రూ. 731 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం | Rs.731 crore-worth drugs seized in Punjab | Sakshi
Sakshi News home page

రూ. 731 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

Published Wed, Apr 23 2014 6:01 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

Rs.731 crore-worth drugs seized in Punjab

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు భారీ మొత్తంలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్)ను స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ రాష్ట్ర ఎన్నికల అధికారి వి.కె.సింగ్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ. 731 కోట్లు ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 30న రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.

 

రూ.7.5 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే రాష్ట్రంలో లైసెన్స్డు ఆయుధాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రూ. 21.85 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. మార్చి 5 వ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement