vn sampath
-
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్-2014
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సంతప్‌కుమార్ బుధవారం మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలోని 42 పార్లమెంట్ స్థానాలకు, 294 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా తొమ్మిది దశల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలో ఏడు, ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుంది. తెలంగాణ : తొలి విడతలో తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, 119 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 30 బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ రెండున విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 9. ఏప్రిల్ 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉప సంహరణకు ఏప్రిల్ 12 చివరి తేదీ. సీమాంధ్ర : రెండో విడతలో సీమాంధ్ర ప్రాంతంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు మే 7 బుధవారం పోలింగ్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 12న విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 19. ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 23. ఓట్ల లెక్కింపు మే 16న చేపడతారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో తక్షణం ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ వివరాలు: * ఏప్రిల్ 7న మొదటి విడుత పోలింగ్. ఈ దశలో 6 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహణ. * ఏప్రిల్ 9న రెండో విడుత పోలింగ్. ఈ దశలో 5 రాష్ట్రాల్లోని 7 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. * ఏప్రిల్ 10న మూడోవిడుత పోలింగ్. ఈ దశలో 14 రాష్ట్రాల్లోని 92 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. * ఏప్రిల్ 12న నాలుగోవిడుత పోలింగ్. ఈ దశలో 3 రాష్ట్రాల్లోని 5 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. * ఏప్రిల్ 17న ఐదోవిడుత పోలింగ్. ఈ దశలో 13 రాష్ట్రాల్లోని 132 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. * ఏప్రిల్ 24న ఆరోవిడత పోలింగ్. ఈ దశలో 12 రాష్ట్రాల్లోని 117 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. * ఏప్రిల్ 30న ఏడోవిడత పోలింగ్. ఈ దశలో 9 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. * మే 7న 8వ విడుత పోలింగ్. ఈ దశలో 7 రాష్ట్రాల్లోని 64 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. * మే 12న 9వ విడుత పోలింగ్. ఈ చివరి విడతలో 3 రాష్ట్రాల్లోని 41 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్. తొలిసారి నోటా .... మొదటిసారిగా తిరస్కరణ ఓటు నోటాను ప్రవేశపెట్టారు. ఈవీఎంలతోనే ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఎన్నికల ఖర్చు మదింపునకు ఒక పరిశీలకుడిని ఏర్పాటు చేశారు. తప్పులకు పాల్పడే ప్రభుత్వాధికారులపై కఠిన చర్యలుంటాయని ఈసీ హెచ్చరించారు. రుతుపవనాలు, విద్యార్థుల పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఎన్నికల తేదీలను నిర్ణయించామన్నారు. ఓటర్ల నమోదుకు మరో అవకాశాన్ని ఇచ్చింది. -
ఆంధ్రప్రదేశ్‌లో రెండు విడతల్లో పోలింగ్
-
ఏప్రిల్ 30, మే 7న రాష్ట్రంలో పోలింగ్
-
ఇప్పుడున్న రాష్ట్రంలోనే ఎన్నికలు
రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారమే.. అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎన్.సంపత్ తెలిపారు. తెలంగాణలోని పది జిల్లాల్లోను ఏప్రిల్ 30వ తేదీన, సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లోను మే 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అయితే అపాయింటెడ్ డేట్ జూన్ 2వ తేదీ అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి, తాము రాజ్యంగం, చట్టం ప్రకారమే వెళ్తామని.. అంటే ఉమ్మడి రాష్ట్రం మాత్రమే ఎన్నికల నాటికి, ఇప్పుడు కూడా ఉంది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని సంపత్ చెప్పారు. పైగా తాము ఎక్కడికక్కడ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో ఏప్రిల్ 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక్కడ నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్ 9. 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 12 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇక సీమాంధ్రలో ఏప్రిల్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్ 19. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21న ఉంటుంది. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది. -
ఇప్పుడున్న రాష్ట్రంలోనే ఎన్నికలు
-
ఏప్రిల్ 30, మే 7 తేదీల్లో ఎన్నికలు.. మే 16న ఫలితాలు
సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎన్ సంపత్ ప్రకటించారు. మన రాష్ట్రంలో రెండు దశల్లో.. అంటే ఏప్రిల్ 30వ తేదీ, మే 7వ తేదీలలో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం అన్ని రాష్ట్రాలలోనూ లోక్‌సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరిగిన తర్వాత మే 16వ తేదీ శుక్రవారం నాడు ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం తొమ్మిది దశల్లో ఏప్రిల్7 నుంచి మే 12వ తేదీ వరకు పోలింగ్ జరుగుతుంది. 15వ లోక్‌సభ గడువు మే 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో 16వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను వీఎన్ సంపత్ ప్రకటించారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు కూడా షెడ్యూలు ప్రకటించారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో నోటా అమలుచేస్తున్నారు. షెడ్యూలు ప్రకటనతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని సంపత్ తెలిపారు. రాజకీయ పార్టీలతో ఏప్రిల్ 4న సమావేశం ఉంటుందని, మే 31 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని ఆయన చెప్పారు. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చు పరిమితిని 70 లక్షలుగా నిర్ణయించారు. సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లు హెచ్.ఎస్.బ్రహ్మ, ఎస్.ఎన్.ఎ.జైదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షెడ్యూలు ప్రకటనతో బుధవారం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలోనే జరుగుతుంది. కానీ ఈసారి వేదికను కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞాన్‌భవన్‌కు మార్చింది. మార్చి 9వ తేదీన బూత్ లెవెల్ అధికారులు సమావేశం అవుతారని, ఆరోజున ఎన్నికల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని ఆయన అన్నారు. ఎండలు బాగా ఉండే కాలాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని, పంటలు, వ్యవసాయం ఊపందుకునే సమయాల్లో పోలింగ్ తేదీలు లేకుండా చూసుకున్నామని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే పది కోట్ల మంది ఓటర్లు పెరిగారన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల పరీక్షలను కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు చెప్పారు. దేశంలో మొత్తం 81.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. తాగునీటి సదుపాయాలు, షెడ్లు, మంచినీళ్ల సదుపాయం, వికలాంగుల కోసం ర్యాంపులు తప్పనిసరిగా ఉండేలా చూశామన్నారు. నోటా సదుపాయాన్ని గత ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టామని, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కూడా అవి ఉంటాయని తెలిపారు. 98.64 శాతం మంది పేర్లు, ఫొటోలు ఓటర్ల జాబితాలో ఉన్నాయన్నారు. ఇప్పటికీ ఎవరివైనా పేర్లు ఎన్నికల ఓటర్ల జాబితాలో లేకపోతే ఇప్పటికీ సరిచేయించుకోచ్చవని చెప్పారు. ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులంతా నిష్పాక్షికంగా వ్యవహరించాలని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి ఉండాలని, క్రమశిక్షణ పాటించాలని సంపత్ స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 2009 ఎన్నికల నాటికి ఫొటోలతో ఓటర్ల జాబితాలు లేవని, కానీ ఈసారి మాత్రం వాటిని అమలులోకి తెచ్చామని, దీనివల్ల ఓటరు పేరు, ఫొటో, చిరునామా, పోలింగ్ కేంద్రం.. ఇలాంటి వివరాలన్నీ అందులో ఉంటాయని చెప్పారు. ఇది పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లకు కూడా అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు. మార్చి 9వ తేదీన 11లక్షల కేంద్రాల్లో ఓటర్ల జాబితాలో పేర్లు నమోదుచేయించుకునే అవకాశం ఉంటుందన్నారు. తొలి పోలింగ్ .. ఏప్రిల్ 7వ తేదీ. ఆరోజు ఆరు తదుపరి 9వ తేదీ ఉంటుంది. ఆరోజు ఐదు రాష్ట్రాల్లో 7 పార్లమెంటరీ నియోజవకర్గాల్లో ఉంటుంది. ఆ తర్వాత 10వ తేదీన 14 రాష్ట్రాల్లో 92 నియోజకవర్గాల్లో ఉంటుంది. 12వ తేదీన మూడు రాష్ట్రాల్లో 5 నియోజకవర్గాల్లో ఉంటుంది. 17వ తేదీన 13 రాష్ట్రాల్లో 122 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉంటుంది.