకరులు కొంతమంది అక్కడకు వెళ్లేసరికి ఎంఈఓ అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం నుంచి ఉపాధ్యాయుల వరకూ అందరూ ముఖం చాటేశారు. ఈలోగా చాలా హడావుడిగా కొంతమంది తెల్లకాగితాలు తీసుకొచ్చి సైకిల్‌పై ఉన్న చంద్రబాబునాయుడు ఫొటో కనిపించకుండా అతికించేందుకు ప్రయత్నించారు. అప్పటికే స్థానికంగా ఉన్న ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు ఈ విషయాన్ని జిల్లా నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జిల్లా నాయకులు ఎన్నికల అధికారుల ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ లేక్కలేదా.... ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే అధికారులు అంతా సాధారణ పనులు పక్కన పెట్టి ఎన్నికల విధుల్లో చాలా బిజీ అయ్యారు. అయినప్పటికీ కోడ్ నిబంధనలు ఉల్లంఘించి గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు సైకిళ్లు పంపిణీ చేయడం చర్చాంశనీయమయ్యింది. కఠిన చర్యలు.... ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఆ విషయాన్ని ప్రభుత్వ అధికారులకు తెలియజేశాం. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. గర్భాం ఉన్నత పాఠశాలలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఇంతవరకు నా దృష్టికి రాలేదు. – కె.సాల్మన్‌రాజ్,ఎన్నికల రిటర్నింగ్ అధికారి, చీపురుపల్లి పంపిణీకి వెళ్లలేదు... గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లలేదు. డీఈఓ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు సైకిల్ ముందు భాగంలో ఫొటోలు కనిపించకుండా తెల్లకాగితాలు అతికించి పంపిణీ చేయమని ఉపాధ్యాయులను ఆదేశించా.– రామారావు, ఎంఈఓ, మెరకముడిదాం సెలవులో ఉన్నాను.... వ్యక్తిగత కా>రణాలు దృష్ట్యా సెలవులో ఉన్నాను. సెలవులో ఉన్నప్పటికీ సైకిళ్ల పంపిణీపై సమాచారం ఇచ్చారు. అయితే సైకిల్ ముందు భాగంలో ఉన్న ఫొటోలపై కాగితాలు అతికించి పంపిణీ చేయాలని ఇన్చార్జి హెచ్ఎం రమణకు సూచించాను.– గ్రంధి ఈశ్వరరావు, హెచ్ఎం,గర్భాం ఉన్నత పాఠశాల -
మోదీ ఒడిలో కూర్చుని దీక్ష చేసి...
సాక్షి, విజయనగరం: ప్రధాని నరేంద్ర మోదీపై పోరాడలేక వైఎస్ జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీతో తమకు సంబంధాలు అంటగట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. మోదీ ఒడిలో కూర్చుని నవనిర్మాణ దీక్ష చేసి, కాంగ్రెస్ పార్టీతో కలిశాక చేస్తున్న ధర్మపోరాట దీక్ష చూసి ప్రజలు తలదించుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు తాను చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోడానికి రాష్ట్ర ప్రజలందరినీ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. నాలుగు సంవత్సరాల పాలనపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న ముఖ్యమంత్రికి ఎన్నికల హామీలు, ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసే సత్తా ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీలు మారిన వారిని చిత్తుగా ఓడించాలన్న చంద్రబాబు ఏపీలో ఆ పిలుపు ఇవ్వగలరా అని డిమాండ్ చేశారు. -
జయహో జగనన్న
సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రజలకోసమే జీవితాన్ని అంకితం చేసి... వారి సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడుతూ... వారి మధ్యనే ఎక్కువకాలం గడుపుతూ... అందరి బంధువుగా గుర్తింపు పొందిన వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవాన్ని జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలతో పాటు, జగన్ అభిమానులు సైతం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవ డం విశేషం. పలు సేవాకార్యక్రమాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. అతి త్వరలోనే జగన్ సీఎం కావాలని, రాజన్న రాజ్యం రావాలని నేతలు, ప్రజలు ఆకాంక్షించారు. ∙విజయనగరం నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరాన్ని కోలగట్ల ప్రారంభిం చారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు తరలివచ్చిన యువత, విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు, కౌన్సిలర్లు రాజేష్, రాంపండు పాల్గొన్నారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. పేదలకు నిత్యావసర సరుకులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అప్పారావు, దేవి, పద్మావతి, చినతల్లి పాల్గొన్నారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరఆధ్వర్యంలో కేక్‌కట్ చేశారు. రామా కాలనీలోని అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జరజాపు సూరి బాబు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముగడ గంగమ్మ, సాలూరు, పాచిపెంట మండల అధ్యక్షులు సువ్వాడ రమణ, కొట్టాపు ముత్యాలనాయుడు పాల్గొన్నారు. ∙చీపురుపల్లి, గరివిడి మండలాల్లో జరిగిన వేడుకల్లో విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు. కురుపాంలోని రావాడ కూడలిలో ఉన్న వై.ఎస్.విగ్రహం వద్ద అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు ఆధ్వర్యంలో జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టా రు. ఈ కార్యక్రమంలో కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, ఎంపీపీ ఆనిమి ఇందిరాకుమారి, మూడు మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు. ∙బొబ్బిలి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చినప్పలనాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశా రు. పీహెచ్సీలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశా రు. పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు అందజేశారు. అలాగే పార్టీ కార్యాలయంలో 2019 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి విజయ్‌కుమార్, తూముల రామసుధీర్, ఇంటిగోపాలరావు, సావు కృష్ణమూర్తినాయుడు పాల్గొన్నారు. ∙నెల్లిమర్ల పట్టణంలోని మారుతీ నర్సింగ్ హోం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు ఆధ్వర్యంలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. డెంకాడ మండలం తాడివాడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమత్స సురేష్‌బాబు, జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు పాల్గొన్నారు. ఎస్.కోట వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో కేక్‌కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నెక్కల నాయుడుబాబు, వేచలపు చినరామునాయుడు పాల్గొన్నారు. పార్వతీపురం పట్టణంలో నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆ«ధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని కోరి గ్రామంలో ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. గజపతినగరం సామాజిక ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలను మాజీ జెడ్పీటీసీ గార తౌడు, దత్తిరాజేరు, గజపతినగరం మండల పార్టీ అధ్యక్షులు కడుబండి రమేష్ నాయుడు, బూడి వెంటరావులు పంచారు. -
చపాతీ కూరలో 30 నిద్రమాత్రలు.. ఆపై ఉరి
విజయనగరం టౌన్ : తన వ్యక్తిగత స్వేచ్ఛకు అడ్డువచ్చాడనే కారణంతో కన్నకొడుకుని ఓ తల్లి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.. ఈ నెల 22వ తేదీ రాత్రి స్థానిక గాయత్రీనగర్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టారు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన హరి భగవాన్ (17) తల్లి వెంకట పద్మావతిని పోలీసులు విచారించడంతో అసలు నిజం బయటకు వచ్చింది. హత్య కేసులో తల్లి వెంకట పద్మావతితో పాటు ఆమె ప్రియుడు గోవింద్ హస్తం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం సబ్‌జైల్‌కు పంపించినట్లు రూరల్ సీఐ రమేష్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అసలేం జరిగింది? గాయత్రీనగర్‌లో నివాసముంటున్న వెంకట పద్మావతికి 2000లో కొండబాబుతో వివాహం జరిగింది. వారికి హరిభగవాన్ (17)తో పాటు ఓ కుమార్తె కూడా ఉంది. కొండబాబు డ్రైవింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అయితే సంపాదన విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో 2012లో కొండబాబు నుంచి పద్మావతి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి గాయత్రీనగర్‌లోని తన సొంతిం టిలో పిన్ని సీతాలక్ష్మి, పిల్లలతో నివాసముంటోంది. ఏజెంట్‌గా పరిచయం... వెంకటపద్మావతి కొన్ని ప్రైవేట్ సంస్థలకు ఏజెంట్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యలో గోవింద్ అనే రియల్టర్‌తో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన తల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి సహించని కుమారుడు హరిభగవాన్ తల్లిని పలుమార్లు హెచ్చరించాడు. హత్యకు ముందస్తు పథకం వెంకటపద్మావతి, గోవింద్‌ల కార్యకలాపాలకు అడ్డుగా ఉన్న హరి భగవాన్ను తప్పించాలనే ఉద్దేశంతో గోవింద్ ఇచ్చిన పథకాన్ని అమలుచేయడానికి పద్మావతి పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమైంది. చివరకు నిద్రమాత్రలు ఇచ్చి హరి భగవాన్ను అడ్డు తొలగించుకోవాలని ఇరువురూ నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 21వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో పద్మావతి పిన్ని సీతాలక్ష్మి తన సోదరుడు విశ్వనాథరాజుకు ఆరోగ్యం బాగోలేనందున బాబామెట్టకు వెళ్లింది. హరిని చంపాలంటే ఇదే సమయమని గోవింద్ తన ప్రియురాలు పద్మావతికి చెప్పాడు. పైగా గోవింద్ తన ఇంటి నుంచి ఎప్పటికప్పుడు ఫోన్లో హత్య ఎలా చేయాలో వివరించడం విశేషం. చపాతి కూరలో 30 నిద్రమాత్రలు కలిపి.. గోవింద్ సలహా మేరకు పద్మావతి చపాతి కూరలో 30 నిద్రమాత్రలు కలిపింది. దీంతో చపాతి తిన్న హరిగోపాల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. నిద్రలోకి జారుకున్న కొడుకు మెడకు చీర బిగించి హత్యచేసింది. అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు చిత్రీకరించి, మార్కులు తక్కువగా రావడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించింది. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన పద్మావతి పిన్ని సీతాలక్ష్మికి హరి ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో ఆశ్చర్యపోయింది. పద్మావతిని గట్టిగా నిలదీయడంతో చేసిన తప్పు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయింది. ఇదిలా ఉంటే హత్యకు పరోక్షంగా సహకరించినా గోవింద్‌ను శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వీరిద్దరిని రిమాండ్ నిమిత్తం సబ్‌జైల్‌కు తరలించారు. -
ఘరానా మోసం
మెరకముడిదాం విజయనగరం : మండలంలోని భైరిపురం గ్రామానికి చెందిన శనపతి పార్వతి ఘరానా మోసానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే... భైరిపురానికి చెందిన పార్వతి నాలుగు రోజులు కిందట చీపురుపల్లి స్టేట్‌బ్యాంకులో తన ఖాతా పుస్తకం నిండిపోవడంతో కొత్త పుస్తకాన్ని తీసుకుంది. బుధవారం అజ్ఞాత వ్యక్తి ఆమెకు 9064541005 నెంబరుతో ఫోన్ చేసి నేను చీపురుపల్లి స్టేట్‌బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. మీరు రెండు రోజుల కిందట కొత్త పుస్తకం మార్చారు కదా...