టెలికం సేవలపై స్వచ్ఛ భారత్ పన్ను వద్దు: సీఓఏఐ
న్యూఢిల్లీ: టెలికం సేవలపై స్వచ్ఛ భారత్ సుంకం (ఎస్బీసీ) విధించవద్దని జీఎస్ఎం ఇండస్ట్రీ వేదిక సీఓఏఐ (సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. లెసైన్స్ ఫీజు వంటి పలు ఇతర సుంకాల భారంతో ఉన్న టెలికం పరిశ్రమపై ఎస్బీసీ తగదని తెలిపింది. ఇది పరిశ్రమతో పాటు కస్టమర్లపై సైతం భారం పెరగడానికి దారితీసే అంశమని వివరించింది. ఇప్పటికే పన్ను పరిధిలోఉన్న సేవలు అన్నింటిపై అదనంగా అరశాతం ఎస్బీసీని కేంద్రం నవంబర్ 15 నుంచీ విధించిన నేపథ్యంలో సీఓఏఐ తాజా ప్రకటన చేసింది.