సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రజలకోసమే జీవితాన్ని అంకితం చేసి... వారి సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడుతూ... వారి మధ్యనే ఎక్కువకాలం గడుపుతూ... అందరి బంధువుగా గుర్తింపు పొందిన వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు, జగన్ అభిమానులు సైతం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవ డం విశేషం. పలు సేవాకార్యక్రమాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. అతి త్వరలోనే జగన్ సీఎం కావాలని, రాజన్న రాజ్యం రావాలని నేతలు, ప్రజలు ఆకాంక్షించారు. ∙విజయనగరం నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరాన్ని కోలగట్ల ప్రారంభిం చారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు తరలివచ్చిన యువత, విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు, కౌన్సిలర్లు రాజేష్, రాంపండు పాల్గొన్నారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. పేదలకు నిత్యావసర సరుకులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అప్పారావు, దేవి, పద్మావతి, చినతల్లి పాల్గొన్నారు.
సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరఆధ్వర్యంలో కేక్‌కట్ చేశారు. రామా కాలనీలోని అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జరజాపు సూరి బాబు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ముగడ గంగమ్మ, సాలూరు, పాచిపెంట మండల అధ్యక్షులు సువ్వాడ రమణ, కొట్టాపు ముత్యాలనాయుడు పాల్గొన్నారు.
∙చీపురుపల్లి, గరివిడి మండలాల్లో జరిగిన వేడుకల్లో విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు. కురుపాంలోని రావాడ కూడలిలో ఉన్న వై.ఎస్.విగ్రహం వద్ద అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టా రు. ఈ కార్యక్రమంలో కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, ఎంపీపీ ఆనిమి ఇందిరాకుమారి, మూడు మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు.
∙బొబ్బిలి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చినప్పలనాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశా రు. పీహెచ్‌సీలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశా రు. పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు అందజేశారు. అలాగే పార్టీ కార్యాలయంలో 2019 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి విజయ్‌కుమార్, తూముల రామసుధీర్, ఇంటిగోపాలరావు, సావు కృష్ణమూర్తినాయుడు పాల్గొన్నారు.
∙నెల్లిమర్ల పట్టణంలోని మారుతీ నర్సింగ్ హోం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు ఆధ్వర్యంలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. డెంకాడ మండలం తాడివాడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమత్స సురేష్‌బాబు, జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు పాల్గొన్నారు. ఎస్.కోట వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో కేక్‌కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నెక్కల నాయుడుబాబు, వేచలపు చినరామునాయుడు పాల్గొన్నారు. పార్వతీపురం పట్టణంలో నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆ«ధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని కోరి గ్రామంలో ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. గజపతినగరం సామాజిక ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలను మాజీ జెడ్పీటీసీ గార తౌడు, దత్తిరాజేరు, గజపతినగరం మండల పార్టీ అధ్యక్షులు కడుబండి రమేష్ నాయుడు, బూడి వెంటరావులు పంచారు.
Comments
Please login to add a commentAdd a comment