V.K. Singh
-
కష్టాల కడలి, రూ.70,820 కోట్లకు ఎయిరిండియా నష్టాలు
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా నష్టాలు 2020 మార్చి 31 నాటికి రూ. 70,820 కోట్లకు చేరినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో విలీనం చేసినప్పట్నుంచీ సంస్థ నష్టాల్లోనే ఉన్నట్లు వివరించారు. ఎయిరిండియా విక్రయా నికి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్ 15లోగా ఆసక్తి గల బిడ్డర్ల నుంచి ఆర్థిక బిడ్లు రాగలవని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సంస్థను విక్రయించేందుకు గతేడాది జనవరి 27న కేంద్రం బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తికరణ పత్రాలను ఆహ్వానించింది. కోవిడ్–19 పరిస్థితుల నేపథ్యంలో బిడ్ల దాఖలుకు డెడ్‌లైన్‌ను పొడిగిస్తూ వచ్చింది. విమానాశ్రయాల చట్ట సవరణల బిల్లుకు ఆమోదం ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సవరణ) బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. వివిధ అంశాలపై విపక్షాల నిరసనల మధ్య స్వల్ప చర్చ అనంతరం రాజ్యసభ దీనికి ఆమోదముద్ర వేసింది. మారుమూల ప్రాంతాల్లోనూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా చిన్న విమానాశ్రయాల కార్యకలాపాల విస్తరణను ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని ప్రతిపాదించారు. షిప్పింగ్ పోర్టులపై పార్లమెంటరీ కమిటీ నివేదిక.. దేశీయంగా కొత్త పోర్టుల ఏర్పాటు అవకాశాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసేందుకు తగు ప్రతిపాదనలతో ప్రభుత్వాన్ని సంప్రదించే స్వేచ్ఛ షిప్పింగ్ రంగంలోని ప్రైవేట్ సంస్థలకు ఉండాలని పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది. కంటైనర్లను వేగవంతంగా ఖాళీ చేసేందుకు జవహర్లాల్ నెహ్రూ పోర్టు (జేఎన్పీటీ)లో రైల్ యార్డును అభివృద్ధి చేసే అంశం పరిశీలించాలని ఒక నివేదికలో సూచించింది. -
రూ. 731 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు భారీ మొత్తంలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్)ను స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ రాష్ట్ర ఎన్నికల అధికారి వి.కె.సింగ్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ. 731 కోట్లు ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 30న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రూ.7.5 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే రాష్ట్రంలో లైసెన్స్డు ఆయుధాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రూ. 21.85 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. మార్చి 5 వ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు. -
పీఎంవో రహస్య సమాచారాన్ని లీక్ చేసింది: వి.కె. సింగ్
షిండేకు ఆర్మీ మాజీ చీఫ్ వి.కె. సింగ్ లేఖ న్యూఢిల్లీ: తాను ఆర్మీ చీఫ్‌గా ఉన్నప్పుడు సాంకేతిక భద్రతా విభాగం ఏర్పాటుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ప్రధాని కార్యాలయం (పీఎంవో), రక్షణశాఖ, సైనిక హెడ్‌క్వార్టర్స్ అధికారులు కుట్రపూరితంగా బయటపెట్టారని జనరల్ వి.కె. సింగ్ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి షిండేకు ఆయన లేఖ రాశారు. ఈ విషయంలో వాస్తవాలు వెలుగు చూసేందుకు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
కాశ్మీర్ సర్కారును పడగొట్టాలనుకోలేదు: వీకే సింగ్
అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేలా యువతను ప్రోత్సహించేందుకే ఓ స్వచ్ఛంద సంస్థకు భారత సైన్యం నుంచి నిధులు మంజూరుచేశాం తప్ప.. జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏమీ ఇవ్వలేదని ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ స్పష్టం చేశారు. గులాం హసన్ మీర్ అనే కాశ్మీరీ మంత్రికి ఆర్మీ నుంచి రహస్యంగా నిధులు వెళ్లాయన్న ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నకు వీకే సింగ్ సమాధానమిచ్చారు. యువతను అభివృద్ధి కార్యక్రమాల వైపు ఆకర్షితులు చేయడానికి డబ్బులు అవసరమైతే ఇవ్వడం తప్పేమీ కాదని ఆయన అన్నారు. కోటి రూపాయలతోనే మన లాంటి గొప్ప దేశంలో ప్రభుత్వాలు పడిపోయేటట్లయితే రోజుకో ప్రభుత్వం పడిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. రక్తదాన శిబిరాల నిర్వహణ, మహిళలకు శిక్షణ, పిల్లలను రాళ్లు విసిరే కార్యక్రమాల నుంచి దూరంగా తేవడం లాంటి కార్యక్రమాలు చేయడానికే ఓ స్వచ్ఛంద సంస్థకు నిధులు ఇచ్చినట్లు సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరత పాలు చేయడానికి మంత్రి మీర్‌కు రూ. 1.19 కోట్ల ఆర్మీ నిధులు వెళ్లినట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. -
భారతీయ జవాన్లు త్యాగధనులు: మోడీ
-
భారతీయ జవాన్లు త్యాగధనులు: మోడీ
మాతృదేశం కోసం సర్వం వదులుకున్న త్యాగధనులు భారతీయ జవాన్లు అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ వెల్లడించారు. ఆదివారం హర్యానాలోని రేవారిలో ఏర్పాటు చేసిన మాజీ సైనికుల ర్యాలీలో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాజీ సైనికులనుద్దేశించి ప్రసంగిస్తూ.... దేశం కోసం అమరులైన జవాన్లకు ఆయన వందనాలు తెలిపారు. సైనిక స్కూల్లో చదువుకోవాలన్న తన లక్ష్యం నెరవేరలేదన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికై మొట్టమొదటిసారిగా ఈ ర్యాలీలో పాల్గొని ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో న్యూఢిల్లీ నుంచి నేరుగా హర్యానాలోని రేవారికి మోడీ చేరుకున్నారు. అనంతరం మోడీని ఆర్మీ మాజీ చీఫ్ వి.కే.సింగ్ సభవేదికపైకి తోడ్కుని వెళ్లారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ఎంపిక చేసిన నేపథ్యంలో ఆ సభకు హాజరైన ప్రజలు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ర్యాలీకి వందలాది మంది మాజీ సైనికులతోపాటు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.