దానికి సంబంధించి మీ ఆధార్ కార్డు ఆన్లైన్ చేయాలని, మీ ఆధార్ కార్డు నెంబరు, మీ బ్యాంకు అక్కౌంట్ నెంబరు చెప్పాలని కోరాడు. నమ్మిన పార్వతి తన ఆధార్‌కార్డు నెంబరుతో పాటు తన అకౌంట్ నెంబరును కూడా చెప్పింది. దీంతో ఆ అగంతకుడు పార్వతి బ్యాంకు ఖాతాలో వున్నరూ.23 వేలను డ్రా చేసాడు. గురువారం పార్వతి బ్యాంకుకు వెళ్లి తన ఖాతాలో డబ్బులు ఎంత వున్నాయో సరి చూసుకుందామని వెళ్లగా బ్యాంకు అధికారులు రూ.23 వేలు డ్రా చేసినట్టు వున్న విషయాన్ని తెలిపారు. దీంతో ఆమె లబోదిబోమంటూ ఇంటిముఖం పట్టింది. ఈ విషయమై స్థానిక సర్పంచ్ కెంగువ ధనుంజయకు తెలియజేయగా ఆయన బుధరాయవలస పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే పార్వతికి అగంతకుడు చేసిన ఫోన్ నెంబరును ఇచ్చారు. దీనిపై బుధరాయవలస పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రేషన్ డిపోల్లో విజిలెన్స్ తనిఖీలు
సాలూరురూరల్ (పాచిపెంట): పాచిపెంట మండలంలోని గురువునాయుడుపేట, పాంచాలి గ్రామాల్లోని రేషన్‌డిపోల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. గరువునాయుడుపేట డిపోలో మూడు క్వింటాళ్ల 88 కిలోల బియ్యం, 11 కిలోల పంచదార తేడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో డీలర్ గొట్టాపు వెంకటస్వామినాయుడుపై కేసు నమోదు చేశారు. అలాగే పాంచాలి డిపో–1లో 30 కిలోల బియ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. చిన్న తప్పు దొర్లినా చర్యలు తప్పవని డీలర్ పెద్దిబాబును హెచ్చరించారు. అలాగే పాంచాలి –2 డిపోలో తనిఖీలు చేపట్టగా 5 క్వింటాళ్ల 16 కిలోల బియ్యం, 40 కిలోల పంచదార అధికంగా ఉన్నట్లు గుర్తించి డీలర్ గొర్లె అప్పన్నబాబుపై కేసు నమోదు చేశారు. అనంతరం సీఐ కృష్ణ మాట్లాడుతూ, రేషన్‌డిపోల్లో 100 కిలోల వరకు బియ్యం అదనపు నిల్వలు ఉంచవచ్చన్నారు. డిపోలు పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట హెచ్‌సీ ధర్మారావు, సీఎస్‌డీటీ రామకృష్ణ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
పారా మెడికల్ కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు కరువు
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: పారా మెడికల్ కోర్సుకు అభ్యర్థులు కరువైపోతున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు సగం సీట్లకు కూడా దరఖాస్తులు రాలేదు. మరికొన్ని కోర్సులకైతే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో కౌన్సెలింగ్ ఎలా చేయాలా అని అధికారులు, నర్సిం గ్ కళాశాల యజమానులు తల పట్టుకుంటున్నారు. జిల్లాలో 13 నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో వివిధ పారా మెడికల్ కోర్సుల్లో ప్రభుత్వ సీట్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సీట్ల భర్తీకి మంగళవారం కౌ న్సిలింగ్ నిర్వహించనున్నారు. అయితే ప్రభు త్వ సీట్లకు సంబంధించి కూడా అభ్యర్థులు కరువయ్యారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులతో పాటు కళాశాలల యజమానులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. సీట్ల వివరాలు డీఎంఎల్టీ కోర్సుకు సంబంధించి 100 సీట్లకు గాను కేవలం 31 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఎనస్తీషియా టెక్నీషియన్‌కు 10 సీట్లకు గాను 8 మంది, రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్స్ 36 సీట్లకుగాను 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. డార్క్ రూం అసిస్టెంట్ 12 సీట్లకు ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఈసీజీ టెక్నీషియన్‌కు కూడా పది సీట్లకు ఒక్క దరఖాస్తు వచ్చింది. అఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ 14కుగాను 7, ఆడియోమెట్రిక్ 30 సీట్లకుగాను 3 మాత్రమే వచ్చాయి. అప్టోమెట్రిక్ విభాగంలో 6 సీట్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఈ విషయాన్ని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా దరఖాస్తులు వచ్చిన వాటికి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.